Quantcast
Channel: Telugu Blog of Shirdi Sai Baba,read sai leels,devotees experiences in telugu
Viewing all 726 articles
Browse latest View live

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 5

$
0
0


01.11.2012 గురువారము

ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 5వ. భాగము

ఈ రోజు సాయి బా.ని.స.చెపుతున్న శ్రీకృష్ణునిగా శ్రీసాయి వినండి.





శ్రీకృష్ణునిగా శ్రీసాయి 

తనను మశ్చీంద్రఘడ్ లో పూజించమని బాబా బలరాం మాన్ కర్  తో చెప్పారు. ఆయన అక్కడ ప్రత్యక్షంగా బాలారాం మాన్ కర్  కు దర్శనమిచ్చి, తాను షిరిడీకి మాత్రమే పరిమితం కాదనీ సర్వత్రా నిండి యున్నానని నిరూపించారు.


మరొక సంఘటనలో చందోర్కర్ కు పండరీపురానికి బదిలీ అయింది. చందోర్కర్ తనతో కూడా బాబాను పండరీపూర్ కు  తీసుకొనివెడదామనుకొన్నాడు. అతను బాబా అనుమతి తీసుకోవడానికి షిరిడీ వచ్చాడు.  ఆసమయములో బాబా మనమందరమూ పండరీపూర్ వెళ్ళవలెను అని భజన్ పాట పాడుతూ ఆ భజనలో మునిగిపోయి ఉన్నారు. భక్తులందరూ బాబా చుట్టూ కూర్చొని వున్నారు. దూరం నుంచే  బాబా, చందోర్కర్ మనసులో ఏముందో తెలుసుకొని దానికి అనుగుణంగా బాబా తన భక్తులందరితో కలిసి పాడుతున్నారు. 

ఒకసారి బాబా తన దర్బారుకు అతిధులు, శ్రేయోభిలాషులు వస్తారని ముందుగానే చెప్పారు. తరువాత దురంధర్ సోదరులు ద్వారకామాయికి వచ్చినప్పుడు, ఉదయం వారి గురించే తాను చెప్పానని బాబా అన్నారు. ఈ ఉదాహరణల వల్ల వివేక వైరాగ్యాలను పొందిన తరువాత బాబాకు అష్టసిధ్ధులు లభించాయని మనకు అర్ధమవుతుంది.

చిత్రకేతు మహారాజుకు అనేక మంది భార్యలున్నప్పటికీ ఆయనకు సంతానం లేదు. 


అంగీరస మహాముని మహారాజు చేత పుత్రకామేష్టి యాగం చేయించిన తరువాత, పుత్రుడు జన్మించాడు. ఇటువంటిదే మనకు సాయి సత్చరిత్రలో కనపడుతుంది. నానాసాహెబ్ డేంగ్లే కి కూడా సంతానం లేదు. రతంజీ షాపూజీ వాడియా కు 12 మంది కుమార్తెలు, కాని మగ సంతానం లేదు. బాబా ఆయనకు పుత్రుడిని ప్రసాదించారు. దాము అన్నా కాసర్ కు ఇద్దరు భార్యలున్నా గాని సంతానం కలగలేదు. బాబా అతనికి రెండు మామిడిపళ్ళను ఇచ్చి ఒకటి చిన్నభార్యకు ఇమ్మని చెప్పారు. 


బాబా అనుగ్రహంతో ఆమెకు సంతానం కలిగింది.  

1896 లో గోపాల్రావ్ గుండు అనే సబ్ యిన్ స్పెక్టర్ కు కూడా ఇద్దరు భార్యలున్నా సంతానం లేదు.  బాబా అనుగ్రహంతో అతనికి సంతానం కలిగింది. ఈనాడు వైద్య శాస్త్రం ఎంతగానో అభివృధ్ధి చెందడంవల్ల, గైనకాలజిస్టుల రూపంలో బాబా ఎంతో మంది సంతానం లేనివారిని అనుగ్రహిస్తున్నారు. 


ఔరంగాబాద్కర్ భార్య బాబా దర్శనానికి వచ్చి, తాను తనకన్న వయసులో బాగా పెద్దయిన వ్యక్తిని  వివాహం చేసుకొన్నాననీ తనకు సంతానాన్ని అనుగ్రహించమని వేడుకొంది. మొదట బాబా ఒప్పుకోలేదు, కాని శ్యామా కలుగచేసుకొన్న తరువాత ఆమెకు ఒక కొబ్బరిచిప్ప నిచ్చి తినమని చెప్పారు. ఆతరువాత  ఆమెకు పుత్ర సంతానం కలిగింది.

హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు నవవిధ భక్తి యొక్క ప్రాముఖ్యాన్నితన  వివరించాడు. ప్రహ్లాదుడు తనతండ్రికి విష్ణువును పూజించమని ఆయనకు విధేయుడై ఉండమని చెప్పాడు.ఇక్కడ మనకు ఒక కుమారుడు,  కల్మషాలను తొలగించుకొని పరిశుధ్ధుడవమనీ, నవవిధ భక్తి గురించి ప్రాముఖ్యాన్ని తన తండ్రికి వివరించడం మనకు కనపడుతుంది. కాని హిరణ్యకశపుడు రాక్షసుడు. 
          

సహజంగా అతనిది రాక్షస ప్రవృత్తి. ఈ కారణంవల్లే అతను విష్ణుమూర్తికి బధ్ధ విరోధి.  కాని అతని కుమారుడు విష్ణుమూర్తికి అత్యంత ప్రియతమ భక్తుడు. 

21వ. అధ్యాయంలో బాబా కూడా నవవిధ భక్తి గురించి చెప్పారు. ఆయన పాటంకర్ ను పిలిచి 9 గుఱ్ఱపు లద్దెలను ఏరుకొన్నావా అని అడిగారు. అతనికి ఒక్క ముక్క కూడా అర్ధంకాక, కేల్కర్ ను పిలిచి దానిలోని అంతరార్ధమేమిటని అడిగాడు.  అశ్వము భగవంతుని అనుగ్రహానికి గుర్తు అని కేల్కర్ చెప్పాడు. శ్రీమహావిష్ణువు అవతారాలలో హయగ్రీవ అవతారం, (ముఖం అశ్వపు ముఖము.)


ఆవిధంగా బాబా భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకున్నావా అని పాటంకర్ ని అడిగారు.  బాబా మహాసమాధి చెందడానికి ముందు లక్ష్మీబాయ్ షిండేకి 9 నాణాలనిచ్చారు.  


తొమ్మిది నాణాలు నవవిధభక్తికి ప్రతీక. ఆవిధంగా బాబా మనకు వాటియొక్క ప్రాముఖ్యాన్ని చెప్పి మనమందరమూ కూడా వాటిని ఆచరించవలసిన అవసరాన్ని గురించి తెలిపారు.

(యింకా ఉన్నాయి పోలికలు)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 6వ. భాగము

$
0
0




08.11.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

                                                     

సాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా శ్రీసాయి



శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 6వ. భాగము

ప్రహ్లాదునికి తన తండ్రి హిరణ్యకశిపుని దుష్ప్రవర్తన చాలా క్షోభ కలిగించింది.  మీరు త్రిలోకాలను జయించారు గాని, మీలో ఉన్న అరిష్డ్వర్గాలను జయించలేకపోయారని తండ్రితో అంటు ఉండేవాడు ప్రహ్లాదుడు. 



నువ్వు వాటిని జయించు నేను నీకు దాసోహమంటాను అన్నాడు.

ఎవరిని జయించాలి అన్నాడు హిరణ్యకశపుడు.  

కామ, క్రోధ, లోభ, మోహ,మద,మాత్సర్యాలు, నీలో ఉన్న ఈ అరిషడ్వర్గాలను  జయించమని తన తండ్రికి సలహా ఇచ్చాడు. 

సాయి సత్చరిత్రలో  ఆత్మారాం తార్ఖడ్ భార్యకు బాబా ఇదే విధమైన సలహా ఇచ్చారు. తార్ఖడ్ బొంబాయిలోని ఖటావూ మిల్స్ కు జనరల్ మానేజర్. ఆమె బాబావద్ద శెలవు తీసుకొని వెళ్ళబోయేముందు ఆమెలో ఇంకా అహంకారం మిగిలి ఉంది. బాబా ఆమెను ఆరురూపాయలు దక్షిణ కోరారు. వారు షిరిడీనుంచి బొంబాయికి తిరుగు ప్రయాణములో ఉన్నందున వారి వద్ద అంత డబ్బులేదు. 

బాబా దక్షిణ అడగడంలోని ఆంతర్యం ఆత్మారాం తార్ఖడ్ ఆమెకు వివరించాడు. అరిషడ్వర్గాలనే దుష్ట శత్రువులను తిరుగు ప్రయాణంలో తన పాదాలవద్ద పెట్టి ఆశీస్సులు పొందమని బాబా ఉద్దేశ్యమని తార్ఖడ్ చెప్పారు. ఆమె తార్ఖడ్ చెప్పినట్లే చేసినతరువాత బాబా చిరునవ్వుతో ఆమెను ఆశీర్వదించారు. ఆవిధంగా భాగవతంలో చెప్పబడినదానికి, బాబా తన భక్తులకు చెప్పినదానికి గల పోలికలను గమనించగలము.   

భాగవతంలో గజేంద్రుడు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియతమ భక్తుడు. గజేంద్రుని కాలు మొసలి పట్టుకున్నపుడు 1000 సంవత్సరాలు దానితో పోరాడి ఇక శక్తి సన్నగిల్లి, తనను రక్షించమని శ్రీమహావిష్ణువుకు మొఱ పెట్టుకున్నాడు. శ్రీమహావిష్ణువు వెంటనే వచ్చి గజేంద్రుని రక్షించాడు. 

శ్రీసాయి సత్ చరిత్రలో కూడా మనకు ఇటువంటిదే కనపడుతుంది. అవి 1914 వ. సంవత్సరములో మొదటిప్రపంచపు యుధ్ధం జరుగుతున్న రోజులు.  బ్రిటిష్ వారి యుధ్ధ నౌకలో భారతదేశానికి చెందిన జెహీంగర్వాలా కాప్టెన్ గా  ఉన్నారు. 


