Quantcast
Channel: Telugu Blog of Shirdi Sai Baba,read sai leels,devotees experiences in telugu
Viewing all 726 articles
Browse latest View live

సంకల్ప బలం - బాబా లీల

$
0
0

Image result for images of shirdi sai
      Image result for images of light blue rose

26.11.2019  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులందరికి బాబా వారి శుభాశీస్సులు
సంకల్ప బలం -  బాబా లీల

ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు తమకు జరిగిన అధ్భుతమయిన బాబా లీలను పంపించారు.  దానిని యధాతధంగా ప్రచురిస్తున్నాను.  మన మనసులో సంకల్పం ఉండాలే గాని, మనం అనుకున్నట్లు బాబాయే జరిపించుకుంటారు.  మనకి సంకల్పం కలిగినపుడు మనం ఏవిధంగా చేయాలనుకుంటామో, ఆ సమయానికి ఆవిధంగా చేయడం ప్రారంభించాలి.  కాలం ఎవరికోసం ఆగదు.  మనం కూడా ఎవరికోసం ఆగకుండా బాబా పని మనం అనుకున్నట్లుగా ప్రారంభిస్తే జరిగే విధానం బాబా చూసుకుంటారు.  ఈ సత్యాన్ని తెలిపే అధ్భుతమయిన లీల ఇప్పుడు మనమందరం తెలుసుకుందాము.   

త్యాగరాజు


"ఓం సాయి రాం"సాయి బంధువులందరికి.
  ఇప్పుడు నేను రాయబోయే లీల ఈ నవంబర్ 23 న సత్యసాయిబాబా జయంతి సందర్బంగా జరిగింది.  ఈ అధ్బుతాన్ని చూసి  నమ్మలేకుండా వున్నాను. బాబా ఎంత కృప చూపారో తలచుకుంటే ఒడలు గగుర్పొడుస్తుంది. ఆశ్చర్యం..ఆనందం కలుగుతుంది. 
   Image result for images of saibaba gayatri mantra japa

"ఆరోజున మేము విశ్వసాయి ద్వారాకామాయి సభ్యులందరము కలసి విశ్వశాంతి కోసము షిర్డీ సాయి గాయత్రీ మహా మంత్ర జపం చేసుకుంటున్నాము విశ్వవ్యాప్తంగా ఒక కోటి సాయి గాయత్రీ చెయ్యాలని,దత్తజయంతి (అనగా డిసెంబర్ 12th) లోపు..అని మా సంకల్పము. ఆ సందర్బంగా నేను భువనేశ్వర్ లో ఒక బాబా మందిరం లో చేద్దామనుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళకు అందరికి ఆరోజున రమ్మని చెప్పాను.  అందరూ వస్తామన్నారు. ఆరోజు అనగా ఈ నెల నవంబరు 23వ.తారీకున నేను ఎంతో నమ్మకంతో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ రాలేదు.  నాకు చాలా దుఃఖం కలిగింది. అయ్యో,ఎవ్వరూ రాలేదు, సంధ్య ఆరతి సమయం కూడా దాటిపోయింది,ఇంక రారు  అనుకొని కళ్ళు మూసుకొని ఒక్కదాన్నే నాకు వీలు అయినంత సాయి గాయత్రీ మంత్ర జపం చేసుకుంటాను అనుకొని మనసులో మొదలు పెట్టాను. 25 సార్లు చేసి ఉంటానేమో నాకు తెలీదు.  కాని నేను ఒక్కమాల అంటే 108 చేసి కళ్ళు తెరిచేసరికి 20 మంది నా వెనకాల వున్నారు.ఎక్కడ నుంచి వచ్చారో...బాబా కే తెలియాలి. 
        Image result for images of baba temple bhubaneswar

 వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. మనం ఏ పని చేయాలన్నా సంకల్పబలం ఉండాలి అంటారు పెద్దవాళ్ళు. మంచి సంకల్పబలం ఉన్నవాళ్లకు దైవం ఎప్పుడూ సహాయకంగా ఉంటాడు అన్నది అక్షరసత్యం. ఆరోజు బాబా నా కార్యాన్ని అలాగే జయప్రదం చేశారు. సత్యసాయిబాబా జన్మదినం రోజు షిర్డీ సాయి గాయత్రీ మంత్ర జపం అఖండంగా జరిగింది. వచ్చిన వాళ్లలో ఎవరో జీడిపప్పు కేక్ తెచ్చారు. అవి బాబాకు నైవేద్యంగా సమర్పించాను. బాబా తిన్నట్టుగా కేక్ మీద చీలికలు కూడా కనబడ్డాయి. అందరూ ఎంతో ఆనంద పడ్డారు.  
         Image result for images of saibaba gayatri mantra japa

బాబా ప్రసాదం తీసుకొని అందరూ వెళ్లిపోయారు. నేను ఆ బాబా మందిరం నుంచి బయటికి వచ్చేసరికి  ఒక్కరు కూడా లేరు. ఎలా వచ్చారో, వాళ్ళు ఎవరో, అంత త్వరగా ఎలా వెళ్ళారో.. అంతా బాబాకే తెలియాలి. నా జీవితంలో జరిగిన అద్భుతమైన లీల ఇది.  విశ్వశాంతి కోసం చేసే ఈ దైవకార్యం లో సాయి బాబా సహాయకారిగా ఉంటారని  నేను ఘంటాపథం గా చెప్పగలను.
 "సర్వం సాయి నాధార్పణమస్తు"....మాధవి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

నేనే నీ చెంతకు వస్తాను

$
0
0
      Image result for images of shirdi wale sai baba      
 Image result for images of  pink rose hd

27.11.2019  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు పంపించిన మరొక అధ్భుతమయిన బాబా చమత్కారాన్ని తెలుసుకుందాము.  మనసులో  బాబాను చూడాలి, చూడాలి అనే తపన ఉండాలే గాని బాబా స్పందించకుండా ఉండగలరా?  ఆయన ఏదో విధంగా, మనం ఊహించని రీతిలో దర్శనమిస్తారనే విషయం ఇప్పుడు మీరు చదవబోతున్న లీల ద్వారా గ్రహించగలరు.


నేనే నీ చెంతకు వస్తాను

"ఓం సాయి రాం"సాయి బంధువులు అందరికి.
  ఇప్పుడు నేను చెప్పబోయే బాబా లీల నేను సంబల్పూర్ లో ఉద్యోగం చేస్తున్న రోజులు.  మా ఆఫీస్ లో పనిచేసే అబ్బాయికి బాబా కలిగించిన అధ్భుతమయిన అనుభవం. సాయి సర్వాంతర్యామి,అని,సర్వభూతాత్మకుడని  చెప్పకనే చెప్పిన లీల.





పోయిన సంవత్సరం అనగా 2018 సాయిబాబా వారి శతాబ్ది ఉత్సవాలకు ముందు జరిగిన లీల.  2018 సెప్టెంబర్ నెలలో చంద్రునిలో బాబావారు కనపడ్డారని అందరూ చూసారు. వాట్సాప్ లో ఫేస్ బుక్ లో అన్నిటిలో వచ్చింది. అది మన అందరికి తెలుసు. అప్పుడు నేను సంబల్పూర్ లో ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేస్తున్నాను. సదాశివ అని ఒక అబ్బాయి,చాలా బీదవాడు. మా ఆఫీస్ లో పని చేసేవాడు. బాబా వారికి చాలా భక్తుడు. సెప్టెంబర్ నెలలో చంద్రునిలో బాబాను అందరూ చూసారు. 
     Image result for images of baba in moon
నేను కూడా చూసాను. అతనికి కూడా ఫోన్ చేసి, "సదాచంద్రునిలో బాబావారి దర్శనం అవుతూవుందినువ్వు కూడా  చూడు"  అని రాత్రి 9 గంటలకు చెప్పాను.  వాడు చూడటానికి బయటికి వచ్చాడు. పాపం వాడికి కనపడలేదు.  అదే బాబా వారి లీల. అతను చాలా  బాధ పడ్డాడు తరువాత రోజు ఆఫీస్ లో కనపడినప్పుడు  మేడం, నాకు కనపడలేదునేను మంచి భక్తుడిని కాదేమో"అని వేదన పడ్డాడు. నేను వాడి బాధ చూడలేక "ఏదో రూపంలో రేపు కనపడతాడులే,బాధ పడకు"అని చెప్పాను.  కాదు,బాబానే నాతో చెప్పించారేమో మరి.  వాడికి ఒక చిన్న లేడీస్ కార్నర్ షాప్ ఉంది.  ఉదయం 6 .00 గం. నుంచి మధ్యాహ్నం  2.00. వరకు ఆఫీస్ లో పని చేస్తాడు.  మధ్యాహ్నం 3 గం. నుంచి  రాత్రి 9 గం. వరకు షాప్ లో ఉంటాడు. తరువాత రోజు సంబల్పూర్ లో కుండపోతగా వర్షం పడింది.  రెండు రోజులు అలా పడుతూనే ఉంది. ఇంక చంద్రుడు రాలేదు. బాబావారు రాలేదు. వాడి కోరిక అలాగే ఉండి పోయింది. అలా బాధ పడుతూనే వున్నాడు. ఇంతలో వాడు షాప్ లో కూచొని ఉండగాషాప్ ముందు ఒక పెద్ద సైజ్ బ్యానర్ ఒకటి ఆ వాన నీటిలో తేలుతూ వచ్చి వాడి షాప్ ముందు ఆగింది.  వాననీళ్లు విపరీతంగా కాలువలై ప్రవహిస్తున్నాయి. కానీ ఆ బ్యానర్ మాత్రం వాడి షాప్ ముందు ఆగిపోయింది.  వాడు అంత వానలో షాప్ తెరిచి చూసాడు"ఏమిటి ఇదిఅస్సలు పోవటం లేదు అని,చూస్తే అది పెద్ద బాబా ఫోటో"ఇంక వాడు ఆ ఫోటో చూసి ఆగలేక పోయాడు. కళ్ళలో నీళ్లతో నాకు ఫోన్ చేసి అంతా వివరంగా చెప్పాడు. అప్పుడు నేను అన్నాను,"చంద్రుడిలో చూడకుంటే ఏమి సదా,బాబా ప్రవహించే నీటిలో నీ చేతికి అందినాడు,ఇంక బాధ పడకు"అన్నాను. 
            Image result for images of baba poster in rain water
ఈ లీలను ప్రతి వాళ్ళు అర్థం చేసుకోండి. బాబా తత్వం అర్థం అవుతుంది. ఇంతకన్నా నేను ఏమి చెప్పలేను."ఓం సర్వాంతర్యామినే నమః"అని మాత్రం బాబా ను నమ్ముదాము..
 "సర్వం సాయి నాధార్పణ మస్తు."

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 6 వ.భాగమ్

$
0
0
        Image result for images of shirdisaibaba old photos
                          Image result for images of rose flower old
28.11.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 6 .భాగమ్

శ్రీ సాయిబానిసగారు నిజజీవితంలో 1993 లో షిరిడీ యాత్ర చేసారు.  షిరిడీలో చావడిలో శ్రీశివనేశన్ స్వామీజీ గారిని దర్శించుకొన్నారు
         Image result for images of sivanesan svamiji
ఆయన చావడిలో భజన చేస్తున్న సమయంలో ఆయన శిష్యురాలు ఒక నల్ల జాతి స్త్రీపేరు క్రిస్టియాన సాయిబానిసగారితో మాట్లాడుతు తనకు ఆకలిగా ఉన్నది అని తనకు ప్రక్కనేఉన్న హోటల్ లో పూరీకూర కొనిపెట్టమని కోరింది.  



సాయిబానిసగారు ఆమె చిన్న కోరికను తీర్చారు.  ఆమె సంతోషముగా తిరిగి శివనేశన్ స్వామీజీ గారి వద్దకు వచ్చి శ్రీసాయి భజనలు చేయసాగింది.  ఆ స్త్రీ తిరిగి 2019 వ సంవత్సరములో సాయిబానిసగారికి స్వప్నదర్శనము ఇచ్చి తనతో ఆయనను ఆఫ్రికా ఖండములోని కాంగో అనే చిన్నదేశానికి తీసుకొనివెళ్లింది.  ఆ అడవిలోని గ్రామము తన పూర్వీకులది అని చెప్పి అక్కడి అడవిజాతివారికి మరియు గ్రామవాసులకు పరిచయము చేస్తూ వీరిపేరు సాయి కృపానందజీ అని తెలియచేసింది.  ఆ గ్రామములో కొందరు తెలుగు భాష తెలిసిన నల్లజాతీయులు ఉన్నారు.  ఆగ్రామవాసులు సాయిబానిసగారికి సకల మర్యాదలు చేసారు.  ఆ తరవాత అక్కడ సత్సంగము ఏర్పాటు చేసారు.

ఆ సత్సంగములో ఆయన తూర్పుదిక్కు ఎటువైపు అని వారిని అడిగారు.  కొందరు దిక్సూచి తేవడానికి వెళ్లారు.  ఇంతలో ఆ సత్సంగములో కాళ్ళకు పోలియోవ్యాధితో బాధపడుతున్న ఒక యువకుడు తెలుగుభాషలో సాయిబానిసగారితో భగవంతుని గురించి మాట్లాడేవారికి దిక్కులుతిధివార నక్షత్రాలు అవసరములేదు.  మీరు మీఉపన్యాసమును ప్రారంభించండి అని గట్టిగా అరచాడు.  సాయిబానిసగారు ఆశ్చర్యముతో ఆ యువకుడి దగ్గరకు వెళ్ళి చూసారు.  ఆ యువకుడు పూర్వజన్మలో ఆంధ్రరాష్ట్రములోని ముమ్మిడివరం బాలయోగి
          Image result for images of mummidivaram balayogi
సాయిబానిసగారు ఆ పోలియోగ్రస్తుడయిన యువకునికి పాదనమస్కారము చేసి అక్కడ ఉన్న గ్రామవాసులకు భగవంతుడు ఈయువకుని రూపములో మీమధ్యనే ఉన్నాడు.  మీరు ఈ యుకుని ఆదేశాలు పాటించుతూ భగవంతుని దర్శించండి అన్నారు.

అక్కడ ఉన్న షిరిడీసాయి భక్తురాలు క్రిష్టియానా సాయిబానిసగారిని మీరు శ్రీసాయి కృపానంద్ గా మరుజన్మలో ఆఫ్రికా ఖండములో శ్రీషిరిడీసాయి తత్త్వప్రచారము చేయాలి అని ఆదేశించారు.

ఈ మానవాళిలో మానవత్వానికి మారుపేరు శ్రీషిరిడీసాయిబాబా.  తన భక్తురాలు బయిజాబాయి ఋణము తీర్చుకోవడానికి ఆమె కుమారుని ప్రాణాన్ని కాపాడటానికి తన ప్రాణాన్ని ఇచ్చిన మహాత్యాగి శ్రీసాయి.  ఈ విషయాలు శ్రీసాయి సత్ చరిత్రలో విపులముగా చెప్పబడినది.

ఇక సాయిబానిస జీవితంలో ఒకనాటి రాత్రి కలలో బాబావారు శ్రీసాయిబానిసను హిందీ సినిమా గైడ్ ను చూడమని ఆదేశించారు.  

