Quantcast
Channel: Telugu Blog of Shirdi Sai Baba,read sai leels,devotees experiences in telugu
Viewing all 726 articles
Browse latest View live

సాయితో మధురక్షణాలు - 16

$
0
0
    
       

27.08.2013 మంగళవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

16 రోజుల తరువాత మరలా మన బ్లాగులో ప్రచురణకు వీలు కుదిరింది..హైదరాబాదు ప్రయాణాలవల్ల, కొన్ని వ్యక్తిగత పనులవల్ల, ఆలశ్యం జరిగింది..ఈ ఆలశ్యానికి బాబావారిని మన్నించమని వేడుకొంటు ఈ రోజు సాయితో మధురక్షణాలలోని ఒక మధురక్షణాన్ని మీకందిస్తున్నాను. ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 83వ.శ్లోక, తాత్పర్యం.
                     
శ్రీవిష్ణుసహస్రనామం 83వ.శ్లోకం:

శ్లోకం:  సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః  |

         దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా  ||

తాత్పర్యం:  పరమాత్మను తిరిగి వచ్చుచున్న మరియూ తిరిగిరాని ఆత్మలతో కూడిన సృష్టి చక్రముగా, ధ్యానము చేయుము  ఆయనను జయించుట, ఆయన ధర్మము నతిక్రమించుట మరియూ ఆయనను పొందుట మిక్కిలి కష్టము.  ఆయనను సమీపించుట దుష్కరము.  మాయతో కూడిన నివాసమే ఆయనది.  ఆయన భక్తులకు కోటవంటివాడు.  దుష్టులను జయంచి సం హరించువాడు.   

సాయితో మధురక్షణాలు - 16

(ఈ కలియుగంలో బాబా శక్తి అంతుతెలియనిది) 

ఈ కలియుగంలో బాబా శక్తి అంతుతెలియనిది

మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించడానికి వీలుకానంతగా క్లిష్టమయినది.  అటువంటిది బాబాయొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించడమంటే అది అత్యంత క్లిష్టమయినది. భయంకరమయిన పర్షియా ఎడారులలో గులాబీల పరిమళాన్ని ఎవరు పరిశీలించగలరు..చేతికందే దూరంలోనే ఉండి, ఉన్నట్లుండి దూరమయిపోయే ఎడారులలోని ఒయాసిస్సుల అందాన్నెవరు వర్ణించగలరు? అదేవిధంగా బాబా విషయంలో కూడా. 


ఆయన ప్రేమను చాలా సులభంగా పొందవచ్చు.  కాని అది శాస్త్ర నిరూపణకందనిది.  భక్తుడు చేసే ఆధ్యాత్మిక అన్వేషణలో భక్తుడిని ఆ మార్గంలో కొంతవరకు తీసుకొని వెడుతుంది, కాని పూర్తిగా ఆదారిలోకి తీసుకొని వెళ్ళదు.  బాబాను గూర్చి సరియైన అవగాహన రావాలంటే ప్రారంభంలో చేసే తత్వవిచారణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.  బాబాను గురించి తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక విచారణా  కొంతవరకు ఉపయోగమే.  కాని, విచారణ ఎప్పుడయితే పూర్తవుతుందో అప్పుడే నిజ తత్వం బోధపడుతుంది.  చిన్న పిల్లవాడు తనకు కావలసినది లభించే దాకా ఏడుస్తూనే ఉంటాడు.  అది లభించగానే ఏడుపు మానేస్తాడు. అదే విధంగా నిజమయిన భక్తుడు తగు విచారణ చేస్తూ, అనేక వివరాలను అడుగుతూ, వేడుకొంటూ చీకటిలో గ్రుడ్డిగా వెదకుతూ ఉంటాడు.  ఎక్కడయితే పరిశోధన అంతమవుతుందో వెలుతురు ఉదయిస్తుంది.

పరిశోధనా మార్గంకన్నా సులభతరమైనది ప్రేమ మార్గం.  యిలా శోధిస్తూ వెడదామనుకునే మార్గమంతా ముళ్ళతో నిండివుండి దానికి అనుగ్రహింపబడిన మేధావులు మాత్రమే ఆమార్గంలో పయనించగలరు.  ఆ మార్గమే సంస్కారమనే మార్గం.  అది చాలా కఠినతరమయినది.  ఆమా ర్గంలో పయనించడం అందరికీ సాధ్యం కాదు.  అందరికీ సులభమయిన మార్గం ప్రేమ మార్గం.  భక్తుడు చేయవలసినది మవునంగా ఉండటమే.  మిగిలినది బాబాయే చూసుకుంటారు.  భక్తుడయినవాడు తాను ఏది నేర్చుకున్నా, ఏదీ తెలియనట్లుగానె ఉండి, బాబా అనుగ్రహం కోసం ఆయన దృష్టిలో ఒక చిన్నపిల్లవాడిలా మారిపోవాలి.
  
తన భక్తుని జీవితంలో జరగబోయే ఉపద్రవాన్ని బాబా వెంటనే జోక్యం చేసుకొని అడ్డుకొన్నారు. అది 1943వ.సంవత్సరములో మొదటి నెలలో మొదటి వారం.  రచయిత యొక్క సోదరికి నెలలు నిండుతున్నాయి.  యింతకు ముందే ఆమెకు యిద్దరు పిల్లలున్నారు.  వారు పసి వయసులోనే మరణించారు.  ఆమెకు ఏడవనెల.  అందరికీ ఆమె ఆరోగ్యం గురించి ఆందోళనగా వుంది.  కాని, రచయితకు ఆమె ఆరోగ్యం గురించి ఎటువంటి బెంగా లేదు.  అంతా బాబా చేతులలోనే వుందని ఎంతో నమ్మకంతో నిబ్బరంగా ఉన్నారు.  

రచయిత రోజు మాదిరిగానే పూజ చేసుకుంటున్న సమయంలో ఆయన సోదరి  ఏడుస్తూ వచ్చి లేడీ డాక్టర్ ను పిలవమని చెప్పింది.  తనకు అబార్షన్ అవచ్చనే భయాన్ని వెలిబుచ్చింది.  ఆసమయంలో రచయిత యొక్క భావాలని ఒక్కసారి ఊహించుకోండి.  బాబా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్న తన నమ్మకానికి విఘాతం ఏర్పడబడబోతోందా?  రచయిత నమ్మకానికి ఈ పరిణామం ఒక దిగ్భ్రాంతి. 

యిటువంటి సంక్షోభసమయంలో బాబా తన భక్తుని శిక్షిస్తున్నాడా?  జాం నేర్ లో నానా కుమార్తె ప్రసవ వేదన పడుతున్న సమయంలో ఆమెకు సుఖప్రసవమవడానికి బాబా సహాయం చేయలేదా?  ప్రధాన్ బిడ్డ చావు బతుకులలో ఉన్నపుడు అతనిని బాబా  వెన్వెంటనే రక్షించలేదా?  బాబాయే దైవికమైన  వైద్యుడు.  అటువంటిది ఆయనే చేయలేనపుడు ఒక లేడీ డాక్టరు చేయగలదా?  కాదు, అలా జరగడానికి వీలులేదు. ఇక్కడ చావా, పుట్టుకా, బాబా తేల్చవలసిన సమస్య. 
                           
యిక విచక్షణా జ్ఞానం కోల్పోయి కోపోద్రేకంతో రచయిత బాబా విగ్రహంలో కొంత భాగాన్ని పగులగొట్టి, పొడి చేసి ముద్దగా తయారుచేసి దానిని తన సోదరి పొట్టమీద రాశాడు.  భగవంతుని నిర్ణయమేమిటో తెలియక, విచక్షణా జ్ఞానం కోల్పోయి కోపంతో ఒక అంధ భక్తుడు చేసిన చర్య యిది.  మందే విచిత్రమనుకుంటే నివారణ కుడా చాలా విచిత్రమైన విషయం.   ఒక్క క్షణంలోనే ఆమెకు జరగబోయే గర్భస్రావం ఆగిపోయి, ఆమె కోలుకొంది.  ప్రమాదకరంగా రజగబోయే అబార్షన్ అదృశ్య శక్తితో నివారణయింది.  అది బాబా విగ్రహం పగులగొట్టి దాని పొడిని ముద్ద్గచేసి రాయడం వల్లనా?  లేక రచయిత కోపోద్రేకంతో బాబా మీద దుడ్డుకఱ్ఱతో బాదినట్లుగా చేసిన చర్యా?  రచయిత యిటువంటి సున్నితమయినప్రశ్నలకు కలత చెందలేదు.      

సాయిసుధ  1943
రామనాధన్
కరూర్ 
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 



సాయితో మధురక్షణాలు - 17

$
0
0

                 
              
            
          

03.09.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయితో మధురక్షణాలు - 17

మరలా వారం రోజుల తరువాత, మన బ్లాగులో ప్రచురణకు సాధ్యపడింది..ఆలశ్యమైన ప్రతీసారి బాబాని మన్నించమని కోరడం నాకే ఇబ్బందిగా ఉంది.. ఆంగ్ల పుస్తకంలోని మధురక్షణాలను అనువదించడంలో కాస్త సమయం తీసుకుంటోంది.  అందుచేత ఆలశ్యం తప్పటల్లేదు..నాది ఈ నెల 30తారీకున పదవీ విరమణ..అప్పటినుండి పూర్తిగా బ్లాగుకు, ఇంకా మిగతా పనులకు పూర్తి సమయాన్ని కేటాయంచుకోవచ్చు.  
               
ముందుగా శ్రీవిష్ణుసహస్ర నామం  84వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం : శుభాంగో లోకసారంగ స్సుతంతు స్తంతువర్ధనః  |

         ఇంద్రకర్మా మహాకర్మాకృతకర్మా కృతాగమః    ||  

తాత్పర్యం: పరమాత్మను శుభమైన ఆకారముతో శుభమయిన అవయవములతో కూడినవానిగా ధ్యానము చేయుము.  ఆయన సకలలోకముల సారము తానేయైనవాడు. సృష్టియను దారము లేక సూత్రము తానేయైననూ మరల తానే తననుండి సృష్టిని దారముగా తీయువాడై యున్నాడు.  ఆయన సృష్టియను మహాకార్యముగా మరి అట్టి కార్యము పరిపూర్తి చేయువానిగా నున్నాడు. సృష్టియందలి శాస్త్రీయ సంప్రదాయము కూడా తానే నిర్మించుకున్నాడు.   

కాల్పనికత కన్నా వాస్తవం చాలా విచిత్రం

అన్ని లీలలోకెల్ల యిప్ప్పుడు చెప్పబోయే ఈ లీల చాలా విచిత్రం.  డా.పి.ఎస్.ఆర్. స్వామిగారు తమ జీవితంలో అసలు జరగడానికే సాధ్యం కాని సంఘటన, ఎలా జరిగిందో మొత్తం జరిగిన తీరుని వివరిస్తున్నారు.  బాబాకు అంకిత భక్తుడయిన ఆయనకు తన కొడుకు మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది.  ఆయన బాబాను నిందించడం మొదలుపెట్టారు.  బాబాయొక్క మాతృప్రేమ ఆయన హృదయానికి గాయాన్ని మిగిల్చింది.  ఆసంఘటనే మూఢభక్తితో ఉండేలాగ చేసింది.  ఈ లీలను ఆయన మనోరంజకంగా వివరించారు.



ఒక్క క్షణం ముందు, నా మొదటి కుమారుడు 10సంవత్సరముల వాడు చనిపోవడంతో దిక్కుతోచక పిచ్చెత్తినట్లయి బాబా అస్థిత్వాన్ని ఆయన సర్వవ్యాపకతను అంతా వట్టిదే అని నిందించాను.  ఆయన భక్తులందరూ కూడా ఆయన సమాధి చెదకముందూ, చెందిన తరువాత సర్వత్రా నిండిఉన్నారని చెప్పిన అనుభవాలని నేను ఖండించాను.

ఆయన అసలు భగవంతుడే కాదు అని ఖండితంగా చెప్పి ఆయన చిత్రపటాన్ని పేడకుప్పలో విసిరిపడేయి అని నాభార్యను బ్రతిమిలాడాను.  కాని, యిక్కడ ఆయన తాను ఉన్నాననే విషయాన్ని ఋజువు చేశారు.

అచేతనంగా స్పృహ లేకుండా పడివున్న నాకుమరుడి నోటిలో పోసిన మందు అలాగే ఉండిపోయింది.  మందు మింగమని నేను గట్టిగా అరచి చెప్పాను.  కాని, ఆనోరు అలాగే తెరచుకొని ఉండిపోయింది.  నేను వొళ్ళుతెలియని స్థితిలో నోరు మూయడానికి ప్రయత్నించాను.  కాని దవడలు గట్టిగా బిగుసుకుపోయి ఉన్నాయి.  నాడి పట్టుకొని చూశాను.  అదికూడా ఆగిపోయింది.  వంట గదిలో ఉన్న భార్యను పిలిచి దైవాన్ని దూషిస్తూ చాలా పరుషంగా మాట్లాడాను.  కొడుకు పోయిన వియోగంలో బాధపడుతున్నదామె.  నేను చేసిన దైవ దూషణకి, అపచారానికి హృదయం బాగా గాయపడి మంచం ప్రక్కనే కళ్ళంబట కన్నీరు కార్చుతూ తలవంచుకుని కూర్చుంది.  నన్ను ఆధ్యాత్మికానికి కట్టబడిన బంధం తెగిపోయే స్థితి వచ్చింది.  యిక నేను నేను కాదు వళ్ళు తెలియని స్థితిలో ఉన్నాను.  నేను క్రూరంగా సిగ్గులేకుండా, రోదిస్తున్న నాభార్యతో యిలా అన్నాను.  

"పోయినవాడెలాగూ పోయాడు.  నేను చావాలనుకోవటల్లేదు.  నాకు ఆకలిగా వుంది.  భోజనం చేయాలి వంట చేశావా" అనడిగాను. ఎటువంటి భావాలు లేకుండా, కేవలం శోకంలో మునిగిఉన్న తల్లితో అటువంటి అమానుషమైన ప్రశ్న వేసిన ఆతండ్రిని ఊహించుకోండి.

 భగవంతునికి ఎంత కృతజ్ఞుడుగా ఉన్నప్పటికీ, మానవుని స్వభావం అధోగతి చెందడానికి అంతం లేదు.ఇక్కడ నేను చెప్పదలచుకునేదేమిటంటే నాలాగ కాకుండా నాభార్య నమ్మకం చివరి వరకూ కూడా ధృడంగానే ఉంది. నాదుర్మార్గ ప్రవర్తన కారణంగా బయటపడిన నా వెఱ్ఱితనం,నా భార్య సత్ప్రవర్తతన నుంచి నేనెలా తప్పించుకున్నానో ఆశ్చర్యంతో నేనేమీ చేయలేని పరిస్థితి.  మానవునియొక్క గొప్పతనం ఎప్పుడూ పతనమవడంలో కాదు, పతనమవుతున్న ప్రతిసారీ నిలదొక్కుకొని నిలబడటంలోనే ఉందన్నది ఒక సామెత.  ఆమె తన మృదుస్వరంతో "ఇప్పుడే పిల్లలకి వంట చేశాను.  ఈ ఒక్కసారికి మీరే వడ్డించుకోమని కోరుతున్నాను" అన్నది.  గతించినదాన్ని తలుచుకుంటూ ఆమె బాబాను ప్రార్ధిస్తూ ఉంని అనుకున్నాను.    

నాకు నలుగురు పిల్లలు. అందులో యిద్దరు కవలలు.  వారికి 6 నెలల వయసు.  నామనస్సు, హృదయం కరడు కట్టాయి. ఎవరిమీద కూడా ఎటువంటి భావాలు, ఆలోచనలు లేవు.  ఆఖరికి బాబా మీద కూడా.  ఆవిధంగా నేను భోజనం చేయడానికి వంట గదిలోకి వెళ్ళాను.  నాముందు కంచం పెట్టుకొని యాంత్రికంగా అన్నం వడ్డించుకొన్నాను.  తినబోయేముందు అన్నం వంక నిస్తేజంగా, నిర్వేదంగా అలాగే కూర్చొని తేరిపార చూశాను.  మనోవైకల్యం కలిగి, నా అంతరాత్మ నన్నిలా ప్రశ్నించింది "చూడు ! నువ్వేమి చేస్తున్నావో.  నీ పెద్దకొడుకు అక్కడ చనిపోయి ఉంటే నువ్వు తినడానికి తయారయ్యావా?"  నేనెంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నానో తెలిసి షాక్ కి గురయ్యాను.  వంటగదికి ఎదురు వరుసలోనే ఉన్న మొదటి గదిలో ఉన్న మంచం మీదకు చూశాను.

అప్పుడే నాకళ్ళు అద్భుతమయిన బాబా రూపం మీదకు దృష్టి సారించాయి.  అది కేవలం దృశ్యరూపమా లేక నా భ్రమా?  యింకా తలవంచుకొని కూర్చున్న నాభార్యతో గట్టిగా అరచి చెపాను "కామూ ! ఎవరొచ్చరో వెళ్ళి చూడు"  వుద్వేగంతో నిండిన నాస్వరంలోని ఆత్రుతను గమనించి నాభార్య గేటువయిపు చూసింది.  ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్లుగా దృష్టిని సారించి, అంకిత భావంతో ప్రార్ధిస్తూ ఆశ్చర్యంతో ముగింపుగా " అమ్మా, నాయనా!  బాబా వచ్చారు" అన్నది. 

అవును, అక్కడ గేటువద్ద నిర్మలయయిన వదనంతో కనులలో కరుణారసం ఉట్టిపడుతూండగా కఫ్నీ ధరించి, తలమీద చుట్టుకొన్న గుడ్డ భుజములమీదనుండి వేళ్ళడుతూ, కుడి చేతిలో భిక్షాపాత్ర పట్టుకొని, ఎడమచేయి ముడుచుకొని కుడి భుజమ్మీద వేసుకొని నిలబడి ఉన్నారు.  సత్ చరిత్ర ఆంగ్ల భాషలో నున్న పుస్తకంలో 112వ. పేజీలో ఆయన ఫొటో ఎలా ఉన్నదో సరిగా అలాగే ఉన్నారు.  నేను ఒక్కసారిగా ఖంగుతిని ఆశ్చర్యపోయాను.
                                      
వాస్తవానికి ఆప్పటికింకా మేమిద్దరిలో ఎవరమూ సత్ చరిత్ర బాబా ఫోటోకుడా చూడలేదు.  మాపూజాగదిలో బాబా కాలుమీద కాలు వేసుకొని ఉన్న ఫోటో మాత్రమే ఉంది.  
                                                     

ఏమయినప్పటికీ ఆయన తన అతి నిగూఢమయిన జ్ఞానంతో అయిదునెలలముందే యిప్పటి ఈ భంగిమతో ఉన్న అయిదు రకాల భంగిమలతో ఉన్న చిత్తరువులను కొనేలా చేశారు.  అందుచేతనే మేము ఆయనని వెంటనే గుర్తుపట్టాము.  నాకిప్పుడు ఖచ్చితంగా ఆయన బాబాయే అని అనిపించింది.  నేను తిరిగి స్పృహలోకి వచ్చాను  సరిగా యిదే క్షణంలో మమ్ములని ఈ కష్టం నుంచి గట్టెక్కిచడానికి బాబా రావడంతో నాహృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.  లేకపోతే నాతెలివి తక్కువతనంతో ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన గురించిగాని, ఆయన మీద గాని. ఎటువంటి ధ్యాస లేకుండా నాముందున్న ఆహారాన్ని అపవిత్రం చేసి ఉండేవాడిని.

ఇలా నూతనంగా లభించిన ఆనందంతో నేను ఎంతో వినయంతో కంచం తీసుకొని వెళ్ళి అన్నం అతని భిక్షాపాత్రలో వేశాను.  అతను దానిని స్వీకరించి ఏమీ  మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.  నిజానికి అంత అవసరం కూడా లేదు.  నాహృదయం ఆనందంతో నిండిపోయింది.  గట్టెక్కినట్లు అనిపించి అర్ధం చేసుకోగానే ఎంతో శాంతి లభించింది.

నేను యింట్లోకి అడుగు పెట్టగానే, మా అబ్బాయి కళ్ళు తెరచి, "నాన్నా నాకు దాహంగా ఉంది.  కాస్త మంచినీళ్ళు యివ్వు"!!! ఈ సంఘటన బాబా మహాసమాధి చెదిన 26 సం.తరువాత మార్చి, 1944 లో జరిగింది.  మానవ శక్తికి సాధ్యం కానిది, సాధ్యపడింది.

శ్రీసాయిలీల 
సెప్టెంబరు 1986
డా.పీ.ఎస్.ఆర్.స్వామి, హైదరాబాదు.  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

సాయినాథ స్తవనమజ్ఞరి

$
0
0

          
         
          
08.09.2013  ఆదివారము

ఒం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మీకనరకూ వినాయక చవితి శుభాకాంక్షలు

సాయిబంధువులందరకూ ఒక ముఖ్యమైన గమనిక.

రేపు అనగా 09.09.2013 సోమవారము వినాయకచవితి... దీని ప్రాముఖ్యం ఏమిటో మీకు తెలియచేస్తాను. 

సరిగా 95 సంవత్సరాల క్రితం అనగా 09.09.1918 సోమవారం, వినాయక చతుర్ధి నాడు శ్రీదాసగణు మహరాజ్ గారు శ్రీసాయినాధస్త్జవన మంజరిని రచన ప్రారంభించి, 15.09.2013 గురువారమునాడు పూర్తి చేసి శ్రీషిరిడీ సాయిబాబావారికి అంకితమిచ్చారు.  బాబా మహాసామాధికి 36 రోజుల ముందు ఈ గ్రంధము వ్రాయబడినది.   


సరిగా ఈ సంవత్సరము కూడా 09.09.2013 సోమవారము వినాయక చతుర్ధి, 15.09.2013 గురువారము వచ్చినవి..  కావున మీరందరూ రేపు గాని, గురువారము నాడు గాని స్థవన మంజరిని పారాయణ చేసి బాబావారి అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా కోరుకుంటున్నాను...వీలయితే 11 సార్లు పారాయణ చేయండి లేనిచో సామూహికంగా నయినా సరే 11 సార్లు పారాయణ చేయండి..ఈసందర్భంగా మీకు శ్రీసాయినాధ స్థవనమనజరిని అందిస్తున్నాను.. 
  
సాయినాథ స్తవనమజ్ఞరి

శ్రీ గణేశుడు పార్వతి చిరుత బుడత
భవుని భవరాన నెదిరిన పందెగాడు
గజముఖంబున తొలిపూజ గలుగువేల్పు
ఫాలచంద్రుడు నన్ను కాపాడుగాక !

వాణి శుకవాణి గీర్వాణి వాగ్విలాసి
శబ్ద సృష్టికి స్వామిని, శారదాంబ
రచయితల వాజ్ఞ్మదురిమను రాణవెట్టు
యజునిరాణి పూబోణి దయాంబురాశి
మంచి వాక్కిచ్చి నన్ను దీవించుగాక !

సగుణరూపి - పండరిరాయా - సంతు - నరహరీ
కృపార్ణవా - రంగా - నిరీక్ష సేయ
దగునటయ్య - నన్ భవదీయదాసునిగని
శ్రీ లముంచ జాగేల చేసెదవు, కృష్ణ !
హే కపాల మాలాభరణా ! కపర్దీ
హే దిగంబరా కృపానిధీ ! జటాధ
రా ! మహేశా ! పాశుపతే ! పురాసురారి !
శివ, శుభంకరా, శంకరా, శ్రీకరా, హరా !
విరాగి దయాళో పరాకుసేయ
నేల 'నోం' కార రూప నన్నేలుకొనగ.

వినయముగ మీకు పాద వందనము సల్పి
చేయనున్నాడ స్తోత్రంబు చిస్త్వరూప
తరచు మీ నామస్మరణంబు గరపు, నాదు
కోర్కె లీడేరకుండునా గురువరేణ్య

జయము దిగ్విజయము జయ సాయినాథ
పతిత పావన భావ కృపావతంస
త్వత్పదంబుల శిరమిడి ప్రణుతిసేతు
నభయమిడి బ్రోవరావమ్ము అత్రితనయ

తపసి బ్రహ్మమీవు పురుషోత్తముడ వీవు
విష్ణువీవు జగద్య్వాపి వీవు – పరమ
పావనియుమ యెవరి భార్య యౌనొ
యట్టి కామారి నీవ కృపాంబురాశి

నరశరీరముదాల్చు నీశ్వరుడ వీవు
జ్ఞాన నభమున వెలుగు దినకరుడ వీవు
దయకు సాగరమీవు భవబంధముల జిక్కి
జ్వరపడు కృశించు రోగికౌషధివి నీవు

భయములో గల వారి కాశ్రయము నీవు
కలుషితాత్ముల పాలిటి గంగవీవు
దుఃఖసాగరమీదగ దొప్పవీవు
దళిత జనపాళి పాలి చింతామణీవు

విశ్వవిశ్వంభరాన నావిర్భవించు
విమల చైతన్య మీవ - యీ విధివిలాస
జగతి నీదు లీలావిలాసమ్మె సుమ్ము
సాధుజన పోష ! మృదుభాష ! సాయినాథ !