రష్యా దేశపు దగ్గరలో ఉన్న సముద్రంలో యుధ్ధం జరుగుతోంది. శత్రువుల సబ్ మెరైన్  నించి ప్రయోగించిన టార్పెడొ యుధ్ధ నౌకని ఢీకొంది. మునిగిపోతున్న నౌకలోని నావికులందరూ ప్రాణభయంతో సముద్రంలోకి దూకారు. ఒక కాప్టెన్ గా తాను ఆవిధంగా చేయకూడదు. అతను బాబా భక్తుడు. అతని జేబులో ఎప్పుడు బాబా ఫొటో ఉంటుంది. ఆప్రమాదాన్నించి రక్షించమని అతడు సాయిని వేడుకొన్నాడు. అదే సమయంలో బాబా చుట్టూ ఉన్న భక్తులంతా బాబా శరీరరం నుండి 2,3 బకెట్ల నీరు పొంగి పొర్లడం చూశారు.  బాబా తన శరీరాన్ని కుదించుకొని, టార్పెడొ ఓడకు చేసిన రంధ్రంలోనికి ప్రవేశించి, ఓడను మునిగిపోకుండా, తన భక్తుడు కాప్టెన్ జెహంగీర్వాలాను అతని ఓడను  రక్షించారు. 


ఆసమయంలో ఈ దృశ్యాన్ని వీక్షించిన  భక్తులు మాత్రమే దీనిని  అర్ధం చేసుకోగలరు. యుధ్ధము ముగిసిన రెండు నెలల తరువాత కాప్టెన్ జెహెంగీర్వాలా  బాబా దర్శనానికి వచ్చి మునిగిపోతున్న నౌకనుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు.  భాగవతంలో శ్రీమహావిష్ణువు గజెంద్రుని రక్షించడం, వేయి మైళ్ళ దూరంలో యుధ్ధంలో పోరాడుతున్న జెహంగీర్వాలాను బాబా రక్షించడం, ఈ రెండిటికి ఎంతటి అద్భుతమైన పోలిక ఉన్నదో  గ్రహించగలరు.

శ్రీసాయి సత్ చరిత్ర 7వ. అధ్యాయములో, ఒక కమ్మరివాని భార్య తన భర్త పిలిచినందున ఒడిలో బిడ్డ ఉన్న సంగతిమరచి హటాత్తుగా లేవగా, ఆమె ఒడిలోని బిడ్డ ప్రమాదవశాత్తూ  కొలిమిలో పడకుండా బాబా ఎట్లు రక్షించారో మనకు తెలుసు. బాబా ద్వారకామాయిలో ధుని ముందు కూర్చొనివుండగా 


బాబా తన చేతిని ధునిలో పెట్టి ఆ బిడ్డను ప్రమాదం నుంచి కాపాడారు.  బాబా చేయి ధునిలోని అగ్నికి కాలింది. శ్రీమహావిష్ణువు తన భక్తులను ఏవిధముగానైతే రక్షించారో అదే విధంగా బాబా కూడా తన భక్తులను ప్రమాదాల బారిన పడకుండా రక్షించారు. ఈ విధంగా మనకు ఎన్నో పోలికలు  భాగవతంలోను, శ్రీ సాయి సత్చరిత్రలోను కనపడతాయి


(యింకా ఉన్నాయి)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు





శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 7వ. భాగము

$
0
0



09.11.2012 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి సత్ చరిత్ర  చదవడం ఒక ఎత్తయితే దానిని అర్ధం చేసుకోవడం మరొక ఎత్తు.  అందుకనే సత్ చరిత్ర పారాయణ అన్నది ఏదో మొక్కుబడిగా అమ్మయ్య ఇవాళ్టికి పారాయణ అయిపోయింది అనుకుని చదివితే ఏవిధమైన లాభము ఉండదు.  చదివినదాన్ని బాగా జీర్ణించుకోవాలి. అర్ధంచేసుకోవాలి. 



ఒక వారం పారాయణ చేద్దాము, ఎప్పుడు పూర్తవుతుందో  అని చూడకుండా ప్రతీరోజు  వీలయితే ఒక అధ్యాయంగాని, కుదరకపోతే ఒకపేజీ గాని మరీ వీలు కానప్పుడు ఒకటి రెండు పేరాలు చదువుకోవాలి.  చదివినదాన్ని బాగా అర్ధం చేసుకోవాలి. 
                          
బాబా వారు మనకు సాయి.బా.ని.స. ద్వారా సాయి తత్వాన్ని, సాయి ఈ కలియుగంలోనే కాదు, యుగ యుగాలలోనూ ఉన్నారు అనే  సత్యాన్ని మనకందరకూ అర్ధమయేలా చాలా సరళంగా చెపుతున్నారు. ఇది బాబా మన సాయి బంధువులందరకూ ఇచ్చిన అదృష్టమనే చెప్పాలి. సత్ చరిత్రలో బాబా చెప్పారు. నా వయసు లక్షల సంవత్సరాలు అని.  ఈ విధంగా మనకు బాబా చెప్పిన మాటలను ఋజువుచేస్తూ సాయి.బా.ని.స. రామాయణంలో సాయి, భాగవతంలో సాయి పోలికలను మనందరము  గ్రహించుకొనేలా చక్కగా చెపుతున్నారు. 


 ఇక ఈరోజు సాయి.బా.ని.స చెపుతున్న శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 7వ.భాగము వినండి.



ఓం సాయిరాం 


                                                                                                                



శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 7వ. భాగము

ఇక ఇప్పుడు భాగవతం విషయానికి వస్తే దేవతలు ధర్మాన్ని తప్పి అధర్మ మార్గాన్ని అనుసరించి ప్రవర్తించడం మొదలుపెట్టారు.  రాక్షసులు దీనిని అవకాశంగా తీసుకొని దేవతలనందరినీ ఇంద్రలోకం నుండి వెళ్ళగొట్టి దానిని ఆక్రమించారు. దేవతలందరూ వీధినపడ్డారు. దేవమాత భర్త కశ్యప, కుమారులందరూ ఎందుకలా తయారయ్యారని ఆమెను ప్రశ్నించాడు. 

వారు ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారా? అతిధులను గౌరవభావంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారా? సాధువులకు ఆతిధ్యమిచ్చి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారా?  ఆవిధంగా కశ్యపుడు దేవమాతకు అన్నీ వివరంగా చెప్పి దేవతలు ధర్మాన్ని తప్పినందువల్లే రాక్షసులు వారిని సులభంగా జయించారని చెప్పాడు. 

మన సాయినాధులవారు కూడా ఇదేవిషయాన్ని చాలా సరళంగా తనభక్తులందరికీ వివరించారు. ఆయన తనభక్తులందరకూ స్వయంగా వండి వడ్డించేవారు.
                              
"భోజనము వేళ మనయింటికి అతిధులు ఎవరువచ్చినా వారికి ఆతిధ్యమివ్వడం మన సాంప్రదాయం.  వయసుమళ్ళినవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి ముందర భోజనం పెట్టవలెననీ, ఆకలిగొన్నవారికి ఇచ్చే ఆతిధ్యం ఎంతో సత్ఫలితాలనిస్తుంది" అని బాబా చెప్పారు.
  
                            
ఇప్పుడు భాగవతంలోనికి వద్దాము. దూర్వాస మహర్షి వల్ల అంబరీషుడు కష్టాలనెదుర్కొన్నాడు. 

                                                 
అంబరీషుడిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని దూర్వాసుని మీద ప్రయోగించాడు.
                                
దూర్వాసుడు పరిగెడుతూ ఇక ఆఖరికి పరుగెత్తలేక ఆగిపోయి, తనను రక్షించమని శ్రీమహావిష్ణువు శరణు వేడుకొన్నాడు.  రక్షించడం తనవల్ల కాదని చెప్పి అంబరీషుని వద్దకు వెళ్ళమని చెప్పాడు శ్రీమహావిష్ణువు. తాను తన భక్తులకు సేవకుడిననీ, వారిని రక్షించడానికి తాను ఎక్కడికయినా సరే ఎంతవరకయినా సరే వెడతానని, ఆవుదూడ తనతల్లిని ఎలాగయితే అనుసరిస్తూ వెడుతుందో 

                                          
తాను కూడా తనభక్తులను అనుసరించే వుంటాననీ, తాను చేయగలిగిందేమీ లేదనీ అంబరీషుడు ఒక్కడే నిన్ను రక్షించగలవాడు" అని  శ్రీమహావిష్ణువు చెప్పాడు. ఆఖరికి దూర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్ళగా అంబరీషుడు ఆయనను  రక్షించాడు.
                            
శ్రీమహావిష్ణువు ఏమాటలయితే చెప్పారో, బాబా కూడా శ్రీసాయి సత్చరిత్ర 15వ. అధ్యాయంలో చెప్పారు. "చేతులు చాచి పిలచినంతనే తాను తన భక్తులవద్ద రేయింబవళ్ళు ఉంటానని బాబా చోల్  కర్ తో చెప్పారు. మీహృదయంలోనే నానివాసం, 
                      

నేను మిమ్మలిని సదా కాపాడుతూ ఉంటాను. భక్తుల కష్ట సుఖాలలో తాను కూడా భాగం పంచుకుంటానని చెప్పారు. 
                                       


లక్ష్మీ కాపర్దే కుమారుడు ప్లేగు వ్యాధితో బాధపడుతున్నపుడు, బాబా తన కఫ్నీని ఎత్తి తన చంకలఓ ఉన్న బొబ్బలను చూపించి, తనను ఆర్తితో రక్షించమని వేడుకొన్న తన భక్తుల బాధలను తాను అనుభవిస్తానని చెప్పారు. "తొందరలోనే మబ్బులు మాయమయి ఆకాశం నిర్మలంగా ఉంటుంది." అన్నారు. అనగా దాని అర్ధం ఆమె కుమారునికి త్వరలోనే నయమవుతుందనీ, అమరావతికి వెళ్ళవలసిన అవసరం లేదనీ చెప్పారు.  శ్రీమహావిష్ణువు తనభక్తులకు చెప్పినదానిని బాబా ప్రత్యక్షంగా చూపించారు. 

నేనిప్పుడు ఒక ఆసక్తికరమయిన విషయాన్ని వివరిస్తాను.  గంగ శ్రీమహావిష్ణువు పాదాల వద్ద పుట్టి భూమిని చేరేముందు పరమశివుని శిరసుపై చేరింది. 

                                               

గంగ శ్రీమహావిష్ణువుయొక్క చరణకమలాల వద్ద పుట్టినదనే ముఖ్యమయిన విషయం చెప్పబడింది. దాసగణు తాను హరిద్వార్ వెళ్ళి గంగలోమునిగి తన మొక్కును తీర్చుకుని వస్తానని బాబా అనుమతిని అడిగినట్లు మనకు 4వ అధ్యాయములో కనపడుతుంది. అంత దూరము వెళ్ళడమెందుకు, గంగా యమునలు ఇక్కడనే ఉన్నవి అని బాబా చెప్పి తన పాదాల బొటనవేళ్ళనుండి గంగా యమునలను స్రవింపచేశారు. 