          Image result for images of guide hindi movie
బాబా ఆదేశానుసారం సాయిబానిస గారు సికింద్రాబాద్ లో ప్రదర్శించబడుతున్న గైడ్ హిందీ సినిమా చూడటానికి వెళ్ళారు.  ఆ సినిమాలో కధానాయకుడు రాజస్థాన్ లో వర్షాలు లేక పంటలు లేక కరువు కాటకాలతో బాధపడుతున్న ఆ గ్రామప్రజలను చూసి వారికోసం దైవప్రార్ధనలు చేస్తూ తను ఉపవాసదీక్ష చేస్తు ఆఖరులో భగవంతుని దయతో వర్షాలు పడుతున్న సమయంలో ఆ కధానాయకుడు తన ప్రాణాలను వదిలాడు.
   (గైడ్ చిత్రంలో దీనికి సంబంధించిన సన్నివేశాన్ని చూడండి)


మానవత్వముతో తోటిమానవుల ప్రాణాలు కాపాడినవారు 1918 .సంవత్సరములో తన శరీరాన్ని వదలిన శ్రీషిరిడీసాయినాధుల వారిని గైడ్ సినిమాలో కధానాయకుడు రాజు పాత్రలో శ్రీసాయిని చూడగలిగానని సాయిబానిసగారు స్వయంగా చెప్పారు.  ఆయన దృష్టిలో గైడ్ సినిమాలో కధానాయకుడుగా నటించిన ప్రఖ్యాత నటుడు శ్రీదేవానంద్ ధన్యజీవి.  గైడ్ సినీకధను రాసిన రచయిత చిరంజీవిగా నిలిచిపోతాడు.
(ఇంకా ఉన్నాయి)
(తరువాయి భాగం వచ్చే ఆదివారమ్)

కళ్ళు తెరచి చూసిన బాబా

$
0
0
     Image result for images of shirdi sai baba
        Image result for images of rose hd

30.11.2019  శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు పంపించిన మరొక లీలను ప్రచురిస్తున్నాను

కళ్ళు తెరచి చూసిన బాబా

"ఓం సాయి రాం"సాయి బంధువులు అందరికి.  ఇప్పుడు నేను రాయబోయే లీల నా జీవితం లొనే జరిగింది.  బాబా నాకు ఇచ్చిన అద్భుతమైన అనుభవం.  నవగురువార వ్రతం చేసేరోజుల్లో జరిగింది.  ఆ రోజుల్లో  తెలీకుండానే నాకు సంబల్పూర్కి  బదిలీఅయింది.  నన్ను ఆఫీస్ నుంచి రిలీవ్ కూడా చేసారు.  ఏమి కారణం లేదు.నాకు చాలా బాధ వేసింది.అప్పుడే మా వారు సిల్చేర్ అనే ఊరు నుంచి భువనేశ్వర్ కి బదిలీయివచ్చారు.మేము ఇద్దరమూ నాలుగు సంవత్సరాలు వేరుగా ఉన్నాము.మళ్ళీ వెంటనే నన్ను వేరే ఊరికి బదిలీ చేశారు.  ప్రభుత్వ ఉద్యోగంచేసేవాళ్లకు ఈ కష్టాలు తప్పవు.  ఇంక తప్పదు అని నేను సంబల్పూర్ వెళ్లి జాయిన్ అయ్యాను.ఒక గురువారం రోజు నవగురువార వ్రతం చేస్తున్నాను.మనసంతా బాధగా ఉంది."బాబాతో మనసులో అంటున్నాను బాబా.."నువ్వు నన్ను చూడు,నేను నిన్ను చూస్తాను"అనే నీ మాట నిజం కాదు.ఎందుకు భక్తులకుఈ వాగ్దానాలు చేస్తావు? ఏమన్నా అంటే,నీ కర్మఫలం అంటావు, ఎందుకు బాబా? అని ఏదో,ఏదో..మనసులో అనుకుంటున్నాను.  ఇంకో పక్కన బాబా పూజ కూడా చేస్తున్నాను.  ఇంతలో విచిత్రం గా నేను పూజ చేసి బాబా విగ్రహం లో బాబా కళ్ళు తెరిచారు.  ఆ ఫోటో కింద జత చేస్తున్నాను. 

అసలు నా శరీరం గగుర్పొడిచింది.నన్ను నమ్మండి.  బాబా నిజంగానే మనల్ని చూస్తున్నాడు.  మన బాధలు వింటున్నారు.  సమయం వచ్చినప్పుడు సమాధానం ఇస్తారు.బాబా చెప్పిన ఏ ఒక్కమాట పొల్లు పోదు.జరిగితీరుతుంది.కావలసినది శ్రద్ధ,సబూరి.  మనము..ఇవ్వవలసినది ఆయన అడిగిన దక్షిణ మనము.బాబా తన మాటకు కట్టుబడి వున్నడని నాకు అప్పుడు అర్థం అయింది.
"సర్వం సాయి నాధార్పణమస్తు"
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 7 వ.భాగమ్

$
0
0
  Image result for images of shirdisaibaba old photos
                    Image result for images of rose garden

01.12.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 7 .భాగమ్

శ్రీ సాయి సత్ చరిత్ర 7 అధ్యాయములో శ్రీసాయికి సన్మానములు అన్నచో అయిష్టములు అని స్పష్టముగా చెప్పబడినది.  కాని ఈనాడు అనేకమంది సాయితత్త్వప్రచారకులు సాయి పేరిట పీఠాధిపతులుతమ జీవితాలలో అనేకసార్లు సాయిభక్తులతో సన్మానము చేయించుకొని తమ కీర్తి కండూతిని తీర్చుకొనుచున్నారు.  ఈ విషయమై నేను సాయిబానిసగారిని అడిగినపుడు ఆయన ఇచ్చిన సమాధానము.



1989సంవత్సరం తరువాత తాను ఎవరికీ సన్మానము చేయలేదుతను ఎవరిచేత సన్మానము చేయించుకోలేదు అని అన్నారు.  సాయిబానిసగారికి శ్రీసాయి 1988 ముందు ఆయన గడిపిన జీవితమును చూపి  “నీవు 1974 లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల పేరిట కీర్తిశేషులు జలగం వెంగళరావు గారుమండలి వెంకట కృష్ణారావు గారు మరియు శ్రీ వావిలాలా గోపాల కృష్ణయ్యగారితో కలసి పని చేసి అనేకమంది రాజకీయ నాయకులుమరియు సినీ ప్రముఖులకు సన్మానము చేసి ఆనందించావు.  ఈనాడు వారందరు కాలగర్భములో కలసిపోయారు.  ఈనాడు నీకు సన్మానము చేయడానికి ఎవరూ లేరు.  మానవజీవితములో మంచిపనులు చేసి కీర్తిప్రతిష్టలను పొందడంలో తప్పు లేదు.  కానివాటిని ఆసరా చేసుకొని సన్మానము పొందటము తమ పతనానికి మూలమవుతుందని గ్రహించవలెను.  నాకు తెలుసు నీవు 33 సంవత్సరములు భారత ప్రభుత్వసేవలో ఉండి పదవీ విరమణ చేసిన రోజున నీకు సన్మానము చేయదలచారు నీమిత్రులు.  కాని నీవు ఆ సన్మాన కార్యక్రమాన్ని సున్నితంగా తిరస్కరించావు.  మానవ జీవితములో నీవు ఎంత గొప్ప పదవులను పొందినా అవి శాశ్వతము కావు.  నీవు మరణించిన తర్వాత భగవంతుని దర్బారులో ఏమి సన్మానము పొందుతావు అనేది ఆలోచించు.  అందుచేత నీజీవితములో ధన సంపాదన పూర్తి చేసి వృధ్ధాప్యములో అడుగుపెట్టిన తర్వాత భగవంతుని దర్బారులో నీకు జరగబోయే సన్మానము గురించి ఆలోచించుతు నీశేష జీవితాన్ని పూర్తిచేసి నీ గమ్యాన్ని చేరుకో అని బాబా సాయిబానిసగారికి బాబా తెలియ చేసిన విషయాన్ని మీ అందరికీ తెలియ పరుస్తున్నాను.

శ్రీ సాయి సత్ చరిత్ర 9 .అధ్యాయములో సాయిభక్తుడు బాలారామ్ మాన్ కర్ తన తండ్రి ఉత్తరక్రియలను షిరిడీలో జరుపుకొనుటకు షిరిడీ చేరుకొని బాబా దర్శనము చేసుకొని బాబాకు ఒక పాలకోవాను (పేడానైవేద్యముగా పెట్టిన విషయం సాయిభక్తులందరికీ జ్ఞాపకము యుండును.  బాబా తన భక్తుడు తండ్రి కర్మకాండ దినములు పూర్తికాకుండా ప్రేమతో ఇచ్చిన పేడాను సంతోషముగా స్వీకరించారు.  బాబా మూఢాచారములకు వ్యతిరేకి.

ఇక సాయిబానిసగారికి 2018 లో జరిగిన సంఘటన బాబా ఆయనకు స్వప్నములో చూపిన వివరాలు తెలియచేస్తాను.

సాయిబానిసగారు తన సోదరుని కర్మకాండ దినములు పూర్తికాకుండా ఒకరోజున మధ్యాహ్నము ఆకలితో తన పినతల్లి ఇంటికి వచ్చి భోజనము పెట్టమని కోరారు.  ఆమె ఆయనను తన ఇంటివసారాలో నేలమీద కూర్చుండబెట్టి విస్తరాకులో భోజనం పెట్టింది.  నేను ఈవిధమైయిన పద్దతికి ఆశ్చర్యపడి నాకు నీవంటింటిలో భోజనము పెట్టేదానివి ఇదివరలోమరి ఈనాడు నన్ను ఒక అంటరానివానిగా భావించి నీఇంటి వసారాలో నేలమీద విస్తరాకులో భోజనం పెట్టడము నీకు న్యాయమా అని అడిగారు.  దానికి ఆమె అన్న మాటలు,..

నీ సోదరుడు చనిపోయి ఇంకా 12 రోజులు పూర్తికాలేదునీవు నీకుటుంబ సభ్యులు మైలవారు.  అందుచేత నీకు నావంట గదిలో భోజనము పెట్టలేను.  ఇది మడిఆచారమునకు సంబంధించిన వ్యవహారము.  అనాదిగా వస్తున్న సాంప్రదాయము అని అంది.  సాయిబానిసగారు ఆమెతో ఎక్కువమాట్లాడకుండా ఆమె, వసారాలో విస్తరాకులో పెట్టిన భోజనము చేసిఆ ఎంగిలి విస్తారాకును స్వయంగా తీసి దానిని రోడ్డుమీద ఉన్న మునిసిపాలిటీవారి చెత్త కుండీలో వేసారు.

ఈ సందర్భంగా సాయిబానిసగారు చెప్పిన విషయాలు

విచిత్రమేమంటే నా పినతల్లి కూడా సాయిభక్తురాలు.  కాని సాయి సత్ చరిత్రను సరిగా అవగాహన చేసుకోలేదు.  తాను నమ్ముకొన్న మూఢాచారాలను పాటించటము నాకు బాధకలిగించింది.  ఆమె వంటి సాయిభక్తుల మనసులో మూఢాచారాలను తొలగించమని ఆ సాయినాధులవారిని వేడుకొన్నానని శ్రీ సాయిబానిసగారు నాకు చెప్పారు…   త్యాగరాజు
           Image result for images of shirdisaibaba old samadhi
షిరిడీలోని బూటీవాడాలోని భూగృహంలో శ్రీసాయిబాబా పార్ధివ శరీరాన్ని సమాధి చేసారు అనే విషయం సాయిభక్తులందరికి తెలిసినదే.  భూగృహములోని సాయిసమాధిని దర్శించి తమ చేతులతో తాకి తరించాలని అనేకమంది సాయిభక్తులు కోరుకొంటూ యుంటారు.  అటువంటి భక్తులలో శ్రీసాయిబానిస ఒకరు.

సాయిబానిసగారు 24.10.2019 నాడు రాత్రి ధ్యానములో యుండగా బాబాగారు దర్శనము ఇచ్చి 2070 .సంవత్సరములో తన భక్తుల కోరిక నెరవేరుతుంది అని అన్నారు.


సాయిభక్తుల కోరికపై షిరిడీసాయి సంస్థానమువారు బూటీవాడాలోని భూగృహానికి రెండు ఇనుప సొరంగాలను ఏర్పాటు చేస్తారుభూగృహములోనికి సాయిభక్తులు వెళ్ళి శ్రీసాయి సమాధిని దర్శించి తరించుతారు.  ఆ సమాధి గదికి సంస్థానమువారు శ్రీసాయిశక్తి స్థల్ అనే నామకరణం చేస్తారు.  నీవు మరుజన్మలో 2070.సంవత్సరములో షిరిడీకి వచ్చి శ్రీసాయిశక్తి స్థల్ ను దర్శించి నీకోరిక తీర్చుకొంటావు అని బాబా అన్నారు.
(ఇంకా ఉన్నాయి)
(మరలా వచ్చే గురువారమ్)
(రేపటి సంచికలో నాకు, నా పటానికి భేదం లేదు)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

నా పటానికి నాకు భేదం లేదు

$
0
0
    Image result for images of shirdi sai baba
  Image result for images of light blue rose

02.12.2019  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నా పటానికి నాకు భేదం లేదు

ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు పంపించిన ఇందుమిశ్రగారి అనుభవాన్ని ప్రచురిస్తున్నాను.
శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా హోళి పండగ నాడు హేమాడ్ పంత్ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి, పటము రూపములో వచ్చారు.  దీనిని బట్టి బాబా పటానికి, ఆయనకు భేదం లేదనే విషయాన్నిశ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసిన మనమందరము ఇప్పటికే గ్రహించుకున్నాము.


నా పటానికి నాకు భేదం లేదు

"ఓం సాయి రాం"సాయి బంధువులు అందరికి.

ఈరోజు మద్యప్రదేశ్ నుంచి ఇందుమిశ్ర గారి అనుభవం ఆమె మాటల్లోనే విందాము.


    సాయి నాథుడు షిర్డీ లొనే వున్నారు అనుకుంటే మనం చాలా పొరపడుతున్నట్లే. ఆయన అన్ని చోట్ల ఉన్నారు, ప్రతిక్షణంసప్తసముద్రాల అవతల కూడాఎవరు ఎక్కడ నుంచి పిలిచిన అక్కడికి వెను వెంటనే పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారు.ఎన్ని సార్లు ఆయన నా మొర విన్నాడో, నేను లెక్కల్లో చెప్పలేను.  వాటిల్లో అన్నిటికన్నా నా మనసు కలిచివేసే కథ మీ ముందు ఉంచుతున్నాను.
   
ఒకసారి మా వారికి ఆరోగ్యం బాగా పాడయింది.  పరిస్థితి విషమించింది.  అందరూ ఆయన జీవితం మీద ఆశ వదిలేసుకున్నారు.అప్పుడు నాకు కొత్తగా పెళ్ళయి అత్తవారింటిలో అడుగు పెట్టాను.ఇంక నా పరిస్థితి మీరే ఆలోచించండి.  నన్ను పెండ్లి చేసుకున్నందు వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణీస్తోంది అని అందరూ అనడం మొదలుపెట్టారు.  మా అత్తగారింటివాళ్ళందరూ సామాజిక పరంపర,అంవిశ్వాసం అనే సంకెళ్లలో ఉన్నవాళ్లు.నన్ను కూడా ఆ సంకెళ్లలో బంధించేశారు.సాయి పూజ,సాయి భక్తిఅంటే ఏమిటో కూడా తెలియదు వాళ్లకు.  నాకు పెళ్ళయిఅత్తగారింటికివచ్చేటప్పుడు నాతో పాటు ఒక బాబా ఫోటో తెచ్చుకున్నాను.నా గదిలో పెట్టుకొని రోజూకొంచెం పూజ చేసేదాన్ని.ఇలాంటి పరిస్థితి లో బాబా మాత్రమే నాకు అండగా ఉంటాడని నమ్మేదాన్ని.
   