చావు పుట్టుకల్ రెండు నజ్ఞాన భావ
జనితములుగాన - యట్టి యజ్ఞాన తిమిర
మార కారుణోదయ ప్రభాసార ! నీకు
జననమే లేదు ! కావున చావు రాదు
దేహమున బ్రహ్మచైతన్యదీప్తిగలుగ

కలిగె దానికి వింతైన గౌరవంబు
నీటికతమున నది కబ్బుమేటి విలువ
పగిది - పరికించి చూడ పాడుబడిన
దేవళముగాదె నిర్జీవ దేహమకట !

జ్ఞానియెన్నడు దేహాభిమానికాడు
దేహముండిన మండిన దివ్యశుద్ధ
సత్వచైతన్య బ్రహ్మంబె శాశ్వతమ్ము
దారిలేకయె ప్రవహించు నీరమట్లు.

చావుపుట్టుకల్ సహజమ్ము జంతుతతికి
పుట్టు ప్రతి ప్రాణికొకపేరు పెట్టు కతన
నీవునేనను భావంబు నిండెగాని
యుండెనా చిత్ జగంబులు రెండుగాను?

నీరదమ్ము ధరించెడి నీరమట్లు
జగతినిండిన చైతన్యశక్తి యెకటె
మాది మీదను తారతమ్యంబు లేక
నిల్చుశాశ్వతమ్ముగ గణనీయమగుచు

నీరు భూమికిజారి గోదారి పడగ
పావనంబంచు నద్ది ప్రఖ్యాతిగాంచె
వాగువంకన - చిరు సరోవరము పడుచు
విలువ గోల్పోవకుండునే ! మలినమగుచు

మీరు గోదావరి పడిన నీరువంటి
వారు - మేమో ! తటాకాది తీరభూము
లందుపడి - చెడి మలినమైనట్టి వార
మగుట - మీకు మాకంతటి యంతరమ్ము.

పాత్రతను బట్టి యర్హతబడసినట్లు
గౌతమికి గల్గెనంతటి గౌరవమ్ము
దివ్యచైతన్య మన్నింట నిండియున్న
మీతనుగత మౌచు పునీతమయ్యె.

ఆదినుండియు గోదారి ఆగకుండ
పారుచున్నది నేటికి తీరమొరసి
కాని రావణారిపద సుఖానుభూతి
బడసిన పవిత్రజలము గన్పడునె నేడు ?

నీరు వాలువ ప్రవహించి చేరు జలధి
కాని - దాని కుపాధేయమైన భూమి
మాత్రము నిజస్థితిని నిల్చి మార్పుచెంద
నట్లు - మీ యునికి నిలుచు నహరహమ్ము

శాశ్వతంబగు బ్రహ్మంబె సాగరంబు
దానిగలిసిన నీరె చైతన్య శక్తి
మీరుపాధేయమైన గోదారివంటి
వారు - మీనుండి వెడలు కాల్వలము మేము

ఎన్నడైన మాలో ప్రవహించుశక్తి
చేరునాస్వామి సాగర తీరమునకు ?
యీ పరీక్ష కృతార్థులనెట్లు సేతు
వయ్య - త్వత్పాదాశ్రితులమైన మమ్ము

పాతనీరుపోయి ప్రతివత్సరమ్మున
క్రొత్తనీరు నదికి కూడునట్లు
పుట్టుచుంద్రు ఋషులు పుణ్యపురుషులును
ప్రతి దశాబ్దమందు – ప్రగతికోరి

అట్టిసంతు ప్రవాహమందాది పుట్టి
భావికాథ్యాత్మ సౌగంధ్య తావినూది
నడచినారలు సనకసనందనాది
బ్రహ్మమానసాత్మజులు పురాణనిధులు

ఉపరి నారద తుంబర, కపిల, శబరి
వాయునందనాంగద, ధృవ, బలినృపాల,
విదుర, ప్రహ్లాదగోప గోపికలు పుట్టి
రవని - కాల మహాప్రవాహమ్మునందు.

ఇన్ని శతాబ్దములు సాగుచున్న సృష్టి
వట్టి పోయెను ! సాధుసంపత్తి లేక
ధర్మ సంస్థాపనార్దమై ధరణి నుద్భ
వించదె - దశాబ్ధికొక్క వివేకజ్యోతి.

ఈ మహా గౌతమున్ బోలె నీదశాబ్ద
మందు సంతురూపున పుట్టిరందు మిమ్ము
దాసగణు మానసాబ్ధిచంద్రా ! అశేష
దీన జనతాకృమిత భవ్యదివ్యచరణ.

ఒక మునక వేసినంతట సకల పాప
ముల హరించు గౌతమివలె – కలుషితాత్ము
ల సమయింపదె మీదృష్టి ప్రసరణంబు
ఆర్తి జనతాశరణ్య సంయమివరేణ్య

ఇనుములోని దోష మిసుమంతయేనియు
స్పర్శవేది లెక్క సలుపనట్లు
దోషరోష వేషు దుర్గుణ జడునన్ను
విడువకుండుమయ్య విశ్వచక్షు

గ్రామమందుపారు కాల్వను గౌతమి
విడుచునొక్క నీరు విడువకుండ ?
జ్ఞానహీన వట్టి చంచల మతినైన
నన్ను విడుతువె దేవ – అనాధనాధ

పరుసవేది తగిలి పరిణితి చెందని
లోహమున్న దాని లోపమెల్ల
స్పర్శవేది తానె భరియించినట్లుగా
నాదుదోషమెల్ల మీదెగాదె

నన్ను పాపిగనుంచి యీనా – రుజమ్ము
పైనవేసికోవలదయ్య స్వామి లోహ
తత్వమైన కాఠిన్యమునుతాకి చెడెను
పరుసు వేదను దుష్కీర్తి బడయవలదు

తప్పు సేయుచుంట తప్పదు బిడ్డకు
దానిసైచికాచు తల్లి యెపుడు
కలుషితాత్ముల మమ్ము కనుసైగకావగ
తప్పదయ్య నీకు దాసపోష.

ఓ సనాతనా ! మీరు ముందుద్భవించి
నట్టి ఓంకారమవు నందునణగిన శబ్ద
సంపదవు తత్ర్పవాహముసాగు ప్రాణ
శక్తివీ సువిశాల విశ్వమునకంత
జీవనాధారుడీవ కృపావతంస.

వేదమీవు స్ర్మతుల కనువాదమీవు
జ్ఞాన నభమున వెలుగు దినకరుడవీవు
సురభివీవు, నందన వనతరువువీవు
వేడినంతట రక్షించు వాడవీవు

సకల సద్గుణ ఘనివని - సాధుజన హృ
దాంతరావృత "సోహంబ" వనియు – స్వామి
స్వర్గ సోపానముల నెక్క సాహసించి
నాఢ - చేయూతనిమ్ము వినమ్రమూర్తి

పరమపావనా ! చిత్స్వరూపా ! పరంత
పా ! కృపాంబురాసీ ! భేదవర్జితా ! దయాళో !
జ్ఞానసింధో ! నరోత్తమా ! దీనజన ని
వాస ధామమా ! నన్ను కాపాడరమ్ము

నివృత్తి నాధుడివీవు, జ్ఞానేశ్వరుడవు
పరమసద్గుణ గురు జలంధరుడవీవు
ఏకనాధుడవీవు, మచ్ఛీంద్రుడీవు
పీరు మహమ్మదువీవు – కబీరువీవు

బోధకుడవీవు తత్వ సుబోధకుడవు
రామ తుకరామ సఖరామ రామదాస
సావంతులలోన నెవరివో సాయినాథ
యెరుగకున్నాడ నిన్ను సహేతుకముగ

యవనుడని కొందరు మరి బ్రాహ్మణుడటంచు
కొందరు నిను కీర్తించుట విందుగాని
నీ నిజస్ధితి నెరుగు మనీషిగలడె
అదెగదా యదూద్వహుని వింతైన లీల

సుతుడు సుకుమారుడంచు యశోదబల్కె
కాలుడనిబల్కె కంస నృపాలకుండు
దయకు మారుగబల్కె యద్దవుడు కూర్మి
ప్రాజ్ఞుగాబల్కె మధ్యమ పాండవుండు

ఇట్టి వైవిధ్య భావములెన్నో కలుగు
వారి, వారి, మనోగత భావగరిమ
కనుకనే - మిమ్ము రూపురేఖలనుబట్టి
పోల్చుదురు భిన్నమతముల ప్రోగువనుచు

ఫాతిహా పలికి మశీదు పంచనుండి
తురకవంచును యవనుల కెరుకపడవె
వేదవిజ్ఞాన విషయ వివేకివగుట
హిందువై యుందువంచు నూహించుకొంటి

బాహ్యమైనట్టి మావిధి వ్యాపకమ్ము
తగవులాటలు గూర్చదె తార్కికులకు
దానినెన్నడు గొనరు ప్రధానమంచు
జ్ఞానులైనట్టి భావ జిజ్ఞాసులెపుడు

జగతికావ్య కారణమైన సాంద్రకీర్తి
జాతి గోత్రములేని ప్రశాంతమూర్తి
హిందు, యవనుల భేద రాహిత్యమునకు
పట్టినావగ్ని - మసీదున మెట్టినావు

తార్కికులకందనట్టి మీ తత్వమరసి
పలుకుటెట్టులో నాశబ్ద పరిధిమించి
కాని మౌనము బూనగా లేనుగాన
పలుకనుంటిని నాపద పరిచయమున

మీ మహాత్ముల యోగ్యత నేమనందు
దేవతలకన్న మిన్నకాదే కృపాళొ
మంచిచెడ్డల తారతమ్యంబులేదు
నాది నీదను భావమేనాడురాదు

రావణాది దానవ కులాగ్రణులు దైవ
నింద చేసి - కులక్షయ మంధినారు
కాని - వినరాని యేగుణహీనుడైన
మీ మహాత్ములజేరి – ప్రేమింపబడడె

గోపిచందుడు పూడ్చడె గుట్టక్రింద
గురు జలంధరుబట్టి నిగూఢవృత్తి
అయిన నేదోష మాతని నంటకుండ
దీవనలొసంగడే చిరంజీవి యనుచు

శిష్టుడైనను దోష భూయిష్టుడైన
నతని సమదృష్టిజూచు మహాత్ముడెపుడు
కాని - పాపులయడబూను కరుణమెండు
వారి యజ్ఞానమను ముందు బాపుకతన

ఆ ప్రభాకరుడొక్క మహాత్ముడ – ప్ర
కాశమే వారి పరిపూర్ణకరుణ- ఆ,-శ
శాంకుడొక సంతు - సుఖదాయి యైనవాని
కృపయె పూర్ణిమరేయి వర్షించు జోత్న్స

ఉజ్వలంబైన కస్తూరియెక్క సంతు
ఆ పరిమళ మద్దాని అవాజ్య కరుణ
రసము ఛిప్పిల్లు చెరకొక రాగరహితు
డమ్మహాతుని కృపయె తియ్యనిరసంబు

మురికిబట్టలుదుక బోదురు తరచుగా
గంగ చెంత మైల కఢిగివేయ
పెట్టెనుండు బట్ట పెక్కుసార్లుదుకగా
నిచ్చగింతురొక్కొ రెవ్వరేని

నీవె గౌతమి - ఆ మెట్లె నిష్ఠ – మలిన
మైన వస్త్ర్ర్రమే జీవాత్మ - ఆ వికుంఠ
మౌరపేటిక – అరిషడ్వికారమనగ
మురికి - అది వదిలినజీవి పొందుమిమ్ము.

నీడనిచ్చు తరువు నీవుగానుండిన
సంచరించు బాటసారి నేను
తాళలేని తప్త తాపత్రయమ్మున
నిన్నె చేరువాడ నీడకొరకు

తపన తీరకుండ దరిచజేరు జీవుని
నీడయనెడిదయతో నింపుమయ్య
చెట్టునీడ గూడ సేద తీర్చకయున్న
వృక్షమంచు దాని బిలుతురెవరు

ధర్మరక్షకు భువిపైన తారసిల్లె
పార్ద సారధి మిషన గోపాలకుండు
రావణానుజు బ్రోవగ రామవిభుడు
కోతిరాజుకు గూడ చేయూతనిచ్చె

వేదములుగూడ వర్ణింప వీలుబడని
నిర్గుణంబైన బ్రహ్మననేక విధుల
సగుణబ్రహ్మగ భువిని సాక్షాత్కరింప
చేయగలదొక్క మహితాత్ము చిత్తవృత్తె

క్షీరసాగరమందు లక్షీసమేతు
డై నిరంతర సుఖనిద్రబూను హరికి
అదిపుడాఢ్యుడు నిర్నిద్రుడన్న పేరు
కలిగె - సంతుల సమదృష్టి కతనగాదె

ఆ మహాత్ముల యోగ్యతనెవరు – యేచి
తూచగలరు - శ్రీహరిచేత తోళ్ళుమోయ
జేసె - చోఖబా ! మొహరుగా, చేసె ధాము
డెట్లాడమనిన నాడె సర్వేశుడకట

నీరుమోసె సక్కుకు రుక్మిణీ విభుడు – సు
ధాము ప్రేమతోడాసి - పాదములు గడిగె
గోముగా బిల్చి సరిచేసె కుబ్జగూని
ఆపదని - విని - అక్రూరు నంటినడచె

పామరుడ నేను యేభాష పల్కగలను
నీవె తల్లివి తండ్రివి నీవెగాదె ?
సంతులకు సంతు - రక్షింపవంతు నీదె
సద్గురూత్తమ శిరిడీశ సాయినాథ

సాగరంబున వటపత్రశాయివోలె
మూరపై పావుచెక్కన చేరి – పవ్వ
ళించి, యోగశక్తిని నిరూపించినావు
నీట దీపాల వెల్గుల నింపినావు

ఊది మందుగ వ్యాధుల బాధబాపి
చూపుతోడుత గొడ్రాలి చూలునింపి
ఐహికంబను జలధికి అడ్డుకట్టి
ముక్తి తలుపులు తెరుచు చిన్మూర్తివీవు

గురువరా ! భవదీయమగు కృప లేశ
మైన నాపై ప్రసరింపదేని – నాదు
జీవితము వృధ - నీ పాద సేవచేసి
కాలము వెలార్చు భాగ్యమ్ము కలుగనిమ్ము

సూక్ష్మమగు చీమ భారమా ! స్థూలకరికి
నన్ను విడువకుమయ్య దీనజనబంధు
నిన్నె నమ్మితినయ్య మునీంద్ర వంద్య
సన్నుతించెద నిన్ను గోసాయివేష

శ్రీ సమర్ధ సద్గురు సాయి సేవసేయ
శాస్త్ర్ర మిసుమంతమేనియు చదువలేని
నాకు, మీదు చిద్రూపు – మానసమునిల్పి
ధ్యాన మొనరించు భాగ్యమ్మునబ్బనిమ్ము

అన్నిటన్ నిండు ఆత్మ మీ అంశమగుట
అర్దమేలేని శబ్ద సహాయమంది
అనుభవములేని తత్వమ్మునరసి – మీదు
యునికి యిదియదియని చెప్పనోపనయ్య

వ్యావహారిక పూజ నేనాచరింప
నర్హతేలేని నాకు – ప్రేమాశ్రువులతో
పాదములు తడుపునటుల భక్తియనెడి
చందనమందునటు లాజ్ఞ సల్పుమయ్య

జలధి - దప్పికతీర్చ నే జలముదెత్తు
అగ్ని - చలిగాచుకొనుట కేయగ్ని దెత్తు
పూజసేయగ నేవస్తులను దెత్తు
దత్త తత్వమన్నింట తా , దాగియుండ

కాన పద సోయగంబను కఫ్ని గూర్చి
మానసిక ప్రేమ భావ పూమాల వేసి
కుచ్ఛితంబను బుద్ధికి కుంపబెట్టి
ధూపముగ వ్రేల్చి నర్చింతు తోయజాక్ష

అగ్ని పడియెడు దుర్గంధ పంకిలంబు
రూప రసగంధ వాసన రుచిని విడిచి
నిర్మలంబైన సద్గురు నీడచేరి
ఆత్మ సౌగంధ్య శక్తిగా నావరించు.

నన్ను గూడిన చెడు లక్షణములు నేడు
పూర్ణముగ మాడి - మీ పరిపూర్ణ కరుణ
నక్షయంబుగ నుత్పన్న మయ్యె మంచి –
మురికి గంగ తిరిగి శుభ్రమొందినట్లు

భద్రమగు నాసనము సమర్పణము జేసి
యిష్టమగు దాని నైవేద్య మిచ్చినాడ
స్వీకరింపుడు భక్తి నివేదనమును
స్తన్యముగ నిండు - ఫలితము తల్లివగుచు

అండపిండ బ్రహ్మాండ మావరించి
నాడవనుమాట - నిజము - ధీనజనబంధు !
అందు లవలేశమైన, నా అంతరాత్మ
నిన్ను గను జ్ఞానచక్షువు నీయగదవె

కస్తూరితో నుండు మృత్తిక కంపురీతి
పూల జతగూడు దారమ్ము వోలె – మీమ
హాత్ముల పరిచర్య కతన – నలరుగాత
క్రొత్తవెలుగు నాజీవిత కుహరమందు

సీ|| ఈ నీలికండ్లలో ఏజ్యోతి వెల్గెనో
అజ్ఞాన తిమిరాళి అంతరించె
ఈ లోతుగుండెలో ఏ ప్రేమ నిండెనో
ప్రీతిభావము జగతి పెంచుకొనియె
ఈ వరాలకరాల ఏ శక్తి దాగెనో
అభయమై జీవనం బతిశయిల్లె
ఈ పాదయుగళియందేహాయి యిమిడినో
సుస్థిరంబగు శాంతి విస్తరిల్లె
ఔర ! నీచూపు నీహృదయాంతరమున
ప్రాపు - నీదు చేతిచలువ – పాదరజము
విలువ - అనుభవైక్యమెగాని – వేరుకాదు
సద్గురూత్తమ శిరిడీశ – సాయినాథ

సీ|| నీ యందు పొడగంటి నిత్యమంగళరూప
సిద్ధ గంధర్వ సంసేవ్య పదము
నీ రూపుగా నెంతు నీరధిగంభీర
మూర్తిత్రయమ్మును మోదమలర
నీవుగా నెంచెద నిఖిలాత్మ సంభూత
కార్యకారణ కర్మగతులనెల్ల

నీవుగా తలచెద భావంబునందున
భువన భాండంబుల పుణ్యపురుష
ద్వాదశాదిత్య దిక్పాలకాది సురల
మునుల - నిధుల - కులాచల, జనపదమ్ము
లెల్ల - నీలోన కనుగొంటి నీప్సితార్ధ
ఫలసుఖంబుల నందితి – పద్మనయన
నద్గురూత్తమ శిరిడీశ సాయినాథ

సీ|| ప్రామినికులు నిన్ను భాషింపనగుగాక
కడదాగ నీమూర్తి కాంచగలవె
పంచ భూతములు నీపంచ గాచెడిగాక
ఎఱుగునే నీగుణం బించుకంత
సూర్యచంద్రులు నీదు చూపులే యౌగాక
నీ తేజ మహిమంబు నేర్వగలరె
సాగరంబులు నీదు శయ్యలే యౌగాక
నీయంతరమును గణింపగలవె

పుట్టియున్నను నీకుక్షి భువనమెల్ల
తెలియునే నీస్వరూపము తెలిసి పలుక
ఈ చరాచర సృష్ఠి కగోచరుడవు
సద్గురూత్తమ శిరిడీశ - సాయినాథ 

సీ|| పాదోది కర్ఘ్యపాద్యాదు లిడినట్లు
ఇనునకు దీప మందించినట్లు
మలయా చలమ్ముకు మలయజంబిడినట్లు
హేమాద్రికిన్ భూషలిచ్చినట్లు

కుసు మేఘ సఖునకు కుసుమంబు లిడినట్లు
పునుగుకు గంధమ్ము పులిమినట్లు
అమరాధి నాధున కాసనంబిడినట్లు
విధునకు సుధనిచ్చి వేసినట్లు


విశ్వనాధుని నిన్ను రావించి సేవ
లందు మనుటెల్ల - మా హృదయాబ్జపీఠి
తలచినంతనే నిలచి మమ్ములరించుమయ్య
సద్గురూత్తమ శిరిడీశ సాయినాథ

దీనినెవరు పఠింతురో దీక్షబూని
వత్సరములోన వారికి వరలు శుభము
త్రివిధ తాపములెల్లను తీరిపోయి
తీరకుండెడి కోర్కి సిద్ధించుగాత !

నిత్యమెవ్వరు దీనిని నిష్టతోడ
మనన మొనరింత్రో వారల మనసులోన
మసలుచుండును సాయి ప్రేమానురక్తి
మంచి పాలన వెన్న భాసించినట్లు

దినమున కొకమారు చదువను తీరకున్న
గురుని వారము నందైన కూర్మితోడ
చదవగలవారియింట సంపదరహించు
ఇహపరంబుల యందున సహకరించు

ఇదియు సాధ్యంబుగాకున్న వుదయమందు
దశమి మరునాడు చదివిన ధనము, బలము
యశము ప్రాప్తించు తాప ముపశమనమగును
నింద తొలగు నిర్భయముగ నిశ్చయముగ

నియమమున మండలము దీని నిష్ఠతోడ
వినిన చదివిన, చదివిన వినినగాని
సాయినాధుడు మీకు సాక్షాత్కరించి
కొంగు బంగారమై జతగూడి నడచు

శాలివాహను పేరిట శకమునందు
పదుయునెనిమిది నలుబది వత్సరమున
భాద్రపద శుద్ధచవితి పర్వదినాన
సోమవారమునందు నీస్తోత్ర రచన

ఆ మహేశ్వరక్షేత్ర భాగాంతరమున
పూరణంబయ్యె నర్మద తీరమందు
శ్రీ సమర్ధగురు కృపా విశేషగరిమ

తెలుగు సేత పది పైన తొమ్మిదొందల ఎనుబది
రెండు సిద్ధి విఘ్నేశ్వరు పండుగ దిన
మున పరిసమాప్తిచెంద నేమూల పురుషు
డీ రచనకు కారణమొ యూహించుకొనుడు

అట్టులూహించుకొని ఆ మహాత్మునొక్క
సారి స్మరణ చేయుడు మనసార "సాయి
సాయి" అనుచు సుజనులారా ! సాయి భక్తు
లారా ! ముక్తికాంత వరించు దారికొరకు.


ఇతి శివం

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై.
శ్రీ హరిహరార్పణమస్తు,
శుభం భవతు, పుండలీకవరదా
హరివిఠలా ! సీతాకాంతా స్మరణ జయజయ రామ
పార్వతీపతే - హరహర మహాదేవ శ్రీ సద్గురు
సాయినాథ మహరాజుకీ జయ శ్రీ సాయి
నాధార్పణమస్తు, శుభం భవతు
శ్రీ సాయినాథ ప్రసన్న శ్రీ దాసగణు మహరాజ్ కీ జై !

శ్రీసాయితో మధురక్షణాలు - 18

$
0
0
                
                 
12.09.2013  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయితో మధురక్షణాలు అనువాదం చేయడానికి కాస్త సమయం తీసుకుటున్నందువల్ల మనబ్లాగులో ప్రచురణకు కాస్త ఆలస్యమవుతోంది.    అధ్భుతమైన ఈ బాబా లీలను చదివి ఆ అనుభూతిని పొందండి.  బాబా వారికి అన్ని విషయాలు మనము చెప్పకుండానే గ్రహించి మనకు తెలియకుండానే నివారణ కావిస్తారు. ఒక్కొక్కసారి మన సమస్య చెప్పకున్నా వారే ఆసమస్యను పరిష్కరిస్తారు.. ఈ అద్భుతమైన లీలను చేదివేముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 85వ.శ్లోకం తాత్పర్యం చదవండి.  

శ్రీవిష్ణుసహస్రనామం 85వ.శ్లోకం

శ్లోకం:  ఉధ్భవ స్సుందర స్సుందో రత్ననాభ స్సులోచనః   |

         అర్కో స్వాజసన శ్శృంగీ జయంత స్సర్వ విజ్జయీ     || 

తాత్పర్యం : నేత్రములతో కాంతిని అన్నివైపులకు ప్రసరింప చేయుచున్నాడు.  ఆయన ఈ సృష్టిచక్రమునకు శిఖరముగా ఆహారమును పుట్టించుచున్నాడు.  తన సృష్టియందలి జీవుల జయమే తానైనవాడు.  ఆయన సర్వమూ తెలిసినవాడు.  మరియూ సర్వమును జయించినవాడు.   
                          

శ్రీసాయితో మధురక్షణాలు - 18 

చూపు క్షీణించిన కండ్లకు దృష్టిని ప్రసాదించిన సాయి

బాబా జీవించి ఉండగా ఆయనను చూసిన భక్తులలో  శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్పాండే కూడా ఒక గొప్ప భక్తుడు.  ఎందుచేతనో ఆయన తాతగారి (తల్లివయిపు తండ్రి) కంటిచూపు మందగించింది.  