దాసగణు ఆనీటిని తన శిరసుపై జల్లుకున్నాడు. తన అహంకారం వల్ల దానిని తీర్ధంగా తీసుకొనలేకపోయానే అని తన విచారాన్ని స్తవనమంజరిలో వ్యక్తం చేశారు దాసగణు. 


గంగ శ్రీమహావిష్ణువు పాదాల చెంత పుట్టింది అదే అద్భుతాన్ని బాబా ద్వారకామాయిలో చూపించారు.    


(మరికొన్ని పోలికలకు ఎదురు చూడండి...)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 8వ. భాగము

$
0
0


                                                     


11.11.2012  ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దీపావళి శుభాకాంక్షలు
సాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా శ్రీసాయి వినండి


శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 8వ. భాగము



మనమిప్పుడు భాగవతంలోని రంతిదేవ మహారాజు చరిత్రను తెలుసుకొందాము. 





ఆయన తనవద్ద ఉన్నదంతా దానధర్మాలు చేసి ఇక ఏమీలేని బికారి  స్థితికి చేరుకొన్నాడు. ఆదశలొ ఎవరైనా అడిగినప్పుడు తాను తింటున్న దానిని కూడా కాదనకుండా దానం చేస్తూ ఉండేవాడు. 
 

1908 నుంచి 1918 మధ్యకాలంలో బాబా రోజూకు సుమారు ఐదువందల రూపాయలదాకా దక్షిణగా స్వీకరిస్తూ ఉండేవారు. 


దక్షిణగా వచ్చినదానినంతా అవసరంలో ఉన్నవారికీ, బీదవారికీ పంచిపెడుతూ ఉండేవారు. అమలికి 2/-,జమాలీకి 3/-,బాయిజాబాయికి 25/-

తాత్యాకు 25/- రూపాయలు ఇస్తూఉండేవారు. అలా ఇచ్చి మరుసటిరోజుకు ఫకీరయిపోయేవారు. బాబా మరలా బిక్షకు వెళ్ళేవారు.


 బాబా ప్రతీరోజూ అయిదు ఇళ్ళవద్ద బిక్షను స్వీకరించేవారు. అలా స్వీకరించిన భిక్షగా వచ్చిన కూరలు, రొట్టెలు అన్నిటినీ  కలిపేసేవారు. రుచిని కూడా పట్టించుకునేవారు కాదు. ఆయన బిక్షగా తెచుకున్నదానిని పిల్లులు, కుక్కలు తింటు ఉండేవి. ద్వారకామాయిలోని సాయినాధులు ఎలాగో భాగవతంలోని రంతి దేవుడు కూడా అట్లాంటివారే అని నేను భావిస్తున్నాను.  

మరలా భాగవతం విషయానికి వస్తే కృష్ణుడు తన చిన్నతనంలో కాళీయ మర్ధనం చేశాడు. కాళీయ మర్ధనం చేసిన తరువాత కాళీయుడికి గర్వమణగి యమునానది నుంచి బయటకు వచ్చాడు.



తాను నీటినుంచి బయటకు వచ్చిన వెంటనే తనను చంపడానికి గరుత్మంతుడు తయారుగా ఉంటాడని కృష్ణునికి చెప్పాడు కాళీయుడు. కృష్ణుడు "భయపడకు, నీపడగమీద నాపాదముద్రలు ఉంటాయి. అపుడు గరుత్మంతుడు నీకు హాని తలపెట్టలేడు. నీకు నేను ఆ హామీ ఇస్తున్నాను. నాపాదముద్రలు నిన్ను రక్షిస్తాయి" అని చెప్పాడు. ఆవిధంగా కృష్ణుడు తాను బాలుడిగా ఉన్నప్పుడే అభయమిచ్చాడు.    

శ్రీసాయి సత్ చరిత్ర 5వ.అధ్యాయములో బాబా తన పాదుకలను వేపచెట్టుక్రింద ప్రతిష్టించదానికి అంగీకరించారు. 1912 వ. సంవత్సరములో వాటిని ప్రతిష్టిస్తున్నపుడు ఇవి భగవంతుని పాదుకలని చెప్పారు. ఏ భక్తులయితే ఈ పాదుకలకు నమస్కరించి, గురు,శుక్రవారములలో ధూపము వేయుదురో వారి భయాలన్ని తొలగి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. శ్రీకృష్ణుడు కాళీయునికి ఎటువంటి అభయమిచ్చాడొ అదే అభయాన్ని  బాబా తనభక్తులకు ఇచ్చారు. బాబా ఎప్పుడూ అవి తన పాదుకలని చెప్పలేదు. భగవంతుని పాదుకలని చెప్పారు. 

ఇంతవరకు మనం శ్రీకృష్ణుడు చెప్పినది విన్నాము.  ఇప్పుడు ఆయన లీలను కూడా విందాము.  అవే లీలలను బాబా కూడా చేసి చూపించారు.  ఆరోజులలో కృష్ణుడు గోపికలు,యాదవులు, గోవులతో అడవిలో వెడుతుండగా అరణ్యం మధ్యలోమంటలు చెలరేగి అందులో చిక్కుకొన్నారు.






వారందరూ రక్షించమని శ్రీకృష్ణుని వేడుకొన్నారు. వారందరూ తనని నమ్ముకొన్నారు, వారిని కాపాడటం తన విధి అని శ్రీకృష్ణుడు గ్రహించాడు.  అప్పుడు ఆయన 14/15 సంవత్సరాల బాలుడు. అప్పుడాయన ఏంచేశారు? తన నోరు తెరిచారు. అరణ్యంలోని అగ్నినంతటినీ మింగివేశారు. 


బాబా కూడా ఇదేవిధమైన లీలను చూపించారు. శ్రీసాయి సత్ చరిత్ర 11వ. అధ్యాయములో ద్వారకామాయిలో ధునిలోని మంటలు హటాత్తుగా పైపైకి ఎగసిపడసాగాయి.  


అక్కడవున్న భక్తులందరూ భయంతో ఏమిచేయాలో పాలుపోక నిశ్చేష్టులయిపోయారు. జరుగుతున్నదానిని బాబా వెంటనే గ్రహించుకొని, తన చేతిలో ఉన్న సటకాతో ద్వారకామాయిలోని స్థంభాలమీద కొడుతూ చెలరేగుతొన్న అగ్నిని తగ్గు, తగ్గు అని అధికార స్వరంతో ఆజ్ఞాపించారు.  


ఒక్కొక్క సటకా దెబ్బకి ధునిలోని మంట తగ్గుతూ వచ్చింది. కొద్ది నిమిషాలలోనే ధునిలోని మంట మామూలు స్థితికి వచ్చింది. అడవిలో చెలరేగిన మంటలనుండి శ్రీకృష్ణుడు తన భక్తులను ఎలాగయితే కాపాడారో అదేవిధంగా బాబా ద్వారకామాయిలో మంటలలో చిక్కుకొన్న తన భక్తులను కాపాడారు.   


(మరిన్ని పోలికలు....)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


కృష్ణునిగా శ్రీసాయి 9వ. భాగము

$
0
0

                                             
                                       
12.11.2012 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                        మరియు 
           దీపావళి శుభాకాంక్షలు
                                   
సాయి బా ని స చెప్పిన కృఇష్ణునిగా శ్రీసాయి 9వ. భాగము వినండి.









కృష్ణునిగా శ్రీసాయి 9వ. భాగము 

కృష్ణునికి 12సంవత్సరాల వయసప్పుడు మరొక సంఘటన జరిగింది. ఇంద్రుడికి యాదవుల మీద క్రోధం కలిగింది. వారిపై సుడిగాలు, ఉరుములు మెరుపులతో పెద్ద కుంభవృష్టిని కురిపించాడు. గోపికలు, ఇంకా వృధ్ధులందరూ కూడా కష్ణుని వద్దకు వచ్చి తమను ఆ ప్రకృతి వైపరీత్యాన్నుండి రక్షించమని వేడుకొన్నారు. 


కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన చిటికెనవేలి మీద నిలబెట్టివారందరికీ దానికింద రక్షణకల్పించాడు.
 
మరి సాయికృష్ణులవారు ఏమిచేశారు? శ్రీ సాయి సత్చరిత్రలోని 11వ. అధ్యాయాన్ని సమీక్షిద్దాము. ఒకరోజు సాయంత్రం షిరిడీలో పెద్ద గాలివానతో తుఫాను సంభవించింది. 

భక్తులందరూ ద్వారకామాయిలోకి వచ్చి తమను  రక్షించమని బాబాను వేడుకొన్నారు. బాబా నల్లని మబ్బులతో కమ్ముకొని ఉన్న ఆకాశం వైపు చూసి "ఆగు, నీప్రతాపాన్ని తగ్గించు. నెమ్మదించు" అని తీవ్రస్వరంతో గర్జించారు.

వర్షం తగ్గి అంతటా ప్రశాంత వాతావరణం నెలకొనగానే భక్తులందరూ బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొని తమ తమ యిండ్లకు వెళ్ళారు. కృష్ణుడు తన భక్తులను ఏవిధంగా రక్షించాడొ, అదేవిధంగా బాబా షిరిడీలోని తనభక్తులను రక్షించారు. 

ఇప్పుడు మనం కుచేలుని కధను తెలుసుకొందాము. కుచేలుడు రాగానే కృష్ణుడు అతనిని ఆలింగనం చేసుకొని సాదరంగా ఆహ్వానించి తన సిం హాసనము  మీద కూర్చుండబెట్టాడు. 
బంగారు కలశంలోని నీటితో అతని పాదాలను కడిగి, చందనం అద్ది, కుచేలునిపై తనకున్న  ప్రేమను వ్యక్తీకరించాడు.  
 
శ్రీసాయి సత్ చరిత్ర 27వ. అధ్యాయములో కాపర్దే భార్య బాబాకి భోజనానికి సాంజా,పూరీ, అన్నం, మధ్యాహ్న్నము వేళ పట్టుకొని వచ్చింది. బాబా ప్రేమతో ఆమె తెచ్చినవాటిని కడుపారా భుజించారు. ఆమె బాబా పాదాలను వత్తుతుంటే, బాబా ఆమె చేతులను ఒత్తసాగారు. అది భగవంతునికి భక్తునికి మధ్య భేదం లేదు అన్నది తెలపటానికే.

తనకు బహుమతిగా అది ఎంత చిన్నదైనా సరే ఏమి తీసుకొని వచ్చావని కృష్ణుడు కుచేలుణ్ణి పరిహాసంగా అడిగాడు.  మూటలో కట్టుకొని వచ్చిన అటుకులను ఇవ్వడానికి కుచేలుడు మొదట సందేహించాడు. తరువాత కృష్ణునికి అవి సమర్పించాడు. దానినే పరమాన్నంగా భావిస్తానని కృష్ణుడు దానిని స్వీకరించాడు.