మా వారికి ఒకరోజు భయంకరమైన తలనొప్పి,వాంతులు,య్యాయి.మా అత్తగారు చాలా భయపడి పోయి,నా వైపు చూసి అరవడం మొదలు పెట్టింది. 'ఏమి,నిలబడుకొని తమాషా చూస్తావా! ఎప్పుడు సాయి,సాయి.అని అరుస్తూవుంటావు కదా, ఇప్పుడు పిలు నీ సాయిని, ఎక్కడ పోయినాడు, రమ్మను నీ సాయి ని" అని నా మీద విరుచుకు పడింది

అప్పుడు ఆమె ఉగ్రరూపాన్ని చూసి ,నేను భయపడి, బాబా ఫోటో దగ్గరికి వెళ్లి,"బాబా,రా తండ్రి,ఇప్పుడు పరీక్ష సమయం,నాకే కాదు,నీకు కూడానువ్వు సర్వే,సర్వత్రా ఉన్నావని, నువ్వే నిరూపించుకోవాలి,నాకు అంత శక్తి లేదు స్వామి"అని నా మనసులొనే బాబాను వేడుకొన్నాను.  విభూతి కొంచెం నీళ్లలో కలిపి మా వారికి తాగించాను.  ఇంతలో పోస్టుమాన్ వచ్చాడు. వాడి చేతిలో పోస్టుకార్డు సైజ్ బాబా ఫోటోఅది.బాబా ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న ఫొటో అది. 
           Image result for images of baba ashirwad photo

 ఒక విభూతి పాకెట్ కూడా వచ్చింది ఫొటోతోపాటుగా.  పైగా దానిమీద లా రాసి ఉంది,  "నా ఫోటోను కేవలం చిత్రపటంమాత్రమేఅనుకోకు, నా ఫోటో ఎక్కడ ఉంటేఅక్కడనేను ఉన్నట్లే"ఇదంతా చూసి,నేనేకాదు, మా అత్తగారు, ఇంట్లో ఉన్నవాళ్లు అందరూ ఆశ్చర్య పోయారు.ఎవరు పంపారోనాకు తెలీదు.బాబా తన జీవిత కాలంలో చాలా మంది ఇంటికి చిత్రపట రూపంలో వెళ్లినట్లు మనం సాయి చరిత్ర లో చదువుతాము. నా హృదయంలో నుంచి వచ్చిన నా పిలుపు మన్నించి బాబా స్వయంగావచ్చారు, అదీ ఇలాంటప్పుడు

నీ సాయి ఉన్నాడా, లేడా.. అని మా అత్తగారు నన్ను నిలదీసినప్పుడు.చూసారా బాబా కృప..చిత్రపటం రావటం..అంటే బాబా వచ్చినట్లే కదా.. ఆరోజు నుంచి మా వారి ఆరోగ్యం కుదుట పడింది.నాకు  మా అత్తగారి ఇంట్లో మంచి స్థానం లభించింది. అంతాబాబా కృపనే, అని మా ఇంటిల్లిపాది నమ్ముతున్నాము.మీరు నమ్మండి"
  ఇది అండి ఇందుమిశ్రా,మద్యప్రదేశ్..గారి కథ.
"సర్వం సాయి నాధార్పణమస్థు"

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


మానవ సేవే మాధవ సేవ

$
0
0

      Image result for images of shirdi saibaba doing seva
                 Image result for images of rose hd

03.12.2019 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మానవ సేవే మాధవ సేవ

ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు తమ అనుభవాన్ని పంపించారు.  మన చిన్నతనంనుండి మనమందరం మానవ సేవే మాధవ సేవ అనే మాటను వింటూ ఉన్నాము.  అనగా తోటి మానవుడికి సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్లే.  అనగా అందరిలోను భగవంతుడిని చూడు, వారికి సేవ చెయ్యి అని భగవంతుడె చెప్పాడు.  అటువంటి సేవ చేసే వ్యక్తి గురించి మనందరికి వివరిస్తున్నారు.

ఓం సాయి రాం"సాయి బంధువులకు.

ఇప్పుడు నేను చెప్పబోయే లీల చాలా బాగుంటుంది. ఇది నిజమా! అనిపిస్తుంది.
  
"  సేవ"అంటే ఏమిటిఅని ఎవరినన్న మనం అడిగితే మనం అన్నదానం అని కొందరుకొందరు గుడి కట్టించామనికొందరు గుడిలో సేవ చేశామనిఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. కానీ నాకు తెలిసిందివిన్నది  ,"మానవ సేవే మాధవ సేవ"అని. ఎలా అంటేఅదే నేను చెప్పబోతున్నాను.
    


 ఈ మధ్య కాలంలో నా జీవితం అస్తవ్యస్తం అయింది. మా వారికి పేరాలిసిస్ వచ్చింది. నాకు వేరే ఊరికి బదిలీ అయింది. భక్తులకు పరీక్ష పెట్టడం అంటేబాబానే పెట్టాలి.  అలా మా జీవితాలు సుడిగుండంలో చుట్టుకున్నాయి.  కానీ బాబా మీద నమ్మకం నేను ఒక్కరోజు కూడా వదలలేదు.

   
ఇంక తప్పనిసరి పరిస్థితిలో మా వారికి ఫిజియోథెరపి చేయించాలి. భువనేశ్వర్   లో అంత మంచి వాళ్ళు లేరు ఫిజియోథెరపి  చేయించడానికి. బరంపురం అనే ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి ఫీజియోథెరపి చాలా బాగా చేస్తాడు. ఎంతో ఆశతో ఆయన దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక విచిత్రం చూసాను. ఏమిటి అంటే అతను పని మొదలుపెట్టడానికి  ముందు ప్రతిసారి
"ఓం సాయి రాం"అంటాడు. అలా సాయిరాం అంటూనే పని చేస్తాడు. నాలుగు రోజులు చూసాను. ఐదోరోజు ఇక ఉండబట్టలేక ఆడిగేసాను"సర్మీరు ప్రతి కదలిక ముందు సాయిరాం అంటారు. మీరు బాబాభక్తులాఅని. దానికి ఆయన చాలా నవ్వినారు. అప్పుడు ఆయన మొదటిసారి తన అనుభవాన్ని నాతో పంచుకున్నారు. ఏమిటి అంటే,15 సంవత్సరాల కిందట ఒకరోజు బాబా ఆయన దగ్గరికి వచ్చారట. వచ్చి, " చూడునువ్వు ఈ ఫీజియోథెరపీతో చాలా మందికి బాగు చేస్తున్నావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తేనేను ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాను"అన్నారట. అది విని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బాబా ఇలా కూడా చేస్తారాఅనిపించింది. చూడండి..బాబా దర్శనం కోసం ఎంతోమంది తపించిపోతూ ఉంటారు. కానీ బాబారోగులకు సేవ చేసేవాళ్ళ కోసందివి నుంచి భువికి దిగి వచ్చి దర్శనం ఇస్తారు. ఇంతకూ ముఖ్యవిషయం ఏమిటి అంటేఆయన డాక్టర్ కాదు ఒక స్కూల్ టీచర్. కానీ న్యూరోలజిలో మంచి పట్టు ఉంది. పేదవారికి ఉచితంగా  చేస్తాడు. ఆయన దగ్గరికి విదేశాల నుంచి కూడా వస్తారు. కానీ ప్రచారాలంటే ఇష్టపడే ఈరోజుల్లో ఆయనకు ప్రచారం ఇష్టం లేదు. ఎవ్వరు ఆయన దగ్గరికి వచ్చినా బాబానే పంపినారు అనుకోని సేవ చేస్తాడు. అలా మానవులకు సేవ చేసిమాధవుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఆయనను కలవడం నా అదృష్టంగా భావిస్తాను. మా వారికి మాటలు కూడా పోయినాయి. ఆయన  మావారిచేత ముందు "ఓం సాయి రాం"అనే అనిపించారు. ఇదండీ ఒక భక్తుడు భగవంతునికి చేసే సేవ
 " సర్వం సాయి నాధార్పణమస్థు"

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)





ఆత్మ పరమాత్మ ఏకమయితే....

$
0
0

b   Image result for images of shirdi dwarakamayi
           Image result for images of brown rose

04.12.2019  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు, ఆనందభారతి ఢిల్లీ గారు పంపించిన అనుభవాన్ని పంపించారు. దానిని యధాతధంగా ప్రచురిస్తున్నాను.

ఆత్మ పరమాత్మ ఏకమయితే....

( సాయినామస్మరణలోని మాధుర్యాన్ని, అనుభవాన్ని దీని ద్వారా మనం గ్రహించుకోగలం. కొంతమందికి ధ్యానం చేసుకొనే సమయంలో కొన్ని కొన్ని అనుభూతులు కలగడం, కొన్ని దృశ్యాలు కనిపించడం సహజం.  అటువంటి అనుభూతులకు ఎటువంటి తార్కాణాలు ఉండవు.  కేవలం వాటిని అనుభవించినవారికి మాత్రమే బోధపడుతుంది.  ప్రయత్నించి చూడండి.  కాని ఏవో అనుభూతులు కలగాలని, దృశ్యాలు కనిపించాలనే ఉత్సుకతతో మాత్రం చేయవద్దు…  ఇది అనుభవంతో చెపుతున్న మాట... త్యాగరాజు)

ఇక ఆనందభారతి గారి అనుభూతిని చదవండి...

"ఓం శ్రీ సాయి రాం"సాయి బంధువులందరికి.
  అన్నిటికన్నా ముందు నేను శ్రీ సాయినాథ్ చరణ కమలాలకు నా వినమ్ర నమస్కారములు సమర్పిస్తున్నాను.


శ్రీ సాయినాథుని అనంతమైన కృప నాపై ఉంది కాబట్టి నాకు అలౌకికమైన అనుభవాలు కలుగుతున్నాయి.  శ్రీసాయి లీలలు అగాధాలు.  నాలాంటి ఒక సాధారణమైన భక్తులు వాటిని వర్ణించలేరు.ఆయన లీలలు రాయాలంటే బాబా కృప ఉండాలి.  అనేక జన్మల పుణ్యం ఉంటేనే మనం ఆయన భక్తిఆయన లీలలు రాసే శక్తి ప్రాప్తిస్తాయి.  నేను ఆగస్టులో (2007) నా ఆఫీసర్ అగర్వాల్.మరియు ఆయన సతీమణి ఉత్పల్ గారితో షిర్డీ దర్శించే అదృష్టం కలిగింది.  అప్పటికే నేను ఎన్నోసార్లు షిర్డీ యాత్ర చేసాను.
   
సాయినాథ్ మహరాజ్ తన భాండాగారం నుంచి నాకు ఎన్నో అమూల్యమైన రత్నాలను ప్రసాదించారు.  సాయిబాబా భక్తులకుబాబా సమాధి తరువాత కూడా అనంతమైన లీలలు నిరంతరం జరుగుతున్నాయి అంటేనమ్మక తప్పదు.
 
ఆయన సూక్ష్మ శరీరంలో ఇప్పటికి తనను నమ్మిన భక్తులకు ఎన్నో అనుభవాలనుఅందిస్తున్నారు.దానిలో ఒకటి నేను చెప్పబోతున్నాను.మేము షిర్డీ వెళ్లిన రోజు రాత్రి11.45 నిమిషాలకు నేను, ఇంకో నలుగురముద్వారకామాయిలో కూర్చొని ఉన్నాము.  
         Image result for images of shirdi dwarakamayi

నేను సాయిస్మరణ చేసుకుంటున్నాను.  మిగిలినవారుసాయిచరిత్ర చదువుకుంటున్నారు.ద్వారకామాయి వాతావరణం ప్రశాంతంగా ఉంది.  నేను సాయినామస్మరణ మొదలు పెట్టి ఐదు నిమిషాలు అయివుంటుంది.నాచెవిలో ఏవో దివ్యమైన శబ్దతరంగాలు వినిపిస్తున్నాయి.అలౌకికమైన ఆత్మానందం కలిగింది.  చాలా సేపు అలా వినపడుతున్నాయి.  నా చెవిలో ఎవరో అమృతం పోస్తున్నారుఅనిపించేలాగా ఉంది.  నా శరీరం,మనసు రోమాంచితమైనాయి.నేను ఆశబ్ద ధ్వనితో దైవలోకం చేరుకున్నాను అనిపించింది.ఇంక నన్ను నేను ఆపుకోలేక అక్కడ ఉన్న భక్తులందరినిచూసాను.  ఎవరన్నా నామస్మరణ చేస్తున్నారేమోఅని.  అందరూ సాయిచరిత్ర చదువుతున్నారు.ఈ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి? అని బయటికి వెళ్లి చూసాను.  ఎవ్వరు లేరు.  మళ్ళీ ద్వారకామాయిలోకి వచ్చి కూర్చున్నాను.  ఇంకా ఎక్కువగా వినపడుతున్నాయి శబ్దాలు.  అప్పుడు అనుకున్నాను"ఈ శబ్దాలు నా అంతరాత్మ నుంచి వస్తున్నాయి"అని.  ఆత్మ,పరమాత్మ ఏకం అయితే అలాంటి ఆలౌకికమైన శబ్దాలు వస్తాయి అని ఏదో పుస్తకంలో చదివాను. 
                   Image result for images of atma, paramatma
                    Image result for images of atma, paramatma

ఆధ్వనిని మనం పట్టుకోవాలిఅంతే.  నా అంతరంగం నుంచి వచ్చే ధ్వనిని నేను పట్టేసాను.  అందుకే అంటారు"సదా భగవంతుని నామస్మరణ చేస్తే మనకు నిజమైన గురువును ఆ భగవంతుడే ప్రసాదిస్తాడు"అని.  ఏ భగవంతుని ఆశీర్వాదం నాపై ఉందొ కానీ, సాయిలాంటి సద్గురు దర్శనం నాకు ద్వారకామాయిలో కలిగింది.సద్గురు కృప లేకుంటే  ఆధ్యాత్మిక ఉన్నతి అసంభవం.ధ్యాత్మిఉన్నతి లేకుంటే మనుష్యజన్మ వ్యర్థం.  ఇంతకూ నాకు వినపడిన ధ్వని తరంగాలు చెప్పలేదు కదు!  అయితే వినండి.

"ముజే సదా జీవిత్ హిజానో.. అనుభవ కరో.  సత్యకో పెహచనో'అంతే, నాకు నా సద్గురు శ్రీసాయినాథుని దర్శనం శబ్దతరంగాల ద్వారా అనుభవం అయింది.అందునా  ఆయన నివసించిన ద్వారకామాయిలో.   కొందరు భగవంతుని "ఓమ్"కారంలో కూడా దర్శిస్తారు.  నాకు బాబా దర్శనం ఈవిధంగా జరిగింది.
    ఆనంద భారతి...ఢిల్లీ
"సర్వం సాయి నాతర్పణమస్తు"

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 8 వ.భాగమ్

$
0
0

 Image result for images of Shirdisaibaba
        Image result for images of green rose hd
05.12.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 8 .భాగమ్

శ్రీ సాయి సత్ చరిత్రలో కష్టానికి కూలి అనే సంఘటన గుర్తుచేసుకొందాము.  బాబావారు ద్వారకామాయిలో ఒక రోజున నిచ్చెన తెచ్చిన కూలీవానికి రెండురూపాయలు కూలి ఇచ్చారు.  ఈవిషయము 18 & 19 అధ్యాయములో వివరముగా హేమాద్రిపంత్ వ్రాసారు

ఇదే విషయాన్ని శ్రీసాయిబానిసగారు 26.10.2019 నాడు తెల్లవారుజామున ధ్యానములో బాబాగారిని అడిగారు.  బాబా చెప్పిన వివరాలు సాయిబానిసగారికి కన్నీరు తెప్పించింది.  ఆయన చాలా బాధతో ఆవివరాలు నాకు తెలియచేసారు.

బాబా ఆదేశానుసారము నిచ్చెన తెచ్చిన వ్యక్తి షిరిడీకి రాక ముందు ఒక జమీందారు ఇంట పనివాడుగా పనిచేసేవాడు.  ఆ జమీందారు ఇంట ఆడమగ కూలీలకు భోజనము పెట్టి వెట్టిచాకిరీ చేయించుకొనేవారు.  మగవారు తమ పనిలో తప్పు చేసిన లేక పొరపాటు జరిగిన ఆకూలీవానిని పశువులను బాదినట్లుగా కఱ్ఱతో కొట్టేవారు.  ఇక ఆడ కూలీలు తప్పు చేసినా, పొరపాటు చేసినా వారిని వారి పిల్లల సమక్షములోనే కాలుతున్న కట్టెతో కాలిమీద వాలు పెట్టేవారు.

తమ తల్లికి వాతలు పెట్టడం ఆ ఆడకూలీ పిల్లలు చూసి వారు భయముతో ఏడ్చేవారు.  ఈ విధమయిన శిక్షలను అక్కడి తోటి కూలీలతో జరిపించేవారు.  జమీందారు, వాని భార్యాపిల్లలు ఈ శిక్షలను చూసి పైశాచిక ఆనందాన్ని పొందేవారు.  ఈ బాధలను తట్టుకోలేక ఈ నిచ్చెన తెచ్చిన కూలీవాడువాని భార్య ఆ జమీందారు ఇంటినుండి పారిపోయి షిరిడీకి వచ్చి నన్ను శరణువేడారు.  వారు జీవితములో ఏనాడు ఒక రోజు కూలీ రెండురూపాయలను చూడలేదు.  ఈ రోజున వానికి రెండురూపాయలు కూలీ ఇచ్చాను.  వాని కళ్ళలో ఆనందమును చూసాను.
   Image result for images of chandpatil
శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా చాంద్ పాటిల్ యొక్క తప్పిపోయిన గుఱ్ఱమును వెతికిపెట్టారనే విషయము సాయిభక్తులందరికీ గుర్తే.  ఆ తర్వాత బాబా చాంద్ పాటిల్ పెండ్లివారితో కలసి షిరిడీకి వచ్చి 1918 వరకు నివసించి షిరిడీలో మహాసమాధి చెందారు.  చాంద్ పాటిల్ గుఱ్ఱము తప్పిపోవడం, దానిని బాబా వెతికి పెట్టడము బాబా చేసిన ఒక లీలగా సాయిబానిసగారు భావిస్తారు.