అత్యుత్తమమయిన వైద్యం చేయించినా గాని, కంటి చూపు మెరుగుపడటానికి బదులు ఆయన పరిస్థితి యింకా దిగజారిపోయి రెండు కళ్ళలో చూపు పూర్తిగా పోయింది.  ఆరోజుల్లో శ్రీగోవిందరావు మాన్ కర్ అనే సన్యాసి ఉండేవారు.  ఆయన గొప్ప సాయి భక్తుడు, బ్రహ్మచారి.  ఆయన, దేశ్ పాండే తాతగారిని షిరిడీ తీసుకొని వెళ్ళి బాబాగారి ఆశీర్వాదములు తీసుకొనమని సలహానిచ్చారు.  శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్ పాండే గారి కుటుంబ సభ్యులందరూ దీనికి సమ్మతించారు.  తాతగారిని  షిరిడీ తీసుకొనివెళ్ళడానికి తోడుగా ఎవరు వెడతారనే సమస్య ఎదురయింది.  ఆయన మేనమాలిద్దరికీ కూడా పరీక్షలు జరుగుతూ ఉండటం వల్ల వారు రాలేని పరిస్థితి.  విఠల్ దేశ్ పాండే ఒక్కడే ఖాళీగా ఉన్నాడు.  ఆఖరికి అందరూ కూడా అతనిని తోడిచ్చి  తాతగారిని షిరిడీ పంపించడానికి నిర్ణయించారు.  ప్రయాణంలో చాలా జాగ్రత్తగాను, బుధ్ధిగాను, ఉండమని ఖచ్చితమమైన ఆదేశాలు యిచ్చారు.  ఒక మంచిరోజున వారిద్దరూ షిరిడీకి ప్రయాణమయ్యారు.

అది 1916వ.సంవత్సరం.  అప్పటికి విఠల్ దేశ్ పాండే వయస్సు 12 సంవత్సరాలు.  శ్రీవిఠల్ దేశ్ పాండేగారు తమ అనుభవాన్ని యిలా వర్ణిస్తున్నారు.

"మేము షిరిడీకి చేరుకున్న వెంటనే మేమిద్దరమూ తిన్నగా బాబాగారి దర్శనం కోసం "ద్వారకామాయి" కి వెళ్ళాము.  బాబా మావైపు నవ్వుతూ చూసి 6 రూపాయలు దక్షిణ అడిగారు.  నాదగ్గిర సరిగ్గా అంత డబ్బులేదు.  అందుచేత నేను 10రూ.నోటు యిచ్చాను.  బాబా తల అడ్డంగా ఊపి, తనకు నావద్దనున్న 10రూ.గాని, 5రూ.గాని వద్దనీ, తనకు సరిగా 6రూపాయలు మాత్రమే కావాలని చెప్పారు.  బాబా చాలా పట్టుదలగా ఉన్నారు. నేను మాతాతగారిని క్రింద వసారాలో కూర్చోబెట్టాను.  ప్రస్తుతం అక్కడ వంట చెఱకు నిలవచేసుకోవడానికి ఒక గదిఉంది.  ఆరోజుల్లో దాని వెంబడే ఒక యిరుకైన వీధి, దానికి అవతల ఒక గోడ ఉన్నాయి.  నేను మాతాతగారి అనుమతి తీసుకొని 10రూ.నోటుకు చిల్లరగా 10 రూపాయి నాణాలు తీసుకొని రావడానికి బయటకు వెళ్ళాను.  నేను ప్రతీ దుకాణం దగ్గరకు చిల్లరకోసం వెళ్ళాను, కాని, అంత చిన్న గ్రామంలో ఎవ్వరూ నాకు చిల్లర యివ్వలేదు.  నేను పూర్తిగా అలసిపోయాను.  నేను చిన్నపిల్లవాడిని కనుక నాకు దఃఖంతో కన్నీళ్ళు వచ్చాయి.  

నాబుగ్గలమీద కన్నీరు జాలువారుతూ ఉంది.  నేను రోడ్డుప్రక్కన నిలబడి వున్నాను.  అపుడు, పంచ, 'బారాబందీ' (ఒకవిధమయిన జాకెట్టు) తలకి పాగా కాళ్ళకు 'పునేరీ' బూట్లు, (పూనాలో ప్రత్యేకమగా తయారయినవి) ధరించిన ఒక పెద్దమనిషె నావైపుకు వచ్చాడు.  ఆయన నుదిటిమీద గంధపు బొట్టుంది.  నావీపు మీద తడుతూ ప్రేమతో ఓదార్పుగా ఎందుకేడుస్తున్నావని అడిగాడు.  మధ్యమధ్యలో వెక్కిళ్ళు పడుతూ నాదుఃఖానికి కారణమయిన కధంతా చెప్పాను.  ఆయన మంచి ఉదారస్వభావుడిలా కనిపించాడు. వెంటనే ఆయన తనజేబులోనుండి పరిరూపాయి నాణాలు తీసి నాచేతికిచ్చాడు.  నాణాలను అందుకున్న వెంటనే ద్వారకామాయికి పరిగెత్తుకొని వెళ్ళి బాబా చేతిలో పెట్టాను.  బాబా చరణకమలాలకి సాష్టాంగ నమస్కారం చేశాను.  బాబా నన్ను దీవిస్తూ "అబ్బాయీ! భయపడకు.  అల్లా మాలిక్ నిన్ను అనుగ్రహిస్తాడు.  నువ్వు వచ్చిన పని పూర్తయింది.  ఇక వెళ్ళు" అన్నారు.  నేను కేవలం 12సం.బాలుడినయినందువల్ల బాబా మాటలలోని గూఢార్ధం నాకు బోధపడలేదు.  బాబాకు మేము షిరిడీ ఎందుకు వచ్చామో చెప్పలేదు.  బాబా కూడా మమ్మల్ని అడగలేదు. "మీరు వచ్చిన పని నెరవేరింది, యిక వెళ్ళండని" బాబా అన్నమాటలకు నేనాశ్చర్య పోయి బాబావంక విభ్రాంతితో చూసినపుడు బాబా మరలా తిరిగి అవే మాటలు అన్నారు. 

నేను ద్వారకామాయినుండి బయటకు వచ్చాను.  మాతాతగారిని కూచోపెట్టిన చోటకు వెళ్ళి చూశాను, కాని అక్కడ మాతాతగారు కనపడకపోవడంతో నాకు చాలా భయం వేసింది.  విపరీతమయిన భయంతో మాతాతగారిని వెదకడానికి ప్రతీ చోటకి పిచ్చిగా పరిగెత్తాను.  కాని, లాభం లేకపోయింది.  మాతాతగారి క్షేమం గురించిన ఆందోళన నన్ను వెంటాడింది.  ఆయనకేమయింది?  కనుచూపుమేరలో ఎక్కడా కనిపించటల్లేదు?.  నేను చాలా దారుణంగా ఊహించుకున్నాను.  మాతాతగారు ఆకస్మికంగా అదృశ్యమవడంతో, భయభ్రాతుడినయిపోయి మరలా బిగ్గరగా ఏడవడం మొదలెట్టాను.  ఓదార్పు లేక ఒంటరిగా ఒకమూల నిలబడ్డాను. అప్పుడే అంతకుముందు నేను కలుసుకొన్న దయగల వ్యక్తి వచ్చి మరలా ఎందుకేడుస్తున్నావని అడిగాడు.  మాతాతగారి అదృశ్యం గురించి నేనతనికి చెప్పాను.  కళ్లనిండుగా కరుణ రసం ఉట్టిపడుతుండగా నన్ను గట్టిగా పట్టుకొని "ఆందోళనపడకు,  వీధిచివర వాడా దగ్గర మీతాతగారు కూర్చొని ఉండటం యిప్ప్పుడే చూశాను" అన్నారు.   నేనిక ఆలశ్యం చేయకుండా ఆయన చూపించిన వైపు పరిగెత్తుకొని వెళ్ళాను.  ఓహ్!  అక్కడ మాతాతగారు చెఱకుగడల గుట్టప్రక్కన కూర్చొని ఆనందంగా చెఱకు ముక్క నములుతూ ఉన్నారు.  "ఒంటరిగా నువ్వు యిక్కడికెందుకు వచ్చావు.  నీకు కళ్ళు కనపడక దెబ్బలు తగిలి గాయపడి చతికిలపడి ఉండేవాడివి కాదా?"  భావోద్వేగంతో కోపంగా నాస్వరాన్ని పెంచి అరిచాను.

మాతాతగారు ప్రశాంతంగా నావైపు చూసి తన ప్రక్కన కూర్చోమని చెప్పి యిలా అన్నారు.  "ఒరేయ్ అబ్బాయీ!  నన్ను కూర్చోబెట్టి నువ్వు చిల్లర తేవడానికి వెళ్ళావు. ఆశ్చర్యకరంగా ముందర నాకు అన్నీ మసకగా కనపడి తరువాత అన్నీ స్పష్టంగా చూడగలిగాను.  ఇక నాకక్కడ ఊరికే సోమరిగా కూర్చోవాలనిపించలేదు.  బయట కాస్త తిరిగివద్దామనిపించింది.  మనం సామానులు పెట్టిన చోటు గురించి కాస్త అవగాహన ఉంది.  అక్కడికి వెళ్ళి నువ్వు వచ్చేవరకు నీకోసం ఎదురు చూద్దామనుకున్నాను.

నామనసంతా ఆనందంతో నిండిపోయింది.  "ఇక మీరు వచ్చినపని నెరవేరింది" అన్న బాబామాటలు గుర్తుకు వచ్చి వాటివెనుకనున్న రహస్యం అర్ధమయింది.  ఆ పని ఏమిటంటే ,  మాతాతగారికి పోయిన కంటిచూపును తెప్పించమని బాబాని ప్రార్ధించడానికి వచ్చామన్న విషయమని వేరే చెప్పనవసరం లేదు.  మేము ఏవిషయం చెప్పకుండానే బాబా మేము వచ్చిన పని గ్రహించి, మమ్మల్ని ఏమీ ప్రశ్నించకుండానె అనుగ్రహించారు.  

బాబా చూడటానికి మంచి స్ఫురద్రూపిగా పొడవుగా చక్కటి శరీర చాయతో ఉంటారు. (ఆయన చేతులు ఆయన మోకాళ్ళ వరకు ఉండేవి).  ఆరతినిచ్చే ప్రతి సమయంలోను ఆయన వదనం ఎంతో దివ్యమైన కాంతితో ప్రకాశవంతంగా ఉండేది.  బాబా సాధారణంగా హిందీలో మాటలాడేవారు.  ఆయన ఎల్లప్పుడు 'అల్లా మాలిక్ అచ్చా కరేగా' (భగవంతుడు మేలు చేస్తాడు) అని తన భక్తులను దీవిస్తూ ఉండేవారు.  ఆయన తురిమిన ఎండుకొబ్బరిలో పంచదార కలిపి భక్తులకు పంచుతూ ఉండేవారు. స్వయంగా తన చేతితో ఊదీని ప్రసాదంగా యిస్తూ ఉండేవారు. ప్రతీ భక్తునికి మొట్టమొదటగా నుదుటిమీద ఊదీని రాయడం ఆయనకలవాటు. తరువాత వారి చేతులలో ఊదీని వేస్తూ ఉండేవారు.  ఎప్పుడూ ఆయనచుట్టూ 25 నుంచి 30 మంది దాకా భక్తులు ఉండేవారు.  ఆరతి సమయంలో ఆయననుంచి ప్రసాదం తీసుకోవడానికి ఎక్కువమంది గుమిగూడి ఉండేవారు.
                                                     
షిరిడీనుంచి బయలుదేరేముందు నేనెప్పుడూ బాబా అనుమతి తీసుకొనేవాడిని.  ఒకసారి నేను, శ్రీషిండే కారులో నాస్నేహితులు శ్రీదామూఅన్నా రాస్నే, శ్రీశంకరరావు షిండేలతో కలిసి బాబా అనుమతి తీసుకోకుండా హడావిడిగా షిరిడీనుండి బయలుదేరాను.  దారిలో అహ్మద్ నగర్ వద్ద మాకారుకు పెద్ద ప్రమాదం జరిగింది.  మాకారు చాలా వేగంగా వెడుతోంది.  అకస్మాత్తుగా మాకారు ముందు భాగం కుడివయిపునుంచి ఒక వ్యక్తి అడ్డంగా రావడంతో కారు అతనికి గుద్దుకుంది.  అతను తెలివితప్పి క్రింద పడిపోయాడు.  మేము దారుణమయిన పరిస్థితిలో చిక్కుకుపోయాము.  రాస్నేగారు బాబా ఊదీని కొంత ఆగాయపడ్డ వ్యక్తి నోటిలో వేసి, కొంత అతని నుదిటిమీద, చాతీమీద, పొట్టమీద రాశారు.  అతనికి కొంతసేపటి తరువాత స్పృహవచ్చింది.  కాని, అతనికి కాలు విరిగిందని తెలుసుకొన్నాక మాకు చాలా భయం చేసింది.  అతనిని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకొని వెళ్ళాము.  రాస్నే, షిండే యిద్దరూ వెంటనే బాబాని ప్రార్ధించడానికి తిరిగి షిరిడీ వెళ్ళారు.  ఇక ముందుకు బయలుదేరడానికి  నేను యెప్పటిలాగే బాబా అనుమతి తీసుకొన్నాను.

బాబా అనుగ్రహం వల్ల ప్రమాదంలో గాయపడ్డవ్యక్తి పూర్తిగా కోలుకోవడంతో, మేము ఎటువంటి సమస్యలు లేకుండా బయటపడ్డాము.  ఈసంఘటన తరువాత యింక మరెప్పుడు బాబా అనుమతి తీసుకోకుండా షిరిడీ విడిచివెళ్లకూడదనే గుణపాఠం నేర్చుకొన్నాను.

నేను బాబాను స్వప్నంలో కాని, మరింకేవిధంగా కాని చూడలేదు.  కాని, నేను మిమ్మల్ని చూస్తున్నట్లుగానే బాబాను చూశాను.  ఈసంఘటన 1968 సం.లో, సరిగా యిప్పుడు నేను కూర్చున్న చోటనే జరిగింది.  ఆరోజు 'అనంతచతుర్దసి.  పూజారిలాగ ఉన్న ఒక సన్యాసి కిటికీ బయటనిలబడి, "నాకు కాస్త టీ యిస్తావా?" అని అడిగాడు.  ఆసన్యాసి నాకు పూజారిలాగా కనపడలేదు.  కాని హిందీలో మాట్లాడాడు.  నేను కొంచం ఆశ్చర్యపోయి అతనిని లోపలకు రమ్మన్నాను.  అతను గదిలోకి వచ్చి గోడకు చేరగిలబడి కూర్చొన్నాడు.  టీ బదులుగా దయచేసి ఒకకప్పు పాలు స్వీకరిస్తారా అని అడిగాను.  

ఆయన యిలా జబాబిచ్చారు "నీ యిష్టం"

"పాలలో కాస్త పంచదార వేయమంటారా"?

"నీయిష్టమయితే అలాగే కానీ"

నేను వినయంగా తీయటి పాలు కప్పుతో ఆయన ముందు పెట్టాను.  నా కనుచివరలనుండి ఆయనను గమనిస్తున్నాను.  కాని నాకు సన్యాసి కనప
డలేదు.  స్వయంగా బాబా కనపడుతున్నారు.  ఆయన బాబా తప్ప మరెవరూ కాదు.  అందులో ఎటువంటి సందేహం లేదు.  నాతోపాటుగా మా కుటుంబమంతా ఆయనముందు సాష్టాంగ నమస్కారం చేశారు.  ఆయన మమ్మల్ని దీవించి వెంటనే గదినుండి నిష్క్రమించారు.  వెంటనే నాకు ప్రేరణ కలిగి బయటకు వచ్చి ఆ సన్యాసి కోసం వెతికాను.  కాని ఎటువంటి జాడ లేకుండా ఆయన అదృశ్యమయిపోయారు.  నేనెంతో ఉద్వేగంతో చుట్టుప్రక్కలనున్న వారందరినీ ఆసన్యాసిని ఎవరైనా చూశారా అని అడిగాను.  కాని, అటువంటి వ్యక్తిని తామెవరూ చూడలేదని చెప్పారు.  సన్యాసి రూపంలో దర్శనమిచ్చినది బాబాయేనని స్థిరమైన అభిప్రాయంతో నేను యింటికి తిరిగి వచ్చాను. 

శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్పాండే
బొంబాయి
యింటర్వ్యూ : శ్రీ ఎం.ఎస్. ఘోలప్ 
సాయిలీల మాసపత్రిక ఫిబ్రవరి 1982     

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

శ్రీసాయితో మధురక్షణాలు - 19

$
0
0
                          
                    
20.09.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

                       
                                  
శ్రీవిష్ణుసహస్రనామం 86వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం :  సువర్ణబిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః            |

          మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః      ||

తాత్పర్యం:  పరమాత్మను బంగారు వర్ణముగల కాంతియొక్క బిందువు గనూ, మరియూ సృష్టివాక్కుగా నుచ్చరింపబడుటకు కారణమైన బిందువుగనూ ధ్యానము చేయుము.  ఆయన వాక్కుయను దేవతలకు అధిపతి గనుక, క్షోభింపచేయుటకు సాధ్యముకాదు.  సృష్టియను సత్తు లేక అస్తిత్వముగానున్న మహా సరస్సువంటివాడు.  భౌతికమగు మహా అగడ్త లేక కందకము ఆయనయే.  అన్ని భూతములకు కారణమైన మహాభూతము ఆయనయే.  అన్ని సంపదలకు మూలకారణమైన మహానిధిగా ఆయనయే యున్నాడు. 

శ్రీసాయితో మధురక్షణాలు - 19 

రజాకార్ల బారినుండి శ్రీకె.జగదీష్ మున్షీని కాపాడిన బాబా 

1948 సంవత్సరములో జరిగిన సంఘటన ఇది.  శ్రీకె. మున్షీగారు తన భార్యతో కలసి బెంగళురునుండి బొంబాయి వెళ్ళే రైలులో మొదటి తరగతి  బోగీలో ప్రయాణం చేస్తున్నారు. 

 ఆబోగీలో ఆరుగురు ప్రయాణీకులు ఉన్నారు.  వారిలో ఒక జంట వృధ్ధ దంపతులు, మిగిలినవారు పడుచు వయసులో ఉన్నారు.  శ్రీ జె.కె.మున్షీగారు, ఆయన భార్య ఇద్దరూ పేకాట ఆడుకుంటున్నారు.  వారిలో వృధ్ధుడు భగవత్ ప్రార్ధన చేసుకుంటున్నాడు.  ఆయన భార్య మిగిలినవారిని పరిశీలిస్తూ కూర్చొని ఉంది.  వారు బెంగళూరు నుండి బయలుదేరేముందు, ఈ మార్గంలో ప్రయాణం చేయవద్దని కొందరు వారికి సలహా యిచ్చారు.  కారణం హైదరాబాదు రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలలో రజాకార్ల అల్లర్లు జరుగుతున్నాయి.  అప్పట్లో వారు వయసులో ఉన్నందువల్ల వారు చెప్పిన సలహాని పెడచెవిన పెట్టారు.  రైలు హైదరాబాదు వదలి షోలాపూర్ స్టేషన్ ని సమీపిస్తూండగా, అకస్మాత్తుగా గంగాపూర్ వద్ద ఎవరో బలవంతంగా రైలుని ఆపేశారు.  అక్కడ రజాకార్లు, రైఫిల్స్, లాఠీలు, మారణాయుధాలు ధరించి గుమికూడి "ముస్లిం లందరూ దిగండి.  హిందువులనందరినీ చంపండి" అంటూ అరుస్తున్నారు.  ప్రయాణం జరుగుతున్నంతసేపూ భగవత్ ప్రార్ధన చేసుకుంటున్న వృధ్ధుడు అందరినీ బోగీ తలుపులు, కిటికీలు, మూసివేయమని ఆదేశించాడు.  అందరూ ఆయన చెప్పినట్లేచేశారు.  రైలునుంచి బలవంతంగా లాగివేయబడ్డ ప్రయాణీకులు ఎంత మొఱపెట్టుకున్నా వారిని కొట్టి, దోపిడీ చేశారు.  ప్రయాణీకులంతా తమ తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రక్కనే ఉన్న పొలాలలోకి పరుగెత్తారు.  వీరి బోగీని బలవంతంగా తెరవడానికి రజాకార్లు చాలా సార్లు ప్రయత్నించారు గాని, లాభం లేకపోయింది.  ఇటువంటి విపత్కర సమయంలో కూడా ఆవృధ్ధుడు తన ప్రార్ధనను ఆపకుండ కొనసాగిస్తూనే ఉన్నాడు.  ఆ అల్లర్లు ఆవిధంగా దాదాపు 5 గంటలదాకా కొనసాగాయి.  ఆఖరికి రైలు ఒకే ఒక బోగీతో షోలాపూర్ స్టేషన్ కు చేరుకొంది.  బోగీలో ఉన్నవారందరూ కూడా రజాకార్ల బారినపడకుండా క్షేమంగా చేరుకొన్నారు.  ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల తరువాత, ఆవృధ్ధుడు తాను శ్రీషిర్దీ సాయిబాబాను ప్రార్ధించడం వల్లనే తాము రజాకార్ల బారిన పడకుండా క్షేమంగా చేరుకొన్నామని ఒక పత్రికకు ఆర్టికల్ పంపించాడు.  అందులో ఆయన శ్రీజగదీష్ క్.మున్షీగారిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్నారు.  ఆసమయంలో ఆయన భగవంతుడిని ప్రార్ధిస్తూనే ఉన్నారని చెప్పి, తనకు శ్రీషిరిడీసాయిబాబా ఎవరో తెలియదని కూడా శ్రీమున్షీ చెప్పారు. 

తరువాత 1953వ.సంవత్సరంలో ఆయన కుటుంబంలో కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురయాయి.  ఒక రోజున ఆయన అఫీసుకు వెడుతుండగా ఒక పటాలు తయారు చేసే దుకాణంలో శ్రీసాయిబాబా పటం తగిలించి ఉండటం చూశారు.  ఆఫొటోలొ ఆయనకు 'నాయందెవరి దృష్టో వారియందే నాదృష్టి' అన్న వాక్యాలు కనిపించాయి.  అప్పుడాయనకు గతంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.  తన భార్యతో సంప్రదించి ఆవిడ అనుమతితో పూజ చేసుకోవడానికి సాయిబాబా పటం కొన్నారు.  తన సమస్యలన్నిటినీ పరిష్కరించమని బాబాను వేడుకొన్నారు.  కొద్ది రోజూలలోనే ఆయన సమస్యలన్నీ తీరిపోయాయి.  ఆపరిణామంతో ప్రతిరోజూ క్రమం తప్పకుడా శ్రీసాయినాధుని పూజించడం ప్రారంభించారు.   

ఒకసారి ఆయన రైలులో రాత్రిపూట సూరత్ నుంచి బొంబాయికి ప్రయాణం చేస్తున్నారు.  రైలు సూరత్ స్టేషన్  నుంచి బయలుదేరిన వెంటనే ఆయనకు బ్లాడర్  లో రాయి ఉన్నందువల్ల విపరీతమయిన నొప్పి ప్రారంభమయింది.  తరువాత ఆనొప్పి ఆయన కూర్చోవడానికి గాని, లేవడానికి కూడా లేనంతగా తీవ్రమయిపోయింది.  మూత్రం  నుంచి రక్తం కూడా పోవడం మొదలయింది.  తోటి ప్రయాణీకుడు నిద్రలో ఉన్నాడు.  రైలు పాల్ఘర్ చేరుకునేటప్పటికి నొప్పి యిక భరించలేనంతగా ఉండటంతో ఆయన తన తోటి ప్రయాణీకుడుని లేపి గార్డుని పిలవమని చెప్పారు.  గార్డు వచ్చి ఆయన క్లిష్టపరిస్థితిని చూసి, రైలులో డాక్టర్లు ఎవరూ లేరని, అందుచేత పాల్ఘర్ లో దిగిపోయి అక్కడి డాక్టర్ చేత వైద్యం చేయించుకోమని సలహా యిచ్చాడు.  గార్డు, స్టేషన్ మాస్టర్ ల సహాయంతో ఆయన పాల్ఘర్ స్టేషన్లో దిగిపోయారు.  రైలు వెళ్ళిపోయింది.  అంతరాత్రివేళ డాక్టర్ స్టేషన్ కు వచ్చి వైద్యం చేయడానికి నిరాకరించడంతో ఆయనను ఒక ఎడ్లబండిలో డాక్టర్ యింటికి పంపించారు.  ఆక్లిష్ట పరిస్థితిలో ఆయన శ్రీసాయినాధుని సహాయం కోసం ప్రార్ధించారు.  డాక్టర్ ఆయనకి నొప్పి తగ్గడానికి మందు యిచ్చారు. డాక్టర్ బొంబాయిలో ఉన్న ఆయన బంధువులకు కబురు పంపించారు.  మరుసటిరోజు వారు వచ్చి ఆయనను బొంబాయికి తీసుకొని వెళ్ళారు.  ఈసంఘటనలో శ్రీషిర్డీసాయిబాబా గారి ప్రత్యేకమయిన మహత్యం ఉందని గానీ  ఆయన వల్లనే తనకు నయమయిందనీ ఆయన భావించలేదు.