1914 వ.సంవత్సరములో శ్రీరామనవమి రోజున ఒక వృధ్ధురాలు, తాను చేసుకొని వచ్చిన మూడు రొట్టెలను బాబాకు సమర్పించడానికి ద్వారకామాయికి వచ్చి తనవంతు కోసం ఆతృతగా నిరీక్షిస్తూ నిలబడి ఉంది.  ఆమె ఎంతో ఓర్పుతో ఎదురుచూసినా  బాబా వద్దకు వెళ్ళలేకపోయింది. ఆఖరికి వాటిని తానే ఆరగిద్దామని నిశ్చయించుకొని సగం తినేసింది. బయట జరిగేదంతా బాబాకు తెలుసు.   ఆ వృధ్ధురాలు నాకోసం ఏదయితే తీసుకొని వచ్చిందో దానిని నేను తింటాను అని బాబా శ్యామాతో చెప్పి  ఆమెను తీసుకొని రమ్మని పంపించారు.  కుచేలుడు తెచ్చిన దానిని తినడానికి శ్రీకృష్ణుడు ఎలాగయిటే ఆతృతగా చూశాడొ, బాబా కూడా అదేవిదంగా ఆతృతగా వేచిచూశారు. ఆమె తెచ్చినదానిలో ఆమె తినగా మిగిలినదానిని బాబా ఆరగించారు.   

(యింకా మరికొన్ని పోలికలు.....)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 10వ. భాగము

$
0
0

15.11.2012  గురువారము

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

సాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా శ్రీసాయి 10వ.భాగము వినoడి.

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 10వ. భాగము  




శ్రీమహావిష్ణువును పూజిస్తున్నాకూడా, ఆయన భక్తులు పేదరికంతో ఎందుకని కష్టాలు పడుతున్నారని, పరీక్షిత్  మహారాజు, శుకమహర్షిని ప్రశ్నించాడు. 
అశ్వమేధయాగం చేస్తున్న సందర్భములో ధర్మరాజు కూడా శ్రీకృష్ణులవారిని ఇదే ప్రశ్న అడిగారు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు.


"బెల్లం చీమలను ఆకర్షిస్తుందన్న విషయం అందరికీ తెలుసు.  ఒక్కసారి కనక బెల్లాన్ని తీసేసిన వెంటనే చీమలన్ని వెళిపోతాయి. మనవద్ద ధనం ఉన్నపుడే బంధువులందరూ మన చుట్టూ చేరతారు, అదిపోగానే అందరూ అదృశ్యమయిపోతారు. ఎవరూ మనకోసం రారు."

నాభక్తులందరినీ నావద్దకు రప్పించుకుంటాను అని  శ్రీకృష్ణుడు చెపుతూ, అపుడు తన భక్తులనుంచి ఐహికపరమయిన వాటినన్నిటినీ లాగేసుకుంటానన్నారు.

శ్రీకృష్ణులవారు ఇలా చెప్పారు, "మొదటగా వారి సంపదను హరించివేస్తాను.  అస్థితిలో బంధువులు కూడా వారివద్దకు చేరడానికి సందేహించి, దూరంగా వైదొలగుతారు. చివరకు ఈ విధమైన పరిస్థితిని పొందినవారందరూ ఒకటవుతారు."

"ఇక వారు  చివరికి చేసేదేమీ లేక నా భక్త బృందంలో చేరి,సత్సంగంలో కలలిమెలసి ఆధ్యాత్మిక పురోగతికి పనిచేస్తారు." 
 
ఇటువంటిదే మనం శ్రీసాయి సత్ చరిత్రలో చూస్తాము. బాబా అంకిత భక్తుడయిన మహల్సాపతి ఆయనను దేవా అని పిలిచేవాడు. బాబా ఆయనను భగత్ అని పిలిచేవారు. బాబా అందరికి ఏమిచ్చినా కూడా మహల్సాపతికి మాత్రం పైసా ఇవ్వలేదు. బాబా అందరికీ ఎంతో దాతృత్వంగా అన్నీ ఇస్తున్నాకూడా బాబా మీకేమిచ్చారని మహల్సాపతి భార్య ఆయనను అడుగుతూ ఉండేది. 

ఒకసారి హన్స్ రాజ్ మహల్సాపతికి ఒక పళ్ళెమునిoడా వెండినాణాలను ఇద్దామనుకున్నపుడు బాబా ఇవ్వనివ్వలేదు. 

మహల్సాపతి వెండినాణాలను స్వీకరించడానికి బాబాని అనుమతికోరినపుడు, నీకేది ప్రాప్తమో అదే ఇస్తాను అన్నారు బాబా. 1922సెప్టెంబరు, 11వ.తేదీన, తన తండ్రీ ఆబ్ధీకము పెట్టిన తరువాత, ఛాతీలో నెప్పివచ్చి మహల్సాపతి బాబాని ప్రార్ధిస్తూ సద్గతి పొందారు. ఆయన స్వర్గాన్ని చేరుకున్నారు. అదే బాబా ఆయనకు అనుగ్రహించినది.  శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఏదయితే చెప్పాడొ, మహల్సాపతి విషయంలో బాబా ప్రత్యక్షంగా చూపించారు.

యిటువంటి సంఘటనలు ఎన్నోఉన్నాయి. కాలం ఎలాగడిచిపోతుందో కూడా మనకు తెలీదు.

ఇపుడు మనం శ్రీకృష్ణులవారుసాయిబాబా, ఇద్దరూ  తమ అవతారాలను ఎలా చాలించారో చూద్దాము. భాగవతంలో పాండవులకు, కౌరవులకు యుధ్ధము ముగియగానే

పాండవులు తిరిగి పూర్వపు వైభవాన్ని సంతరించుకొన్నారు.  యాదవులు తమలో తాము కోట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక ఎవరూ తనమాట వినరనే విషయం శ్రీకృష్ణునికి అర్ధమై తన అవతారాన్ని చాలిద్దామనుకొన్నాడు. ఒకసారి ఆయన అరణ్యలో, కుడికాలిమీద, ఎడమకాలు వేసుకొని ఊపుతూ కూర్చొని వున్నారు. అలా ఉన్న సమయంలో, దూరమునుండి ఒక వేటగాడు, అది లేడియొక్క శిరస్సుగా భ్రమించిశ్రీకృష్ణుని పాదానికి తన బాణాన్ని గురిపెట్టి వదిలాడు. కృష్ణుడు అదే కారణంగా భావించి తన అవతారాన్ని చాలించాడు. బాలునిగా ఉన్నపుడే ఎంతోమంది రాకషసులతో పోరాడి, మహాభారత యుధ్ధానికి సారధ్యం వహించిన శ్రీకృష్ణుడు, ఈచిన్న సంఘటనతో  తన అవతారాన్ని చాలించి విష్ణులోకానికి వెళ్ళిపోయారు. 

మన సాయికృష్ణులవారు తన అవతార పరిసమాప్తికి ఏకారణాన్ని ఎన్నుకున్నారు. ఇది మనకు శ్రీసాయి సత్ చరిత్ర 43,44అధ్యాయాలలో స్పష్టంగా కనపడుతుంది.

1918సంవత్సరములో, విజయదశమినాడు, మధ్యాహ్న్నము 2.30కు, ఏకాదశి ఘడియలు సమీపిస్తుండగా, సాయి భక్తులందరినీ పంపివేశారు.  తన శిరసును బయ్యాజీ భుజం మీద పెట్టి ఆఖరి శ్వాస తీసుకొన్నారు. ఆయన మహాసమాధి చెందేముందు అన్నమాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొందాము. "ద్వారకామాయిలో నాకు అశాంతిగా ఉన్నది. నన్ను బూటీవాడాకు తీసుకొని వెళ్ళండి".  బాబా నిర్ణయించిన ప్రకారం బూటీవాడాలో మురళిధరుని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి కొంత స్థలం కేటాయించబడింది. షిరిడీ సాయియే మురళిధరుడు అంటే కృష్ణుడు అనే విషయాన్ని  ఋజువు చేస్తు, బూటీవాడాలో మురళిధరుని విగ్రహాన్ని ప్రతిష్టించవలసిని స్థానంలో, ఆఖరికి సాయి శరీరం సమాధి చేయబడింది. 
ఈనాడు కోటానుకోట్ల భక్తులు సమాధిమందిరాన్ని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతున్నారు. నా ఉద్దేశ్యంలో కలియుగంలో సాయినాధులవారు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణపరమాత్ములవారు ఇద్దరూ ఒకరే. 

జై సాయిరాం

(శ్రీకృష్ణునిగా శ్రీసాయి సమాప్తము)     

బాబా మరణాన్ని కూడా తప్పించగలరు

$
0
0


17.11.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                              

                                                 



ఈ రోజు అమెరికా నుండి ఒక సాయి భక్తురాలి కి బాబావారు చూపిన లీల, జరగబోయే పెద్ద ప్రమాదం నుండి ఎలా సూచనప్రాయంగా తెలిపి రక్షించారో చదవండి. బాబాను పూర్తిగా నమ్మడమే మనం చేయవలసినది.  మిగతాది ఆయనే చూసుకుంటారు, కంటికి రెప్పలా కాపాడతారు. బాబా "ప్రశ్నలు జవాబులు" పుస్తకంలో కూడా అందులో మీసమస్యకు వచ్చిన సమాధానం ప్రకారం చేయండి.  నేను కూడా ఒక సమస్యకు అందులో వచ్చిన విధంగానే చేయడం జరిగింది.  రెండుసార్లు నేను ఒకటే నంబరు అనుకోకుండా (వేరు వేరు రోజులలో) తలచుకోవడం అదే సమాధానం రావడంతో అందులో వచ్చిన విధంగానే చేయడం జరిగింది. బాబా నాకు గుండె ఆపరేషన్ జరిపించి గుండెకు ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడారు. ఇది నేను బ్లాగులో కూడా పోస్ట్ చేశాను.  