అటువంటి అనుభూతిని శ్రీసాయి ఆయనకు ప్రసాదించారు.

శ్రీసాయిబానిసగారు 1955 .సంవత్సరములో తన పినతండ్రి శ్రీ యు.పి.సోమయాజులుగారి ఇంట ఉండి విద్యాభాసము చేసారు.  ఆ సమయములో వారి పినతండ్రి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు డిక్ష్నరీ కొన్నారు.  ఆపుస్తకము చాలా పెద్దపరిమాణములో ఒక కిలో బరువు ఉంటుంది.  సాయిబానిసగారికి ఆ పుస్తకము అంటే చాలా ఇష్టము.  కాలచక్రములో 1991 సంవత్సరము రానే వచ్చింది.  శ్రీసోమయాజులుగారు మరణించేముందు సాయిబానిసగారిని పిలిచి ఆపుస్తకము ఆయనకు బహూకరించారు.  ఇంతవరకు ఇదంతా శ్రీసాయిబానిసగారి నిజ జీవితములో జరిగింది.  సాయిబానిసగారు ఆ పుస్తకమును తన ప్రాణప్రదముగా తన ఇంటిలో దాచుకొన్నారు.  

27.10.2019 నాడు ఆయన సాయిపై ధ్యానం చేసుకొంటున్నారు.  ఆ ధ్యానములో తనకు తన పినతండ్రి ఇచ్చిన ఇంగ్లీషు ఆక్స్ ఫర్డ్ డిక్ష్నరీ ఎవరో దొంగిలించారు అని తెలిసి బాధపడసాగారు.  శ్రీ సాయిసాయిబానిసగారికి  ధ్యానములో  దర్శనము ఇచ్చి "నీవు పోగొట్టుకొన్న పుస్తకం ఇపుడు నీవీధిచివలో ఉన్న నీ ధనిక స్నేహితుని ఇంట భద్రముగా ఉందివెళ్ళి తెచ్చుకో"అన్నారు.  సాయిబానిసగారు వెంటనే తన బస్తీలోని ఆ ధనిక స్నేహితుని ఇంటికివెళ్ళి అతని ఇంట ఇంగ్లీషు డిక్ష్నరీ ఉందా అని అడిగారు.  ఆ స్నేహితుడు మంచి మనసుతో క్రిందటి రోజున పాత పుస్తకాల దుకాణములో ఆ పుస్తకాన్ని కొన్నానని చూపించాడు.  ఆపుస్తకాన్ని చూసి ఆయన సంతోషముగ ఆపుస్తకము నాదిదానిని ఎవరో దొంగిలించారుఇపుడు అది మీఇంట ఉందినాపుస్తకమును నాకు ఇవ్వమని కోరారు.  ఆధనికుడు అది నీపుస్తకము అయితే దానికి ఉన్న గుర్తులు చెప్పమని కోరాడు.  ఆయన దానిపై శ్రీ యు.పి.సోమయాజులుగారి చిరునామాదానిక్రింద 1991లో తాను అతికించిన చిన్నసైజు సాయిబాబాఫోటోఆఫోటో క్రింద తన సంతకము ఉంటుందని చెప్పారు.

ఆ ధనికుడు సాయిబానిసగారు చెప్పిన వివరాలు ఆపుస్తకములో సరిపోల్చుకొని నీకు నీపుస్తకం నాదగ్గిర ఉందని ఎలాగ తెలిసిందని అడిగాడు.  నేను నా సద్గురు శ్రీషిరిడీసాయిబాబా గారు, నేను పోగొట్టుకొన్న పుస్తకం మీఇంట ఉందని చెప్పారుదయచేసి నాపుస్తకమును నాకు ఇవ్వండని వేడుకొన్నారు.  ఆధనికుడు ఆ పుస్తకములో శ్రీసాయిఫోటోకి నమస్కరించి సాయిబానిసగారికి ఆయన పుస్తకాన్ని ఇచ్చేసారు.

సాయిబానిసగారికి మెలకువ వచ్చింది.

((మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో మరపురాన్ని అనుభవాన్ని ఇచ్చిన బాబా)

మరపురాని అనుభవాన్నిచ్చిన బాబా

$
0
0
        Image result for images of shirdi saibaba in samadhi mandir
           Image result for images of golden yellow rose hd

06.12.2019  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

షిరిడీలో నివసిస్తున్న ఒక డాక్టర్ గారి అత్యద్భుతమయిన అనుభవాన్ని శ్రీమతి మాధవి గారు భువనేశ్వర్ నుంచి పంపించారు.  ఈ అనుభవాన్ని మీరుకూడా చదివి ఆనందించండి.

 మరపురాని అనుభవాన్నిచ్చిన బాబా

"ఓం సాయి రాం"సాయి భక్తులందరికి.ఇప్పుడు Dr రుస్తుంజి షిర్డీ..నుంచి తనకు బాబా తో కలిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
     
నేను ఒక హోమియోపతి డాక్టర్ ను. షిర్డీలోనే ఒక క్లినిక్ పెట్టుకున్నాను.  నాకు సాయిబాబా మీద చాలా నమ్మకం ఉన్నా ఇలాంటి అనుభవాన్ని  ఆ దేవదేవుడు నాకు కలిగిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు.ఆ బాబా ఎందరినో, ఎన్నో రకాలుగా రక్షిస్తున్నాడు.  తన చెంతకు చేర్చుకుంటున్నాడు.  సప్తసముద్రాల ఆవలి తీరంలో న్నా వాళ్ళను కూడా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు షిర్డీ వైపుకు లాగుతున్నారు బాబా.  కానీ ఇక్కడే షిరిడీలోనేఉన్న నాకు ఇలాంటి అనుభవాన్ని కలిగించి ,మనసా,వాచా,కర్మణా తనవైపు లాగుతాడని అస్సలు ఊహించలేదు. 


ఒక పచ్చి నిజం చెప్పనా! షిర్డీ లో ఉండేవారుఅందరూ బాబా భక్తులు కారు.  కొందరు వ్యాపారం కోసం,  కొందరు వృత్తి కోసం  కొందరు వాళ్ళ,వాళ్ళ అవసరాల కోసం ఉంటారు.నేను కూడా అలాగే ఒక హోమియోపతి క్లినిక్ తెరుచుకొనివచ్చే పోయే యాత్రికులు ఎక్కువ ఉంటారని, నా క్లినిక్ బాగా నడుస్తుందనే భావంతోషిర్డీలో ఉన్నాను.
   
నేను ఒక పార్టీ వాళ్ళ దగ్గర 300 రూపాయలు అప్పు తీసుకున్నాను చాలా రోజుల కిందట.  ఒకరోజు నేను నా క్లినిక్ లో ఉండగావాళ్ళు వచ్చి ఆ 300 రూపాయలు ఇవ్వమని అడిగారు. ఆసమయంలో  నా దగ్గర అప్పుడు డబ్బు లేదు.  అందుకని చెక్కు మీదసంతకం పెట్టి ఇచ్చాను.  వాళ్ళు చెక్కు తీసుకొని వెళ్లిపోయారు.  తరువాత ఇంటికి వచ్చి పాస్ బుక్ చూసుకున్నాను.దానిలో 100 రూ.మాత్రమే ఉన్నాయి."అయ్యో,వాళ్లకు,300 రూపాయలకు చెక్కుఇచ్చాను,  చూస్తే 100రూ.ఉన్నాయిచెక్కు బౌన్స్ అవుతుందేమోనాకు ఒక డాక్టర్ గా ఎంతో చెడ్డపేరు వస్తుంది"అనుకొని చాలా బాధపడ్డాను.  అప్పుడు నా దృష్టి బాబా వైపు మళ్ళింది.అంతవరకు రాని ఆలోచన అప్పుడు వచ్చింది.అందుకేనేమో భగవంతుడు మనుషులకు కష్టాలు ఇస్తాడు.అప్పుడైనా ఆ విధాతను గుర్తు చేసుకుంటామని."బాబా,నన్ను ఈ అపవాదు నుంచి రక్షించు"అని సమాధి మందిరం వైపు పరుగుపెట్టాను.  ఇలా నాలుగు రోజులు గడిచింది.  ఒకరోజు,ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు."నేను ఒక చిన్న పేకెట్ నీ దగ్గర పెట్టనా! అని అడిగాడు."దానిలో ఏముంది?"అని ఆశ్చర్యంతో అడిగాను. ఈ పాకెట్ లో 300 రూపాయలు ఉన్నాయి అని అన్నాడు.  ఇంక నేను ఉంట్టలేక "మీకు భ్యంతరంలేకపోతే, నేను ఆ డబ్బువాడుకోవచ్చా? అని అడిగాను.  ఆ వ్యక్తి వాడుకోండి,నేను మళ్ళీ మూడు నెలల తరువాత వస్తాను..అని చెప్పి వెళ్లిపోయాడు.

నేను వెంటనే బ్యాంక్ కు పరుగులు పెట్టాను.  300 రూపాయలుఅకౌంట్ లో వేసాను.అప్పటికి నేను చెక్కు ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇంకా డబ్బుతీసుకోలేదు."భగవంతుడా..రక్షించావు..అనుకున్నాను.
 
మూడు నెలలు గడిచాయి..ఆ వ్యక్తి రాలేదు..ఆరు నెలలు గడిచిపోయినాయి."ఏమైవుండవచ్చు? అతను ఎందుకు రాలేదు? మర్చిపోయినాడా? ఇలా నా మనసు అనేక రకాలుగా పరుగులు పెట్టింది.  ఎక్కడ ఉంటాడో కూడా తెలీదు.  ఒకరోజు అతను నాకు రోడ్డుమీద వెడుతూవుంటే కనపడ్డాడు.  నేను వెంటనే అభివాదం చేసి, మీరు, నా దగ్గర ఉంచిన 300 రూపాయలకోసం ఎందుకు రాలేదు.మర్చిపోయినారా! అని అడిగాను.  అతను ఆశ్చర్యంగా నా వైపు చూసి,  నేను నీకు ఎందుకు డబ్బులుఇస్తాను? మీరు డబ్బుగురించి మాట్లాడుతున్నారు? నాకేమి అర్థం కావటం లేదు.."అన్నాడు.  నేను ఆయన తమాషా చేస్తున్నాడు..అనుకున్నాను.  కానీ ఆయన నిజమే చెప్పినట్లు అక్కడ నుంచి వెంటనే ఏమి మాట్లాడకుండా వెళ్లిపోయాడు.  అప్పుడు నాకు అర్థం అయింది." ఇది ఆ దివ్యమైన సాయి లీల..అని..ఓహో..ఇలాంటి లీలలు ఆయన సప్తసముద్రాల అవతల కూడా చేస్తున్నాడు.అందుకే షిర్డీలో జనప్రవహం చాలా పెరిగింది..అనిపించింది. అందుకే ప్రజలు,బీద,ధనిక,రోగం,భోగం..ఏమి లెక్కచేయకుండా షిర్డీ వైపు పరుగులు పెడుతున్నారు"అనుకోని ఆ సాయి నాధుడికి సర్వస్య శరణాగతి చేసుకున్నాను
  Dr రుస్తుంజి..షిర్డీ
"సర్వం సాయి నాధార్పణమస్థు"

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 9 వ.భాగమ్

$
0
0

       Image result for images of shirdisaibaba old photo
                  Image result for images of light skyblue rose
08.12.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 9 .భాగమ్

23.  సాయిబానిస గోపాలరావు రావాడగారు 1989 లో శ్రీషిరిడీసాయి భక్తులుగా మారి షిరిడీ దర్శించుకొన్నారు.  కాని ఆయన సాయి అంకితభక్తుడు అయిన శ్రీ ఎక్కిరాల భరద్వాజగారిని దర్శించుకోలేదని ఈనాటికీ బాధపడుతున్నారు.  బాబా ఆయన బాధను అర్ధము చేసుకొని 29.10.2019 నాడు తెల్లవారు జామున శ్రీఎక్కిరాల భరద్వాజగారిని చూపించి, ఇతడు నా అంకితభక్తుడు.  
                    Image result for images of ekkirala bharadwaja
నీవు వానిని దర్శించుకోలేదని బాధపడుతున్నావు.  ఇప్పుడు వానిని చూడు అతను తన జీవిత గమ్యానికి చేరడానికి సిధ్ధపడి ధ్యానముద్రలో ఉన్నాడు.


శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు తన జీవిత ఆఖరి రైలు ఎక్కడానికి రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫారమ్ మీద బెంచీమీద కూర్చొని తన రైలు కోసం ఎదురు చూస్తున్నారు.  సాయిబానిసగారు వారి ధ్యానాన్ని భంగపరచకుండా ఆయన సమీపానికి వెళ్ళి దూరమునుండే వారికి సాష్టాంగనమస్కారము చేసారు.  ఆ తర్వాత రైలు వచ్చింది.  శ్రీఎక్కిరాల భరద్వాజగారు రైలు ఎక్కి మనందరికి అందని దూరానికి వెళ్ళిపోయి శ్రీసాయిబాబాలో ఐక్యమయిపోయారు.  ఈ విషయాలు సాయిబానిసగారు నాకు టెలిఫోన్ లో చెబుతుంటే నాకు ఆనందం కలిగింది.

24.  కాలచక్రంలో షిరిడీ

సాయిబానిసగారు 2000వ.సంవత్సరంలో ఆఖరిసారిగా షిరిడీ వెళ్ళి బాబావారి దర్శనం చేసుకొన్నారు.  తిరిగి తాను ఎప్పుడు షిరిడీని దర్శించుకొంటాను అని ఆయన బాబాను ధ్యానంలో ప్రశ్నించినపుడు బాబా ఇచ్చిన సమాధానం వివరాలు మీకు తెలియచేస్తాను.
          Image result for images of shirdi in 1916
“నీవు 1916 నాటి షిరిడీయొక్క ఫోటోలు చూసావు.  ఆనాటి షిరిడీ ఒక చిన్నపల్లెటూరు.  కాని నీవు ఆఖరిసారిగా 2000 సంవత్సరంలో షిరిడీ చూశావు.  అది ఒక పట్నముగా రూపొంది కళకళలాడుతోంది. 
                  Image result for images of shirdi in 2000

నీవు వచ్చే జన్మలో అనగా 2070 వ.సంవత్సరంలో షిరిడీ వచ్చి నాదర్శనం చేసుకొంటావు.  2070 నాటికి నాభక్తుల కోరికపై షిరిడీ సంస్థానమువారు నా భక్తుల దర్శనార్ధము భూగృహములోని నాసమాధి దర్శనానికి ఏర్పాట్లు చేస్తారు.  2070 నాడు షిరిడి ఒక మహాపట్నముగా మారుతుంది.  బూటీవాడలోని నాసమాధి మందిరం గోపురం బంగారు రేకుతో తాపడం చేస్తారు.  షిరిడీలో దూరదర్శన్ కేంద్రము ఏర్పాటు చేస్తారు.
                 Related image
నాభక్తులు షిరిడీకి ప్రతిరోజు విమానములలోను, రైళ్ళలోను, వస్తూ ఉంటారు.  షిరిడీ సంస్థానంవారు ఉచిత భోజనసదుపాయాలు, ఉచిత వైద్య సదుపాయాలు షిరిడీ పట్టణవాసులకు ఉచిత విద్యాసౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.  షిరిడీ, ప్రపంచంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రముగా మారుతుంది.  నీవు 2070 లో షిరిడీకి శ్రీసాయి కృపానంద్ పేరిట వచ్చి దేశవిదేశాలలో నాతత్త్వప్రచారం చేస్తావు.  అంతవరకు ఓపికతో ఉండు.  నిన్ను మరుజన్మలో కలుస్తాను.”
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

సాయి గాయత్రి

$
0
0
     Image result for images of shirdi sai

      Image result for images of light yellow rose

08.12.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు పంపించిన ఆమె స్వీయ అనుభవాన్ని ప్రచురిస్తున్నాను.


"ఓం సాయి రాం."సాయి బంధువులు అందరికి..ఇప్పుడు నేను రాసె బాబావారి లీల నా జీవితం లోనే జరిగిందని చెప్పడానికి నేను ఎంతో సంతోషం పడుతున్నాను.