1968 సం.లో ఆయన తండ్రి ఆయనను సత్యసాయిబాబా దగ్గరకు తీసుకొనివెళ్ళి పరిచయం చేశారు.  సత్యసాయిబాబాగారు అన్న మాటలు "అతను శ్రీసాయిబాబాను 16సం.నుంచి నమ్ముతున్నాడని నాకు తెలుసు.  ఒకసారి విపరీతమయిన నెప్పి వచ్చి రైలు నుంచి దిగిపోయాడు.  శ్రీసాయిబాబాను సహాయం కోసం ప్రార్ధించాడు.  అతనిని కాపాడినది శ్రీసాయిబాబాయే.  సత్యసాయిబాబా అన్న ఆమాటలు శ్రీషిరిడీ సాయిబాబా వారి మహిమను చాటి చెప్పాయి.  
                                             
1959సం.లో ఒక నెల వయసున్న ఆయన అమ్మాయికి విపరీతమయిన జ్వరం వచ్చింది. పాపని ఆస్పత్రిలో చేర్పించారు.  3వారాలపాటు వైద్యం చేశారు కాని, జ్వరతీవ్రత ఎక్కువగానే ఉంది.  ఆయన, ఆయన భార్య చాలా కలత చెందారు.  1959సం. నవంబరు 14 వ.తారీకున యిద్దరు ప్రముఖ డాక్టర్లు ఆపాప బ్రతకడం కష్టం అని చెప్పారు.  ఆపాప కనక బ్రతకకపోతే తానిక షిర్దీ సాయిబాబాను పూజించకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఆయన ఈనిర్ణయం తీసుకున్న తరువాత ఆపాప జ్వరం క్రమేపీ తగ్గి రాత్రి 7గంటలలకు నార్మల్ కి వచ్చింది.  ఈ సంఘటన జరిగిన 3నెలల తరువాత పాప మంచి ఆరోగ్యంగా తయారయింది. 

1960సం.మార్చి నెలలో వారు తమ 5నెలల పాపను తీసుకొని కారులో షిరిడీకి వెళ్ళారు.  దారిలో ఆపాప మొట్టమొదటగా పలికిన పలుకులు " బా బా బా బా " శ్రీసాయిబాబా శ్రీజగదీష్ కె.మున్షీగారిని కాపాడి మార్గాన్ని చూపారు.  ఆయన గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు.  స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ పాత్రపోషించినవారు, రాజకీయనాయకుడు, రచయిత, విద్యావేత్త.  వృత్తిరీత్యా ఆయన లాయరు.   ఆయన రచయితయినా గాని , తరువాత రాజకీయాలలోకి ప్రవేశించారు.  గుజరాతీ సాహిత్యంలో మంచిపేరున్నవారు. 1938సం.లో ఆయన భారతీయ విద్యాభవన్ ను స్థాపించారు. 

ఆంబ్రోషియా ఇన్  షిరిడీ నుండి.
రామలింగస్వామి
షిరిడి.  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

శ్రీసాయితో మధురక్షణాలు - 20

$
0
0
                       
                

24.09.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయితో మధురక్షణాలు -  20 

సాయి బంధువులారా! మన బ్లాగులో ప్రచురణకు ఈ రోజు సమయం కుదిరింది..ఈ రోజు మీకందించబోయే సాయితో మధురక్షణాలలో ఈ బాబా లీల చదవండి..ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 87వ.శ్లోక, తాత్పర్యం.
                               
శ్రీవిష్ణుసహస్రనామం 87వ.శ్లోకం

శ్లోకం:  కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః   |

         అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః      || 

పరమాత్మను భౌతిక సుఖములు కలిగించు పరిమళపుష్పములుగా ముఖ్యముగా మల్లెపువ్వుగా ధ్యానము చేయుము.  ఆయన వర్షమున కధిపతియై జీవులకు సౌఖ్యము కలిగించుచున్నాడు.  వాయువునందలి వీచు శక్తిగా అన్నిటిని పరిశుధ్ధము చేయుచున్నాడు.  అమృతమయములకు చంద్రకిరణములే ఆయన భౌతిక శరీరము.  ఆయన అన్నియూ తెలిసినవాడు. మరియూ అన్నిటియందు సామర్ధ్యము కలవాడు.     

ఆకలితో ఉన్న తన భక్తులకోసం బాబా వేచిఉండుట.

అది 1962వ.సంవత్సరం.  శ్రీవాడ్రేవు రామమూర్తిగారు తన స్నేహితులతో కలసి జమానపల్లినుండి షిరిడీ వెళ్ళారు.  అక్కడ వారు ప్రతీరోజూ షిరిడీ సాయిబాబా క్యాంటీన్ లో భోజనం చేస్తూ ఉండేవారు. క్యాంటీన్ యజమాని రోజూ రాత్రి 9 గంటలకల్లా క్యాంటీన్ మూసివేసి తాళాలు వేసుకొని యింటికి వెళ్ళిపోతూ ఉండేవాడు.  ఒక రోజున వారంతా క్యాంటీన్ యజమానితో, తామందరూ సాకోరీ (షిరిడీనుండి 5 మైళ్ల దూరంలో ఉంది.   అక్కడ బాపూసాహెబ్ జోగ్ సమాధిని, శ్రీఉపాసనీగారి ఆశ్రమం దర్శించుకోవడానికి) వెడుతున్నామని తాము వచ్చేటప్పటికి క్యాంటీన్ మూసివేయకుండా వేచి చూడమని చెప్పారు.



వారు చెప్పినదానికి క్యాంటీన్ యజమాని ఒప్పుకోకుండా, వారు 9 గంటలకల్లా రాకపోయినట్లయితే తాను ఎప్పటిలాగే క్యాంటీన్ మూసివేసి తాళాలు వేసుకొని వెళ్ళిపోతానని చెప్పాడు.  వారు సాకోరి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 11గంటలయింది.  క్యాంటీనతను చెప్పినట్లుగానే క్యాంటీన్ మూసేసి వెళ్ళిపోయాడు.  షిరిడీ గ్రామమంతా చీకటిగా నిర్మానుష్యంగా ఉంది.  వారు చాలా ఆకలితో ఉన్నారు.  ఏదో విధంగా తినడానికేమయినా దొరికితే బాగుండునని ఎంతో ఆశతో ఉన్నారు. అనుకోకుండా క్యాంటీన్ ప్రక్కన పడుకున్న ఒక వ్యక్తి లేచి క్యాంటీన్ తలుపు తాళం తీశాడు.  నలుగురికీ వేరుశనగపొడి, అన్నం పెరుగు వడ్డించాడు. అతను ఒక్కమాట కూడా మాట్లాడకుండా వారందరినీ భోజనం చేయమని సంజ్ఞచేశాడు.  మంచి రుచికరమైన భోజనం చేసి వారు వెళ్ళిపోయారు.  భోజనం వడ్డించిన వ్యక్తి మాట్లాడకుండా తన చోటకు వెళ్ళి నిద్రపోయాడు.

తరువాత వారంతా నిద్రించడానికి ద్వారకామాయికి వెళ్ళారు.  వాడ్రేవు రామమూర్తిగారికి నిద్రలేమి ఉండటంతో మెలకువగా ఉన్నారు.  యింతలో కొంతమంది వీరి వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు.  కాని, గుఱ్ఱమంత ఎత్తు ఉన్న కుక్క ఎక్కడినుంచో వారి రక్షణ కోసం వచ్చింది.  ఆ కుక్క ఎక్కడినుండి వచ్చిందో ఆయనకర్ధం కాలేదు.  ఆయనకి చాలా భయం వేసింది.  ఆ కుక్క వీరు సామానుల చుట్టూరా తిరుగుతూ వాడ్రేవు రామమూర్తిగారి దగ్గరకు వచ్చి తన పాదాన్ని ఆయనమీద పెట్టింది.  ఆయనకది నిజమైన మనిషి చేయిలా అనిపించింది.  అది కుక్కని తెలుసు. కాని తనమీద పడినది మనిషి చేయి. అంత చీకటిలోనూ ఆ చేతివంక చూడటానికి చాలా ప్రయత్నించారు గాని, చాలా చీకటిగా ఉన్నందువల్ల అది సాధ్యం కాలేదు.  తెల్లవారుఝామున 3 గంటలకు షిర్దీ సంస్థానం వారు లేచి లైట్లు వేశారు.  దాంతో ఆకుక్క వెళ్ళిపోయింది.  ఆవిపత్కర సమయంలో తామందరినీ దొంగలబారిని పడకుండా రక్షణగా వచ్చినది సాయినాధుడే తప్ప మరెవరూ కాదనిపించింది.

మరుసటిరోజు వారు, రాత్రివేళ తామందరికీ భోజనాలు ఏర్పాటు చేసినందుకు క్యాంటీన్ యజమానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళారు.  క్యాంటీన్ యజమాని తనకా విషయమేమీ తెలియదని అంతా వివరంగా చెప్పమన్నాడు.  అంతా విన్న తరువాత అతను బయట నిద్రించే వ్యక్తిని పిలిచి "రాత్రి నువ్వు వీరందరికీ, భోజనాలు ఏర్పాటు చేశావా" అని అడిగాడు.  అప్పుడా వ్యక్తి లేదని తల అడ్డంగా ఊపుతూ , "మీరు క్యాంటీన్ కి తాళాలు వేసుకొని పట్టుకెళిపోతే నాకదెలా సాధ్యమవుతుంది" అని తన యజామానితో ప్రశ్నార్ధకంగా అన్నాడు. అందరూఆశ్చర్యంతో స్ఠాణువులైపోయారు.  అంత రాత్రివేళ తమకోసం రుచికరమయిన భోజనాలు ఏర్పాటు చేసి తమ అందరి ఆకలిని తీర్చినది సాయినాధుడేనని అర్ధమయింది. 

క్యాంటీన్ యజమాని వారినెంతో అభినందించాడు.  ఈ సంఘటనతో, తామందరికి సాయినాధుని దర్శనం లభించినందుకు, ఆయన తామందరి ఆకలిని తీర్చినందుకు ఎంతో సంతోషంగా తమతమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్ళారు.

శ్రీసాయిలీలా స్రవంతి (తెలుగు)
శ్రీమతి భారం ఉమామహేశ్వరరావు  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  
         

శ్రీసాయితో మధురక్షణాలు - 21

$
0
0

                                                   
                              
04.10.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు


సాయిబంధువులారా! నేను 30.09.2013 న బ్యాంకు సర్వీసునుండి రిటైర్ అయ్యాను. ఈ సందర్భంగా కొన్ని పనులవలన ప్రచురణకు ఆలశ్యం జరిగింది. ఈ రోజు శ్రీసాయితో మధురక్షణాలలో 21వ. లీలను అందిస్తున్నాను...ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 88వ.శ్లోకం, తాత్పర్యం..  

                                      
శ్రీవిష్ణుసహస్రనామం 88వ.శ్లోకం

శ్లోకం: సులభః సువ్రతః సిధ్ధః శత్రుజిత్ శత్రుతాపనః        | 

        న్యగ్రోధోదుంబరో శ్శ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః   ||  


తాత్పర్యం: పరమాత్మను సులభముగా పొందవలెనన్నచో, పవిత్రమైన జీవితమును గడుపుచు, వ్రత నియమములాచరించుచూ, అశ్వత్థ వృక్షము క్రింద జీవించుచూ, మేడి పండును తిని, జమ్మి ఆకులు నానబెట్టిన నీటిని త్రాగుచుండవలెను.  ఇట్టి నియమముతో కూడిన ధ్యానమును వ్రతముగా నాచరించువానికి పరమాత్మ వారి అంతశ్శతృవులను జయించి నిర్మూలించును.  ఆయన ఆంధ్రుడైన  చాణూరుడను వానిని సం హరించెను.  పైన చెప్పిన వృక్షముల సాన్నిధ్యమున వ్రత నియమముల నాచరించుచూ, నారాయణుని ధ్యానము చేయువానికి అన్ని సిధ్ధులునూ లభించును.  

శ్రీసాయితో మధురక్షణాలు - 21

తన భక్తుడిని రక్షించడానికి బాబా లాయరుగా ప్రవేశం

హైదరాబాదునుండి ప్రారంభింపబడిన ద్విభాషా మాసపత్రిక సాయిప్రభలో దీనికి సంబంధించిన బాబా లీల ప్రచురింపబడింది.  శ్రీసాయి సత్ చరిత్రలో (33వ.అధ్యాయం) జామ్నేర్ లో టాంగావాలాగా బాబా కనిపించిన సంఘటన మనకు కనపడుతుంది.  మన సమస్యలను తీర్చటానికి బాబా వివిధరూపాలలో వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  ఒకసారి శ్రీసాయి భక్తుడయిన ఒక లాయరుగారు (శ్రీవేమూరి వెంకటేశ్వర్లుగారు) తన క్లయింటు కేసు వాదించడానికి రాలేకపోయిన సందర్భంలో రేపల్లె జిల్లా మున్సిఫ్ కోర్టులో శ్రీసాయినాధుడు శ్రీవేమూరి వెంకటేశ్వర్లుగారి రూపంలో వచ్చి కేసు వాదించారు. 


1960 సంవత్సర ప్రాంతంలో గుంటూరు జిల్లా రేపల్లెలో శ్రీవేమూరి వెంకటేశ్వర్లు గారు మంచి ప్రాక్టీసు ఉన్న లాయరు.  ఆయన శ్రీసాయిబాబాకు అంకిత భక్తులు. ఆయన తన హృదయాన్ని, ఆత్మను శ్రీసాయి చరణాలవిందాలకు సర్వశ్యశరణాగతి చేశారు.   కోర్టుకు శలవులు వచ్చినప్పుడెల్లా,  బాబాకు అంకిత భక్తునిగా ఆయన చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి సాయి తత్వాన్ని ప్రచారం చేస్తూ అందరిలోను బాబా మీద భక్తిని పెంపొందింప చేస్తూ ఉండేవారు.  బాబాపై ఎంతో స్పూర్తిదాయకంగాను, ఆకట్టుకునే విధంగాను ఆయన ఉపన్యాసాలు యిస్తూ ఉండేవారు.  

కోర్టు పనిదినాలలో ఒకరోజు ఆయన తన బంధువుల పనిమీద అత్యవసరంగా తన స్వగ్రామానికి వెళ్ళవలసివచ్చింది.  కాని, అదేరోజున రేపల్లె జిల్లా మున్షిఫ్ కోర్టులో ఆయన ఒక సివిల్ కేసును వాదించవలసి ఉంది.  కాని అత్యవసరంగా వెళ్ళవలసినందువల్ల తాను లేని సమయంలో యింకెవరికీ పని అప్పగించడానికి తగిన ఏర్పాట్లు చేయలేకపోయారు.  కాని, అయన క్లయింటుకు ఆయన లేరనే విషయం తెలీదు.  అతను రేపల్లె వచ్చి ఆయన యింటికి వెళ్ళి లేరనే విషయం తెలిసి, తన లాయరుగారు ఊరిలో లేరని కేసు వాయిదా వేయమని కోరడానికి వెంటనే కోర్టుకు వెళ్ళాడు.  కాని, అక్కడ శ్రీవెంకటేశ్వర్లుగారు తన కేసుని చాలా బలంగా వాదిస్తుండటం చూసి ఆశ్చర్యపోయాడు.  

ఆరోజున కోర్టులో ఆయన వాదన చాలా అసాధారణంగా ఉంది.  కోర్టులో ఆయన చేసిన బలమైన వాదన జిల్లా మున్సిఫ్ గారిని ఎంతో ఆకట్టుకొంది.  ఆయన చాలా సంతోషించారు.  తీర్పు ఆయన క్లయింటుకు అనుకూలంగా వచ్చిందని వేరే చెప్పనక్కరలేదు.  అబ్బురపరచిన తన లాయరు వాదన విన్న ఆక్లయింటు ఉబ్బితబ్బిబ్బయి ఈ విషయం వెంకటేశ్వర్లుగారి భార్యకు చెప్పడానికి ఆయన యింటికి వెళ్ళాడు.   కోర్టులో శ్రీవెంకటేశ్వర్లుగారు వాదించిన అద్భుతమయిన వాదన, తను కేసు గెలవడం అక్కడి తోటి లాయర్లు అందరూ వెంకటేశ్వర్లుగారిని పొగడ్తలతో ముంచెత్తి అభినందించడం అన్నివిషయాలు తలా తోకా లేకుండా ఎంతో సంబరంతో ఆవిడకు చెప్పాడు. 

మరుసటిరోజు వెంకటేశ్వర్లుగారు స్వగ్రామం నుండి తిరిగి వచ్చి యధావిధిగా కోర్టుకు హాజరయ్యారు.  కోర్టుకు రాగానే, లాయర్లందరూ క్రిందటి రోజున సివిల్ కేసులో ఆయన చేసిన అద్భుతమయిన వాదనకు, అందరినీ ఆకట్టుకొన్న ఆయన వాగ్ధాటికి అభినందిస్తూ ఆయనని ఆకాశానికెత్తేశారు.  వారు చేస్తున్న ఆపొగడ్తలకి శ్రీవెంకటేశ్వర్లుగారు స్థాణువయ్యి, క్రిందటిరోజున తాను స్వంతపని మీద స్వగ్రామానికి వెళ్ళానని అసలు కోర్టుకే రాలేదని చెప్పారు.  ఇదివినగానే తోటి లాయర్లందరూ, చాలా ఆశ్చర్యపోయారు.  వెంటనే శ్రీవెంకటేశ్వర్లుగారు యింటికి పరుగెత్తుకొని వెళ్ళి శ్రీసాయిబాబా ఫొటోముందు నిలబడి ఆనందభాష్పాలతో "ఓ! దేవా! షిర్దీలో నువ్వు సశరీరంతో ఉండగా నాకు నీదర్శన భాగ్యం కలుగలేదు.  ఇప్పుడు నువ్వు నారూపంలో వచ్చి నన్నుగ్రహించావు.  నేను లేని సమయంలో కోర్టుకు వచ్చి నాక్లయింట్ తరఫున ఎంతో అద్భుతంగా వాదించి నాక్లయింటు కేసులో గెలవడానికి సహాయం చేశావు"

ఈ విషయమంతా శ్రీసాయిబాబా భక్తురాలయిన శ్రీమతి కామేశ్వరమ్మగారు 1968 సంవత్సరంలో ఆమె షిర్దీలో ఉన్నప్పుడు వివరించారు.  ఈ లీల ఆమె హైదరాబాదు వాస్తవ్యులయిన శ్రీకె. సుబ్బారావుగారికి వివరించారు. 

సాయిప్రభ
జనవరి, 1986
సీ.సుబ్బారావు
అడ్వొకేట్ & నోటరీ
ఒంగోలు  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)   

శ్రీసాయితో మధురక్షణాలు - 22

$
0
0
                    
             
06.10.2013 ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 89వ.శ్లోకం, తాత్పర్యం
                    

శ్రీవిష్ణుసహస్రనామం 

శ్లోకం :  సహస్రార్చిః సప్తజిహ్వా సప్తైధాః సప్తవాహనః              | 

          అమూర్తిరనఘో చింత్యో భయకృద్భయనాశనః           ||

తాత్పర్యం: పరమాత్మను వేయి కిరణములు గలవానిగా, ఏడు నాలుకలు గలవానిగా, ఏడు సమిధలుగా, అమరియూ ఏడు వాహనములు గలవానిగా ధ్యానము చేయుము.  ఆయనకు రూపము లేదు.  మరియూ పాపమంటనివాడు.  ఆయన మనస్సుకందడు.  ఆయన పాపులకు భయమును కలిగించి, పుణ్యాత్ములకు భయమును పోగొట్టును. 


శ్రీసాయితో మధురక్షణాలు - 22

శ్రీసాయిబాబా అనుగ్రహం 

ప్రియమైన పాఠకులారా! పూజ్య శ్రీనరసిం హస్వామీజీ గారు ఆంగ్లంలో తను వ్రాసిన పుస్తకాల ద్వారా, వార్తా పత్రికలలో ప్రచురించిన కధనాలు, యింకా సమావేశాలలో ప్రసంగాలద్వారా, మరాఠీభాష తెలియని భక్తులందరికి శ్రీసాయిని పరిచయం చేశారు. 



 మనందరికీ కూడా బాబావారి అనుగ్రహం లభించుగాక.  ఆంగ్లభాషలో శ్రీసాయి సత్ చరిత్ర వ్రాసిన శ్రీనగేష్ వి.గుణాజీగారు ఆంగ్లభాష తెలిసిన వారందరికీ ఆపుస్తకం ద్వారా ఎంతో సహాయం చేశారు.  లేకపోతే మనకి శ్రీసాయిబాబా గురించి తెలిసేదే కాదు.  ఆయనకు కూడా మనమందరం నమస్కారాలు తెలియచేద్దాము.  ఆయనకూడా తమ అనుభవాన్ని సాయిసుధ (జూలై 1951) ఎడిటర్ గార్కి ఈ క్రింద వివరించిన విధంగా తెలియచేశారు.  

శ్రీసాయి సత్ చరిత్ర ఆంగ్లంలో చదివిన కొంత మంది నాస్నేహితులు, సాయిబాబాపై నేను పొందిన అనుభూతులేమిటని నన్నడిగారు.  నేను చాలా ఉన్నాయని చెప్పాను. కాని, అవన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకున్నందువల్ల లాభమేమిటి?  ఆంగ్ల భాషలో ఉన్న శ్రీసాయి సత్ చరిత్రలోనుండి ఒకదానిని ఉదాహరణగా తీసుకొందాము.  నాకు ఆంగ్లభాషలో ప్రావీణ్యం లేదు.  నేనసలు ఆపుస్తకం రాద్దామనుకోలేదు.  కాని, సాయిబాబా నాచేత వ్రాయించారు. 

ఇక యిటీవలే జరిగిన అనుభవానికొస్తే, ఏప్రిల్ నెల 1951వ.సం.గురువారం, 12వ.తారీకు ఉదయం 8 గంటలకు తలకవాడి  కాంగ్రెస్ రోడ్డునుండి నాస్నేహితునితో కలసి వస్తున్నాను.  అతని యిల్లు తలకవాడిలో తూర్పువైపున ఉంది.  వెంకటేష్ విలాస్ టీ క్లబ్ ముందున్న రైలు గేటును దాటుకొని తన యింటికి వెళ్ళిపోయాడు.  ఆరోజు గురువారం కాబట్టి హారతయిన తరువాత సాయిబాబాకు నైవేద్యం పెట్టడానికి కోవా కొనడానికి మిఠాయి దుకాణానికి తిన్నగా నడుచుకొంటూ వెళ్ళాను.  కొన్ని అడుగులు వేసిన తరువాత నాకెదురుగా ఒక కారు నామీదకు రావడం గమనించాను.  దానినుండి తప్పించుకోవడానికి నేను కుడివైపుకు వెళ్ళాను.  కాని, కారు డ్రైవరు కూడా అదే దారిలో కుడివయిపుకు నాకెదురుగా వచ్చి నన్ను గుద్దడంతో క్రిందకు పడిపోయాను.  కొద్ది క్షణాలు నాకు స్పృహతప్పింది.  తరువాత మామూలుగా లేచి నిలబడ్డాను.  రోడ్డుమీద వెడుతున్నవారందరూ నేను పోయాననే అనుకున్నారు.  కాని, నేను లేచి నిలబడగానే చాలా ఆశ్చర్యపోయారు.  నామీదుగా పోయేలా కారునెందుకు నడిపావని  డ్రైవరునడిగాను.  తనకారుకెదురుగా కొంతమంది ఉన్నారని వారిని తప్పించడంకోసం కారును కుడివయిపు పోనిచ్చానని చేప్పాడు.  తరువాత నేను మిఠాయి దుకాణానికి వెళ్ళి కోవా కొని, యింటికి వెళ్ళి బాబాకు హారతినిచ్చి కోవా నైవేద్యం పెట్టాను.  మంచం మీద పడుకొని సుఖంగా నిద్రపోయాను.  మరునాడు డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకున్నాను.  నాశరీరానికి ఎక్కడా దెబ్బలు తగలలేదని ఆరోగ్యంగా ఉన్నానని పూర్తిగా పరీక్షించి చెప్పాడు.

బాబా అనుగ్రహం వల్లనే నేనా ప్రమాదం నుండి తప్పించుకొన్నాను.  నాకు ఎటువంటి గాయాలు తగలకుండా రక్షించి ఆరొగ్యంగా ఉంచారు.

ఎన్.వీ.గుణాజీ
సాయిసుధ
జూలై 1951 



(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

సాయితో మధుర క్షణాలు - 23

$
0
0
                 
           
16.10.2013 బుధవారం

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

30,09,2013 న బ్యాంకు సర్వీసునుండి రిటైర్ అయ్యాను.  ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాను. బ్లాగులో ప్రచురణకు కొంత ఆలశ్యం తప్పటల్లేదు.  కాస్త ఓపిక పట్టి ఇంతకు ముందు ప్రచురించిన బాబా లీలలను మరలా ఒకసారి చదువుకొని ఆనందాన్ని అనుభూతిని పొందండి. 