"మీ అమ్మగారిని తలచుకొని అన్నదానం చేయి. నీకు వెంటనే ఫలితం కనపడుతుంది. నీపిల్లలకు లాభం చేకూరుతుంది." అని వచ్చింది. అందులో వచ్చిన విధంగానే బాబా గుడిలో అన్నదానానికి కొంత బియ్యము, కూరలు రెండు సార్లు ఇచ్చాను.  ఆతరవాత నాకు హార్ట్ లో ప్రోబ్లెం ఉన్నదనే సూచనలు కూడా ఏమీలేకపోవడం, అనుకోకుండా డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు హార్ట్ లో కొంత ట్రబుల్ ఉందని చెప్పడం జరిగింది.  ఎకో లోను, ఈ.సీ.జీ.లోను గుండెలో అసలు ప్రాబ్లెం ఏదీ కనపడలేదు.  యాంజియో గ్రాములో ప్రమాదకరమైన 4 బ్లాకులు బయటపడి ఆపరేషన్ జరిగింది.  ఈవిధంగా బాబా నన్ను కంటికి రెప్పలా కాపాడారు.     

ఇక చదవండి.

బాబా మరణాన్ని కూడా తప్పించగలరు



అమెరికా లో మెమోరియల్ డే కి లాంగ్ వీకెండ్ ( అంటే వరుసగా మూడు రోజులు సెలవు) ఉంటుంది. ఆ లాంగ్ వీకెండ్ కు మేము పొకొనోస్ ను  (పొకొనోస్ పర్వతాలను) దర్శించాలనుకున్నాము. 


వీకెండ్ కి ముందు నేను సాయిబాబా గుడికి వెళ్ళాను. నా జాబ్ కెరీర్ , నా వ్యక్తిగత జీవితం ఎన్నో సమస్యలతో నిండి ఉంది. ఏ సమస్యకు  కూడ కొన్ని కారణాల వలన ఒక పరిష్కారం అంటూ దొరకకుండా సమస్య అలాగే సాగుతూ ఉంది. ఆ ప్రతికూల పరిస్థితుల నుండి బయట పడేందుకు నేను బాబా గారిని వారి ఆశీర్వాదం కోసం చాల రోజుల నుండి వేడుకొంటు న్నాను. ఆ గుడిలో పెద్ద సాయిబాబా విగ్రహం యింకా ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఆ గుడిలో స్వరూప సాంప్రదాయ కూడా ఉంది.( స్వరూప సంప్రదాయ వర్గం వారు  అద్వైత వేదాంతాన్ని అనుసరిస్తారు. అంటే ఆత్మ ను దర్శించుటయందు మొగ్గు చూపుతారు).  నేను స్వరూప సాంప్రదాయ దగ్గర నిలబడి ప్రార్థిస్థుండగ , ఎక్కడి నుండో ఒక పువ్వు క్రింద పడింది. ఆ పువ్వు ఎక్కడి నుండి పడిందో అని చూస్తూ,  ఆ పువ్వును భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంగా తీసుకున్నాను. తర్వాత నేను దాని గురించి మర్చిపోయాను.  మేము మా వీకెండ్స్ ప్లాన్ ప్రకారం అంతా సిద్దం చేసుకుంటున్నాము. బయలుదేరే ముందు నాకు ఒక అసాధారణమైన భావన కలిగింది.  అందువలన నేను ప్రయాణపు పనులు అన్నీ ఆపివేసి బాబా ముందర రెండు చేతులు జోడించి నిలబడ్డాను.  అయినా ఇంకా ఆ భావన పోలేదు.  పూజా మందిరం నుండి చిన్న బాబా ఫోటో తీసుకొని నా పర్సులో పెట్టుకున్నాను.  నేను వంటగదిలోకి వెళ్ళగానే గ్యాస్ వాసన వచ్చింది. ప్రొద్దున్నే వంటగది లోకి ఎవ్వరు అడుగు పెట్టలేదు. మరి స్టౌవ్ ఎలా ఆన్ అయిందో  (నాబ్ ఎలా తిరిగి ఉందో ) అర్థం కాలేదు.  స్టవ్ ఆపివేసి,  బయలుదేరేముందు మమ్మల్ని కాపాడినందుకు బాబాకి మరలా ఒకసారి ప్రార్ధించాను. మేము జాగ్రత్తగా గమ్యానికి చేరుకున్నాము.  కాని వాతావరణం  బాగాలేకపోవటం చేత రోజంతా కష్టంగా గడిచింది. నాలో ఇంకా ఆ అసాధారణమైన భావన పోలేదు. రాత్రి నేను నిద్రపోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక స్వప్నదృశ్యం  నా కళ్ళకు కనపడి అదృశ్యమయింది. ఒక పెద్ద ట్రక్ ( సాధారణంగా అమెరికా లో ఉండే పెద్ద కంటేనర్లు ఉండే ట్రక్ లు ) మేము వెళ్ళే దారిలో మా వైపుకు వస్తూ ఉంది. ఈ దృశ్యం నా కళ్ళ ముందుకు వచ్చి వెళ్ళింది. బాగా అలిసి పోవడం వల్ల బాబాను తలుచుకుంటూ నిద్రపోయాను. మరుసటి రోజు బోటింగ్ కి (పడవలో విహారానికి) వెడదామనుకున్నాము.  మా  ఆయన , అమ్మాయి ఇద్దరూ బోట్ లో కూర్చున్నారు. నేను ఆ బోట్ ను నడపాలని ప్రయత్నిస్తుండగా , ఆ బోట్ తలక్రిందులైంది. నది రెండు అడుగుల లోతు మాత్రమే ఉండటం వల్ల అదృష్ట వశాత్తు మా అమ్మాయి నీళ్ళలో పడి పోలేదు. తనకి ఫ్యాంటు మాత్రమే కొద్దిగ తడిసింది. మా వస్తువులన్ని నీళ్ళలో పడిపోయాయి. కాని దీన్ని బట్టి ఒకటి అర్ధమైనది ఏమిటంటే  మాకు ఇంకా ఏదో  చాలా పెద్ద ప్రమాదం జరగబోయేదే , కాని బాబా గుడిలో పుష్పాన్ని ప్రసాదంగా ఇచ్చి మా అందరిని ఆశీర్వదించి , పెద్ద ప్రమాదం జరగకుండ రక్షించారు. 

      ఈ సంఘటన జరిగిన కొన్ని వారాలకు దీన్ని గురించి పూర్తిగా మర్చిపోయాము. గత ఆదివారము నేను ఉద్యోగాల గురించి చూడాలని కంప్యూటర్ ఆన్ చేస్తుండగ, నా మనసుకు "బాబా ప్రశ్నలు జవాబులు" వెబ్ సైట్ ఓపన్ చేయాలనిపించింది. ఆ వెబ్ సైట్ ఓపన్ చేస్తుండగ నా మనసుకు 311 సంఖ్య  స్పురించింది. ఎందుకో నాకు 311 సంఖ్య చూడాలనిపించింది. నా దృష్టికి మొదట3...1...1  అలా అస్పష్టంగ కనిపించింది. నేను "బాబా ప్రశ్నలు జవాబులు" వెబ్ సైట్ ఓపన్ చేసి 311సంఖ్య చూడగ దానికి జవాబుగ  "మరణము తప్పింది, సాయిబాబా ను గుర్తుంచుకో"  అని వచ్చింది. నాకు కొంచెం భయంవేసింది,కాని వెంటనే బాబా వుండగ నాకు భయమేల . నేను బాబాను పూర్తిగా నమ్ముకొని ఉన్నాను  అనుకొని ప్రశాంతం గా ఉన్నాను. ఆ రోజు రాత్రి నిద్రపోతుండగ, మరలా ఇంతకు ముందు వచ్చిన దృశ్యం  (పెద్ద కార్గో ట్రక్)  నా ముందరికి వస్తున్న దృశ్యం అలా  వచ్చి వెళ్ళింది. బాబా ని తలచుకుంటూ నిద్రపోయాను.

          మరుసటి రోజు మా ఆయన ఆఫీస్ పని మీద కెనడా కి వెళ్ళాల్సి ఉంది. నేను ఆఫీస్ కి బయల్దేరాలి.  ఆ రోజంతా బాగా గడిచింది. మనసుకు చాల ప్రశాంతంగ ఉంది. కాకపోతే మా ఆయన కెనడాకి వెళ్తున్నారని బాధపడ్డాను. బాబాకి పూజ చేసి నా పనిలో పడ్డాను. మా ఆయన కెనడాకి చేరాక తాను చేరుకున్నట్లుగా మెసేజ్ పంపారు. నాకు ఊరట కలిగింది. ఇక దాని గురించి మర్చిపోయి పనిలో పడ్డాను. సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళడానికి కారు తీసి బయల్దేరాను. రెడ్ సిగ్నల్ పడింది. అక్కడ ఆగాను. మనసులో బాబా ను తలచుకుంటూ, ఆఫీస్ లో ఇప్పుడు ఉన్న ఒడిదుడుకుల నుండి కాపాడమని బాబాని అభ్యర్థిస్తున్నాను. మ్యూజిక్ సిస్టం లో బాబా భజన వస్తుంటే వింటున్నాను. అప్పుడే మా పాప గురించి ఆలోచిస్తు పాపను డే కేర్ నుండి తీసుకొనిరావాలని అలోచిస్తుండగ తిరిగి మనసు బాబా భజన మీదికి మళ్ళింది. భజన వింటుండగ హఠాత్తుగ  నా వెనకల నుండి ఎవరో నా కారును గుద్దారు. రెండు సార్లు పెద్ద అదుర్లు వచ్చాయి. దాని ఫలితంగ నేను నా ముందర కారును గుద్దాను. ఓరి భగవంతుడా నా కారు కి యాక్సిడెంట్ అయింది అనుకొని కారులో నుండి దిగాను. దాని ప్రభావం ఎంతగా పడిదంటే నా కారు ముందర, వెనుకల రెండు వైపుల డామేజ్ అయింది. కారు ఎక్కడెక్కడ  డామేజ్అయిందో అని నేను పరిశీలించాను. రెండు వైపుల చిన్నచిన్న గీతలు పడ్డాయి కాని, ఎక్కువ డ్యామేజ్ కాలేదు  ( రిపేర్ కి దాదాపు 500 డాలర్లు అవుతుందని అంచన).  నా వెనకాల ఉన్నతను రెడ్ లైట్ చూసుకోలేదు.  అతను గంటకు 40 మైళ్ళ  వేగంతో డ్రైవ్ చేస్తూ రెడ్ లైట్ చూసుకోకుండ వచ్చి నా కారును గుద్దాడు.  పోలీస్ తప్పు చేసిన అతన్ని అన్ని విషయాలు అడుగుతూ విచారిస్తున్నాడు. నన్ను ఏమి అడగట్లేదు. నేను మనసులోపల బాబాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను పోలీస్ ను రిపోర్ట్ అడిగాను. పోలీస్ నా వైపు ప్రశ్నార్థకంగా చూసాడు. అసలు డ్యామేజ్ ఏమి కాలేదు కదా, ఎందుకు ఈవిడ రిపోర్ట్ పదే పదే అడుగుతుంది అన్నట్టు తన మొహం ప్రశ్నార్థకంగ  పెట్టుకొని నావైపు చూశాడు.  ఓ బాబా నాకు అగుపడిన దృశ్యానికి అర్థం ఇదేనా. బాబా నన్ను రక్షించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ యాక్సిడెంట్ వల్ల ఒక్క నష్టం మాత్రం జరిగింది. మా అమ్మాయి డే కేర్ కి 30 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను. దానికి ఫలితంగా 100 డాలర్లు లేట్ ఫీజ్ చెల్లించాల్సివచ్చింది.