   అది ఈ దీపావళి రోజుజరిగింది.  నేను మా వారిని తీసుకొని ఒక నాచురోపతి ఆస్పత్రికివెళ్ళాను.  అది భువనేశ్వర్ నుండి 30 కి.మీ.దూరంలో ఉంది.  ఎలాగైనా మా వారిని బాగుచేయాలన్న తాపత్రయంతో వెళ్ళాను.  మా వారు పేరాలిసిస్ తో బాధపడుతున్నారు.  రెండు రోజులు వైద్యంచేశారు.  అక్కడ మా వారికి నచ్చలేదు.  భోజనం సరిగా లేదు.  ఆయన చాలా బలహీనపడిపోయారు. 



దీపావళి పండుగ రోజు నాతో  నేను ఇక్కడ ఉండను, నాకు నచ్చలేదు"అన్నారు.  నాకు మావారి మీద చాలా కోపం వచ్చింది.  మనసులో చాలా బాధపడ్డాను.  ఇంక ఇంత అశాంతిలో సాయిగాయత్రీ మహామంత్ర జపమే శాంతిని కలిగిస్తుంది అని,జపమాల తీసుకొని బయటకు వచ్చేసాను.  ప్రశాంతమైన వాతవరణంలో హాయిగా జపం చేసుకుందాం, అనిజపంమొదలు పెట్టాను.
Image result for images of sai gayatri mantra japam

 ఏ మనిషికయినాశాంతి మనసులో నుంచి రావాలి కానీ బయట ఎక్కడో దొరుకుతుంది అంటే అది సర్వం కల్ల.అలాగే నాకు కలిగింది.  మంత్రాన్నయితేజపిస్తునానుకానీ బాబాను ప్రశ్న వేస్తున్నాను"బాబా,నువ్వు నిజంగా దైవానివే అయితే నాకు ఏదో ఒక విధంగాఇప్పుడేనిరూపించు.  ఇప్పుడే కావాలి నాకు. చాలా విసిగి పోయినాను కష్టాలతో, ఆయనకు బాగాలేదు, పిల్లలు మాట వినరు, అన్నివిధాలుగా నేను విసిగిపోయినాను, ఎక్కడ వున్నావు స్వామి"అని రకరకాలుగా వేదన పడుతున్నాను.జపం ఏదో మూడు మాలలు కానిచ్చి గదికి తిరిగివచ్చాను.మా అబ్బాయి మ్మా, నీకేదో ఫోన్ వచ్చింది,నాలుగు missed కాల్స్ ఉన్నాయి,చూడు"అని ఫోన్ ఇచ్చాడు.నేను ఎవరో సాయిగాయత్రీ వాళ్ళు అయివుంటారు..అని ఆ వచ్చిన నంబర్ కి తిరిగి ఫోన్చేసాను. అప్పుడు "పూణే బాబా మందిరం నుంచిఒక బాబానుమాట్లాడుతున్నాను "మాధవీ, ఈసారి సాయిగాయత్రీ చేయడానికిఎందుకు రాలేదు(క్రితం సంవత్సరం చేసాను), మీవారికి బాగా అవుతుంది అని బాబా చెబుతున్నారు,  ఎంతో స్థిరమైన భక్తురాలివి, అస్థిరం అవ్వకు, బాబా చూస్తున్నారు, సమయం వచ్చినప్పుడు అన్ని బాగుచేస్తారు"అని చెప్పి, నన్ను మాట్లాడనివ్వలేదు...ఫోన్ పెట్టేసారు. కొంచెంసేపు నాకు అయోమయం అనిపించింది.మళ్ళీ కాల్ చేసాను,ఎవరు? ఏమిటి? కనుక్కుందామని..చూస్తే "this number does not exist"అని వచ్చింది.అంతా రెండు నిమిషాలలో జరిగిపోయింది..ఆ ముసలాయన ఎవరో తెలియదు.నా ఫోన్ నెంబర్ ఎవరిచ్చారో తెలీదు..అప్పుడు గుర్తువచింది, బాబాను ఆడిగానుకదా,"నువ్వు ఉన్నావని నిరూపించు"అన్నాను కదా.. బాబా అలా నిరూపించారు.భరించలేని కష్టం వచ్చినప్పుడు మనం కూడా భగవంతునికి పరీక్ష పెడతాం మనకు తెలీకుండానే.ఆయన అందరికి ఏదో ఒక విధంగా సమాధానం చెప్తూ ఉంటాడు.మన మనసులకుస్వాంతన కలిగిస్తూవుంటాడు.

  మేము అంటే, విశ్వసాయి ద్వారకామాయి.. విశ్వశాంతి కోసం చేసే ఈ మహాయజ్ఞం డిసెంబర్ 12వ.తారీకుతోపరిసమాప్తి అవుతుంది.అందరూ ఆహ్వానితులే.అడ్రెస్ కింద జాతచేస్తున్నాను.మీరు వచ్చి ఆ సాయిగాయత్రీ అమ్మవారి, బాబా వారి ఆశీస్సులు తీసుకోవాలని మా ఆకాంక్ష..
"సర్వం సాయి నాధార్పణమస్థు"

విశ్వసాయి ద్వారకామాయి శక్తి పీఠమ్ వారు శ్రీ షిరిడీ సాయి గాయత్రి దత్తాత్రేయ శాంతి హోమమ్ జరుగు స్థలము వివరములు...  అందరూ ఆహ్వానితులే...

గురూజీ లక్ష్మోజీ  వెంట్రప్రగడ  , హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో డిసెంబరు 12 వ.తారీకున జరుగబోవుచున్నది. 
హోమము, మంత్ర జపము, ఆరతి, అన్నదానములు  జరుగును.
జరుగు స్థలము.   శ్రీ ద్వారకామాయి షిరిడీ సాయిబాబా ఆలయమ్, వైష్ణవి టెంపుల్ వెనుక వైపు,
రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన ద్వారము ప్రక్కన,
అబ్దుల్లపూర్ మెట్ గ్రామము, మండలం,
హైదరాబాద్

(సర్వం శ్రీసాయినాధాప్రణమస్తు)

శ్రీమతి మాధవిగారు పంపించిన సందేశం యధాతధంగా...


Dear Sai Bhandhus , 

On the auspicious day of Datta Jayanthi, Viswa Sai Dwarakamai Shakthi Peetam will be performing Sri Shirdi Sai Gayatri Dattatreya Shanti Homam 🔥 under the guidance and presence of Guruji Sri Laxmoji Ventrapragada in Hyderabad, India on Dec 12th 2019 as a concluding event for World Peace and Human Well-being.
Homam will be followed by chanting, aarthi, and Annadanam. 

🍚Annadanam will be done on a grandeur scale serving food to the absolute Destitute and Needy (including Human- Old, Orphan, Disabled, Animals-Grass feeding for Cows
etc.).

Venue: 🛐 Sri Dwaraka Shirdi Sai Baba Alayam, Vaishnavi Temple back side, Near Ramoji Film City main entrance, Abdullapurmet Village & Mandal, Hyderabad.

🗞Please forward this message📬 to your friends and family who live in, near or around Hyderabad or anyone who can make it to the event.
Humble appeal to all Sai devotees/Sai Sevaks/Sai disciples to par take in this divine and blissful event 🕉 for Sri Sai Bhagwan’s divine blessings.

Sai Ram
SaI Sevaks 🙏




శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 10 వ.భాగమ్

$
0
0
   Image result for images of shirdisaibaba and datta
        Image result for images of white roses hd

12.12.2019  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి  శుభాశీస్సులు
దత్తాత్రేయుల వారి ఆశీర్వాదములు

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 10 .భాగమ్

25.  ధనవ్యామోహం విడనాడు

శ్రీషిరిడీ సాయి తన అంకిత భక్తుడు మహల్సాపతితో మాట్లాడుతున్న సమయములో హంసరాజు అనే సాయిభక్తుడు ఒక పళ్ళెమునిండా వెయ్యి వెండి రూపాయనాణాలు తీసుకువచ్చాడు.  బాబా అనుమతితో ఆ   నాణాలను మహల్సాపతికి బహూకరించదలచాడు.  మహల్సాపతి సంతోషముగా  ఆ నాణాలను స్వీకరించడానికి సిధ్ధపడ్డాడు.  బాబా హంసరాజుని పిలిచి మహల్సాపతికి ఆ నాణాలను ఇవ్వవద్దని ఆదేశించి మహల్సాపతికి గల ధనవ్యామోహాన్ని తొలగించారు.




ఇటువంటి సంఘటన సాయిబానిసగారికి స్వప్నములో బాబా కలిగించారు.  ఆ వివరాలు మీకు తెలిచేస్తాను.  సాయిబానిసగారు తన మిత్రునితో కలిసి ఒక పెద్దహోటల్ లో భోజనానికి వెళ్ళారు.  భోజన సమయములో సాయిబానిసగారికి భోజనటేబుల్ క్రింద ఒక చేతిసంచి కనపడింది.  ఆయన ఆ సంచీని పైకి తీసి చూసారు.  అందులో అమెరికా డాలర్ల కట్టలు వంద డాలర్లు విలువ గలవి వంద కట్టలు ఉన్నాయి
  Image result for images of american dollars 100
సాయిబానిసగారి మిత్రులు ఆ నోట్లకట్టలో తమ వాటా తమకు ఇవ్వమని కోరారు.  ఒక్కొక్కరు 20 కట్టలు తీసుకొని తమ తమ సంచులలో వేసుకొని తమ ఇళ్ళకు బయలుదేరారు.  బాబా గారు సాయిబానిగారి మనసులో ప్రవేశించి వెంటనే ఆనోట్లకట్టలను ఆ హోటల్ లోని మురికి కాలవలో పారవేయమన్నారు

సాయిబానిసగారి స్నేహితులు హోటల్ బయటకు వచ్చి తమ కార్లు ఎక్కుతున్న సమయంలో పోలీసులు వచ్చి తమకు ఈ హోటల్ లో దొంగసొమ్ము ఉందని తెలిసిందిబయటకు వచ్చే ప్రతివారిని సోదా చేయాలి అని చెప్పి ఆ నలుగురు మిత్రులను సోదాచేసి వారివద్ద ఉన్న డాలర్ల కట్టలను స్వాధీనం చేసుకొని వారిని పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్ళారు.  బాబా ఆదేశము ప్రకారం సాయిబానిసగారు తన వద్ద ఉన్న డాలర్ల కట్టలను హోటల్ బయట ఉన్న  మురికి కాలవలో పారవేయటం వల్ల పోలీసులకు సాయిబానిసగారి వద్ద డాలర్లు దొరకలేదు.
     Image result for images of dollar notes throwing

పోలీసులు ఆయనను వదలివేసారు.  సమయానికి శ్రీషిరిడీ సాయిబాబా తన మనసులో ప్రవేశించి తనకు ఉన్న ధనవ్యామోహాన్ని తొలగించి ఆ డాలర్లను పారవేసేలాగ చేసి తనను పోలీసుల బాధనుండి తప్పించినందులకు ఆయన శ్రీషిరిడీ సాయిబాబాకు ధన్యవాదాలు తెలియచేసుకొన్నారు.

26.  ధనముకీర్తి, శాశ్వతము కాదు.
       Image result for images of gurusthan shirdi
శ్రీ సాయిసత్ చరిత్రలో గురుస్థానంలోని వేపచెట్టుక్రింద బాబా పాలరాతి పాదుకలు ప్రతిష్టించినపుడు ఆపాదుకల పలకపై సదా నింబ వృక్షస్య’ అనే శ్లోకము వ్రాసిన సాయి అంకిత భక్తుడు ఉపాసనీ మహరాజ్శ్రీసాయి మహాసమాధి అనంతరంసకోరి గ్రామంలో ఒక ఆశ్రమము స్థాపించి గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించారు.  వీరి దర్శనార్ధము అనేకమంది జమీందార్లు వచ్చి వీరి ఆశ్రమానికి ఆర్ధిక సహాయం చేస్తూ ఉండేవారు
         Image result for images of sakori upasani ashram

వీరి ఆశ్రమం నిర్వహణలో అనేక అపోహల కారణంగాకొందరు సకోరి గ్రామవాసులు శ్రీఉపాసని మహరాజ్ పై కోర్టులో అనేక కేసులు పెట్టారు.  ఈ కోర్టుల వ్యవహారాలతో శ్రీఉపాసని మహరాజ్ అనేక మానసిక బాధలకు గురయ్యిశ్రమానికి ధనసహాయం లేక ఆఖరులో అనారోగ్యముతో తన 72 .ఏట మరణించారు.  ఈయన మరణము ద్వారా మనము తెలుసుకోవలసినది మానవ జన్మలో కీర్తిప్రతిష్టలుధనసంపాదన శాశ్వతము కావు అని.  దీనికి ఉదాహరణగా మనము శ్రీనాధ కవిసార్వభౌముని జీవితమును గుర్తు చేసుకొందాము
      Image result for images of srinatha kavi

శ్రీనాధ కవి సార్వభౌముడు తన జీవితములో కీర్తిప్రతిష్టలుధనసంపాదన చేసి ఆఖరులో రాజుగారికి కప్పము కట్టలేక రాజుగారి కోపమునకు గురయ్యిరాజభటుల చేత కొరడా దెబ్బలు తిని మానసిక వేదనతో నదిలో పడి ఆత్మహత్య చేసుకొన్నాడు.  అందుచేత జీవితములో కీర్తి ప్రతిష్టలుధనసంపాదన శాశ్వతము కావు అని మనము శ్రీసాయి అంకిత భక్తుడు  ఉపాసని మహరాజ్ మరియు శ్రీనాధ కవి సార్వభౌముని జీవితాలనుండి గ్రహించగలము.
(శ్రీనాధకవి సౌర్వభౌమ చిత్రం లోని ఈ సన్నివేశాన్ని తిలకించండి)


(మరికొన్ని వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 11 వ.భాగమ్

$
0
0
    Image result for images of Shirdisai and maa
          Image result for images of lotus flower
15.12.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ ఒక ముఖ్యమయిన విషయమ్...
ఈ రోజున "శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి (తెలుగు) & FACE TO FACE WITH SAI (ENGLISH) రెండు పుస్తకాలు ఆవిష్కరణ మహోత్సవం జరుగుతున్నది.  పుస్తకాలు కావలసినవారు తమకు ఎన్ని కాపీలు కావాలో నాకు మైల్ చేసినట్లయితే కొరియర్ ద్వారా గాని, పోస్ట్ ద్వారా గాని పంపిస్తాను.  దయచేసి కొరియర్ , పోస్టల్ చార్జీలను పంపించవలెను.  పుస్తకములు అందిన వెంటనే చార్జీలను నా అక్కౌంట్ కి పంపించవలసినదిగా కోరుతున్నాను.
మైల్. ఐ.డి.  tyagaraju.a@gmail.com
phone.  8143626744  &  9440375411

ఓమ్ సాయిరామ్

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 11 .భాగమ్

27.  కపట గురువు – జవహర్ ఆలి

శ్రీసాయి సత్ చరిత్రలో కపట గురువు జవహర్ ఆలి గురించి వివరింపబడింది.  అతను షిరిడీ ప్రజలను తన మాయమాటలతో లోబరుచుకొని శ్రీసాయిబాబాను తన శిష్యుడిగా మార్చుకొన్నాడు.  శ్రీసాయిబాబాకు జవహర్ ఆలిలోని లోపాలు తెలిసినాప్రజల కోసం అతనిని తన గురువుగా అంగీకరించి సహనంతో అతనితోపాటు జీవించారు.  ఆఖరికి జవహర్ ఆలి తన తప్పును తెలుసుకొని షిరిడీ వదిలిపెట్టి పారిపోయాడు.




జవహర్ ఆలి కధ ద్వారా మనము తెలుసుకోవలసిన విషయాలు.