ఈ రోజు మీరు చదవబోయే సాయితో మధురక్షణాలలో బాబాగారు శ్రీసాయి సత్ చరిత్రలో వివరించిన శిష్యులలోని రకాల గురించిన ప్రస్తావన వస్తుంది.  గురువుమీదనే అచంచలమైన విశ్వాసం పెట్టుకొని ఇక ముందూ వెనకా ఆలోచించకుండా గుడ్డి నమ్మకంతో చేసిన పని కూడా అసాధ్యమనుకున్నది కూడా సాధ్యం చేస్తుందని వివరిస్తుంది ఇప్పుడు మీరు చదవబోయేది. 
                         

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 90వ.శ్లోకం, తాత్పర్యం
 
శ్లోకం:  అణుర్భృహత్కృశః స్ఠూలో గుణభృన్నిర్గుణోమహాన్                  

         అధృతః స్వధృతః స్వాస్ఠ్యః ప్రాగ్వంశోవంశవర్ధనః 

తాత్పర్యం:  పరమాత్మను అణువుగా, మరియూ విశ్వముగా, పలుచనివానిగా మరియూ స్ఠూలమైనవానిగా, గుణములు గలవానిగా, మరియూ గుణములు లేనివానిగా,ఆయనను ధ్యానము చేయుము.  ఆయన తనని తాను ధరించుటవలన గొప్పవాడగుచున్నాడు.  ఆయనను  సం హరింపగలవారెవ్వరునూ లేరు.  ఆయనలోనికి సమస్తమునూ చేరి పూర్వపు స్థితిని పొందుచున్నవి.  ఆయన మన వంశములు ప్రారంభమగుటకు ముందే యున్నాడు.  మరియూ మన వంశములను వర్ధిల్ల చేసినవాడు.  


సాయితో మధుర క్షణాలు - 23

సిజేరీన్ ఆపరేషన్ నివారించిన బాబా - అధ్బుతమైన లీల

మనకు ఒక ఆలోచన గాని, అభిప్రాయం గాని వచ్చిందంటే దానికి తగ్గ ప్రాధమిక కారణాలను గమనించదగ్గ అంశమేదీ లేదు. గుడ్డి నమ్మకం కూడా అసాధ్యమైన పనిని కూడా  సాధ్యాన్ని చేస్తుంది.  శ్రీసాయి సత్ చరిత్రలో హేమాడ్ పంతు శిష్యులని మూడు రకాలుగా వర్ణించాడు. 1) ఉత్తములు, 2) మధ్యములు 3) సాధారణులు.

1) గురువుకేమి కావాలో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ  శిష్యులు 2) గురుని యాజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవర్చువారు మధ్యములు 3) అడుగడుగునా తప్పులు చేస్తూ సద్గురుని ఆజ్ఞను వాయిదా వేసేవారు. 

గురువు చెప్పిన మాటలను పరీక్షించడానికి కాక నమ్మకంతో శిష్యుడు అమలు చేసినపుడు గురువు తన శిష్యుని రక్షణకు స్వయంగా వస్తారు.

అటువంటి ప్రగాఢమయిన నమ్మకం విశ్వాసం ఉన్న భక్తులలో జబల్ పూర్ లోని మహారాష్ట్ర యువ దంపతులు ఒకరు.  వారు తమ గురువుగారు చెప్పకుండా ఏవిధమయిన పని చేయ తలపెట్టరు.  భార్యకు ప్రసవం దగ్గర పడటంతో ఆమెను లేడీ ఎల్జిన్ మహిళా ఆసుపత్రిలో చేర్పించారు.  ఆమెకు మామూలుగా జరిపే పరీక్షలన్ని చేసి ఎక్స్ రే కూడా తీశారు. అందులో బిడ్డ అడ్డంతిరిగి ఉండటం కనిపించింది.  అందుచేత సిజేరియన్ చేసి బిడ్డను తీయడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు.  

అది మేజర్ ఆపరేషన్ అవడం వల్ల ప్రాణానికి కూడా ప్రమాదకరమయిన పరిస్థితి.  అందుచేత భర్తనుండి లిఖిత పూర్వకమయిన అంగీకారం తీసుకోవాల్సి ఉంది.  భర్తని అంగీకార పత్రం పూర్తిచేసి సంతకం పెట్టి యిమ్మని డాక్టర్లు అడిగారు. వెంటనే అతను, అంగీకారపత్రం రాసి యివ్వమంటారా వద్దా అని తన గురువుగారి సలహా కోసం ఆయన దర్బారుకు వెంటనే పరిగెత్తాడు. 

అతను దర్బారుకు చేరుకున్న సమయంలో గురువుగారు బాబాకు మధ్యాహ్న్న హారతి యివ్వబోతున్నారు.  ఎంతో గాభరాగా, ఉద్రేకం నిండిన స్వరంతో, తన భార్యకు ఆపరేషన్ చేయడానికి ఒప్పంద పత్రం యివ్వమంటారా లేక యింటికే తీసుకొని వచ్చి ప్రసవం చేయించమంటారా అని అడుగుదామనుకొన్నాడు.  తరువాత అతను తన గురువుగారిని తను ఏమని అడుగుదామనుకొన్నాడో ఆవిధంగానే అడిగినట్లు చెప్పాడు.  అతను చెప్పినది గురువుగారు ఏమని వినిపించుకున్నారో తెలీదు.  తమిళం తెలుగు, ఉర్దూ, హిందీ కాకుండా గురువుగారు మరాఠీలో జవాబిచ్చారు.  ఆయన అలాగే చేయి (అసా కరా) అని జవాబు చేప్పేసి హారతినివ్వడంలో నిమగ్నమయ్యారు.  భర్తకి అర్ధమయినదేమిటంటే తన ప్రశ్నలోని చివరి మాటయిన యింటికే తీసుకొని వచ్చేయమంటారా అన్నదానికి ఆయన అలాగే చేయి అని సమాధానం ఇచ్చారని భావించుకున్నాడు. ఇక ఎంతో ఉపశమనం పొందినట్లుగా హమ్మయ్యా అనుకొని లాగి వదలిన బాణంలాగ ఆస్పత్రికి తిరిగి వచ్చాడు.  డాక్టర్ కి గాని, నర్సుకి గాని చెప్పకుండా,భార్యను యింటికి తీసుకొని వెళ్ళడానికి  బయట నిలబెట్టిన రిక్షా దగ్గరకు నడిపించుకొంటూ తీసుకొని వెడుతున్నాడు.  డా.దేవ్ గైనకాలజిస్టుకు విషయం తెలిసి అతనిని వారించడానికి కంగారుగా వార్డులోకి వచ్చాడు.  అటువంటి పరిస్థితిలో ఆమెను తీసుకొని వెళ్ళడం ఆమె ప్రాణానికే ప్రమాదమని, అది చాలా మూర్ఖత్వమని హెచ్చరిద్దామనుకొన్నాడు.  కాని అతన్ని ఏవిధంగానూ ఎవరూ ఆపలేకపోయారు.  గురువుగారే చెప్పారు కదా యింటికే తీసుకొని వెళ్ళమని అందుచేత ఏవిధమయిన భయం అక్కరలేదనుకొన్నాడు.  ఆపరేషన్ చేయవలసిన అవసరం తప్పిందని ఎంతో సంతోషించాడు.  తమ గురువుగారిపై వారికంత నమ్మకం.  సెంట్.అగస్టిన్ ఇలా చెప్పారు.  "నమ్మకంతో నువ్వు చేసే పని, దానితరువాత ఆపని చేసినందువల్ల దాని ప్రతిఫలం చూసి, నువ్వు నమ్మకంతో చేసిన పని ఫలితాన్ని నమ్ముతావు" 

అలా సంతోషంతో ఆ దంపతులిద్దరూ యింటికి క్షేమంగా చేరుకొన్నారు.  అప్పటికే  నెప్పులు వస్తున్న ఆమెని మం చం మీద పడుకోబెట్టారు.  మంత్రసాని ఎవరూ రాకముందే, యిక ఎటువంటి సహాయం లేకుండా ఆమె ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చింది. 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

శ్రీసాయితో మధురక్షణాలు - 24

$
0
0
                    
             

05.11.2013 మంగళవారం

సాయిబంధువులందరికీ కాస్త ఆలశ్యమయినా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు సాయితో మధురక్షణాలలోని 24వ.క్షణం ప్రచురిస్తున్నాను.

సర్వీసునుండి రిటైర్మెంట్ అయాక ప్రతీరోజు ప్రచురణ చేద్దామని తలిచాను గాని, కొన్ని కొన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరగవు.  హైదరాబాదు వచ్చి గృహసంబంధ వ్యవహారాలు, పనులలో ఉన్నందువల్ల ప్రచురణకి సాధ్యపడటంలేదు. అదీకాక మధురక్షణాలను ఆంగ్లం నుండి తెలుగులోనికి కూడా అనువాదం చేయాలి.  దానికి కూడా సమయం తీసుకుంటుంది.  అందుచేత అవి అనువాదం చేస్తూ చిన్న చిన్న  లీలలు కొన్ని ప్రచురించడానికి ప్రయత్నం చేస్తాను.   

మనం బలవంతులమే కావచ్చు, బలహీనులమే కావచ్చు, మనకు కావలసిన శక్తి ఆసాయినాధులవారే ఇస్తారు.  ఒక్కొక్కసారి మనకు ప్రమాదకరమయిన పరిస్తితులు ఎదురు పడచ్చు.  అటువంటి పరిస్తితులలో నమ్మకం, విశ్వాసంతో సాయినాధులవారిని స్మరించి బాబా నీవే దిక్కు, నన్నీ కష్టం నుండి గట్టెక్కించు అని మనసారా ప్రార్ధిస్తే ఆయన తప్పక సహాయం చేస్తారు.  బలహీనులను కూడా శక్తిమంతులుగా మారుస్తారు.  ఈ రోజు మీరు చదవబోతున్న క్షణం దాని గురించి వివరిస్తుంది.  ముందుగా   
       
                

శ్రీవిష్ణుసహస్రనామం 91వ.శ్లోక, తాత్పర్యం..

శ్లోకం : భారభృత్కధితో యోగీ యోగీశః సర్వకామదః

         ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణోవాయువాహనః 

తాత్పర్యం:  పరమాత్మను నీ సమస్త భారమును వహించువానిగా, నీ జీవితమందలి కధలుగా వర్ణింపబడువానిగా ధ్యానము చేయుము.  నీలో నున్న యోగి  అతడే.  ఆయన అన్ని సమస్యలనూ పరిష్కరించు యోగీశ్వరుడు.  ఆయనయే నీకు ఆశ్రమము.  మరియూ నీ పనులను నీవే నిర్వర్తించుకొనగల సామర్ధ్యము విష్ణువే.  నీవు ఉపవాసము చేసినచో నీయందు కృంగి కృశించువాడతడే.  ఆయనయే గరుత్మంతుడు. వాయువే వాహనముగా గల అగ్ని ఆయనయే. 

శ్రీసాయితో మధురక్షణాలు -  24

సాయి - బందీ

అమెరికాలోని డెట్రాయిట్ నగరం.  ఆరోజు 21.02.1985 గురువారం. అన్ని రోజులలాగే ఆరోజు కూడా ఎటువంటి ప్రత్యేకతా లేకుండా సామాన్యంగానే ఉంది.  నేను పనిచేస్తున్న సూపర్ మార్కెట్ అండర్ గ్రౌండ్ లో ఉన్న సరకులన్నిటినీ కన్వేయర్ బెల్ట్ మీద పైకి పంపిస్తున్నాను. 



 నాకు బేస్మెంట్ లోనే పని చేయడం చాలా  ప్రశాంతతనిస్తుంది.  ఎవరిగోలా ఉండదు.  ఇంకొకరి సమస్యలలో తలదూర్చడం నాకిష్టం ఉండదు.  ఒక సాయి భక్తురాలిగా అది అనుచితం, పైగా చాలా స్వార్ధం.  హటాత్తుగా ఎవరో మెట్లమీదనుంచి క్రిందకు పరిగెత్తుకుంటూ వస్తున్న చప్పుడు వినబడింది.  వచ్చినది క్యాషియర్ షిర్లే.  ఆమె వస్తూనే ఎవరో దోపిడీ దొంగలు  వచ్చి షాపుని లూటీ చేస్తున్నారని చెప్పి మరలా  వేగంగా పైకి వెళ్ళిపోయింది.

నేను ఇక్కడ క్రింద బేస్ మెంట్ లో ఉన్నానే విషయం ఎవరికీ తెలీదు.  అందుచేత పైన జరుగుతున్న లూటీ  జరుగుతుంటే నాకేమి సంబంధం?  ఈ విధంగా ఆలోచించి నాపనిలో నేను మునిగిపోయాను.  ఇంతలో నావెనుక కొంత గందరగోళం వినపడింది.  మెట్లమీదనుండి నలుగురు మనుషులు దిగుతూ వస్తుండడం కనపడి బెదరిపోయాను.  వారిలో ఒకరు జిమ్మీ (గుమాస్తా, ఇంకొకరు దోరా (క్యాషియర్) మిగిలిన యిద్దరూ ఆగంతకులు.  వారిద్దరూ  జిమ్మీ,  దోరా తలలకి తుపాకులు గురిపెట్టారు. 

నేను సాయిబాబాను తలచుకొని, 'బాబా వీరినెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు అని మనసులో అనుకొని వారు చెప్పినట్లే చేసి వారి విషయంలో జోక్యం చేసుకోరాదనుకున్నాను. 

తుపాకులు పట్టుకున్నవారిలో ఒక వ్యక్తి 'బయటకు వెళ్ళే దారేది?'అని అరిచాడు.  అతను పొట్టిగా చూడటానికి పిల్లవాడిలా ఉన్నాడు. మరొకతను కాస్త పొడవుగా ఉన్నాడు.  వయస్సు 20 సంవత్సరాలు ఉండచ్చు.  నేను వారి తుపాకులవైపు చూశాను.  ఏమీ మాట్లాదవద్దన్నట్లుగా నాలో సాయిబాబా ప్రేరణ కలిగించారు.  వారు అన్ని తలుపులు తెరవడానికి చూశారు గాని ఏమీ తెరచుకోలేదు.  వారు జిమ్మీ చేయిపట్టి లాగుతూ తొందరగా మెట్లమీదుగా వెళ్ళారు.  దోరా హిస్టీరియా వచ్చినదానిలా ఏడుస్తూ నిలబడిపోయింది.  నేనామెని ఏమీ అనలేను .  కారణం ఆమె 5 నెలల గర్భవతి.

మెట్లమీదుగా మరింతగా అడుగుల చప్పుడు విబడింది.  ఈ సారి దోపిడీదొంగలు మాత్రం వచ్చారు.  బయటకు పోవడానికి కాపలాలేని దారి ఎంతవెదకినా దొరకకపోవడం వల్ల క్రిందకు వచ్చారు.  జిమ్మీ ఎలాగో తప్పించుకొని ఉంటాడు.

'బయటపోలీసులు ఉన్నారు.మనకి ఒక బందీ అవసరం'పొట్టిగా ఉన్న వ్యక్తి ఆందోళన నిండిన స్వరంతో అన్నాడు.  దోరాని చేయి పట్టుకొని లాగాడు.

నేను 1984 సంవత్సరంలో అమెరికాలో అడుగు పెట్టినప్పటినించి 'బందీ'అనే మాట వింటున్నాను.  బందీగా ఉండటమంటే, అది  చాలా ప్రమాదకరం కూడా. కాని నాకు ఈ విధంగా యిటువంటి సంఘటనను ప్రత్యక్షంగా అనుభవించే స్థితిని సాయిబాబా కల్పిస్తాడని ఏమాత్రం ఊహించలేదు.  ఒక్క క్షణం నాకు చాలా భయం వేసింది.

ఆగంతకుడు దోరా చేయిపట్టి లాగినపుడు ఆగు అని గట్టిగా అరిచాను.  నేనేనా ఇలా  గట్టిగా మాట్లాడింది? అసలు ఈ వ్యవహారంలో సాహసం చేయాలని, జోక్యం చేసుకోవాలని అనుకోలేదు.  కాని, ఆమె గర్భంలో ఉన్న శిశువు క్షేమం నాకు ముఖ్యం .  అవును అదే ముఖ్యం.  అప్పుడనిపించింది నాకు, నేనెందుకలా ప్రవర్తించానో. 

ఇక ఏవిషయం పట్టించుకోకుండా ఒక సాయి భక్తురాలిగా సాయినే నమ్ముకొన్నాను.  నమ్మకం నా జీవిత పరమార్ధం.  సాయిబాబా నాలోనుండి చెబుతున్నట్లుగా అనిపించింది, 'ఏదో ఒకటి చేయ్యి .  ప్రత్యక్షసాక్షిగ ఊరికే చూస్తూ కూర్చోకుండా బాబా నన్ను యింకా  ధైర్యంగా ఏదో చేయమంటున్నారని అర్ధం చేసుకొన్నాను.  తాత్యా పాటిల్ ను బ్రతికించడానికి సాయిబాబా తన  జీవితాన్నే ధారపోశారు.  నా సహోద్యోగిని రక్షించడానికి నాకిది మంచి అవకాశం.

నేనొక అడుగు ముందుకు వేసి 'ఆమె గర్భవతి.  ఆమెను వదలిపెట్టి కావాలంటే నన్ను బందీగా తీసుకువెళ్ళండి'అన్నాను.  వారిద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని దోరా చెయ్యి వదలి నన్ను లాగారు.  ఎయిర్ కండిషన్ సామానులు ఉంచే చిన్న గదిలో నన్ను బందీగా ఉంచారు.  దొంగలిద్దరూ బాగా చెమటలు కక్కుతున్నారు.   అయినా వాళ్ళిద్దరూ నామీదకు తుపాకులు గురిపెట్టి  ఉంచారు.  నాతో సహా అందరినీ రక్షించమని సాయిబాబాని యిలా ప్రార్ధించాను.  'సాయిదేవా! నువ్వు ఎప్పుడు నావెంటే ఉన్నావని తెలుసు.  నాకు ధైర్యాన్ని ప్రసాదించు.'

పైన ఒక్కడే  పోలీసు ఉన్నప్పుడే మనం కాల్చి ఉండాల్సింది  పొడవుగా ఉన్న వ్యక్తి అన్నాడు.

'అవును, ఇప్పుడు మనల్ని చమపేస్తారు   పొట్టిగా ఉన్న వ్యక్తి అన్నాడు.  

వారు తుపాకీ పేల్చడానికి సిధ్ధంగా ఉన్నారు. నేను నిస్సహాయురాలిని. సాయిబాబాను ప్రార్ధిస్తూ ఉన్నాను.  అకస్మాత్తుగా నాలో సాయినాధుని ప్రేరణ కలిగింది.  మీరెందుకులా ప్రవర్తిస్తున్నారని వారినడిగే ధైర్యం వచ్చింది.  కాస్త రిలీఫ్ గా అనిపించింది.

'నీకు భర్త, పిల్లలు ఉన్నారా'పొట్టిగా ఉన్న  వ్యక్తి అడిగాడు.

నామదిలో నాభర్త, నామేనల్లుడు రవి మెదిలి ఉన్నారనీ జవాబు చెప్పాను.

'బాగుంది, నాకిద్దరు పిల్లలు ఇంకొకడు రాబోతున్నాడు అన్నాడు.

'మేము బందిపోటులం కాదు.  మాకు ఉద్యోగం లేదు. మాకు డబ్బవసరం.  నేను కాలేజీలో చేరదా మనుకుంటున్నను.  మేము ఎవరినీ చంపదలచుకోలేదు పొట్టిగా ఉన్నతను అన్నాడు. 

'అవును. ఆవిధంగా చేయకూడదు.  మీరు తుపాకులను వదిలేసి నన్ను బయటకు పంపిస్తారా?'అని అడిగాను. 

'లేదు! మాకు ఒక బందీ కావాలి  పొడవుగా ఉన్న వ్యక్తి అన్నాడు.

పోలీసులు అండర్ గ్రౌండులోకి అప్పటికే వచ్చేశారు.  వారు దొంగలని షూట్ చేయడం వారి శరీరాలన్నీ బుల్లెట్ లు తగిలి పడిపోతున్నట్లుగా ఊహించుకొన్నాను.  'సాయినాధా! యిలా ఏమీ జరగకుండా చూడు.  నేను ఇందులో చిక్కుకుపోయాను.  ఈ యిద్దరికీ నాకు చేతనయినంతగా సహాయం చేయగలిగే శక్తినివ్వమని బాబాని ప్రార్ధించాను.  

నేనొక క్షణం తొందరగా వారితో యిలా అన్నాను. 'మీకు మీప్రాణాలు చాలా ముఖ్యం.  మీరు మీకుటుంబాలగురించి ఆలోచించాలి. దోపిడీ దొంగలుగా మారి మీజీవితాలనెందుకు నాశనం చేసుకుంటున్నారు?  మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి.  యిదొక్కటే మార్గం'.

'కాని పోలీసులు మమ్మల్ని ఎలాగైనా షూట్ చేస్తారు పొట్టిగా ఉన్న  వ్యక్తి అన్నాడు.

'అయితే ఆ తుపాకులు నాకివ్వండి.  నేను బయటకు వెడతాను అన్నాను.

'కాని నిన్ను చంపేయచ్చు,'ఆమాటలు నాకు సూటిగా  తగిలి చలించిపోయాను.  నాజీవితం వాళ్ళ జీవితంకన్నా ఎక్కువా?  నేను వారికోసం ఏమయినా చేయగలనా?  యింతకు ముందెప్పుడూ నాకు యిటువంటి భావన వచ్చినట్లుగా నాకు గుర్తు లేదు.

'ఈ గోడకున్న రంధ్రం ద్వారా మీతుపాకులను బయటకు విసిరేస్తే ఎలా  ఉంటుంది?'అన్నాను.

కొద్ది సెకండ్లు వారు నావైపు తేరిపార చూశారు.  తరువాత తమ తుపాకులని నాచేతిలో పెట్టారు.  గోడకున్న రంధ్రంలోనుండి తుపాకులని బయటకు విసిరేస్తున్నానని పోలీసులతో చెప్పాను.  కొద్ది నిమిషాల తరువాత మేము బయటకు వచ్చాము.  ఆవిధంగా ఒప్పందం జరిగింది.  అదంతా ఎంత వేగంగా జరిగిపోయిందో నేను నమ్మలేకపోయాను.  నేను చేయవలసిన పని సాయిబాబా నాచేత చేయించారు.  నేనేమిటో నాకు తెలిసింది.  నేనెంతో సాహసం చేశాను.  అది ఖచ్చితం.

కాని ఎవరైనా ఒక విషయంలో తలదూర్చారంటే అందులొ అపాయం ఉంటుందని తెలుసు.  యిప్పుడు నేను సాహసం చేయదల్చుకున్నాను.  తమ శక్తేమిటో, తనెవరో తెలుసుకోనివారికి సాయినాధుడు వారిచెంత ఉండి  రక్షిస్తారని అర్ధమయింది.  

సత్యమార్గంలో చెప్పబడిన ఒక సూక్తిని వివరిస్తూ ముగించదల్చుకున్నాను.  'ఎంత ఆనందం నాలోనుండి వ్యక్తమవుతుందో, ఎంత ప్రేమయితే నానుండి ప్రవహిస్తుందో, నేనెంత దయతో ఉంటానో, నెనెంతవరకు సహనంతో ఉంటానో , నాజీవిత సారం కూడా అదే విధంగా వృధ్ధి పొందుతుంది.' 

అనుకోని పరిస్థితులలో వాటిని తట్టుకునే శక్తి ధైర్యం, ఆమెకు బాబామీద ఉన్న నమ్మకం, విశ్వాసం కలిగించాయి.

సాయిసుధ, 1989
శ్రీమతి ఉషా రంగనాధన్
కర్నాటక 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 




శ్రీసాయితో మధురక్షణాలు - 25

$
0
0
                              
                                                       
07.11.2013 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయితో మధురక్షణాలు - 25

ఈ రోజు మరొక అద్భుతమైన క్షణాన్ని తెలుసుకుందాము.  మనకి బాబా మీద ప్రేమ, భక్తి, అంకితభావం ఉండాలె గాని ఆయన ఎల్లప్పుడు తన భక్తులను అంటిపెట్టుకునే ఉంటారు.  సదా ఆయన నామాన్నే స్మరణ చేసుకుంటూ, ఆయన రూపాన్నే ధ్యానం చేసుకుంటే కొన్ని కొన్ని అనుకోని పరిస్థితులలో కూడా ఆయన మనకి చేదోడు వాడుగా ఉంటాడు. ఒక్కొక్కసారి మనం ఊహించం.  తరువాత గాని తెలియదు అది బాబా చేసిన అద్భుతమయిన లీల అని.  అటువంటిదే మీరు ఈ రోజు చదవబోయే ఈ లీల.  ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 92వ.శ్లోకం, తాత్పర్యం. 
                                        
శ్రీవిష్ణుసహస్రనామం 

శ్లోకం : ధనుర్ధరో ధనుర్వేదో దండోదమయితా దమః   

         అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః  


తాత్పర్యము:  పరమాత్మను ధనుస్సును ధరించినవానిగా, విలువిద్య తెలిసినవానిగా ధ్యానము చేయుము.  ఇతరులను నియమించి నియమము కలుగునట్లు శిక్షణనిచ్చు న్యాయదండముగా తానేయుండి, మరల తానే ఆదండమును ధరించుచున్నాడు.  ఆయన  ఎప్పటికీ ఓడిపోవుటలేదు.  ఆయన  సామర్ధ్యము, సహనము, అన్నిటినీ మించినవి.  ఆయన జీవులకు నియామకుడు.  సక్రమముగా తీర్చిదిద్దువాడు  మరియూ శిక్షకుడునైయున్నాడు.      