  ,ఆ రోజు నాకు ఇంకా పెద్ద యాక్సిడెంట్ జరగబోయేదని నాకు బాగా గట్టి నమ్మకం. నా కారు మొత్తం డ్యామేజ్ అయ్యుంటే నా పరిస్థితి ఏమిటి? అసలే మా ఆయన కూడా ఊరిలో లేరు. బాబా దయ, ప్రేమ నాపై చూపకుంటే నష్టం ఇంకా ఎక్కువ జరిగేది.  యాక్సిడెంట్ జరిగే సమయానికి మా పాప నాతో ఉండకుండ చూశారు బాబా. ఇంకా ఏమి చెప్పను? మా ఆయన కూడా అసలు దేశంలో నే లేరు. ఈ సంఘటన జరిగినపుడు బాబా నే  నా దగ్గర లేకుంటే ఇంకా ఏమి జరిగిఉండేదో ఊహించుకోలేను.

        నాకు సంబందించి ఈ మధ్య కాలంలో ఏమి సవ్యంగా జరగట్లేదు. పరిస్థితులు ఏమి బాగా లేవు. పని ఒత్తిడి , వ్యక్తిగత జీవితం కొన్ని ప్రతికూల పరిస్థితులతో సతమతమవుతుండగ,  దానికి తోడు గత రెండు నెలలుగా రెండు సార్లు ప్రాణాంతకమైన యాక్సిడెంట్ల నుండి తప్పించుకోవడం కొంచెం ఆందోళన కలిగించే విషయం ఆయన దయకు,ప్రేమకు ఒక్క ధన్యవాదాలు మాత్రంసరిపోవు. ఆయనకు ఎంతో ఋణపడ్డాను. మీరు నమ్మగలిగితే  "బాబా ప్రశ్నలు జవాబులు" పుస్తకం ద్వారా బాబా మీతో మట్లాడతారు. అందులో ఏమి జవాబు వచ్చినా  దాన్ని మనఃస్పూర్తిగా నమ్మి అందులో ఏమి చేయమని వస్తే అది చెయ్యండి. దానితో ఆటలాడవద్దు. కాని బాబా అందులో ఏమి చెప్తారో అది నమ్మి చేయండి. బాబా మా అందరిని అశీర్వదించి, జీవితపు ఎగుడు దిగుడుల నుండి తట్టుకునే శక్తి,  ధైర్యం ఇవ్వండి బాబా.


సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 
...

శ్రీసాయితో మధుర క్షణాలు - 1 - సాయి ప్రార్ధన

$
0
0


                                                  
                                 


18.11.2012  ఆదివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈరోజునుండి అలనాటి బాబా భక్తుల అనుభవాల మాలిక "శ్రీసాయితో మధుర క్షణాలు" అందిస్తున్నాను.  ఈ అనుభవాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రచురించడానికి తగిన సమయం ఇమ్మని, సహాయం అందించమని బాబాని ప్రార్ధిస్తూ ప్రారంభిస్తున్నాను.



ఈ అనుభవాలను సంధ్యా ఉడ్ తా గారు ఆంగ్లంలో "Moments with Shree Sai" పుస్తకంగా వెలువరించారు. దీనికి కాపీ రైట్ లేనప్పటికీ, సాంప్రదాయ బధ్ధంగా  మొదటగా వారికి చెప్పి అనుమతి తీసుకోవడం జరిగింది. 

మొదటగా శ్రీసాయి ప్రార్ధన.

                             శ్రీసాయి ప్రార్ధన

(ప్రతిరోజు ఉదయం బాబా విగ్రహం ముందుగాని, పటం ముందుగాని, దీపం వెలిగించి, బాబా అష్టొత్తర శతనామావళిని చదవండి.  తరువాత శ్రధ్ధా,భక్తులతో ఈ ప్రార్ధన చేయండి.  బాబా మీకు రోజంతా సుఖ సంతోషాలను కలుగచేస్తారు.)
                               
"సాయిబాబా నేను నీవద్దకు వచ్చాను. నీపవిత్ర పాదాలవద్ద నాశిరసునుంచి నీకు సర్వశ్యశరణాగతి చేస్తున్నాను.  మంచికి, చెడుకి భేదమెరుగలేను. నువ్వు సర్వత్రా నిండివున్నావు. సర్వ శక్తిమంతుడవు.  నన్నెల్లపుడూ సంతోషంగా ఉంచేది, నాకు అర్హమైనది ఏదో అదే అనుగ్రహించు.  జీవితంలో దురదృష్టాన్ని, విచారాన్ని భరించే శక్తి నాకులేదు.  యిది మాత్రమే నాకుతెలుసు.  నేను, నాకుటంబం, బంధుమిత్రులు, యింకా ఈ సమాజంలోని వారందరూ కూడా ఒకరిమీద ఒకరు ప్రేమానురాగాలతో సుఖ సంతోషాలతో కలసిమెలసి జీవించాలి.  ఇదే నేనెల్లప్పుడూ కోరేది.  బాబా నన్నెల్లప్పుడు నీకంటికి రెప్పలా కాపాడు.   

నా దైనందిన జీవితంలో నేనెవరికీ హాని తలపెట్టకుండాను, నాకెవరూ హాని తలపెట్టకుండాను వుండేలాగ అనుగ్రహించు.  రేయింబవళ్ళు సదా నీ సాయి మంత్రాన్నే జపించే వరమివ్వు.  అహంకారం, పగ, ప్రతీకారం యిటువంటి దుష్ట ఆలోచనలు నాదరి చేరకుండా అనుగ్రహించు.  నామాటలు ఎవరినీ నొప్పించే విధంగా లేకుండా నన్ను దీవించు.  

నీపాదాల వద్ద శరణువేడుకోవడం నేనెన్నటికీ మరువను.  గతంలో నేను, తెలిసి గాని తెలియకగాని చేసిన తప్పులను దయచేసి మన్నించు.

సద్గురు సాయినాధా ! సుఖ సంతోషాలతో జీవించేలా నన్ను దీవించు.

ఓం శ్రీసాయిరాం


                                       

శ్రీసాయితో మధుర క్షణాలు - 1

శ్రీసాయి మూగవారిని కూడా మాట్లాడించగలరు

కష్టాలలో ఉన్నపుడు ప్రతి భక్తునికి వర్ణించనలవికాని ఒక లీల అనుభవమౌతుంది.  దాని గురించి వివరించేటప్పుడు అది తమకెంతో ప్రీతిపాత్రమైన అనుభూతిగా వర్ణిస్తారు. సంకటాలలో ఉన్న ప్రతిసారి శ్రీసాయి మహరాజ్ వారి అనుగ్రహానికి పాత్రులయిన కొద్ది మంది భక్తులు ఉన్నారు. శ్రీసాయినాదులవారు వారికొక్కరికే రక్షణ కలిపంచడమే కాదు, వారి కుటుంబానికంతటికీ రక్షణ కల్పిస్తూ ఉండేవారు. అలా జరిగినవాటిలో శ్రీ టీ.ఎల్.ఎస్. అయ్యర్, కుంభకోణంవారి జీవితంలో జరిగిన ఒక లీల.

ఆయనకొక కుమార్తె ఉంది.  ఆమె పేరు రాజలక్ష్మి. పుట్టినతరువాత ఆమెకు 8 సంవత్సరముల వయసు వచ్చినా కూడా మాటలు రాలేదు.  ఆమ్మ, అప్ప అని కేవలం రెండు మాటలను మాత్రమే పలకగలిగేది. శ్రీసాయినాధుల వారి ఆశీర్వాదముల వల్ల అమ్మాయికి మాటలాడే శక్తి వస్తుంది, ఆమెను షిరిడీ తీసుకొనివెళ్ళండని శ్రీ ఎస్.బీ.కేశవయ్య, శ్రీ జె.పీ.హరన్ (శ్రీసాయికి అంకిత భక్తుడు) సలహా యిచ్చారు.    వారి సలహా ప్రకారం శ్రీఅయ్యర్ గారు తమ కుమార్తెను మార్చి, 28, 1942 లో షిరిడీ తీసుకొని వెళ్ళారు.  అప్పుడక్కడ శ్రీదాసగణు మహరాజ్ ఉన్నారు.  ఆయన ఆమ్మాయిని తన దగ్గర కూర్చోపెట్టుకొని, "సాయిబాబా" అను అన్నారు.  రాజలక్ష్మి ఆరెండు పవిత్రమయిన నామములు "సాయి - బాబా" అని అంది.  సాయినామములోని శక్తి అటువంటిది. ఆరోజునుంచి ఆ అమ్మాయి వివిధ రకాలయిన మాటలను ఒకదాని తరువాత మరొకటి నేర్చుకోవడం, మాట్లాడటం మొదలు పెట్టింది. యిక ఆమెకు మాట్లాడటం అలవాటయి స్కూలుకు కూడా వెళ్ళే అవకాశం కలిగింది.  తన ఈడు పిల్లలలాగే జీవితం గడిపింది.   

బాబా దర్శనంతో మూగ అమ్మాయికి మాటలు వచ్చుట లేక మూగతనం పోవుట.

పైన వివరించిన ఇదే వృత్తాంతము "స్వదేశ్ మిల్రన్" అనే తమిళ పత్రికలో 15.09.1944 లో ప్రచురింపబడింది.   

శ్రీటీ.ఆర్.ఎస్.మణి అయ్యర్ గారిది కుంభకోణం.  ఆయన శ్రీసాయిబాబాకు అంకిత భక్తుడు.  ఆయన కూతురు రాజలక్ష్మి పుట్టుకనుంచి మూగది.  ఆమెకు 9 సంవత్సరముల వయసప్పుడు సాయిబాబా వారి ప్రేరణతో షిరిడీలోని ఆయన సమాధిని  దర్శించుకొన్నారు.  అయ్యర్ గారు 28.03.1942 న తమ కుమార్తెను తీసుకొని షిరిడీ వెళ్ళారు.  ఎంతో భక్తి శ్రధ్ధలతో బాబాను ఆయన సమాధి వద్ద పూజించారు.  ఆ అమ్మాయి "సాయిబాబా, సాయిబాబా" అంటూ అరవడం మొదలుపెట్టింది.  ఇవే ఆమె మొట్టమొదటగా మాట్లాడిన మాటలు. మేనెల 1944 లో అయ్యర్ గారు రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళి, బాబావారికి బెనారస్ శిల్క్ శాలువా, తన కుమార్తె ఎత్తుగల వెండి దీపాన్ని బాబావారికి బహూకరించారు.     