ఈనాడు ప్రతి పట్టణములోను శ్రీసాయి పేరిట కపట గురువులు అనేకమంది సమాజములో తిరుగుతున్నారు.  మనము ఆకపట గురువులను గుర్తించి వారినుండి దూరముగా జీవించాలి.  వారి మాయలోపడి పతనము చెందరాదు.  అందుచేతనే శ్రీసాయిబానిస గారు ఏనాడు సాయిగురువులమని చెప్పుకొని ప్రసంగాలు చేసేవారినుండి దూరంగా జీవించారు.  ఆయన తన జీవితంలో శ్రీసమర్ధ సద్గురు సాయినాధులవారికే తమ హృదయంలో స్థానం కల్పించుకొన్నారు.  ఆయన ఆధ్యాత్మిక మార్గంలో శ్రీషిరిడీ సాయినాధులవారి పాదాలకు అంకితమై తన జీవితాన్ని 1989 నుండి కొనసాగించుకొన్నారు.  కాని ప్రాపంచిక రంగములో ఉద్యోగరీత్యా భారతప్రభుత్వ శాఖలో పనిచేస్తుండగా తన పై అధికారి చెడుప్రవర్తనకురాక్షస మనస్తత్వానికి తట్టుకోలేక తన 54 .సంవత్సరములో అనగా 2000 .సంవత్సరములో భారతప్రభుత్వ సేవలనుండి స్వచ్చంద పదవీ విరమణ చేసి శ్రీసాయికి మరియు శ్రీసాయి భక్తుల సేవలో తరిస్తున్నారు.  ఈవిధముగా తన పైఅధికారి కపట గురువునుండి దూరంగా జీవించారు.

28.  శ్రీ సాయి జగన్మాత

శ్రీసాయి సత్ చరిత్ర 3.ధ్యాయములో బాబా స్వయంగా అన్నమాటలు

నేనే జగన్మాతనుత్రిగుణాల సామరస్యాన్ని నేనేసృష్టిస్థితిలయకారకుడిని నేనే..”

ఈమాటలు అక్షరసత్యాలు.  బాబా అంకిత భక్తుడు నెవాస్కర్ తన జీవిత ఆఖరి దశలో తన భార్యలో శ్రీసాయిని చూడగలిగిన ధన్యజీవి.  ఇక సాయిబానిసగారి విషయంలో ఆయన పొందిన అనుభూతిని మీకు తెలియచేస్తాను.

2000 .సంవత్సరములో శ్రీసాయిబానిసగారికి అమెరికాలోని చికాగోపట్టణములో జరుగుతున్న మొదటి ప్రపంచ షిరిడీసాయి భక్తుల సమ్మేళనానికి ఆహ్వానింపబడ్డారు.  ఈ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు.  అమెరికాలోని చికాగో పట్టణంలో వందసంవత్సరాల క్రితం శ్రీస్వామి వివేకానంద వెళ్ళేముందు వారి గురువు శ్రీరామ కృష్ణపరమహంసలవారువివేకానందునికి కాళీమాత దర్శనము చేయించివివేకానందులవారిని ఆశీర్వదించి వారిని అమెరికాకు పంపించారు.  ఈ విషయమును సాయిబానిస గారు జ్ఞాపకము చేసుకొని తాను 2000 .సంవత్సరము నవంబరు నెలలో అమెరికాకు బయలుదేరుతు తన సద్గురువు అయిన శ్రీసాయినాధులవారిని ఒక విచిత్రమయిన కోరిక కోరారు.  తాను అమెరికాకు బయలుదేరేముందు రాత్రి బాబాను ప్రార్ధించి తనకు జగన్మాత దర్శనము చేయించమని కోరారు.  శ్రీసాయి దయామయుడు సాయిబానిసగారి చిన్న కోరికను ఈ విధముగా తీర్చారు.

అమెరికాకు బయలుదేరేముందు రాత్రి బాబాగారు ఆయనకు ఆయన తల్లిగారు శ్రీమతి రావాడ రవణమ్మ గారి రూపములో దర్శనము ఇచ్చారు.  ఆమె పట్టుచీర కట్టుకొని వంటినిండా బంగారు ఆభరణాలనునుదుట పెద్ద కుంకుమబొట్టుతలలో చక్కటి పూలు ధరించ దర్శనము ఇచ్చారు.  సాయిబానిసగారు ఆశ్చర్యపడి తిరిగి బాబాను ప్రార్ధించి తనకు జగన్మాత దర్శనము ఇవ్వమని కోరారు.  బాబా ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి నీకు జన్మనిచ్చిన నీతల్లి నీకు జగన్మాత అని చెప్పారుఆయన స్వప్నమునుండి మెలకువ తెచ్చుకొని శ్రీసాయి జగన్మాతను తన తల్లిరూపములో దర్శనము ఇచ్చినాతాను సరిగా గ్రహించలేక కనీసము తన తల్లికి నమస్కరించలేదని బాధపడ్డారు.  శ్రీసాయి తన భక్తులకు ఇచ్చిన సందేశము ఏమిటి అంటేప్రతి మనిషి తన తల్లిలోనే జగన్మాతను చూడమని ఆమెను పూజించమని
                                  Image result for images of mother
మరి ఎంతమంది సాయిభక్తులు ఈవిషయాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టగలరు?  చూడాలి.

(మరికొన్ని వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 12 వ.భాగమ్

$
0
0

       Image result for images of shirdi saibaba old photos
            Image result for images of rose hd

19.12.2019  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 12 .భాగమ్
29.  ద్వారకామాయి -  ధుని
షిరిడీ ద్వారకామాయిలో శ్రీసాయి వెలిగించిన ధుని ఈనాటికీ  మండుతూనే ఉంది.  అనేకమంది భక్తులకు  ధునినుండి వచ్చే ఊదీ ప్రసాదముగా పంచబడుతూ ఉంది.  ఈ ధుని గురించి కొన్ని విషయాలు చాలామందికి తెలియవు.




     Image result for images of shirdi saibaba dhuni old photos

శ్రీసాయి ధుని కోసం కట్టెలను కొని ద్వారకామాయిలో నిలువ చేసేవారు.  షిరిడీలో ఒక సారి కలరా వ్యాధి ఉన్న సమయంలో షిరిడీ గ్రామస్థులు షిరిడీలో కట్టెలు అమ్మరాదని ఆజ్ఞాపంచారు.  బాబా ఈ మూఢాచారానికి వ్యతిరేకముగా కట్టెలబండిని పిలిపించి ధునికోసం కట్టెలను కొని నిలవుంచారు.
               Image result for images of g g narke
ఒకసారి బాబా అంకిత భక్తుడు శ్రీ జి.జి.నార్కే ద్వారకామాయికి వచ్చాడు.  అదే సమయంలో ఒక బండినిండా కట్టెలు అమ్మేవ్యక్తి వచ్చి బాబాను ధుని కోసం కట్టెలను  కొనమని ప్రాదేయపడ్డాడు.  ఆవ్యక్తిని చూసి బాబా జి.జి.నార్కేను పిలిచి ఈ కట్టెలుఅమ్మేవాడు నీకు క్రిందటి జన్మలో మంచి స్నేహితుడు.  నీవు చేసుకొన్న మంచి కర్మలతో ఈజన్మలో నీవు ఉన్నత విద్యలు అభ్యసించి పూనాలోని దక్కన్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నావు.  నీస్నేహితుడు తాను చేసుకొన్న పాపకర్మలను అనుభవించటానికి ఈజన్మలో కట్టెలుకొట్టుకొని తన జీవనాన్ని సాగించుతున్నాడు.  నీవు వానికి రెండురూపాయలు ఇచ్చి ఈబండెడు కట్టెలను ద్వారకామాయిలోని ధుని కోసం కొనమని చెప్పారు. శ్రీ జి.జి.నార్కే న్నీరుతో తన క్రిందటి జన్మ స్నేహితుని కౌగలించుకొని వానికి రెండు రూపాయలు ఇచ్చి ధుని కోసం కట్టెలను కొన్నాడు.  శ్రీసాయి భక్తులకు ధునినుండి వచ్చే ఊదీ అనేక వ్యాధులను నిర్మూలించుతున్న గొప్ప ఔషధముగా ఈనాడు వాడుతున్నారు.

30.  శ్రీషిరిడీసాయి సమాధి మందిర్ -  బూటీవాడ

నేటి షిరిడీ సాయిబాబా సమాధిమందిరానికి ముందు అనగా 1915 .సంవత్సరము వరకు బాబా ఆస్థలములో పూలతోటను పెంచేవారు.  బాబా అంకితభక్తుడు గోపాల్ ముకుంద్ బూటీ ఆస్థలాన్ని 1915 .సంవత్సరము డిసెంబర్ లో కొన్నాడు.  
        Image result for images of shirdisaibaba watering plants
ఆ స్థలంలో తాను నివసించటానికి మరియు మురళీధరుని మందిరాన్ని నిర్మించడానికి  30.12.1915 నాడు మురళీధరుని మందిరనిర్మాణమును ప్రారంభించాడు.  ఈ మందిర నిర్మాణము 1918 నాడు పూర్తయినా అనేక కారణాల వల్ల మురళీధరుని విగ్రహ ప్రతిష్ఠాపన పని జరలేదు.  15.10.1918 నాడు బాబా తన ఆరి శ్వాస తీసుకొనుచున్న సమయంలో తనను బూటీ నిర్మించిన వాడాలోకి తీసుకొని వెళ్లమని కోరారు.  ద్వారకామాయిలో తన తుది శ్వాసను తీసుకొన్నారు.  15.10.1918 నాడు బాబాయొక్క హిందు – ముస్లిమ్ భక్తులు బాబా పార్ధివ శరీరాన్ని ఎక్కడ సమాధి చేయాలని తర్జన భర్జనలు చేసారు.  రికి అందరూ 16.10.1918 నాడు బాబా పార్ధివ శరీరాన్ని బూటీవాడాలో మహాసమాధి చేయాలని నిర్ణయించుకొన్నారు.  ఆనాడు సాయంత్రము 4 గంటలకు ఊరేగింపుగా బాబా పార్ధివశరీరాన్ని ద్వారకామాయినుండి బూటీవాడాకు తీసుకొని వచ్చి మురళీధరుని విగ్రహప్రతిష్టాపనకు నిర్ణయించిన స్థలములో అనగా బూటీవాడాలోని భూగృహములో మహాసమాధి చేసారు.
                  Image result for images of shirdi saibaba dhuni old photos
బాబా పార్ధివ శరీరాన్ని ఏడు అడుగుల పొడవుగల గోతిలో బాబాకు ఇష్టమయిన ఇటుకను రెండు ముక్కలను వెండితీగతో కట్టి ఆ ఇటుకను బాబా శిరస్సు క్రింద ఉంచారు.
                 Image result for images of shirdi saibaba samadhi old photo
బాబా చాంద్ పాటిల్ పెళ్ళివారితో వచ్చినపుడు ఆయన ధరించిన ఆకుపచ్చని జుబ్బా మరియు కఫనీతోపాటు శిరస్సుపై ధరించిన టోపీని ఒక సంచిలో పెట్టి ఆగోతిలో ఉంచారు.  బాబా నిత్యము వాడే సటకాలలో ఒక సటాకానుఒక చిలుము గొట్టమును, ఆయన తన చినిగిన కఫనీలను కుట్టుకొనే సూదిదారము కండిని కూడా ఉంచారు.  బాబా శరీరముపై అత్తరు చల్లారు.  పూలరేకులతో కప్పారు.  తెల్లని నూతన వస్త్రమును చుట్టారు.
ఈ విధముగా బాబా మహాసమాధి కార్యక్రమము 17.10.1918 తెల్లవారుజాము వరకు సాగింధి.  బాబా మహాసమాధి అనంతరము సమాధికి 17.10.1918 ఉదయము హారతి ఇచ్చారు.  ఆనాటినుండి నేటివరకు బాబాకు నిత్యము నాలుగు హారతులు ఇవ్వడం జరుగుతూ ఉంది.
                              Image result for images of shirdi saibaba samadhi old photo
1954 సంవత్సరము వరకు భూగృహముపైన ఉన్న స్థలములో బాబాపటమునకు నాలుగు హారతులు ఇవ్వసాగారు.

1954 .సంవత్సరములో బొంబాయి హార్బరులో ఇటలీనుండి వచ్చి పడిఉన్న పాలరాయిని కొందరు భక్తులు వేలంపాటలో కొని షిరిడీసాయి సంస్థానమువారికి అప్పగించారు.  శ్రీ బాలాజి తాలిమ్ విగ్రహాన్ని చెక్కారు.  
                    Image result for images of talim preparing baba idol
బాబా పాలరాతి విగ్రహాన్ని శ్రీ సాయి శరణానంద్ ప్రతిష్టించారు.  షిరిడీ సాయి సంస్థానము బాబా మహాసమాధి చెందిన తర్వాత 17.10.1918 నాడు 15 మంది సభ్యులతో శ్రీగోపాల్ ముకుంద్ బూటీ చైర్మన్ గానుశ్రీ హేమాద్రిపంతు సెక్రటరీగాను ఒక సంస్థానము స్థాపింపబడింది  ఆనాడు స్థాపించిన షిరిడీ సంస్థాన్ నేడు షిరిడీ సాయి భక్తులకు సేవ చేస్తున్నది.  కాలక్రమములో షిరిడీ సంస్థానం సభ్యులు మారుతున్నారు.  షిరిడీ దినదినాభివృధ్ధి చెందుతున్నది.  ప్రపంచములోని కోటానుకోట్లమంది సాయిభక్తులు నేడు షిరిడీకి వచ్చి బాబా పాలరాతి విగ్రహములో బాబా జీవకళను దర్శించుకొని తరిస్తున్నారు.  ఆనాడు గోపాల్ ముకుంద్ బూటీ మహాసమాధి మందిరాన్ని నిర్మించిన వ్యక్తిగా  చరిత్రలో నిలిచిపోయిన ధన్యజీవి.
(మరికొన్ని వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 13 వ.భాగమ్

$
0
0

     Image result for images of shirdisaibaba
                   Image result for images of white and green rose

22.12.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 13 .భాగమ్
31.  శ్రీ సాయి దినచర్య
శ్రీ సాయిబాబా షిరిడీలో ద్వారకామాయిలో తన దినచర్యను ఏవిధముగా చేసేవారు అనే వియాన్ని శ్రీ సాయి సత్ చరిత్ర మరాఠీభాషలో శ్రీహేమాద్రిపంతు వ్రాసారు.  అందులో ముఖ్యముగా బాబా అంకిత భక్తుడు శ్రీహరి సీతారామ్ దీక్షిత్ తన ఉపోధ్ఘాతములో వివరముగా వ్రాసారు




ఉపోద్ఘాతములో 

శ్రీసాయి తెల్లవారుజామున ద్వారకామాయిలో నిద్రనుండి లేచి ద్వారకామాయిలోని నిర్దేశించబడిన స్థలములో మలమూత్రవిసర్జన చేసితన కాళ్ళు చేతులు శుభ్రము చేసుకొని ధునిముందు కూర్చుని ధ్యానము చేసేవారు.  సూర్యోదయము కాగానే బాబా తన స్వహస్థాలతో తన మలమూత్రాలను తీసి ద్వారకామాయి అవతల పారవేసేవారు.  ఆతరువాత భాగోజీ షిండే వచ్చి బాబా కాలిన చేతికి నేతితో మర్ధనా చేసి ఆకుతో కట్టుకట్టేవాడు.
ఆతరువాత బాబా తన భక్త బృందముతో కలిసి లెండీబాగ్ కు వెళ్ళి అక్కడ దైవప్రార్ధనలు చేసి ఆ తరువాత ఐదు ఇళ్ళకు భిక్షకు వెళ్ళి వచ్చేవారు.  
                    Image result for images of shirdisaibaba washing his hands
తాను తెచ్చిన భిక్షలోనుండి ద్వారకామాయిలో పని చేసే స్త్రీకి కొన్ని రొట్టెలు ఇచ్చేవారు.  కొన్ని రొట్టెలను కాకులకుపిల్లులకు పెట్టేవారు.  ఆ తర్వాత మిగిలిన రొట్టెలను తాను తినేవారు.  మధ్యాహ్న సమయములో తనవద్దనున్న రాగినాణాలను తీసికొని వాటిని తన భక్తుల పేర్లను ఉచ్చరించుతూ తన చేతిబొటనవ్రేలితో రుద్దేవారు.

తన చినిగిన కఫనీని తనే స్వయంగా సూదీదారముతో కుట్టుకొనేవారు.  మిగతా సమయాలలో తన భక్తులతో కలిసి దర్బారును నిర్వహించేవారు.  ఆయనకు దినచర్యలో మహల్సాపతి, భాగోజీషిండేమాధవరావు దేశ్ పాండేలు  ఎక్కువ సహాయము చేసేవారు.