సాయితో మధుర క్షణాలు -  25

బాబా లీల

బాబా మీద ప్రగాఢమయిన భక్తి ఉన్నవారికి తమ దైనందిన జీవితంలో జరిగిన  ప్రతీ సంఘటన, అది బాబాలీలే అని విశ్వసిస్తారు.  అవి వారికి మరపురాని మధురానుభూతులుగా మిగులుతాయి.  కాని భక్తి విశ్వాసం  లేనివారికి మాత్రం అవన్ని కూడా కాకతాళీయంగానే జరిగినట్లు అనిపిస్తుంది.  సాయినాధులవారు ఎవరినయితే తన భక్తులుగా స్వీకరిస్తారో లేక గుర్తిస్తారో వారెంతో అదృష్టవంతులు.ఇప్పుడు వివరింపబోయే బాబా లీల అత్యద్భుతమే కాదు,  సాయినాధులవారి మాతృప్రేమ ఎటువంటిదో మనకు అర్ధమవుతుంది.  


ఒక్కొక్కసారి మనకి లౌకిక పరంగా అవసరమయినప్పుడు మనం ఆయనని అడగకుండానే మన అవసరాలని గుర్తించి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తారు. మనం అలా జరుగుతుందని ఊహించం కూడా. 

''1973 సంవత్సరంలో నేను కుటుంబంతో సహా ఢిల్లి నుండి కారులో షిర్డీ చేరుకునేటప్పటికి మధ్యాహ్న్నం అయింది.  పూజకి, బాబా దర్శనానికి వెళ్ళేముందర స్నానం చేసి పరిశుభ్రంగా వెడదామనుకున్నాను.  ఆ ఉద్దేశ్యంతో తిన్నగా స్నానాల గదులవైపు నడిచాను.  గదులకి కొద్ది అడుగుల దూరం ఉందనగా  యిద్దరు వ్యక్తులు నన్ను ఆపి, స్నానాలు చేసే గదులలో ఏఒక్కదానిలోను చుక్క నీరు కూడా  రావటల్లేదనీ, కుళాయిలన్న్నీ ఎండిపోయి ఉన్నాయని చెప్పారు.  ఒక్క క్షణం నాకేమి చేయాలో అర్ధం కాక స్థబ్దుగా ఉండిపోయాను. 

నాకు బాగా తెలిసిన శ్రీ సాహెబ్ గారి యింటికి గాని, శ్రీ బాగ్వే సాహెబ్ గారి యింటికి గాని వెడదామనుకుని వెనుకకు తిరిగాను.  అప్పుడే మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక  వ్యక్తి నన్ను ఆగమన్నట్లుగా సంజ్ఞ చేశాడు.   

చూడటానికి అతను యువకుడిలా మంచి దుస్తులు ధరించి ఉన్నాడు.  తలకి గుడ్డ కట్టుకొని, మంచి స్ఫురద్రూపిగా, మంచి చాయతో ప్రకాశవంతమయిన కళ్ళతో ఉన్నాడు.  అతని వదనం మనోహరమైన చిరునవ్వుతో వెలిగిపోతోంది.  అతను నావద్దకు వచ్చి కరుణరసం ఉట్టిపడుతున్న స్వరంతో 'నీ కేం కావాలీ'అని అడిగాడు నన్ను.  స్నానం చేద్దామంటే ఏఒక్క గదిలోను కుళాయిలనుండి ఒక్క  చుక్క కూడా నీరు రావటల్లేదు అని చెప్పాను.  ఆ పరిచితుడు నన్ను తనతో కుడా రమ్మని దగ్గరలో ఉన్న ఒక స్నానాల  గదికి తీసుకొని వెళ్ళాడు.  అక్కడ కుళాయిలోనుండి ధారగా విస్తారంగా నీళ్ళు వస్తున్నాయి.  అన్ని నీళ్ళు చూడగానే నాకెంతో సంతోషం కలిగి హాయిగా అనిపించింది.  నేను హాయిగా స్నానం  చేసి వచ్చేటప్పటికి ఆవ్యకి అక్కడ లేడు.   

నేను పూజా సామగ్రి, బాబాకు సమర్పించడానికి ప్రసాదం కొని తొందర తొందరగా సమాధి మందిరంలోకి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది భక్తులు క్యూలో నిలబడి తమ  వంతుకోసం ఎదురు చూస్తూ ఉన్నారు.  క్యూ చాలా  పెద్దదిగా ఉంది.  అందరూ కూడా బాబా దర్శనం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు.  నావంతు వచ్చేసరికి చాలా సమయం పట్టేటట్లుగా  ఉంది.  ఎంతో దూరంనుండి కారులో ప్రయాణం చేసి రావడం వల్ల చాలా అలసటగా ఉండి అంతసేపు క్యూలో నిలబడలేననిపించింది.  నావంతు వచ్చేవరకు నిరీక్షించక  తప్పదని మవునంగా నిలబడ్డాను.  ఇంతలో అకస్మాత్తుగా ఎవరో నా చెయ్యి పట్టుకొని లాగారు.  చూసేటప్పటికి ఆవ్యక్తి ఎవరో కాదు, అంతకు ముందు నన్ను స్నానాల గదికి తీసుకొని వెళ్ళిన వ్యక్తే.  అతను నా  చేయి పట్టుకొని గుంపులోనుండి తీసుకొని వెళ్ళి తిన్నగా బాబా సమాధి వద్దకు తీసుకొని  వెళ్ళి అక్కడ వదలి పెట్టాడు. క్యూలో ఉన్నవారందరూ ఖచ్చితంగా అడ్డుపెట్టి నన్ను నిందిస్తారని భయ పడుతూనే ఉన్నాను. కాని అలా ఏమీ జరగలేదు.   ఏ ఒక్కరూ కూడా అది తప్పని అనలేదు, కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. 

పూజాసామగ్రి, ప్రసాదాన్ని పూజారిగారికి అందించి బాబా ముందు శిరసు వంచి ప్రార్ధించాను.  నన్ను తీసుకొనివచ్చి ఉపకారం చేసినతనికి కృతజ్ఞతలు తెలుపుదామని వెనుకకు తిరిగాను.  ఎంత అకస్మాత్తుగా వచ్చోడొ అంత అకస్మాత్తుగానూ అతను అదృశ్యమయ్యాడు.  సమాధి  మందిరం బయటకు వచ్చి కొద్ది నిమిషాలు అతను కనపడతాడేమోనని చూశాను కాని, ఎక్కడా కనపడలేదు.  నేను నా కారును నిలిపి ఉంచిన చోటకు వచ్చాను.   అక్కడ నాతో వచ్చినవాళ్ళు చెట్టు క్రింద నీడలో యింకా అలాగే కూర్చొని ఉండటం నాకు కోపాన్ని తెప్పించించింది.  బాబా దర్శనానికి, పూజకి సమాధి మందిరానికి వెళ్ళకుండా అలా చెట్టు క్రింద సోమరుల్లాగా  ఎలా కూర్చొన్నారని ప్రశ్నించాను.  స్నానాలకి ఏఒక్క గదిలోనూ నీళ్ళు రావటల్లేదని అందరూ ముక్త కంఠంతో చెప్పారు.  వీరి జవాబు సహజంగానే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.  ఒక గదిలో మాత్రం  బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయనీ, 20 నిమిషాల క్రితమే నేను స్నానం  చేశానని చెప్పాను. నేనెంతో నమ్మకంగా చెప్పి, పదండి చూపిస్తాను అని నేను స్నానం చేసిన గది వద్దకు వారిని  బయలుదేర దీశాను.

    నేను కొంతసేపు ఆగది కోసం వెతికాను కాని అది నానుండి తప్పిపోయింది.  నేను అయోమయంలో పడిపోయాను.  అంతా తికమకగా ఉంది.  ఇక అటుగా వెడుతున్నవారి నుంచి సహాయం తీసుకుందామనుకొన్నాను.  అంతకు 20 నిమిషాల క్రితమే నేనొక గదిలో స్నానం  చేశానని, అందులో బాగా నీళ్ళు వస్తున్నాయని ఆగది గురించి మీకేమయినా తెలుసా అని అడిగాను.  వాళ్ళు నన్ను జాలిగా తేరిపార చూశారు.  బహుశా నన్ను పిచ్చివాడి క్రింద జమకట్టి ఉంటారు.  అలా నన్ను చూసి, నాకూడా వచ్చినవారితో తాము గంటన్నరనుండి నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నామని ఎక్కడా నీళ్ళు రావటల్లేదని చెప్పారు.  ఇదంతా బాబా లీలేనని గ్రహించడానికి నాకు క్షణం పట్టలేదు.  నాకోసం, నా అవసరంకోసం, బాబా నీటిని సృష్టించారు.  చాలా దూరం ప్రయాణం చేసి, అలసిపోయి క్యూలో నిలబడలేని పరిస్థితిలో బాబా నాకు వేచిచూసే అవసరం లేకుండా వెంటనే దర్శన భాగ్యాన్ని కూడా కలిగించారు.  నాతో వచ్చినవారందరూ నాకు అదృష్టాన్ని కలిగించిన ఆ స్నానాల గది ఎక్కడని అడుగుతూనే ఉన్నారు.  కాని నానుండి ఎటువంటి సమాధానం లేదు.  నేను మాటలు రానివాడిలా అయిపోయాను.

శ్రీసాయి లీల
డిసెంబరు, 1979
ఆర్.ఎస్.చిట్నీస్
న్యూఢిల్లీ 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 




శ్రీసాయితో మధురక్షణాలు - 26

$
0
0
                                  
                           
16.11.2013 శనివారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయితో మధురక్షణాలు - 26 

రెండురోజుల క్రితమే హైదరాబాదునుండి నరసాపురం రావడం జరిగింది. దాని వల్ల, యింకా మరి అనువాదం చేయడంలోను కాస్త ఆలశ్యమయింది.  మరలా 19వ.తారీకున హైదరాబాదు ప్రయాణం, తరువాత 22వ.తారీకున దుబాయికి ప్రయాణం.  అందుచేత ప్రచురణకి కొంత ఆలశ్యం జరుగుతుంది.  మరలా దుబాయినుండి యధాప్రకారంగా బ్లాగులో ప్రచురణ కొనసాగుతుంది. శ్రీసాయితో మధురక్షణాలలోని ప్రతీ క్షణం అద్భుతమే. మరలా మరొక్కసారి యింతకుముందు ప్రచురించిన లీలలన్నీ చదువుకొని బాబా చెంతనే ఉన్నట్లుగా అనుభూతిని పొందండి.   

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 93వ.శ్లోకం, తాత్పర్యం.
                                   
శ్రీవిష్ణుసహస్రనామం

శ్లోకం:    సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః  |

            అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః        || 

తాత్పర్యం: పరమాత్మను సత్వస్ఠితిగా మరియూ మనస్సు స్వభావమూ సాత్వికమైనవానిగా, సత్యముగా, సత్యధర్మముల కంకితమైనవానిగా, మనయందు ప్రియముగల అభిప్రాయముగా, ధ్యానము చేయవలెను.  ఆయనను అట్టి అభిప్రాయముగానే అర్చన చేయవలెను.  ఆయన అర్చనగనే తెలియబడుచున్నాడు.  ఆయనకు అర్చన వలననే జీవులపై ప్రీతి కలుగుతున్నది.  అంతేగాక యితరులకు తనయందు ప్రీతిని కలిగించి దానిని వృద్దిపొందించుచున్నాడు.  

శ్రీసాయితో మధురక్షణాలు - 26

బాబా అప్పుడే కాదు ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు

సంవత్సరం క్రితమే నేను బాబా గురించి విన్నాను.  అదే సమయంలో ఒకరు నాకు శ్రీసాయి సత్ చరిత్రను బహూకరించారు.  కొన్ని పేజీలు చదివి తరువాత మానేశాను.  బాబా చేసిన అద్భుతాలు నమ్మదగినవిగా లేవనే కారణంతో కాక, నిరాశతో ఉన్ననాకు ఒక గురువు ఆవశ్యకత ఉన్న నాలాంటివాడికి అవి ఏవిధంగానూ ఉపయోగం కాదనే ఉద్దేశ్యంతో మానేశాను. కొన్ని నెలల తరువాత రాజసులోచనగారితో పరిచయం కలిగింది.   ఆమెకు బాబామీద సంపూర్ణ విశ్వాసం ఉంది.


  అయినాగాని యిప్పటికీ నాలాంటివానికి బాబా వల్ల ఉపయోగం ఉంటుందనే విషయం నామనసు ఒప్పుకోలేదు.  కానీ బాబా నామీద తన దయ చూపించదలచుకొన్నారు.  ఆకారణం చేతనే నాకు భరద్వాజగారిని కలుసుకొనే అదృష్టం కలిగింది.  పారాయణ వల్ల కలిగే లాభాలు గురించి, బాబా గురించి ఆయన ద్వారా విన్నాను.  ఆయన నన్ను శ్రీ సాయి సత్ చరిత్రను మూడు సార్లు చదివి బాబాకు పరీక్ష పెట్టమని చెప్పారు.  నేను ఆయన చెప్పినట్లే చేశాను.

జోషీమఠ్ శంకరాచార్య శ్రీ శాంతానంద సరస్వతి గారు ఢిల్లి విచ్చేస్తున్నారని తెలిసింది.  నేను ఆయనని చూడటానికి వెడుతూ బాబాని మనసులో యిలా కోరుకున్నాను "బాబా నువ్వు సాధు పుంగవులందరిలోను ఉన్నావని నిరూపించదలచుకొంటే (ఏకత్వం), నిష్ఠ, సబూరీలకు గుర్తుగా శాంతానందగారు నాకు రెండు పుష్పాలనివ్వాలి".  శాంతానందగారు చెప్పే ప్రవచనం శ్రధ్ధగా కూర్చొని వింటున్నాను.  ఆయన ప్రవచనం పూర్తయింది.  శాంతానందగారు నాకు ఏవిధంగా రెండు పుష్పాలనిస్తారో చూద్దామని ఆలోచిస్తూ నేనింకా వెళ్లకుండా అక్కడే ఉన్నాను.  ఆయనెక్కడో దూరంగా ఆసనంలో ఆశీనులయి ఉన్నారు.  ఆయన వద్దకు వెళ్ళే ధైర్యం లేదు నాకు.  ఇక విచారంతో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొన్నాను.  నేను వెళ్ళడానికి లేవగానే శాంతానందగారు తన శిష్యులలో ఒకరిని పిలచి అందరికీ ప్రసాదం యివ్వమని చెప్పారు.  అతను ఒక ఫలాన్ని తీశాడు.  నేను ఆఫలాన్ని తీసుకోవడానికి చేయి చాపగానే శాంతానందగారు రెండు ఫలాలనివ్వు అనడం వినపడింది. అందరికీ రెండేసి పళ్ళు యిస్తున్నారనుకొన్నాను.  కాని తరువాత విచారిస్తే నావెనుకనున్న అందరికీ ఒక్కటే యిచ్చారని చెప్పారు.  నాకు చాలా సంతోషం కలిగింది. కాని యిదంతా పూర్తిగా కాకతాళీయమని తోసిపుచ్చలేకపోయాను.  అందుచేత మరొక ప్రయత్నం చేద్దామనుకొన్నాను.  

నాలో నమ్మకం పెరిగేకొద్దీ, తరువాత  షిర్దీ వెళ్ళాలనుకొన్నాను.  ఆశ్చర్యకరంగా వెంటనే షిర్దీ దర్శించే భాగ్యం కలిగింది.  ద్వారకామాయిలోకి వెళ్ళి బాబా పటం ముందు కూర్చొని ఆయన మెడలో ఉన్న పూలదండలపై దృష్ట్టిపెట్టి ధ్యానం చేస్తున్నాను.  
                  
                        

ఆయన నన్ను స్వీకరిస్తే దానికి సూచనగా నాకు రెండు దండలు యివ్వాలని అడగడానికి నిర్ణయించుకున్నాను.  రెండుగంటలపాటు ధ్యానం చేశాను.   బాబా ఉన్న రోజులలో షిర్దీ ఎలాగ ఉండేదో, యిప్పుడు బాబా లేనప్పుడు షిర్దీ ఎలా ఉన్నదో, రెండిటికి మధ్య ఉన్న తేడాలను గురించి ధ్యానంలోనే ఆలోచిస్తూ ఉన్నాను. షిర్డీకి నా అంతట నేను వచ్చాను.  మరలా నా అంతట నేనే షిర్దీ నుంచి తిరిగి వెడుతున్నాను.  ఎవరైనా షిరిడీనుండి తిరిగి వెళ్ళేముందు బాబా వారికి అనుమతిచ్చి ఊదీనిచ్చి పంపేవారు.  మరి యిప్పుడు నాకు షిరిడీ విడిచి వెళ్ళడానికి అనుమతినిచ్చి, వెళ్ళేముందు ఊదీ ప్రసాదంగా యివ్వడానికి బాబా లేరు..  ఆరోజులలో బాబా నుండి స్వయంగా ప్రసాదం లభించిన వారిపై నాకు అసూయ కలిగింది, కారణం నేను సమర్పించిన వాటిని తిరిగి బాబా ప్రసాదంగా నాకు యిచ్చినా అది నిజమైన ప్రసాదం కాదనే భావన నాలో కలిగింది. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ధ్యానంలో అలా కూర్చిండిపోయాను.  ఆవిధంగా రెండు గంటలు గడిచిపోయాయి.  ఇక లేవబోయే సమయం దగ్గర పడుతున్నాగాని బాబావారినుంచి ఎటువంటి సూచన లభించలేదు.  ఇక నిరాశతో లేచాను.  నేను లేచిన వెంటనే ఒక వృధ్ధుడు లోపలికి వచ్చాడు. అతను మసీదులోనికి ప్రవేశించగానే అక్కడ ఉన్న ఒక నౌకరు ఆవృధ్ధుడు ఎవరో తెలుసా అని నన్ను అడిగాడు.  నాకు తెలియదని చెప్పాను.  అప్పుడతను ఆయన మహల్సాపతిగారి కుమారుడు అని చెప్పాడు.  అది వినగానే నాలో అశలు చిగురించాయి.  నేనాయన వద్దకు వెళ్ళి పాదాభివందనం చేసి ప్రసాదం కోసం చేతులు చాచాను.  ఆయన ఏమీ యివ్వకుండా నన్ను మహల్సాపతిగారి కుటీరానికి రమ్మని చెప్పారు.  మొదట సందేహించినా, ఆఖరిగా నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఆయనని అనుసరించాను. 
                        
మహల్సాపతిగారి కుటీరానికి వెళ్ళగానే, అడగకుండానే నాకాయన ప్రసాదం యిచ్చారు.  ఆయన చేతిలో పూలదండలు చాలా ఉన్నాయి.  అవన్నీ చిక్కులుపడిపోయి ఉన్నాయి.  వాటిని ఆయన వేటికవి విడివిడిగా తీయడం మొదలుపెట్టారు.  ఆయన వాటినుండి ఒక దండ వేరు చేశారు గాని దానిని నాకివ్వడానికి సందేహించారు.  దాని బదులుగా ఆయన నాకు చిక్కులు పడివున్న దండల గుత్తి యిచ్చారు.  వాటిని నేను తీసుకున్నాను.  నా హృదయం దడ దడ కొట్టుకుంటూ ఉంది.  వాటి వంక తేరిపార చూశాను.  ఆశ్చర్యం అవి రెండు దండలు.  నేనేమి కావాలని అడిగానో అవి నాకు లభించాయి.  నాకన్నులనుండి ఆనంద భాష్పాలు కారాయి.  మహల్సాపతిగారి కుమారుడు నన్ను కారణమడిగారు.  బాబాకు నేను పెట్టిన పరీక్ష గురించి చెప్పి, అది యిప్పుడు నిర్ధారణ అయిందని చెప్పాను.  బాబా మనం చేసే ప్రార్ధనలకి ఎల్లప్పుడు సమాధానాలిస్తారనే మాట వాస్తవం.  మహాసమాధికి  ముందు బాబా "నా ఎముకలు మాటలాడతాయి"అని చెప్పిన మాట వాస్తవం. 

ఇంకా అప్పుడే అయిపోలేదు. ఇక వెళ్లబోయేముందు  బాబా విగ్రహం పాదాల వద్ద దక్షిణ పెట్టాను.  ఇక నేను లేచేముందు మహల్సాపతి కుమారుడి వద్దనుండే పరిచారకుడు ఊదీ ఇవ్వమంటారా అని అడగగానే వెంటనే సందేహించకుండా యిమ్మని చెప్పాను.  అది బాబా ధునిలోని ఊదీ అని భావించాను.  అది నావద్ద చాలా ఉంది.  కాని, ఆ ఊదీ బాబా గారు జీవించి ఉన్న రోజులలోనిది.  ఆయన మహాసమాధి చెందినపుడు ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు ధునిలో ఉన్న ఊదీనంతటినీ సేకరించారు.  ఎవరయితే ఆఊదీ కావాలనుకుంటారో వారికి, ఎవరయితే అదృష్టవంతులో వారికి ఒక్కసారి పార్ధిస్తే చాలు వారికి లభిస్తుంది.  నాప్రార్ధనలను మన్నించారనడానికి సూచనగా నాకు శ్రీసాయిబాబా వారి నుంచి రెండు దండలు, ఊదీ ప్రసాదంగా లభించాయి.  నేనింకేమీ అడగగలను?  షిరిడీనుండి తిరిగి వెళ్ళడానికి అనుమతి యిచ్చినట్లుగా ఊదీ కూడా లబించింది.

అందుచేత నేను చెప్పదలచుకునేదేమిటంటే బాబా యిప్పటికీ ఉన్నారు.  వారు మనం చేసే ప్రార్ధనలని ఆలకించి వాటికి సమాధానాలను కూడా యిస్తున్నారు.

సాయిప్రభ
శాంతాసింగ్
నెల్లూర్ జిల్లా   

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

శ్రీసాయితో మధుర క్షణాలు - 27

$
0
0
                         
                              
18.11.2013 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

19వ.తారీకున హైదరాబాదు ప్రయాణం, తరువాత 22వ.తారీకున దుబాయికి ప్రయాణం.  అందుచేత ప్రచురణకి కొంత ఆలశ్యం జరుగుతుంది.  మరలా దుబాయినుండి యధాప్రకారంగా బ్లాగులో ప్రచురణ కొనసాగుతుంది. శ్రీసాయితో మధురక్షణాలలోని ప్రతీ క్షణం అద్భుతమే. మరలా మరొక్కసారి యింతకుముందు ప్రచురించిన లీలలన్నీ చదువుకొని బాబా చెంతనే ఉన్నట్లుగా అనుభూతిని పొందండి
                                    
                                       

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 94వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం :  విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః   |

          రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః  ||  

తాత్పర్యము:  పరమాత్మను కాంతితో కూడిన వాయు మార్గముగా తేజోవంతునిగా, తన కాంతిచే సమస్తమును నియమించువానిగా, హవిస్సును స్వీకరించువానిగా, ధ్యానము చేయుము.  ఉచ్చరింపబడిన వాక్కే తన కాంతిగా సమస్తమును దర్శించి ధరించువానిగా, మరియూ సృష్టించువానిగా నున్నాడు.  సూర్యుడే తన నేత్రముగా కలిగియున్నాడు. 

శ్రీసాయితో  మధుర క్షణాలు - 27 

కుట్టడం మరచిన తేలు

శ్రీ సాయి సత్ చరిత్ర 22వ.అధ్యాయములో పామును గాని, తేలును గాని, చంపుట న్యాయమేనా అన్న విషయం మీద చర్చ జరిగింది.  దానికి బాబా చాలా సరళంగా సమాధానమిచ్చారు.  భగవంతుడు అన్ని జీవులలోను నివసిస్తున్నాడు.  అవి పాములైనా సరే, తేళ్ళయినా సరే.  ఈ ప్రపంచాన్ని నడిపించేది భగవంతుడు.  అన్ని జీవులు, పాములు, తేళ్ళు అన్నీ కూడా  ఆయన ఆజ్ఞకు బధ్ధులయి ఉంటాయి.  


  ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరూ ఎవరికీ హని తలపెట్టలేరు.  ప్రపంచమంతా కూడా ఆయన మీదనే ఆధారపడి ఉంది.  ఎవ్వరూ కూడా స్వతంత్రులు కాదు.  అందుచేత సకల జీవరాసుల మీద మనం దయ చూపాలి.  ఏవిధమయిన శతృత్వాలు, ఘర్షణలు, చంపుకోవడాలు, లేకుండా  అన్నిటినీ వదలిపెట్టి ఓరిమి వహించాలి.  అందరినీ రక్షించేది ఆభగవంతుడే.  ఇప్పుడు మీరు చదవబోయే లీలలో ఒక తేలు, తన కుట్టే స్వభావాన్ని ఎలా మరచిపోయిందీ వివరిస్తుంది.  ఈ లీల మనలని మంత్రముగ్థుల్ని చేస్తుంది. 

బాబా వారి మాతృప్రేమను వివరించే ఈలీలను మీతో పంచుకోవడం తప్ప ఏవిదంగా మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోగలం? 

జూలై 1వ.తేదీ, 1988 వ.సంవత్సరం.  ఆరోజున జె.వసుంధరాదేవి గారి సోదరుడు ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు.  ఆయన తల్లి అతనికోసం వంట చేస్తోంది.  వండిన అన్నాన్ని ఒక పళ్ళెంలో పెట్టి కొద్ది క్షణాలు వంట గదిలోనుండి బయటకు వెళ్ళింది.  తరువాత మరలా వంటగదిలోకి వచ్చి చూసేటప్పటికి పళ్ళెంలో పెట్టిన వేడి వేడి అన్నంలో రెండు పెద్ద ఖాళీలు  (ఎవరో అన్నం చేతితో తీసినట్లుగా)కనిపించాయి.  ఆమె అందరినీ పిలిచి ఆవింత చూపించించింది.  అందరూ ఆపళ్ళెంలోకి చూసి అంత వేడి వేడిగా ఉన్న అన్నాన్ని బాబావారు స్వీకరించి, తమ లీలను చూపించారని, ఆయన అనుగ్రహపు జల్లులు తమందరిమీద కురిపించినందుకు ఎంతో సంతోషించారు. బాబాను ప్రార్ధించారు.
                                           
                                                   
సింధియాలో ఉన్న సాయి మందిరానికి వెళ్ళి ఆయనకు తమ కృతజ్ఞతలు తెలుపుకుందామని నిర్ణయించుకొన్నారు.  సాయి మందిరం వారి యింటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.  వారక్కడికి అరుదుగా వెడుతూ ఉంటారు.  తమతో పాటుగా తమ స్నేహితులు కొంతమంది ఎవరయిన వస్తారేమో అడిగి వారిని కూడా తీసుకొని వెడదామనుకొన్నారు.  వారి యింటి ప్రక్కనఉన్నవారి  బాబు రాహుల్ ని కూడా తమతో తీసుకుడదామనుకొన్నారు. బాబు వయస్సు 3 సంవత్సరాలు.  చాలా తెలివైనవాడు.  బాబుకి బాబా అంటే చాలా యిష్టం.  ఎప్పుడూ బాబా ఊదీ పెట్టుకుంటాడు.  బాబా పాటలు వినడమన్నా ఎంతో యిష్టం.  బాబు తెలివితేటలు చూసి 6 మాసాల ముందునుండే స్కూల్ లొ వేశారు.

ఆరోజున రాహుల్ ఎప్పటిలాగే ఉదయం 7.45 కి స్కూలుకు వెళ్ళాడు.  మరలా తిరిగి ఉదయం 11.15 కి యింటికి వచ్చాడు.  పెద్దవాళ్ళెవరి సాయం లేకుండానే తనబూట్లు, సాక్సు తనే విప్పుకున్నాడు.   పొరుగింటిలో మరొకరు ఉంటున్నారు.  వారి అబ్బాయి శివబాబు  ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. రాహుల్ విప్పిన సాక్సు చేతిలో ఉంది.  ఆ సాక్సులో ఏదో ఒకవిధమైన గడ్డలాంటిది ఉండటం శివబాబు చూశాడు. అదేమిటో చూద్దామని రాహుల్ చేతిలో నుండి సాక్సు తీసుకొని చూశాడు.  సాక్సులో ఒక తేలు ఉంది.  అదింకా బ్రతికే ఉంది.  వెంటనే ఆతేలుని చంపేశారు.  రాహుల్ తల్లి చాలా భయపడిపోయి "కాలికి ఏమయినా నొప్పి గాని, మంటగాని ఉందా"అని అడిగింది.  తనకి ఏవిధమయిన మంట, నొప్పి లేవని చెప్పాడు.  అంత పసివయసులోనే బాబా భక్తుడయిన ఆబాబుకు నొప్పి, మంట ఎందుకు ఉంటాయి?  కుట్టడమే తన సహజ గుణమయిన ఆతేలుకి కుట్టడమే మరచిపోయేలా చేశారు బాబా.  ఆయన ఎల్లప్పుడూ తన భక్తులమీద ప్రసరించే మాతృప్రేమ అది.
                                 
అంతకుముందు వారు మందిరానికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు.  రాహుల్ చిన్నపిల్లవాడవడం వల్ల బాబుని ఎత్తుకొని గుడివరకూ నడచి వెళ్ళడం కష్టమని రాహుల్ని ఇంటివద్దే వదలి వెడదామనుకొన్నారు. కాని యిప్పుడు బాబా బాబుని ఏవిధంగ రక్షించారో చూసిన తరువాత మనసు మార్చుకొని బాబుని కూడా తమతో మందిరానికి తీసుకొని వెళ్ళడానికి నిశ్చయించుకొన్నారు.  బాబు బస్సు స్టాండునుంచి మందిరంవరకూ ఎటువంటి అలసట లేకుండా నడిచాడు.  బాబుని కాపాడినందుకు వారంతా  కృతజ్ఞతలతో బాబాని ప్రార్ధించారు.  ఎవరయితే మనస్ఫూర్తిగా, త్రికరణశుధ్ధిగా ఆయన సహాయంకోసం అర్ధిస్తారో వారికి బాబా వెంటనే సహాయం చేస్తారని స్వామి శ్రీసాయి శరణానందజీ గారు చెప్పారు.  త్రికరణశు  ధ్ధికి ఎటువంటి కొలమానాలు లేవు.  కాని భక్తుడు పిలచిన వెంటనే బాబా వెంటనే స్పందించి, వెన్వెంటనే తన భక్తుని సహాయం కోసం వస్తారు.

సాయి ప్రభ 
జనవరి 1989 
జె.వసుంధరాదేవి
ఆంధ్ర ప్రదేశ్    

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

శ్రీసాయితో మధుర క్షణాలు - 15 - బాబావారి కఫ్నీ

$
0
0


  
          

11.08.2013 ఆదివారము 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజున విజయవాడలో ఉన్నందువల్ల శ్రీవిష్ణుసహస్రనామం శ్లోకం, 
తాత్పర్యం అందిచలేకపోతున్నాను...  


శ్రీసాయితో మధుర క్షణాలు - 15

బాబావారి కఫ్నీ

బాబాగారు తన కఫ్నీ చిరిగిపోయి పాడయిపోయినప్పుడెల్లా దానిని యితరులకెవరికైనా యిచ్చివేసే బదులు దానిని ధునిలో కాల్చి బూడిద చేసేవారు.  దానిని ధునిలో కాల్చడానికి అది పాతబడిపోవాల్సిన అవసరమే లేదు.

ఒక్కొక్కసారి ఆయన కఫ్నీలను కొద్ది కాలమే ధరించినప్పటికి వాటిని కాల్చి బూడిద చేసేవారు. ఒకోసారి ఆయన వాటిని కుట్టుకొని బాగుచేసుకొని ధరిస్తూ ఉండేవారు.  సాయిబాబాగారి దుస్తులు చిరుగులు పట్టినపుడు, తాత్యాపాటిల్ వాటిని తన వేళ్ళతో యింకా చింపివేసేవాడు.

సాయిబాబా ఏభక్తుడినయినా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలని భావించినపుడు, ఆ అదృష్టవంతునికి బాబావారి దుస్తులు ప్రసాదంగా లభించేవి.  బాబావారి దుస్తులలో అపారమయిన శక్తి నిండి ఉంది.  ఒక సారి సాయిబాబా తన కఫ్నీని మహల్సాపతికి బహుమతిగా యిచ్చారు. దానియొక్క ఫలితం ఏమిటంటే, మహల్సాపతి తాను మరణించే వరకూ సన్యాసిలా జీవించినా, తన కుటుంబ బాధ్యతలను సామాజిక అనుంబంధాలని నెరవేర్చాడు.

మరొక సంఘటనలో సాయిబాబా తన కఫ్నీని ముక్తారాం అనే భక్తునికిచ్చారు. కఫ్నీ బాగా మాసిపోయి ఉండటంవల్ల ముక్తారాం దానిని ఉతికి వాడా (ధర్మశాల) లో ఆరబెట్టాడు.  తరువాత ముక్తారాం బాబా దర్శనానికి వెళ్ళాడు.  కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో కఫ్నీ ఆరబెట్టిన చోట వామనరావు ఉన్నాడు.  కఫ్నీలోనించి ఈ విధంగా మాటలు  వినిపించాయి, "చూడు, ముక్తారాం నన్నిక్కడకు తీసుకొనివచ్చి తలకిందులుగా ఆరబెట్టాడు".    

వామనరావు వెంటనే కఫ్నీని తీసి తాను ధరించాడు.  కఫ్నీని ధరించిన తరువాత వామనరావు ద్వారకామాయికి వెళ్ళాడు.  

కఫ్నీని ధరించిన వామనరావుని చూసి సాయిబాబా కోపోద్రిక్తులయ్యారు.  కాని, వామనరావు సన్యాసం తీసుకోవడానికి నిశ్చయించుకొన్నాడు.  ఈసంఘటన జరిగిన తరువాత సమయం వచ్చినపుడు వామనరావు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకొన్నాడు.

15, అక్టోబరు, 1918, మంగళవారమునాడు బాబావారు సమాధి చెందిన తరువాత బాబావారి పాత గుడ్డ సంచిని తెరచి చూశారు.  దానిని ఆయన ఎప్పుడూ ఎవరినీ ముట్టుకోనిచ్చేవారు కాదు.  ఆసంచిలో ఆకుపచ్చ కఫ్నీ, ఆకుపచ్చ టోపీ కనిపించాయి.  వాటిని కాశీరాం అనే దర్జీ బాబాకిచ్చాడు.

బాబా వాటిని ధరించారు.  కాని, తరువాత తెల్లని దుస్తులను ధరించడానికే యిష్టపడ్డారు.  మిగిలిన వస్తువులతోపాటు, ఈ సంచికూడా బాబావారి సమాధిలోపల ఉంచారు.

నేటికీ షిర్దిడీలోని దీక్షిత్ వాడాలో "సాయిబాబా మ్యూజియం లో బాబావారి మరొక కఫ్నీని చూడవచ్చు. 

                    

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

శ్రీసాయితో మధురక్షణాలు - 28

$
0
0

                                
                    
                                        
23.11.2013 శనివారము (దుబాయ్  నుండి )

శ్రీసాయితో మధురక్షణాలు - 28
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

నిన్ననే 22వ.తారీకున హైదరాబాదునుండి దుబ్బాయ్ కి రావడం జరిగింది..మనబ్లాగులో సాయితో మధురక్షణాలలోని మధురక్షణాలను అనువాదం చేసిన వెంటనే ప్రచురిస్తూ ఉంటాను.  
                                      
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 95వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం: అనంత హుతభుగ్భోక్తా సుఖదోనైకజో గ్రజః  |

        అనిర్విణ్ణః సదామర్షీ లోకాధిష్టాన మద్భుతః  ||  

తాత్పర్యం:  పరమాత్మను అంతులేనివానిగా, నిరంతరమూ తినువానిగా, హవిస్సును భుజించువానిగా, సుఖము నిచ్చువానిగా, సృష్టి సమస్తమునకూ పెద్ద సోదరునివంటి వానిగా ధ్యానము చేయుము. ఆయనకు సంభ్రమము లేదు.  ద్వేషము లేదు.  ఆయన సమస్త లోకములకూ నివాసమై యున్నాడు.  అది అద్భుతమై యున్నది.   

నువ్వు, నేను వేరుకాదు

ఇప్పుడు చెప్పబోయే వృత్తాంతం కీ.శే. శ్రీ విఠల్ రావ్ మరాఠే గారు వివరించి చెప్పిన.ది  ఆయన షిరిడీ సంస్థాన్ వారి ఆస్థాన విద్వాంసులు.  షిర్దీలో సత్యనారాయణ వ్రతాలు చేసే చోట కీర్తనకారుడు.


ఒకరోజున యిద్దరు పఠాన్ లు బాబావారి దర్శనం కోసం ప్రొద్దుటే తెల్లవారుతుండగా షిరిడీ చేరుకొన్నారు.  బాబాగారికి నమస్కారం చేసి ఆయన ఎదురుగా కూర్చొన్నారు.  అది చలికాలం కావడంతో చాలా చలిగా ఉంది.  వణికించే చలిలో వారక్కడ కూర్చొని ఉన్నారు.  ఆయిద్దరిలో ఒకరికి "ఈ సమయంలో వేడి వేడి టీ త్రాగితే ఎంతబాగుండును? "అనే ఆలోచన వచ్చింది కాని మరుక్షణంలోనే "యింత చిన్న గ్రామలో టీ దొరుకుతుందనుకోవడం తెలివితక్కువ ఆలోచన, పైగా యిక్కడ కొంతమందికి టీ అంటే తెలియకపోవచ్చు"అనుకొన్నాడు.

అప్పుడే అక్కడికి బాబా దర్శనం కోసం సగుణ నాయక్ వచ్చాడు. అతను అక్కడికి వచ్చే భక్తుల కోసం చిన్న హొటలు నడుపుతున్నాడు.  సగుణ నాయక్ బాబాకి నమస్కరించి పొద్దుటే ఫలహారానికి ఏమితెమ్మంటారని అడిగాడు. "సగుణా! ఒక పాత్రనిండుగా వేడి వేడి టీ పట్టుకురా"అన్నారు బాబా.  సగుణ బాబాకి  అంకిత భక్తుడు, క్రమశిక్షణ గలవాడు.  బాబా టీ అడగటంతో చాలా ఆశ్చర్యం వేసింది.  బాబా టీ త్రాగడం అతను ఎప్పుడూ చూడలేదు.  బాబాని మరింకేమీ ప్రశ్నించకుండా వెంటనే వెళ్ళి ఒకపాత్ర నిండుగా పొగలు కక్కే వేడి వేడి టీ తెచ్చాడు.  

పఠాన్ లు ఇద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. హాయిగా వేడి వేడి టీ తాగారు.  వారు ఎవరితోనూ  తమకు టీకావాలని చెప్పడం గాని, టీ ఎక్కడ దొరుకుతుందని గాని అడగలేదు. కాని బాబా, వారి మనసులోని ఆలోచనను గ్రహించారు.  బాబా సామాన్యమైన మహావ్యక్తి కారని, వారిలో అతీతయమైన శక్తులు ఉన్నాయనీ, ఆయన అందరి హృదయాలలోనూ ఉన్నారనీ వారికి అర్ధమయింది.

శ్రీసాయి లీల
  అక్టోబరు 1979
శోభనా టీ.మార్వంకర్
బొంబాయి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)   


శ్రీసాయితో మధుర క్షణాలు - 29

$
0
0

                       
               
27.11.2013 బుధవారం  (దుబాయి నుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయితో మధుర క్షణాలు - 29

ఈ రోజు శ్రీసాయితో మధుర క్షణాలలోని మరొక మధుర క్షణాన్ని మనం తెలుసుకొందాము.  ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా సరే బాబా నీదే భారం అని మొత్తం వ్యవహారమంతా ఆయన భుజాల మీదే వేస్తే కనికరించకపోరు.  కావలసినదల్లా మనకి ఆయన మీద సంపూర్ణ విశ్వాసం, మొక్కవోని ధైర్యం..ఇక చదివేముందు శ్రీవిష్ణుసహస్ర నామ స్తోత్రంలోని 96వ.శ్లోకం, తాత్పర్యం.
                           
శ్రీవిష్ణుసహస్ర నామ స్తోత్రం 

శ్లోకం:         సనాత్సనతనతమః కపిలః కపిరవ్యయః         | 
  
                 స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః    || 

తాత్పర్యం:   పరమాత్మను మిక్కిలి పూర్వీకునిగా, బ్రహ్మ, కుమార సర్గములకన్నా ముందున్నవానిగా, మరియూ కపిలావతారముగా, సృష్టియందలి సాంఖ్య శాస్త్రమున కదిపతిగా ధ్యానము చేయుము.  అతడు భూమి యందలి నీటిని ఆవిరి చేసి పరిశుధ్ధ మొనరించు సూర్యునిగా, అవ్యయునిగా లేక తరిగిపోనివానిగా, శుభమును కలిగించువానిగా మరియూ తానే శుభమైనవానిగా నున్నాడు.  మరియూ శుభమును అనుభవించువానిగా, సత్కర్మాచరణ చేసినవానికి శుభమును పంచిపెట్టువానిగా ధ్యానము చేయుము. 


అచేతనావస్థలో ఉన్న కుమార్తెను బాబా వారి రాతి వద్ద వదలి వెళ్ళుట.

1982 మే నెలలో శ్రీమురళీధర్ భికా సోనావనె తమ కుమార్తెకు వ్యాధి సోకడం వల్ల శ్రీసాయినాధ్ ఆస్పత్రిలో చేర్పించారు.  డాక్టర్లు పరీక్ష చేసి ఆమె జబ్బు మందులతో నయం కాదని, యిక చేసినా ఫలితం లేదని యింటికి తీసుకొనిపొమ్మని చెప్పారు.  ఎంతో బాధతో తల్లిదం  డ్రులుఆమెను తిరిగి యింటికి తీసుకొని వచ్చారు. 


మరలా యింకొక డాక్టరు వద్దకు తీసుకొని వెళ్ళి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకొందామని డా.గొడేకర్ గారి దగ్గరకు తీసుకొని వెళ్ళారు.  ఆయన పరీక్షించి బాబా దయతోనే ఆ అమ్మాయి  బ్రతకాలి తప్ప యిక చేయగలిగిందేమీ లేదని చెప్పారు.  తల్లిదండ్రులు అమ్మాయిని యింటికి తీసుకొని వచ్చారు. యింటికి తీసుకొని రాగానే ఆ అమ్మాయి అచేతనంగా కళ్ళు తెరచుకొని ఉండిపోయింది.  అమ్మాయి పరిస్థితి చూసి తల్లిదండ్రులు భయపడిపోయి ఏడుస్తూ ఆమెని ద్వారకామాయికి తీసుకొని వచ్చారు.  ఆమెను, బాబావారు ఎప్పుడూ కూర్చునే రాయి వద్ద క్రింద  పడుకోబెట్టారు. 

                                 
 నాడి కోట్టుకోవడం మెల్లగా తగ్గిపోతూ యిక ఆగిపోయే స్థితికి వచ్చింది.  బరువెక్కిన హృదయంతో వారు ఊదీ కలిపిన నీటిని, తీర్ధాన్ని ఆమె నోటిలో పోశారు గాని, ఫలితం లేదు.  పోసిన తీర్ధం బయటకు రాసాగింది. ఆమె శరీరాన్ని అక్కడే ఉంచి యిద్దరూ కూడా ధుని వద్ద ఉన్న బాబా ఫొటో వద్దకు వెళ్ళి ప్రార్ధించసాగారు.

                                   
 ఆమెని బాబావారి ద్వారకామాయికి తీసుకునిరావడంతోనే అనారోగ్యంతో ఉన్న అమ్మాయికి కాస్త ఉపశమనం కలిగింది.  ఒక నిజమైన భక్తునిగా చేసిన ప్రయత్నాలన్న్నీ చేసి ఆఖరి ప్రయత్నంగా భారమంతా సాయి మీద వేశారు.  నీటిలో మునిగేవాడికి గడ్డిపరక అధారంగా దొరికినట్లుగా ఉంది వారి పరిస్థితి.       

అరగంట తరువాత వారు తమ కుమార్తెని పడుకోబెట్టినచోటుకి, బాబా వారి రాతివద్దకు వచ్చి చూశారు.  కాని అక్కడ వారికుమార్తె లేదు.  ఆనందం పట్టలేకపోయారు.  వారి కుమార్తె ద్వారకామాయికి దక్షిణం వైపు వున్న గోడవద్ద అక్కడ ఉన్న పిల్లలతో కలిసి ఆడుకొంటు కనపడింది.  వారి ఆనందానికి అవధులు లేవు.  బాబావారు 15 అక్టోబరు  1918 న మహాసమాధి అయిన తరువాత, ఇప్పుడు మే నెల 1982 లో ద్వారకామాయిలో ఆ పాపని కాపాడారు.

ఆంబ్రోసియ ఆఫ్టర్ సమాధి (ఆధారం) 
రామలింగస్వామి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

శ్రీసాయితో మధుర క్షణాలు - 30

$
0
0
                                 
                           
                                                       
                                    
28.11.2013 గురువారం (దుబాయి నుండి)

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయితో మధురక్షణాలలో మరొక మధురక్షణం తెలుసుకుందాము. నిన్న మధురక్షణం చదివారుకదా.. ధైర్యం కోల్పోకుండా బాబా మీదనే భారం వేసిన దంపతుల గురించి చదివారు.  ఈ రోజు కూడా ఆపద సమయం లో కూడా ఎంత సహనంతో ఉండాలో వివరిస్తుంది. ముందుగా  శ్రీవిష్ణుసహస్రనామం 97వ.శ్లోక, తాత్పర్యం.
                            
శ్రీవిష్ణుసహస్రనామం

శ్లోకం : అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః   |  

         శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః      ||  

తాత్పర్యం : పరమాత్మను భయంకరము కానివానిగా, చుట్టలుగా చుట్టుకొని యున్నవానిగా, చక్రమును ధరించినవానిగా, ధ్యానము చేయుము.  ఆయన సమస్తమునూ జయించి ఆక్రమించును.  ఆయన వాక్కు శాసనము.  ఆయన తన వాక్కుకతీతముగా నుండి తానుచ్చరించిన ప్రపంచమును తనయందే ధరించును.  చల్లదనము, మరియు రాత్రి కూడా ఆయన రూపములే.  


శ్రీసాయితో మధుర క్షణాలు - 30

నాయందెవరి దృష్టో వారియందే నా దృష్టి

సాయి సుధ మాసపత్రికనుండి 

నవంబరు 7వ.తేదీ 1986 సంవత్సరంలో నేను మాబంధువుల యింటికి వెడదామని విశాఖపట్నం బయలుదేరబోతుండగా కాకినాడనుండి నామేనల్లుడు ఫోన్ చేశాడు.  అతని రెండవ కొడుకు శీరం సాయి కల్యాణ్ (వయస్సు 22 సం.)  కు సీరియస్ గా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించామని చెప్పడంతో కాకినాడకు బయలుదేరి  8వ.తారీకు ఉదయానికి చేరుకున్నాను.  


 వెంటనే కల్యాణ్ ని చూడటానికి ఆస్పత్రికి వెళ్ళాను.  బీ.పీ.తగ్గిపోయి స్పృహ లేకుండా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడు.  నన్ను చూడగానే నా మేనల్లుడు "బాబాతో చెప్పి నాకొడుకు వద్ద కూర్చొని వాడిని బ్రతికించమను"అని నాచేతులు పట్టుకొని ఏడ్చాడు. బాబా మనలని ఎల్లప్పుడూ రక్షిస్తారు ధైర్యంగా ఉండు అని ఓదార్చాను.  నేను బాబా సమాధికి తాకించి తెచ్చిన శాలువాను కల్యాణ్ తలగడ క్రింద పెట్టి నుడుటిమీద ఊదీ రాశాను. 

కల్యాణ్ పరిస్థితిలో ఎటువంటి మార్పులేదు.  కల్యాణ్ కి తప్పకుండా నయమవుతుందనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాను.  నామేనల్లుడికి కూడా ధైర్యం చెబుతూ బాబా వారు చెప్పిన సహనం(సబూరీ) తో ఉండమని చెప్పాను.  నేను కూడా ఓపికగా వేచి చూస్తున్నాను.  9వ.తారీకు ఉదయం డాక్టర్స్ కల్యాణ్ ని పరీక్షించి అవి ఆఖరి క్షణాలని ధైర్యంగా ఉండమని చెప్పారు.  డాక్టర్స్ ఆవిధంగా చెప్పినా, కల్యాణ్ పరిస్థితిని చూసికూడా నేను ఆశ కోల్పోలేదు.  ధైర్యంగానే ఉన్నాను.  10వ.తేదీన కల్యాణ్ లో కొంత కదలిక వచ్చింది.  12వ.తారీకు ఉదయం 4 గంటలకు కల్యాణ్ హటాత్తుగా కళ్ళు తెరచి, "తెల్లటి దుస్తులలో బాబా వచ్చి చిన్న కఱ్ఱ తో నాగుండెల మీద కొట్టారు.  నేను ఇప్పుడు మామూలుగానే ఉన్నాను"అని చెప్పాడు.