(యింకా ఉన్నాయి మధుర క్షణాలు) 

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


శ్రీసాయితో మధుర క్షణాలు - 2

$
0
0

19.11.2012సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                                            
                                  
                                            
 సాయి బంధువులందరికీ ఈరోజునుండి శ్రీ విష్ణుసహస్రనామం ఒక శ్లోకం దాని తాత్పర్యము కూడా ఇద్దామని నిర్ణయించుకున్నాను. మనలో కొంతమంది ప్రతీరోజు విష్ణుసహస్రనామం చదువుతూ ఉండవచ్చు. కొంతమందికి కంఠతా కూడా వచ్చి ఉండవచ్చు. ప్రతీశ్లోకానికి అర్ధం కూడా చదివి బాబా అనుగ్రహానికి, శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా కోరుచున్నాను.    

శ్రీవిష్ణు సహస్ర నామం  

                                    
                                       
1.    విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుహుః     

      భూత కృ ద్భూత భృధ్వావో భూతాత్మా భూతభావనః  

అర్ధము: ఈ సృష్టియంతయు విష్ణువుచే వ్యాప్తి చెందియున్నది.  అతడు విశ్వమంతయు నిండి అందు నివసించి  ఉన్నవాడు.  అతడే జరిగినది, జరుగబోవునది మరియు జరుగుచున్నది అను కాలము.  అతడు ఈ సృష్టికి పాలకుడు కనుక జీవులకు సృష్టికర్త.  అతడు భూతములకు ఆత్మయైనవాడు.  కనుక వానిని భరించి పోషించుచున్నాడు.  తన ఉదరమందే జీవులను కల్పించుచున్నాడు.                                           ------

ఇక శ్రీసాయితో మధుర క్షణాలు చదవండి.


శ్రీసాయితో మధుర క్షణాలు - 2

సాయి  చీకటిలో వెలుతురును నింపుట

శ్రీ టీఎల్.ఎస్.మణి అయ్యర్ గారు బాబాకు గొప్ప అంకిత భక్తుడు.  ఆయన ఒక హోటల్ యజమాని.  ఆయన తరచుగా షిరిడీ వెడుతూ ఉండేవారు. యింటిలో ప్రతీరోజూ క్రమం తప్పకుండా సాయిని పూజిస్తూ ఉండేవారు.  శ్రీసాయినాధులవారు కూడా తన భక్తునియొక్క భక్తికి అదేవిధంగా  ఆయనను, ఆయన కుటుంబాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉండేవారు.  డిసెంబరు 1944వ. సంవత్సరములో ఒకసారి  ఆయన కుంభకోణంలో తన యింటినుంచి బయలుదేరారు.  అపుడు చాలా చీకటిగా ఉంది.  వీధి దీపాలు లేవు.  ఆకాశంలో  చంద్రుడు, నక్షత్రాలు కాంతి విహీనంగా ఉన్నాయి.  ఆయన రెండు సంచులనిండా చిల్లర నాణాలు పోసుకొని తన నడుముకు ఉన్న సంచిలో ఉంచుకొన్నారు. ఒక సంచిలో రూ.50/- లకు నికెల్ నాణాలు, యింకొక సంచిలో రూ.50/- లకు సిల్వర్ నాణాలు సంచీలలో నిండుగా ఉన్నాయి. హటాత్తుగా రెండు సంచులూ వదులయిపోయి సంచిలో ఉన్న నాణాలన్నీ రోడ్డుమీద చిందర వందరగా (చెల్ల చెదురుగా) పడిపోయాయు.  చీకటిగా ఉండటంవల్ల ఆయనకు నాణాలు ఏమీ కనిపించలేదు. లైటు తెచ్చుకొని వెదుకుదామన్నా, నాణాలను అక్కడే వదిలేసి వెళ్ళడం క్షేమం కాదు. కొంత సేపు అక్కడే నిలుచున్నారు.  హటాత్తుగా ఉదయం ఆరు గంటలయిందా అన్నట్లుగా ప్రకాశవంతమయిన వెలుగు వచ్చింది. ఆయనకు ప్రతీనాణెం స్పష్టంగా కనపడింది. మొత్తమన్నిటినీ ప్రోగుచేశారు.  చిల్లరనంతటినీ తీసుకొని తన కాఫీ హోటలుకు వెళ్ళారు.  ఆయన తన నాణాలన్నిటినీ తీసుకోగానే ఆప్రకాశవంతమయిన వెలుతురు మాయమయి తిరిగి ఎప్పటిలాగే చీకటి అలుముకుంది.

(మరికొన్ని మధుర క్షణాలకైఎదురుచూడండి...)

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు      


శ్రీసాయితో మధురక్షణాలు - 3

$
0
0


                                                 

20.11.2012  మంగళవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అధ్బుతమైన మధుర క్షణం.  అన్నీ మధుర క్షణాలే. 

ముందుగా శ్రీ విష్ణుసహస్రనామం 2వ. శ్లోకం, మరియు తాత్పర్యం 

                                  

శ్లోకం 2.     పూతాత్మా పరమాత్మాచ ముక్తానాం పరమాగతిః    

                 అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ || 

తాత్పర్యము: పరిశుధ్ధమైన ఆత్మ కలవాడు, గొప్ప ఆత్మయైనవాడు, మోక్షము పొందిన జీవులకు ప్రధాన లక్ష్యముగా నున్నవాడు, తరుగుట యనునది లేనివాడు, దేహమునందున్న ప్రజ్ఞలన్నింటినీ గమనించువాడు, ఉపాధియందుండి తెలిసికొనువాడు, నాశనము లేనివాడు కదా !  (అక్షరః = నాశనము లేనివాడు, ఏవచ = ఆవిధముగానున్నాడు కదా)  


శ్రీసాయితో మధురక్షణాలు - 3

నీ బిడ్డను పట్టుకో.....
                              
                                           
1945 సెప్టెంబరు న శ్రీ టీ.ఎల్.ఎస్. మణి అయ్యర్ గారికి అమ్మాయి జన్మించింది.  ఆమెకు "సాయి చంద్ర" అని పేరు పెట్టారు.  మిగతా కుటుంబాన్ని రక్షించినట్లే శ్రీసాయి బాబా ఈపాపను కూడా రక్షించారు.  25, జనవరి 1946 వ.సంవత్సరంలో మణి అయ్యర్ గారు  ఒకరోజు వేకువజామున 4 గంటలకు లేచి యింటినుంచి బయలుదేరడానికి సిద్ధమయారు. తను పడుకున్న మంచం మీద అయిదు నెలలున్న తనపాప రెండు అడుగుల ఎత్తు ఉన్న మంచం మీద ఒక్కతే నిద్రపోతూ ఉంది. మంచానికి రెండువైపులా ఎటువంటి రక్షణా లేదు.   ఆయన మరొక ప్రక్కన నిద్రపోతున్న తన భార్యతో "పాపను జాగ్రత్తగా చూసుకో" అంటూ  బయటకువెళ్ళిపోయారు.  ఆయన భార్య అలాగే అని సమాధానమిచ్చి వెంటనే నిద్రలోకి జారిపోయింది. నిద్రలో ఉన్నతల్లికి (కుఝంధైయ యై ఏదు) " నీ పాపను పట్టుకో" అనే మాటలు వినపడటంతో ఉలిక్కిపడి హటాత్తుగా లేచింది.  అక్కడ ఆమాటలు అన్నవారెవరూ కనపడలేదు.  పాప మంచం మీదనుంచి కిందకి వేలాడుతూ పడిపోవడానికి సిధ్ధంగా ఉంది.  ఆమె పాపను పట్టుకోవడానికి ముందుకు జరిగినపుడు భూమిలోనుంచి రెండు చేతులు వచ్చి పసిపాప పడిపోకుండా రక్షణగా ఉండటం కనిపించింది.  తల్లి మంచి గాఢనిద్రలో ఉన్నపుడు పాపని అనుక్షణం కనిపెట్టుకొని ఉన్నది ఎవరు? స్వయంగా ఆసాయినాధుడే.  ఎల్లపుడు మనందరినీ ప్రేమించే  తల్లి, తండ్రి.  తల్లి, ఆపాపని తన చేతులలోనికి తీసుకోగానే, అంతవరకు సాయిచంద్ర పడిపోకుండా రక్షణగా ఉన్న ఆచేతులు అదృశ్యమయ్యాయి.  
  
బావిలో పడిన మూడు సంవత్సరాల బాలిక శాంతిని, మేడమీదనుంచి పడిన రెండు సంవత్సరాల బాలుడు నాచ్నేను  రక్షించినట్లుగానే బాబా ఆపాపను రక్షించారు. 

(1928 వ.సంవత్సరంలో సాయినాధ్ నాచ్నే  రెండు సంవత్సరాల బాలుడు. ఒకరోజున ఆపిల్లవాడు పరిగెడుతూ ఉండగా ప్రమాదవశాత్తు మేడమీదనుంచి పడిపోయాడు.  కింద పెద్దరాళ్ళగుట్ట, చెత్త ఉంది.  నాచ్నే  పరుగెత్తుకుని వెళ్ళి చూసేటప్పటికి అతని కుమారుడు ఎటువంటి గాయాలు, దెబ్బలు లేకుండా నిల్చుని ఉన్నాడు. నాచ్నే  తన తండ్రితో "భయపడద్దు, బాబా నన్ను పైకి లేపారు" అన్నాడు. 

సాయిసుధ - సావనీర్ 1946 ప్రచురణ నుంచి సమాచారం .


(యింకా ఉన్నాయి మధురక్షణాలు)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


శ్రీసాయితో మధుర క్షణాలు - 4

$
0
0

  
                                   
 

21.11.2012 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                             

శ్రీవిష్ణు సహస్రనామం 3వ.శ్లోకం:

   యోగో యోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వరః 
   
   నారసిం హవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః  ||

తాత్పర్యము: ఆయనే యోగము, యోగులకు నాయకుడైయున్నవాడు. మూల ప్రకృతిలేక మాయగా వచ్చినవాడు.  పురుషులకు ఈశ్వరుడైనవాడు. నృసిం హ రూపముతో వచ్చినవాడు, లక్ష్మీదేవికి భర్త. లోకములే ఆయన కేశములు. ఉత్తమ పురుషుడను ప్రవృత్తిచే తెలియబడినవాడు. 