ఈవ్యాసములో తెలిపిన వివరాలు అన్నీ తెలుగుభాషలో శ్రీసాయి సత్ చరిత్ర హేమాద్రిపంత్ మరాఠీ భాషలో వ్రాసిన విషయాలనుశ్రీమతి మణెమ్మగారు 1995 లో హైదరాబాద్ లోని కిషన్ బాగ్ సాయి మందిరము ఆధ్వర్యములో తెలుగులో అనువాదము చేసారు.  నేను ఆపుస్తకమునుండి శ్రీసాయి దినచర్య వివరాలను సేకరించి ఇక్కడ ప్రచురిస్తున్నాను.   (ఉపోద్ఘాతము పేజీ నంబరు.. 12) …  త్యాగరాజు

32.  గౌరి కళ్యాణం

శ్రీ సాయి సత్ చరిత్రలోని వీరభద్రప్ప – చెన్నబసప్పల కధలో బాబా అన్నమాటలు మరియు ద్వారకామాయిలో బాబా దర్బారులో ఉండగా ఒక భక్తుడు వచ్చి తాను మతం మార్చుకొని వచ్చానని అన్నప్పుడు బాబా అన్నమాటలను ఈ వ్యాసంలో ఒక సారి గుర్తు చేసుకొందాము.

మతము మార్చుకొన్న ఒక భక్తుడిని బాబా అందరిసమక్షములో నీతండ్రిని మార్చినావా నీవు చేసినది తప్పు అని చెప్పారు.  దీనితో బాబా మత మార్పిడికి వ్యతిరేకము అని తెలుస్తోంది.

బాబా పూజారి కుమార్తె గౌరిని వీరభద్రప్పకు ఇచ్చి వివాహము చేసిన సంఘటనలో మనకు బాబా తెలియచేసిన విషయాలు గుర్తు చేసుకొందాము.
వివాహానికి ముందు వధూవరుల కులగోత్రాలుజాతకములను చూసి అన్నీ సవ్యముగా ఉన్నట్లయితేనే మంచి ముహూర్తములో వివాహము జరిపించవలెను అని చెప్పారు
                    Image result for images of marriage
బాబా ఇదేపద్ధతిలో పూజారి కుమార్తె అయిన గౌరిని వీరభద్రప్పకి ఇచ్చి వివాహము జరిపించారు.

శ్రీసాయి సత్ చరిత్ర ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏమిటంటే పరధర్మము ఎంత గొప్పదయినా స్వధర్మమునే పాటించాలి.  ఇదే విషయము భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి ఉపదేశించారు.  బాబా జ్యోతిష్యశాస్త్రానికి వ్యతిరేకంకాదు వధూవరులు పెండ్లి నిశ్చయము జరిగిన తర్వాత మంచి ముహూర్తములో ఆపెండ్లి జర్పించవలసినదని చెప్పారు.

(క్రిందటి గురువారమునుండి సాయిబానిస గారి రచనలు కొన్ని హిందీ భాషలో కూడా ప్రచురిస్తున్నాను...  హిందీ భాషలోకి అనువాదము చేస్తున్న సాయి భక్తురాలు శ్రీమతి మాధవి, భువనేశ్వర్)
(రేపటి సంచికలో హైదరాబాద్ లో జరిగిన విశ్వశాంతి గాయత్రి శాంతి హోమం విషయాలను శ్రీమతి మాధవిగారు వివరిస్తారు...)

(మరికొన్ని వచ్చే గురువారమ్)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 14 వ.భాగమ్

$
0
0

       Image result for images of shirdi saibaba old photo
              Image result for images of rose
26.12.2019 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 14 .భాగమ్

33.  నిద్రపట్టని వ్యక్తి

 శ్రీ సాయిసత్ చరిత్ర  35 .అధ్యాయంలో ఒక సాయిభక్తునికి అతని తండ్రి రోజూ రాత్రి స్వప్నములో కనిపించి తన కుమారుని దూషించసాగేవాడు.  దానితో అ వ్యక్తికి నిద్రపట్టక బాధపడుతూ ద్వారకామాయికి వచ్చి తన బాధను బాబాకు చెప్పుకొన్నాడు.  బాబా ఆవ్యక్తి బాధను గ్రహించి అది వాని తండ్రికి తన కుమారునిపై కోపము కారణంగా మరణించిన తర్వాత కూడా తన కుమారునిపై కక్ష కట్టి కలలో దర్శనము ఇస్తూ దూషిస్తున్నట్లు చెప్పారు.




బాబా ఆవ్యక్తికి ధునిలోని ఊదీని ఇచ్చి పొట్లం కట్టుకొని తలక్రింద దిండులో పెట్టుకొని నిద్రించమని సలహా ఇచ్చారు.  ఆవ్యక్తి ఆవిధముగా చేసి తన తండ్రి దూషణలనుండి విముక్తి చెంది ప్రశాంతముగా నిద్రించేవాడు.  ఇది సాయి సత్ చరిత్రలో చెప్పబడిన విషయం.  సాయిబానిసగారు ఈ విషయమును నమ్మలేదు.  ఏతండ్రీ తన కుమారునిపై కక్షకట్టి కలలలో కనిపించి తన కుమారుని దూషించరు అని భావించి బాబాను ఈ విషయముపై వివరణ ఇవ్వమని కోరారు.  బాబా సాయిబానిసగారికి ఈవిధముగా వివరించారు.

1971 లో సాయిబానిసగారి తండ్రి తన చిన్న కుమార్తె వివాహము చేసారు.  ఆ వివాహము జరుపుటలో కొంత ధనము అనవసరంగా ఖర్చు చేయబడింది.  ఈవిషయంలో సాయిబానిసగారు తన తండ్రితో గొడవలు పడ్డారు.  సాయిబానిసగారి తండ్రి చాలా కోపముతో తన సొమ్ము తన చిన్నకుమార్తె వివాహానికి ఖర్చు పెట్టడములో ఎవరి సలహాలను సూచనలను తాను తీసుకోనవసరము లేదని చెప్పి సాయిబానిసగారిని దూషించారు.  అపుడు సాయిబానిసగారు తన తండ్రితో గొడవపడ్డారు.  కొన్ని రోజులు తండ్రి కొడుకులు మాట్లాడుకోలేదు.  ఆ తరువాత సాయిబానిసగారు తన తప్పును తెలుసుకొని తన తండ్రిని క్షమాపణ కోరారు.  ఈవిధముగా తండ్రికొడుకుల వైరము తొలగిపోయింది.  అదేవిధముగా బాబా ఇచ్చిన ఊదీ వలన షిరిడీ భక్తునికి నిద్ర పట్టింది

34.  గురువు అజ్ఞానమును తొలగించును

శ్రీసాయి సత్ చరిత్ర 39అద్యాయములో గురువు తన శిష్యుని మనసులో ఉన్న అజ్ఞానమును తొలగిస్తారు.  అపుడు శిష్యుని లోపల దాగిఉన్న జ్ఞానజ్యోతి వెలిగి శిష్యునికి జ్ఞానము లభించును అనేది స్పష్టముగా తెలపబడింది.  ఈవిషయాన్ని శ్రీసాయిబాబా వారు సాయిబానిసగారికి తెలిపిన విధానము చాలా ఆసక్తికరముగా ఉంది.  ఆవిషయాలను తెలియచేస్తాను.

ఒకనాటి రాత్రి సాయిబానిసగారు హైదరాబాదులో ఉన్న కాప్రా చెరువు దగ్గర ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళారు.  ముందుగా అక్కడ ఉన్న చెరువులో స్నానము చేసి గుడిలోకి వెళ్ళాలనే కోరిక కలిగింది  చెరువు గట్టుమీద ఉన్న మెట్లమీద నిలబడి చెరువులోకి చూడసాగారు.  చెరువునిండా నీటిమీద గుర్రపుడెక్కనాచు మొక్కలతో నిండి ఉంది.  ఆయనకు ఆ చెరువులోని నీరు అపరిశుభ్రముగా కనబడింది. ఇంతలో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి ఆ గుర్ఱపు డెక్కను తొలగించి  స్వచ్చమయిన నీటిలో స్నానము చేయించి వెళ్ళిపోయారు.  ఆయన గుడిలోకి వెళ్ళి శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని గుడిప్రాంగణములోని బెంచీమీద కూర్చుని తన చేత స్నానము చేయించిన వ్యక్తి గురించి ఆలోచంచసాగారు.  ఆవ్యక్తిని శ్రీసాయిగా భావించి తనలోని అజ్ఞానాన్ని తొలగించి తనకు జ్ఞానాన్ని ప్రసాదించిన తన గురువుగా భావించి ఆవ్యక్తికి మనసులో నమస్కరించుకొన్నారు.

(చెరువులోని గుర్రపు డెక్క, నాచు అనగా మన మనసులో ఉన్న జ్ఞానము మీద గుర్రపు డెక్క, నాచు అనే అజ్ఞానము ఆవరించి ఉండటం వల్ల మనము మంచి, చెడులను గ్రహించలేకున్నాము.  ఆ అజ్ఞానాన్ని తొలగించే సద్గురువు మనకి లభించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానానికి మార్గం చూపిస్తారు…. త్యాగరాజు )

35.  శ్రీసాయి అంకిత భక్తులు
శ్రీసాయి సత్ చరిత్ర 25అధ్యాయంలో శ్రీసాయి అన్నమాటలు గుర్తు చేసుకొందాము.
ఆ మామిడి చెట్టును చూడుచెట్టునిండా పూత పూసింది.  అందులో కొన్ని పిందెలుగా మారి రాలిపోయినవి.  ఆ పిందెలలో కొన్ని గాలికి రాలిపోయాయి.  కొన్ని మామిడికాయలుగా మారినవి.  ఆమామిడికాయలలో కొన్ని గాలికి రాలిపోయినవి.  ఆఖరికి ఆ చెట్టుకు కొన్ని మామిడికాయలు మిగిలినవి.  మరి ఆమామిడికాయలు కూడా చెట్టుకే పరిపక్వము చెంది పండ్లుగా మారుతున్నవి.  కొన్ని పండ్లు తమ బరువుకే నేలమీద రాలిపోయి మట్టిలో కలిసిపోతున్నాయి.  అదే విధముగా నేను మామిడి చెట్టును అయితే నా అంకితభక్తులు చెట్టుకు ముగ్గిన మామిడిపళ్ళు.  ఆ పళ్ళు కాలచక్రములో చెట్టునుండి రాలిపోయి మట్టిలో కలసిపోతున్నారు.  నేను మహాసమాధి చెందిన తర్వాత నా అంకితభక్తులలో అనేకమంది కాలగర్భములో మట్టిలో కలసిపోయారు.   

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు సమాప్తం
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

షిర్డీ సాయి గాయత్రి శాంతి హోమం

$
0
0
     Image result for images of shirdisai
               Image result for images of rose yellow

28.12.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


డిసెంబర్ 12వ.తారీకున హైదరాబాదులో విశ్వసాయి ద్వారకామాయి సంస్థవారి ద్వారా జరిగిని షిరిడీ సాయి గాయత్రి శాంతి హోమం విశేషాలను శ్రీమతి మాధవి భువనేశ్వర్ నుండి తమ గురువుగారికి  వ్రాసిన లేఖ ఈ రోజున ప్రచురిస్తున్నాను.


సాయిరాం గురువుగారు..అద్భుతంగా గా జరిగిన ఈ"షిర్డీ సాయి గాయత్రి శాంతి హోమం "లో నేను ఒక భాగస్వామిని అవడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సంపూర్ణంగా బాబా వారి కృప మరియు మీ అనుగ్రహము,నా మీద మీకు ఉన్న నమ్మకము నన్ను ఈ మహాత్ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసింది. దీనికి శతకోటి ధన్యవాదములు మీకు.
  

ఇంక నా అనుభవాలను రాస్తే,ఎన్ని రాయను?  ప్రతిక్షణం ఒక్కో అనుభవం  మొదటిిరోజు నుంచే మీకు గుర్తు ఉండి ఉంటుంది. 1st మీ ఇంటికి నేను వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు. మీ అన్నగారి కోసం ఇల్లు చూసేదానికి వెళ్లారు. నేను ఉడిపి కృష్ణడు విగ్రహం తీసుకొని మీ ఇంటికి వచ్చాను.  నాకు మీ ఇంటి మెట్ల మీద ఒక నెమలి పించం కనపడింది.  ముందు నేను తీసుకోలేదు. తరువాత అనుకున్నాను, "అయ్యో, కృష్ణుని దగ్గర పెట్టుకొనే నెమలిపించం వదిలి రావడం నా మూర్ఖత్వందీనిలో ఏదో లీల దాగివుంది"అనుకున్నానుమళ్ళీ వెనక్కు వెళ్లి అది తీసుకొని మీ ఇంటికి వచ్చాను. మీ అమ్మగారు తలుపు తీసారు. నేను ఆవిడకు ఏమి చెప్పలేదు. మీరు వచ్చాక మీకు అన్ని చెప్పి కృష్ణ విగ్రహం మీకు ఇచ్చాను. 
             Image result for images of udupi srikrishna
అప్పుడు మీరు చెప్పారుకృష్ణుడు మీకు కలలో వచ్చి,పాలు అడిగి తాగారు..అని..ఆ కృష్ణడికి పించం లేదు అని. నిజానికి ఉడిపి కృష్ణకు పించం ఉండదు. మీకు కలలో కృష్ణుడు రావడంనేను ఉడిపిలో మీ కోసం కృష్ణ విగ్రహం కొనడం ,అదే సమయంలో ,అప్పటి నుంచే మన విశ్వసాయి లీలలు మొదలు అయ్యాయి. అసలు ఇది ఎలా సంభవం అయింది?.నాకు అస్సలు అర్థం కాదు. చాలా లీల జరిగింది. అది కృష్ణుడి లీల. అద్భుతం,ఆశ్చర్యం..ఆనందం..ఇప్పటికీ స్వామి కృపకు నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి గురువుగారు.
    