"నన్ను శరణు జొచ్చినవారిని, నన్నే ఆశ్రయించువారిని నేను వదలి పెట్టను" - బాబా 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)   

శ్రీసాయితొ మధురక్షణాలు - 31

$
0
0

                           
                       
03.12.2013 మంగళవారం (దుబాయి  నుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

శ్రీసాయితొ మధురక్షణాలు - 31


సాయి బంధువులందరూ సాయితో మధురక్షణాలు చక్కగా చదివి ఆనందిస్తున్నారు కదూ!  మీరు చదివే ప్రతీ క్షణంలోను, ముఖ్యంగా కావలసినది నమ్మకం, సహనం అని గుర్తించేఉంటారు.  ఈ రోజు కూడా మీరు  చదివే క్షణంలో నమ్మకమే మనకు కావలసినది అని గ్రహిస్తారు.  ఇంతకుముందు మా అమ్మాయి స్వీయ అనుభవం,"ఆ చేతులు ఎవరివి"చదివే ఉంటారు. ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 98వ.శ్లోకం , తాత్పర్యం. 
                           
శ్రీవిష్ణు సహస్రనామం 

శ్లోకం: అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః   |

        విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః    ||

తాత్పర్యం: భగవంతుని క్రూరత్వము తొలగించువానిగా, మధురమైనవానిగా, మృదువైనవానిగా, ధ్యానము చేయుము.  ఆయన అందరికన్నా మించిన సామర్ధ్యము కలవాడు.  యజ్ఞము చివర పంచి పెట్టబడు దక్షిణగా తానే యున్నాడు. క్షమించువారియందు ఉత్తముడు.  తెలిసినవారియందు అనగా జ్ఞానులయందు శ్రేష్టుడు.  ఆయన భయమును తొలగించి తనను గూర్చి స్తోత్రము చేయువారిని మరియూ ఆ స్తోత్రములను వినువారిని పవిత్రమొనర్చుచున్నాడు.    




                         
                           

నమ్మకమే ఎప్పుడూ జయిస్తుంది

నంద్యాల తాలూకా దేష్ పురం నివాసి వెంకటరామయ్యగారు, తమ కుమార్తె ప్రసవ సమయం దగ్గిర పడటంతో నంద్యాల  వచ్చారు.  అది 1985వ.సంవత్సరం డిశంబరు 2వ.తే. దీ తమ కుమార్తెకు పురిటినొప్పులు రాత్రి 10గంటలకు మొదలయి ఉదయం 2గంటలవరకూ తగ్గకపోవడంతో భార్యభర్తలిద్దరికీ చాలా భయం వేసింది.  ఉదయాన్నే ఆమెని తమ యింటికి దగ్గరలోనే ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోం కి తీసుకొనివచ్చారు.  వారితో పొరిగింటిలోనే ఉంటున్న కొండయ్యగారి భార్య కూడా తోడుగా వెళ్ళింది.  సాయంత్రం 4 గంటలయినా నర్సింగ్ హోం నించి ఎవరూ రాక అసలు విషయం ఏమీ తెలియకపోవడంతో కొండయ్యగారు చాలా ఆత్రుతతో ఉన్నారు. తన భార్య కూడా ఆస్పత్రినుండి రాకపోవడంతో ఏమయిందోననే ఆందోళనతో కొండయ్యగారు సాయంత్రం ఆస్పత్రికి వెళ్ళారు.  అక్కడ వెంకటరామయ్యగారి అమ్మాయికి యింకా పురిటి నొప్పులు తగ్గకపోవడంతో అందరూ చాలా  విచారంగా ఉన్నారు. అమ్మాయి పురిటినొప్పులు భరించలేక శోషించిపోయింది.    

కానుపు అవడం చాలా కష్టమని వెంటనె ఆపరేషన్  చేయాలని లేడీ డాక్టర్ చెప్పింది . వెంటనే రూ.2000/- కట్టమని లేకపోతే తానేమీ  చేయలేనని చెప్పింది.  అపుడు కొండయ్యగారికి సాయినాధులవారే గుర్తుకు వచ్చారు.  ఇటువంటి యాంత్రిక జీవితంలో బాబా తప్ప  మరెవరూ సహాయం చేయలేరనుకున్నారు.  ఆయన దయే కనక లేకపోతే మనుగడే కష్టం.  ఆకలి వేసే  పిల్లవాడికి ఆహారం కావాలి, దాహంతో ఉన్నవారికి మంచి నీరు చాలు, కష్టాలలో ఉన్నపుడు మాతృప్రేమ కావాలి.  బాబా ఎప్పుడూ తన బిడ్దలకు ఎంత చిన్న  కష్టమొచ్చినా తన మాతృప్రేమను కురిపిస్తారు.  కొండయ్యగారు తన భార్యతో అమ్మాయికి ఊదీ పెట్టమని  అన్నపుడు ఆవిడ కాస్త సందేహిస్తూ చూసేసరికి, "ఊదీ యొక్క శక్తినే శంకిస్తున్నావా"? అని గట్టిగా అరిచారు.

కొండయ్యగారి భార్య, అమ్మాయి నుదుటిమీద ఊదీరాసి కొంత నోటిలో వేసింది .  ఇదంతా చూసిన లేడీ డాక్టరు అసహ్యించుకొని, మూఢ నమ్మకాలతో అటువంటి పిచ్చి పనులు ఏమీ చేయవద్దని చెప్పింది.  ఇటువంటివాటి వల్ల ఏవిధమయిన ఉపయోగం లేదు వెంటనే ఆపరేషన్ కి డబ్బు కట్టమని చెప్పింది.  కొండయ్యగారు వెంటనే యింటికి వెళ్ళి బాబా ముందు కూర్చొని అమ్మాయికి సుఖప్రసవం కలిగేలా చేయమని ప్రార్ధించారు. 
                              

 అపుడు సమయం మధ్యాన్నం గం.2.30ని.అయింది.  సాయంత్రం 4.గంటలు అవుతుండగా వెంకట రామయ్యగారి అమ్మాయి వచ్చి తన సోదరికి ఆపరేషన్  లేకుండా మగపిల్లవాడు జన్మించాడనీ , బాబు మంచి  ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పింది.
                     
                             
కొండయ్యగారు వెంటనే బాబును చూడటానికి ఆస్పత్రికి వెళ్ళారు.  ఇదంతా చూసిన డాక్టర్ కి చాలా అద్భుతమనిపించింది.  వెంకటరామయ్యగారితో కనీసం 600 రూపాయలయినా బిల్లు కట్టమని  చెప్పింది.

సాయిసుధ మాసపత్రిక
కొండయ్య
నంద్యాల 
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

శ్రీసాయితో మధుర క్షణాలు - 32

$
0
0
                     
                        
             
శ్రీసాయితో మధుర క్షణాలు - 32
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

వారం రోజులు పైన అయింది. బ్లాగులో ప్రచురణ చేసి. దుబాయిలో ప్రదేశాలు చూడటం, ఇంకొక పుస్తకం  అనువాదం చేయడంలోను కాస్త, కాదు ఎక్కువే ఆలశ్యమయింది. ఎప్పుడూ ఏదో వంక చెపుతున్నారనుకోకండి. ఈ రోజు మరొక మధురాతి మధురమైన క్షణాన్ని తెలుసుకుందాము. మనం బాబాకి గాని ఏ భగవంతునికయినా సరే కోరిక తీరగానే మొక్కిన మొక్కును వెంటనే తీర్చివేయాలి. బాబాని తలచుకొని ఒక పని చేస్తానని అనుకున్నప్పుడు ఆపని కూడా పుర్తి చేయాలి. ఒకవేళ మనము మొక్కును మరచి పోయినా అశ్రధ్ధ చేసినా భగవంతుడే ఏదొ విధంగా మనకి గుర్తు చేస్తాడు. ఇక చదవండి..చదివేముందు శ్రీవిష్ణుసహస్ర నామం 99వ.శ్లోకం తాత్పర్యం.
        
                
శ్రీవిష్ణుసహస్రనామం 

శ్లోకం:  ఉత్తారణొ దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః      |  

          వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః               || 

తాత్పర్యం:  పరమాత్మ చెడ్డపనులను తన మంచి పనుల రూపమున నశింప చేయుచూ జీవులను సం హరించి సత్కర్మ ఫలితములను మరియూ సత్పురుషులను రక్షించువానిగా, జీవనమే తానైనవానిగా యితరుల ఆలోచనలకు, పనులకు ఫలితముగా వారికిచ్చు జీవనము తానేయైనవానిగా, ధ్యానము చేయుము.  

మాట ఇచ్చి తప్పినచో భగవంతుడే స్వయంగా గుర్తు చెస్తాడు

తీర్ధ యాత్రలు చేయడానికి వెళ్ళే ప్రతీ సామాన్యునిలాగానే శ్రీరామస్వామి అయ్యంగారు నారాయణమొదలియార్ (డాక్టరు) షిరిడీ కి వెడదామని నిర్ణయించుకున్నారు.  అందరిలాగానే తను కూడా తనకిష్టమయిన ఆహార పదార్ధాన్ని గాని, అలవాటును కాని వదలివేయాలనుకున్నారు. 

 శ్రీ షిరిడీ సాయిబాబావారి గొప్పతనాన్ని విని, రామస్వామి అయ్యంగారు నారాయణ్ మొదలియార్ (డాక్టర్) గారు, రావు సాహెబ్ సుబ్బయ్య చెట్టియార్ గారితో కలసి 1938 సంవత్సరం, ఏప్రిల్, 27వ.తేదీన షిరిడీకి ప్రయాణమయ్యారు.  కాశీ, రామేశ్వరం పుణ్యక్షేత్రాల యాత్రలాగా తన షిరిడీ యాత్ర కూడా ఒక మధురానుభూతిగాను, ఫలప్రదంగాను మిగిలిపోవాలనుకొన్నారు. ఈ విధంగా అనుకొని ఆయన, తనకు ఉన్న విపరీతమయిన అలవాటయిన కిళ్ళీ నమలడం మానివేస్తానని భీకరమయిన ప్రతిజ్ఞ చేశారు. ఇక చివరిసారిగా ఆక్షణం నుండి షిరిడీ విడిచి వెళ్ళేవరకు తాంబూలం వేసుకోరాదనె నిర్ణయం తీసుకొన్నారు.  కిళ్ళీ వేసుకోవడం ఆయనకు చిన్న తనం  నుండీ ఉన్న అలవాటు.  అటువంటిది కిళ్ళీ మానేయడమంటే ఆయన దృష్టిలో అది పెద్ద త్యాగమే.

అలా అనుకోగానే కిళ్ళీ వేసుకోవడం మానివేసి, 1938, ఏప్రిల్, 28 తేదీన చెట్టియార్ గారితో కలసి, ఒక ఎడ్లబండిలో షిరిడినుండి తిరుగు ప్రయాణమయ్యారు.  వారిద్దరూ బండిలో కూర్చొగానె చెట్టియార్ గారు కిళ్ళీ నమలడం మొదలుపెట్టారు.  షిరిడీలో అంతవరకు కిళ్ళీ వేసుకోవాలని  కోరికతొ మనసు లాగినా దానిని జయించారు.  కాని యిప్పుడు చెట్టియార్ గారిని చూసిన తరువాత ఒట్టు కాస్తా గట్టున పెట్టి మద్రాసు చేరుకున్న క్షణం నుండీ మానేయవచ్చులే అనే ఆలోచన కలిగింది. ఆకులు,వక్క ఉంఛే చిన్న పెట్టెలోనుండి ఆకులు,వక్క, సున్నం తీసుకొని ఆనందంగా నమలడం మొదలు పెట్టారు.  ఎప్పుడయితే కిళ్ళీ నమలడం మొదలు పెట్టారో నాలిక వెంటనే పొక్కిపోయింది.  ఎన్నో దశాబ్దాలనుండి కిళ్ళీలు నమిలి నమిలి ఆయన నాలుక బండబారిపోయి బండలాగ తయారయింది.  ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది.  కాని దానినేమీ పట్టించుకోకుండా తనివితీరా నమిలారు.  ఒక అరగంట గడిచాక తన నాలుక, నోరు బాగా ఎఱ్ఱ బారి ఎన్నడు లేని విధంగా చాలా అసాధారణంగా కందిపోయాయి. అప్పటినుండీ తమలపాకులే కాదు ఘనపదార్ధాలేమి నమలలేకపోయారు.  ఆయనకు కనీసం గ్యాస్ ప్రోబ్లెం కూడా లేదు.  ఆరోజునుండి 18 రోజులదాకా తమలపాకులతో సహా మిగిలిన ఘనపదార్ధాలన్నిటినీ, నోటిపూత కారణంగా ఆయన మానుకోవలసి వచ్చింది.  ఒట్టిపాలు మాత్రమే త్రాగేవారు.

చెట్టియార్ గారిని చూస్తుంటే ఆశ్చర్యం అంతకంతకూ పెరగసాగింది.  తామిద్దరూ ఒకే తమలపాకులు, సున్నం తో కిళ్ళీలు వేసుకొన్నారు.  మరి ఆయనకు లేని సమస్య తనకెందుకు వచ్చినట్లు? కాని నేను వాగ్దానం చేసినట్లుగా ఆయన చేయలేదు.  కిళ్ళీ నమిలిన గంట తరువాత ఆయనకు మరొక అనుభవం ఎదురయింది. ఆయన తనతో కుడా తమలపాకులు వేసుకొనే చిన్న బుట్ట, వక్కలు, సున్నం పెట్టుకొనేందుకు చిన్న వెండి కప్పు, ఈ సరంజామానంతా తెచ్చుకొన్నారు. (తమిళులు ఇటువంటివన్నిటినీ ఒక చిన్న పెట్టెలో పెట్టుకొని కూడా పట్టుకెడుతూ ఉంటారు) 

  
వాటిని చెట్టియార్ గారి  వద్ద పెట్టి కొన్ని తమలపాకులు, యింకా కొన్ని సరుకులు కొనుక్కొని రావడానికి రత్నా బజారుకు వెళ్ళారు.  కొద్ది నిమిషాలలోనే తిరిగి వచ్చారు.  తను పెట్టిన తమలపాకులు,సున్నం డబ్బా కోసం చూశారు.  వావ్! ఏముంది?  అక్కడ తన సరంజామా ఏమీ కబపడలేదు.  అక్కడికి దొంగ ఎవరూ రాలేదు.  వాటినన్నిటినీ చెట్టియార్ గారి దగ్గరే పెట్టారు.  ఎంత వెతికినా గాని అవి కనపడలేదు.

పై రెండిటి సంఘటనలు జాగ్రత్తగా గమనిస్తే బాబా గారు యింకా జీవించే ఉన్నారని ఆయనకర్ధమయింది.  ఆయన తన భక్తులనందరినీ స్వంత బిడ్డలవలె చూసుకొంటారు.  అంతే కాక క్రొత్తగా వచ్చిన భక్తులని కూడా ఎంతో ప్రేమతోను చాలా జాగ్రత్తగాను కనిపెడుతూ రక్షిస్తున్నారని గ్రహించారు. 
                             

 శ్రీసాయినాధులవారికి భయభక్తులతో ఏదయినా మాట యిచ్చి తప్పితే, అలా మాట ఇచ్చి తప్పినవారిని శిక్షించి క్రమశిక్షణలో పెడతారు. ఆయన తన భక్తులు ఉన్న పరిస్థితులు, పరిసరాలు అన్నిటినీ ఎల్లప్పుడు గమనిస్తూ ఉంటారు.  తనభక్తులు ఎప్పుడు ఏవిషయంలోను అతిక్రమించి దారి తప్పకుండా నిత్యం గమనిస్తూ ఉంటారు.

బాబా ఆయనకి మంచి గుణపాఠం నేర్పారు.  ఆరోజునుండి ఆయన యిక ఎప్పుడూ యిచ్చిన మాట తప్పలేదు.

ఆవిధంగా బాబా ఆయనలో విశ్వాసాన్ని పెంచి, ఆయన చేసిన వాగ్దానాన్ని అమలు పరచే మనోధైర్యాన్ని ప్రసాదించారు.  ఆయన షిరిడి దర్శనానికి ముందు బాబా ఔన్నత్యాన్ని గురించి, ఆయన దయాగుణం గురించి విన్నారు, కాని అవి ఆయన మదిలో ఒక అస్పష్టమయిన ముద్రను వేసింది. కాని వాస్తవంగా పొందిన ఈ అనుభవం బాబా మీద ఆయనకున్న అభిప్రాయం మరింత స్పష్టంగాను, శక్తివంతంగాను ఆయన జీవితాంతం వరకు నిలబడిఉంటుంది.  ఆయన తన దృష్టినంతా బాబా మీదనే కేంద్రీకరించారు.

ఆంబ్రోసియా ఆఫ్ షిరిడీ నుండి
రామలింగస్వామి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

నా ఊదీలో నీకు నమ్మకం లేదా?

$
0
0
                     
             

20.12.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయితొ మధురక్షణాలలో ఇంకా మరికొన్ని క్షణాలు ఉన్నాయి.  ఇంకా వాటిని అనువాదం చెయ్యాలి. ఈ రోజు బాబా చేసిన ఒక అద్భుతమైన లీలను ప్రచురిస్తున్నాను. చదవండి.  మనం ఆర్తితో పిలిస్తే బాబా స్పందించకుండా ఉండడు.  అత్యంత అధ్బుతంగా జరుగుతాయి కొన్ని కొన్ని సంఘటనలు.  మూడు రోజుల క్రితం నెల్లూర్ నుంచి సుకన్యగారు ఆంగ్లంలో ప్రచురించిన లీల నాకు మైల్ ద్వారా  పంపించారు.  చదివిన వెంటనే అనువాదం కూడా చేశాను.  ఇది ఇంతకు ముందు సాయిలీలాస్.ఆర్గ్ లో ప్రచురించడం వల్ల వారినుంచి కూడా అనుమతి తీసుకున్నాను.  వారు కూడా నిన్నే అనుమతి కూడా ఇచ్చారు.  సాయిలీలాస్ బ్లాగును పరిచయం చేసిన సుకన్య గారికి అభినందనలు తెలుపుతూ, అనుమతినిచ్చిన సాయిలీలా ఆర్గ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.      

ముందుగా శ్రీవిష్ణుసహస్ర నామం 100వ.శ్లోకం, తాత్పర్యం. 
           

శ్రీవిష్ణుసహస్రనామం

శ్లోకం : అనంతరూపోనంత శ్రీర్జితమన్యుర్భయాపహః   |

         చతురశ్రోగభీరాత్మా విదిశో వ్యాదిశోదిశః  || 

తాత్పర్యం:  నారాయణుని అసంఖ్యాకమైన రూపములుగా, వైభవము గలవానిగా, జీవులలోగల కోపమును జయించినవానిగా ధ్యానము చేయుము.  చతురస్రమై, భయమును పోగొట్టు లోతైన ఆత్మ గలిగి, అన్ని దిశలయందు వ్యాపించి, అన్ని దిశలయందు, అంతర్దిశలయందు వ్యాపించుటయే గాక, అన్ని దిక్కులకు తానే దిక్కుగా నుండువాడు.

   నా ఊదీలో నీకు నమ్మకం లేదా?
        
వివిధ ప్రదేశాలనుండి భక్తులు షిరిడీకి పాదయాత్ర చేస్తారు.  కొంతమంది పల్లకినీ మోసుకొని వెడితే కొంతమంది నడచి వెడుతూ ఉంటారు.  భారతదేశంలోని వివిధ ప్రాంతాలనుండి భక్తులు పాదరక్షలతో గాని, లేకుండాగాని షిరిడీ వరకు పాదయాత్ర చేస్తారు.

  విఠోభా భక్తులు పండరిపూర్ వరకు పాదయాత్ర చేయడం ప్రారంభించినప్పటినుండీ ఈ పాదయాత్రలు మొదలయ్యాయి.  షిరిడీకి పాదయాత్ర చేయడమంటే భక్తులకి అదొక అపూర్వమయిన అనుభూతి.

తమ దగ్గిర ఎటువంటి ధనము ఉంచుకోకుండా దారిలో కేవలం భిక్ష మీదనే ఆధారపడుతూ షిరిడీకి పాదయాత్ర చేసిన భక్తులు కూడా ఉన్నారు.  అటువంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.  అటువంటి పాదయాత్ర గురించి ఒక అధ్బుతమయిన అనుభవం తెలుసుకొందాము.

2007వ.సంవత్సరం జూన్ నాలుగవ తారీకున అనిల్ సాహెబ్ రావి షిల్కే గారు ఆఫీసునుండి యింటికి తిరిగి వెడుతుండగా తీవ్రమయిన అనారోగ్యానికి గురయ్యారు.  హటాత్తుగా ఒళ్ళంతా చెమటలు పట్టి గొంతుక ఎండిపోయింది.  పొత్తికడుపంతా ఉబ్బిపోయి బాధ పెట్టసాగింది.  లక్షణాలన్ని బాగా తీవ్రంగా ఉండటంతో దగ్గరలోనున్న షాపులోనికి వెంటనె వెళ్ళి యింటికి ఫోన్ చేద్దామని వెళ్ళారు.  ఫోన్ డయల్ చేసి మాట్లాడలేక స్పృహతప్పి పడిపోయారు.  ఆయనకు తెలివి వచ్చేటప్పటికి  చించివాడ్ ఆస్పత్రి ఐ.సీ.యూ. లో ఉన్నారు.

రక్తపరీక్షలు, స్కాన్ రిపోర్టులు చూసిన తరువాత ఆయన కిడ్నీలు రెండూ పని చేయటంలేదని, ఆరోజునుండి డయాలసిస్ చేయాలని డాక్టర్  చెప్పారు.  ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన తరువాత కూడా జీవితాంతం ప్రతి వారం మంగళ, శుక్రవారాలలో డయాలసిస్ చేయించుకుంటూ ఉండవలసినదేనని చెప్పారు.  డాక్టర్ నిర్ధారణ చేసి తనకు వచ్చిన జబ్బు గురించి చెప్పగానే ఆయన వెన్నులో చలిజ్వరం వచ్చినట్లయి నిస్సహాయులైపోయారు.  నిరాశ నిస్పృహలతో ఆయన బాబాను "బాబా, జీవితాంతం డయాలసిస్ మీదే బ్రతికే జీవితం నాకు వద్దు.  దానికన్నా నాకు మరణాన్ని ప్రసాదించు"అని అర్ధించారు.
                        
17వ.తేదీన ఆయన యింటికి తిరిగి వచ్చారు.  సరిగ్గా తరువాతి నెలలోనే పూనానుండి షిరిడీవరకు పాదయాత్ర జరగబోతోంది.  గడచిన 8 సంవత్సరాలుగా ఆయన పాదయాత్ర లో పాల్గొంటున్నారు.  ఈసారి పాల్గొనలేకపోతున్నాననే బాధ కలిగింది.  ఆయన మన్స్పూర్తిగా బాబాని యిలా ప్రార్ధించారు.  "అనారోగ్యం వల్ల నేను ఈసంవత్సరం పాదయాత్ర చేయలేకపోతున్నాను బాబా.  వచ్చే సంత్సరం పల్లకీతో పాదయాత్ర చేసేలాగ నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు.  వచ్చే సంవత్సరం నేనే కనక నీపల్లకీ ముందు గుఱ్ఱం లాగ పరిగెత్తగలిగితే, అందుకు కృతజ్ఞతగా నీకు వెండి గుఱ్ఱాన్ని సమర్పించుకుంటాను"అని మొక్కుకొన్నారు.  నుదిటికి ఊదీ రాసుకొని నిద్రపోయారు.    
                       

                     
ఆరాత్రి ఆయనకు బిగ్గరగా ఒక స్వరం వినపడింది.."నా ఊదీలో నీకు నమ్మకం లేదా"? --  ఆయన తన భార్యను లేపి ఆమెకు ఆస్వరం ఎమన్నా వినిపించిందా అని అడిగారు.  భర్త ఏదో పరాకు మాటలు మాట్లాడుతున్నారనుకొని భయపడింది.  ఆయన మళ్ళీ పడుకొని మరలా ఉదయం 5 గంటలకే లేచారు.  ఈసారి ఆయనకు కాకడ ఆరతి స్పష్టంగా వినిపించింది.  ఆయన మరలా తన భార్యను లేపారు. ఇంటిలోనివారందరూ లేచారు.  వారికెవరికీ కాకడ ఆరతి వినపడలేదు ఆయనకు తప్ప.  ఇదే పెద్ద మలుపు.  రెండు గంటల  తరువాత ఆయన కాస్త మూత్రం విసర్జించారు.  ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గడచిన 15 రోజులుగా ఒక్క చుక్క కూడా మూత్రం రాలేదు.  కొద్ది రోజుల తరువాత ఆయన ఆస్పత్రికి వెళ్ళి, పరీక్ష చేయించుకున్నారు.  రక్త పరీక్షలో ఆయన ఆరోగ్యం కూడా మెరుగు పడిందని తెలిసింది.  డయాలసిస్ కూడా అవసరం లేదని చెప్పారు.  అనిల్ గారి ఆరోగ్యం కుదుటపడి నిలకడగా ఉంది.   

ఆయన తనభార్య, స్నేహితునితో కలసి షిరిడీ వరకు పాదయాత్ర చేసి, మొక్కున్న విధంగా బాబాకు వెండి గుఱ్ఱాన్ని సమర్పించారు. 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

saileelas.org  వారికి కృతజ్ఞతలతో  


Viewing all 726 articles
Browse latest View live