 ఎలా ప్రారంభం అయ్యాయి లీలలు..నేను ఎప్పుడూ అనుకునే దాన్ని,నాకు సేవ చేసే భాగ్యం ఎప్పుడు వస్తుంది? అని. విశ్వసాయి ఏదో ఒక ఫంక్షన్ లో నేను పాల్గోవాలని ఉండేది. కానీ ఇంత త్వరగా సాయినాథుడు కరుణిస్తాడని అనుకోలేదు నేను.  పూజారులు విషయంలో కానీఇంక ఏ విషయంలో కానీ involve అవుతానని అనుకోలేదు. అంtaa బాబా కృపమీకు నాపై ఉన్న నమ్మకం. పూజారిని ఏర్పాటు చెయ్యమని మీరు నాకు చెప్పినప్పుడునేను భయపడ్డానుచెయ్యగలనా? అనుకున్నాను. కానీ చాలా మంచి పూజారులు దొరికారు. వాళ్ళుకూడా దత్తసాయి భక్తులు కావడం అత్యంత విశేషం గురువుగారు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే,వాళ్ళు మిమ్మల్ని చూసిన వెంటనే మీకాళ్లకు దండం పెట్టడం. అసలు ఏ మందిరం లో అయినా పూజారులువాళ్ళ దైవానికి తప్ప ఎవ్వరికీ దండం పెట్టరు.మనమే పూజారికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాము. అలాంటిది వాళ్ళు మీకు నమస్కారం పెట్టడం ఆశ్చర్యం. వాళ్ళు మీలో బాబా ను చూసారు. చాలా బాగా హోమంపూజ చేశారు. సంకల్పం చాలా బాగా చెప్పారు. నేను పూర్తిగా విన్నాను. సంకల్పం మొత్తం. అష్ట దిక్పాలకులు,నవగ్రహాలు,అందరూ,దేవి,దేవతలను,బ్రహ్మమానసపుత్రులనుఎవ్వరిని వదలకుండా ఆహ్వానించారు. నేను బాగా విన్నాను. బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన  విశ్వవసును కూడా ఆయన పిలిచాడు.(ఒక్క క్షణం రావణాసురుని కూడా పిలుస్తాడేమో అనుకున్నాను.హహ) సంకల్పం చాలా బాగా చేసారు. మాతో కుంకుమ అర్చన చేయించాడు. అప్పుడు ఖడ్గమాల స్తోత్రంతో చేయించారు. అది తిరుగులేని మంత్రం. నాకు నోటికి వచ్చు అది గురువుగారు. అందుకే ఖచ్చితంగా చెప్పగలను. అంటే,గాయత్రి అమ్మవారిని ఆహ్వానించారు. దానికి సువాసినిలు ఉండాలి. అది దానికి అంతరార్థము అని నాకు అర్థం అయింది. ఏది ఏమైనా పూజ మాత్రం అద్భుతంగా చేశారు. చాలా మంది ఆశ్చర్యంగా చూసారు. ఇంక మిమ్మల్ని దూరం నుంచి జనాలు చూస్తూనే వున్నారు. చాలాసేపు గమనించారు. మళ్ళీ దగ్గరికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకున్నారు వాళ్ళు. అందరూ పెరుపేరునా అదృష్టవంతులం అనుకోని వెళ్లడం నేను చూసాను. మాకు అంటే మీ గురించి తెలుసు. కానీ ఏమీ తెలీని వాళ్ళు కూడా తమ అదృష్టంగా భావించి,మీ ఆశీర్వాదాలను తీసుకొని వెళ్లారు. అది నేను చూసాను. అందరూ చాలా సంతుష్టిగా వెళ్లారు. మీలో బాబాను దర్శించుకొని వెళ్లారు. మీరు కారులో కూచొని ఇంటికి వెళ్లే వరకు బాబా మీలో వున్నారు అని ప్రతి ఒక్కరు భావించారు. చాలా మందినన్ను అడిగారు,"ఈయన ఎవరు? వచ్చారుఅంతలో వెళ్లారు?"అని. మీరు ఎంతమందికి విభూతి ప్యాకెట్స్ ఇచ్చారో మీకు గుర్తు ఉండదు బహుశ. అక్షయపాత్ర లాగా విభూతి ప్యాకెట్స్ వస్తూనే వున్నాయి.నా బాగ్ లో కమలాపండు అలాగే వచ్చింది. నేను భ్రమ పడుతున్నాను,అనుకున్నాను. కానీ మీ వదిన గారికీ అలాగే అనిపించింది. ఇదంతా నా అనుభూతి. బాబా నా మీద ప్రేమతో ప్రసాదించారు సేవ చేసే భాగ్యాన్ని .నాకు వీలు అయినంత చేసాను. చివరికి ఉమగారిని కూడా నేనే రిసీవ్ చేసుకున్నాను. లేకుంటే తను సమయానికి రాలేకపోవచ్చును. ఇది మొత్తం, మొదట నా కోరిక సేవ చెయ్యాలని నా మీద మీ నమ్మకం, బాబా అనుగ్రహం మన అందరి పైన, వెరసి "విశ్వసాయి ద్వారకా మాయి, కోటి షిర్డీ సాయి గాయత్రి మహామంత్ర జపం దత్త సాయి శాంతి హోమం."అధ్భుతంగా జరిగింది.  ఈ విధంగా నా అనుభూతిని మీతో పంచుకుంటున్నాను గురువుగారు. నా గురించి మీకు బాగా తెలుసు. నేను ఎన్ని సమస్యలలో మునిగి ఉన్నానో. అయినా ఒకటే మార్గం. మీరు నడిచే మార్గం. మీ వెనక మేమంతా ఒక విశ్వశాంతి ప్రభంజనంలా మీ అడుగులో అడుగు వేస్తాము.మా జన్మలు ధన్యం చేసుకుంటాము.

నాకు మనసుకు తోచింది రాసాను.తప్పులు ఉంటే క్షంతవ్యురాలను.సాయి రాం.గురువుగారు.అన్నిటికీ కర్త,కర్మ,క్రియ బాబావారు అనే మీ వాక్యం అక్షర సత్యం.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


సాయిని నమ్ముకో - నమ్మకం వమ్ము కాదు

$
0
0

    Image result for images of shirdisai
     
          Image result for images of pink rose

30.01.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు సాయిలీల నవంవరు – డిసెంబరు, 2019 పత్రికలో ప్రచురింపబడిన సాయిలీలని తెలుగులో అనువాదం చేసి పంపించారు.  దానిని యధాతధంగా ప్రచురిస్తున్నాను.

సాయిని నమ్ముకో -  నమ్మకం వమ్ము కాదు


"ఓం సాయి రాం"సాయి బంధువులు అందరికి.
మీ అందరికి వసంత పంచమి శుభాకాంక్షలు.
ఒక నాస్తికుడిని బాబా ఎలా తన భక్తునిగా మర్చినారో  తెలిపే కథ ఇది.చదివి మీరు ఆనందించండి.
   
 ముంబాయి లో ఉన్న కళ్యాణ్ అనే ఊరిలో వైతరణ లో ఉన్న వీరేంద్ర పాండ్యా గారి స్వీయ అనుభవం.ఆయన మాటల్లోనే.....
   
 మా పరివారం లో అందరంబాగా చదువుకున్న వాళ్ళమే.  కానీ మాకు దైవం మీద అస్సలు విశ్వాసం ఉండేది కాదు.నేను ఒకసారి మా బాబాయ్ వాళ్ళ అబ్బాయితో షిర్డీ వెళ్ళాను.షిర్డీ నుంచి వచ్చేసరికి నాకు తెలిసింది, బీహార్ లో ఉన్న మా తల్లిదండ్రుల కు ఏదో పెద్ద కష్టం వచ్చింది అని.నాకు చాలా బాధ అనిపించింది.అప్పుడు నేను షిర్డీ నుంచి ఒక చిన్న ఫోటో తెచ్చాను బాబా వారిది.అది నా బాగ్ లోనే ఉంది.దాన్ని బయటికి తీసి, బాగా శుభ్రం చేసి ఒక టేబుల్ మీద పెట్టి, ఒక దీపం పెట్టి,"బాబా ,నా పరివారం పైన వచ్చిన కష్టాన్ని దూరం చెయ్యి స్వామి"అని మొక్కుకున్నాను.
     

రెండు,మూడు రోజులు గడిచిపోయినాయి.  మాకు వచ్చిన కష్టం అలాగే వుంది.మళ్ళీ బాబా దగ్గర ఈవిధంగా  ప్రార్థన చేసాను"బాబా, నీకు తెలుసు, నేను అంత భక్తుడిని కాదు.ఎంతో మంది నిన్ను భగవాన్ అని నమ్ముతారు.ఒకవేళ నువ్వు నిజమైన భగవంతునివేఅయితే ఈరోజు సాయంత్రం లోపల మాకు వచ్చిన కష్టాన్నితీర్చు.లేకపోతే నేను నీ ఫోటో తీసేస్తాను.
( మనం అందరం అంతే,భగవంతునికి చాలా పరీక్షలు పెడతాము.పాపం,మన అజ్ఞానాన్ని ఆయన భరించి,మనల్ని సమాధాన పరుస్తాడు.)సాయంత్రం అయ్యేసరికి మా కష్టం దూరం అయింది.నేను మా అమ్మగారికి ఉత్తరంరాసి అన్ని విషయాలు చెప్పాను.అదే సమయం లో మా అమ్మగారు కూడా అన్ని సమస్యలు సమాధానం అయ్యాయి అని జాబు రాసింది.రెండు జాబులు రెండు రోజుల తరువాత చేరాయి.ఈ సంఘటన తరువాత నాకు బాబా మీద భక్తి రెండింతలు అయింది.నా జీవితం మొత్తం బాబా సేవలో గడపాలని నిర్ణయించుకున్నాను.ఇంక పెళ్లికూడా ఇష్టం లేదు.అంతలో మా అమ్మగారు ఇలా అన్నారు, "నువ్వు కర్మయోగిగా బతకాలి"అని.ఎంతైనా అమ్మ కదా.అప్పుడు మళ్ళీ బాబా నే ఆశ్రయించాను.బాబా ఫోటో కింద ఒక తెల్లకాయితం మీద ఇలా రాసి పెట్టాను"బాబా, నీకు నాగురించి, నా మనసులో ఉన్న ఆలోచన గురించి తెలుసు.ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి.? నువ్వు కూడా నాకు రాసి చూపించు బాబా"
   
 నేను ఎదురు చూస్తూ కూచున్నాను, బాబా ఎలా సమాధానం చెప్తారు? అని.ఇంతలో, భావనగర్ నుంచి, శ్రీ సాయి బాబా భక్త మండలి ద్వారా ప్రింట్ అయిన పుస్తకం "శ్రీ సాయి బాబా ఉపాసన"నా చేతికి అందింది
              Image result for saibaba upasana book

పుస్తకంచదువుతూ ఉండగా దానిలో"భావసుధ"అనే అధ్యాయంలో"నువ్వు కర్మయోగ ద్వారా నే నీ జీవితాన్ని గడుపు "అని రాసి ఉంది.అప్పుడు అనుకున్నాను" బాబా, ఈ విధంగా జవాబు ఇచ్చారు"అని.
   
ఇంకో లీల..ఆరోజు బుధవారం.నేను బాబా ఫోటో ముందు నిలబడి "బాబా,రేపు గురువారం,  ఆరోజు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఎవరన్నా సాధువు,  సన్యాసి..మా ఇంటికి రావాలి,వచ్చి నా తలపైన చెయ్యి పెట్టి నా పాదం వరకు  నిమిరి నన్ను ఆశీర్వదించాలి"అని మొక్కుకున్నాను. గురువారం రోజు నేను భోజనానికి కూర్చున్నాను, నిజంగానేఒక సన్యాసి వచ్చాడు.అతనికి బాబా ముందు పెట్టిన ప్రసాదం ఇచ్చాను.అతను వెంటనే వెళ్లిపోయాడునన్ను ఆశీర్వదించకుండానే.నేను అప్పుడు మళ్ళీ మనసులో అనుకున్నాను, బాబా ఎందుకు వెళ్లిపోయినావు? రా బాబా..అని..అతను మళ్ళీ వెంటనే వెనక్కు మా ఇంటికి వచ్చాడు.నేను పెట్టినభోజనం చేసాడు.రెండు రూపాయలు ఇచ్చాను, తీసుకున్నాడు.ఎంతో అందంగా నవ్వారు.నా తల మీద చెయ్యి పెట్టి,నా పాదం వరకు ఆశీర్వదించారు నేను అనుకున్నట్లు.నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి.ఆనందంతో ఆయన కాళ్ళ మీద పడ్డాను.నాతో అన్నారు"వచ్చే గురువారం మళ్ళీ వస్తాను...అన్నారు.నేను అన్నాను,వీలు అవ్వదు, నేను వచ్చే గురువారం షిర్డీ లో ఉంటానుఅన్నాను.దానికి ఆయననేను నీకు"అక్కడే కనపడతాను"అని.
   తరువాతగురువారానికిమేము షిర్డీ వెళ్ళాము.అక్కడ మధ్యాహ్న ఆరతి జరుగుతూవుంది.అకస్మాత్తుగా  నాకు బాబా విగ్రహం లో ఆ సన్యాసి కనిపించాడు.నాకు చెప్పలేనంత ఆనందం వేసింది.బాబా సర్వాంతర్యామి.ఆయనకు అసాధ్యం ఏమి ఉండదు.అంతా మన నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది.ఇలాఎన్నో లీలలు నా జీవితం లో కలిగాయి.
 "సర్వం సాయినాధార్పణమస్తు"
         వీరేంద్ర పాండ్యా..సాయి లీల..నవంబర్...డిసెంబర్.


శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు - 3 వ.భాగమ్

$
0
0

Image result for images of shirdisaibaba preaching and listening
Image result for images of rose hd

01.03.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి భక్తులందరికి బాబావారి శుభాశీస్సులు
ఈ వారం నుండి మరలా బాబా వారు తెలియచేసిన  శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు 3 వ.భాగాన్ని ప్రచురిస్తున్నాను.  చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.


శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు  -  3 .భాగమ్

14.01.2020   ఋణానుబంధ విముక్తి

నీవు ఎవరినుండినయినా ధన సహాయము గానిమాట సహాయము గాని పొందినచోవారికి కృతజ్ఞతాభావంతో ఉండు.  వారికి తిరిగి సహాయము చేయలేకపోయినా కనీసం వారు మరణించిన రోజున వారి పార్ధివశరీరముపై ఒక పూలమాలను వేసి వారిపట్ల నీకృతజ్ఞతా భావమును తెలియచేయి.




శ్రీ సాయి సత్ చరిత్ర 31అధ్యాయాన్ని ఒక సారి గమనిద్దాము.

మేఘా చనిపోయినప్పుడు భక్తులు, గ్రామస్థులు శ్మశానానికి వెళ్ళారు.  బాబా కూడా వెళ్ళి మేఘాపై పుష్పాలు చల్లారు.  ఉత్తరక్రియలు జరుగుతుంటే భక్తసఖుడైన బాబామాయలో ఉన్న మానవునివలె కళ్ళనీరు కార్చి శోకించారు.  తమ చేతులతో ప్రేమగా శవాన్ని పూలతో కప్పారు.  దుఃఖిస్తూ వెనుకకు మరలారు.”

15.01.2020   స్నేహము – స్నేహితులు

నేటి సమాజములో మూడు రకముల స్నేహితులు ఉన్నారు.  వారిలో ఉత్తములతోనే నీవు స్నేహము చేయి.
వివరణ :    1.  ఉత్తములు -  వీరు తమవద్ద ఉన్న జ్ఞానమును నిస్వార్ధముగా ఇతరులకు పంచిపెడతారు.
           2.  మధ్యములు -  వీరు తమకు ఉన్న జ్ఞానమును అహంకారముతో ఇతరుల ముందు ప్రదర్శించి వారికి పంచుతారు.
          3.  అధములు -  వీరు తమవద్ద ఉన్న జ్ఞానమును సంకుచిత భావంతో తమ వద్దనే ఉంచుకుని సమాజానికి పనికిరానివారిగా మిగిలిపోతారు.

16.01.2020  ధనవంతులతో స్నేహము -  మాటల వరకే

నీవు వారి ఇండ్లకు వెళ్ళినా వారి ఇంట పనిచేస్తున్నవారు మాత్రమే నిన్ను పలకరించినీకు అతిధి సత్కారాలు చేస్తారు.  ఆ తరవాతనే ఆ ఇంటియజమాని మేడపైనుండి దిగి వచ్చినిన్ను పలకరించినిన్ను నీఇంటికి సాగనంపుతాడు.  అందుచేతనే ధనవంతులతో స్నేహము ఉన్నా వారినుండి ఏమీ ఆశించరాదు.  స్నేహము ఎల్లపుడూ సమ ఉజ్జీగలవారితోనే చేయవలెను.

(శ్రీ సాయి సత్ చరిత్ర   47 అధ్యాయములోని వీరభద్రప్ప – చెన్న బసప్పల విషయం మనం గుర్తుచేసుకుందాము)

17.01.2020  -  ధనసంపాదనలో అత్యాశ

నా భక్తుడు ఒకడు జీవనోపాది కోసం నా ఆశీర్వచనాలతో కిరాణా దుకాణము పెట్టుకుని సంతృప్తిగా జీవించసాగాడు.  కొంతకాలానికి అతను ధనవ్యామోహంతో నామాట వినకుండా అప్పులు చేసి వజ్రాలవ్యాపారము ప్రారంభించాడు.  వ్యాపారములో భాగంగా అద్దాలగదిలో వజ్రాలను ప్రదర్శించి తన ఆడంబరత్వాన్ని సమాజానికి చూపించాడు.  
            Image result for images of diamonds shop in glass room
కొందరు దొంగలు అతను దుకాణములో లేని సమయంలో ప్రవేశించిఆ అద్దాలగదిని పగలగొట్టి వజ్రాలను దొంగిలించి వెళ్ళిపోయారు.  ఆ బాధను తట్టుకోలేక నా భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  నేను వానిని వారించినా నామాట వినకుండా ధన వ్యామోహమునకు పోయి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.

విశ్లేషణ  -  దామూ అన్నా కాసార్
ఇటువంటి సందేశము మనము శ్రీసాయి సత్ చరిత్ర  25 .  అద్యాయములో  చూడగలము.
దామూ అన్నా కాసార్ ధనముపై అత్యాశతో జట్టీ వ్యాపారం చేయడానికి బాబా అనుమతి కోరినపుడు బాబా వానిని ధనవ్యామోహంతో అత్యాశకు పోవద్దని చెప్పిఉన్న సగము రొట్టిని తిని ప్రశాంతముగా జీవించమని ఆదేశించారు.
ఈ విషయమును మనము సదా గుర్తుంచుకొనవలెను. ---   త్యాగరాజు
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
Viewing all 726 articles
Browse latest View live