యోగమనగా అన్నిలోకములలోను ప్రజ్ఞ మేల్కొని యుండుట. అన్నమయము (భౌతికము) ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయమను కోశముల యందన్నిటియందు జీవులు సమానముగా మేల్కొని యుండు స్థితి.  దీనిని సాధించుకొనుటకే యోగాభ్యాసము ఆవశ్యకము.  అట్టి యోగాభ్యాసము ప్రారంభింపవలెనన్న కోరిక పరమాత్మనుండియే మనయందు పుట్టుచున్నది.  కనుక పరమాత్మయే యోగమను పేర కూడా తెలియబడుచున్నాడు.  

అందుచేత యోగసాధన చేయువారికి, ప్రారంభించువారికి నాయకుడు లేక మార్గ దర్శకుడు నారాయణుడే అగుచున్నాడు. యోగాభ్యాసము మొదట ఒక సద్గురువునొద్ద ఉపదేశము పొందవలెను అట్లు ఉపదేశించు గురువు ద్వారా యోగము నారాయణుడే ఉపదేశించుచున్నాడు.  అనగా గురువు నుండి శిష్యులలోనికి నారాయణుడే ప్రవేశించుచున్నాడు.  


సాయితో మధురక్షణాలు ప్రతిక్షణం తలుచుకుంటూ ఉండండి.

శ్రీసాయితో  మధుర క్షణాలు - 4
నాయెందవరి దృష్టో వారియందే నాదృష్టి
 
మీరు ద్వారకామాయిలోకి అడుగుపెట్టగానే రాత్రి పొద్దుపోయిన సమయంలో కూడా కొంత మంది భక్తులు ధ్యాన నిమగ్నులై ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యం.  కొత్తగా ధ్యానం ప్రారంభించే భక్తులు ద్వారకామాయిలో ఉన్న ఆయన చిత్రపటం ముందు కూర్చొని ఆయన రూపాన్ని ధ్యానిస్తారు.  ఈ బాబా చిత్రపటం వెనుక శ్రీ డీ.డీ.నిరోయ్ గారికి సంబంధించిన ఒక లీల ఉంది. శ్రీ డీ.డీ. నిరోయ్ కామూ బాబా ( ముంబాయి గిర్ గావ్ లో ఉండే  సాధువు) కు భక్తులు. బాబా కరుణా దృష్టిని ప్రసరిస్తూ రాతి మీద కూర్చొని ఉన్న చిత్రపటాన్ని తయారుచేయించారు.  దానిని నలుగురు మనుషుల సాయంతో ఆయన గిర్గావ్ కు తీసుకొని వచ్చి తన గురువుగారికి సమర్పించారు.  కామూ బాబా ఆ చిత్రపటాన్ని చూసి ఎంతో ప్రశంసించారు.  కాని, దానిని తీసుకోవడానికి నిరాకరించారు.  దానిని షిరిడీ తీసుకొని వెళ్ళి ద్వారకాయాయిలోని సభామండపం (హాలు) లో పెట్టమని కామూ బాబా నిరోయ్ గారికి చెప్పారు.

నిరోయ్ గారు నిరాశపడి గురువుగారి పాదాలవద్ద కూర్చొని "ఈ చిత్రాన్ని వేయించడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది. దానిని ఫ్రేములో బిగించడానికి నెలన్నర పట్టింది.  ఖర్చు గురించి నేనాలోచించను.  మీరేమో దీనిని తీసుకోనంటున్నారు" అన్నారు.  ఒక భక్తునిగానిరోయ్ గారు ఎటూ తేల్చుకోలేక ఆందోళనలో పడ్డారు,కాని, గురువు జ్ఞాని,  ఆయనకు అంతా తెలుసు.  "దానిని తిరస్కరించడం అన్నది కాదు ప్రశ్న.  నువ్వు దానిని షిరిడీకి తీసుకొని వెళ్ళాలన్నదే నా ప్రగాఢమైన వాంచ.  అక్కడ వేలకొద్ది భక్తులకు  ప్రార్ధించుకొనే భాగ్యం కలుగుతుంది." అని ప్రశాంతంగా జవాబిచ్చారు.

ఆవిధంగా ఆ పటం ద్వారకామాయిలోని సభామండపంలో ప్రతిష్టింపబడింది.  జరగబోయేదానిని ముందే ఊహించి కామూబాబా చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆయనే కనక ఆవిధంగా చెప్పి ఉండకపోతే ఈనాడు మనకు ద్వారకామాయిలో అంత అందమైన బాబా చిత్రపటాన్ని దర్శించుకొనే భాగ్యం కలిగి ఉండేది కాదు. 

బొంబాయి చివరి ప్రాతమయిన అంధేరీ ప్రధాన రహదారిలో పుణ్యపురుషుడయిన కామూబాబా నివాసం.  రోడ్డ్లుకు ప్రక్కనున్న బంగళాలో ఒక పార్సీ కుటుంబం నివసిస్తోంది. కామూబాబా గారు అక్కడ నివసిస్తూ ఉండేవారు.  పార్సీ కుటుంబంవారు కామూబాబా భక్తులు.  వారు ఆయన సేవ చేసుకొంటూ ఉండేవారు.  ప్రాపంచిక సమస్యల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పుకొని ఆయన ఆశీర్వాదాలను పొందటం కోసం చాలా మందిఅయన దర్శనం కోసం వస్తూ ఉండేవారు.

చెన్నైకి చెందిన లాల్ చంద్ అనే భక్తుడు కామూబాబా వల్ల తాను పొందిన అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకొన్నారు.  1952నుంచి ఆయన షిరిడీ వెడుతూ ఉండేవారు.  మానవమాత్రునిలో దైవిక శక్తులు నిక్షిప్తమయి ఉండటం, ఆయనను దానివైపు మొగ్గు చూపేలా చేసింది. కామూబాబా వద్దకు వెళ్ళి, ఆయన దర్శనం చేసుకోవాలనే కోరిక ఉదయించింది ఆయనలో.  కాని మనసులో ఒకవిధమయిన సంశయాత్మకమయిన భావనకూడా ఉంది.  స్వచ్చమయిన పుణ్య పురుషుడి యొక్క దర్శన భాగ్యం కలుగ చేయమని ప్రార్ధించుకొన్నారు. ఆసమయంలో ఆయనకు తన సమస్యలు చెప్పుకొని సమాధానం పొందటానికి ఎటువంటి సమస్యలూ లేవు. 

1959వ సంవత్సరంలో  ఆయన బొంబాయిలో ఉన్నపుడు ఒకరోజు సాయంత్రం 5గంటలకు కామూబాబాను దర్శిద్దామనుకొన్నారు.

సాయంత్ర సమయంలో రద్దీగా ఉంటుందని కాస్త ముందుగానే వెడదామనుకొని ఆఫీసునుంచి బయలుదేరబోతుండగా ఫోన్ వచ్చింది.  ఆఫోన్ యొక్క సారాంశం ఏమిటంటే ఆయన ఒక వ్యక్తికి అప్పుయిచ్చాడు.  అతను యిప్పుడు మోసపూరింతంగా తానా అప్పును తీర్చటల్లేదని చెప్పడంతో ఆయన మనసు మార్చుకొని ఈ విషయమేదో తేల్చుకొందామనే ఉద్దేశ్యంతో కామూ బాబా వద్దకువెళ్ళడం వాయిదా వేద్దామనుకొన్నారు. కాని మెరుపులా ఆయన మదిలోకి ఇలా అనిపించింది "ఎందుకు చింతిస్తావు? నేనా విషయం రేపు చూసి చక్కబరుస్తాను"

ఆయన తన స్నేహితునితో కలసి కామూబాబా దర్శనానికి వెళ్ళారు.  200మంది భక్తులున్న వరుసలో చోటు దొరికిం ది.  ఆయన స్నేహితునితో కలసి ఎక్కడో చివర ఉన్నారు.  ఆయన కామూబాబా వద్దే ఎంతో ఆత్రుతతో చూస్తూ, అదే సమయంలో షిరిడీసాయిబాబా వారిని కూడా స్మరించుకుంటున్నారు.  5, 6గురు భక్తులను చూసి, వారి సమస్యలకు సమాధానాలు చెప్పిన తరువాత బాబా వారివైపు చూసి చేయి ఊపారు. ఎంతోమంది తనముందు వేచి చూస్తున్నా వారినందరినీ కాదని కామూబాబా ఆయనను పిలిచారు.  బహుశా తన సమస్య, తన ఆత్రుత కామూబాబాకు చేరి ఉండవచ్చు.  ఆయన వరుసలోనుంచి బాబావద్దకు వెళ్ళారు.  కామూబాబా, చిరునవ్వుతో "నీకేదైతో రాదని అనుకుంటున్నావో అదినీకు లభిస్తుంది.  చింతించకు" అన్నారు.  కామూబాబా ఆశీర్వాదాలు తీసుకొని ఆయన తిరిగి వచ్చారు.  మరునాడు ఆయన ఉదయం 11గంటలకు అఫీసుకు చేరగానే, ఆయన ఎక్కౌంటంట్ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫోన్ చేసి ఆయనకు ఒక బేరర్ చెక్కు బ్రోకర్స్ వద్దనుంచి వచ్చిందనీ దానిని అయన ఖాతాలో జమ చేసినట్లుగా చెప్పారు.  యిది కామూబాబాగారు చేసిన అద్భుతం మరియు ఆయన అనుగ్రహం.

శ్రీసాయిలీల మాసపత్రిక
డిసెంబరు 1981
లాల్ చంద్  కె.బుల్భాందినీ - తమిళ్ నాడు
(మరికొన్ని మధురక్షణాలు ఇంకా ఉన్నాయి....)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 




జన్మ మరియు పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 1

$
0
0



                                     
                                                

22.11.2012  గురువారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                             
                                   
                                    
శ్రీ విష్ణుసహస్ర నామస్తోత్రం 4వ. శ్లోకం మరియు అర్ధం:

శ్లోకం:  సర్వ శ్శర్వ శ్శివ స్ఠాణు ర్భూతాధిర్నిధిరవ్యయః    

         సంభవో భావనోభర్తా ప్రభవః ప్రభురీశ్వరః  || 

సమస్తము తాను అయినవాడు, హింసను నశింపచేయువాడు, శుభము కలిగించువాడు, భూతములకు స్థిరమైన కారణమైనవాడు, వ్యయము కాని నిధి అయినవాడు, భావమై పుట్టుకయైనవాడు, భరించువాడు, మేల్కొలుపటకు సమర్ధుడైనవాడు, ఆట్లు సృష్టివైభమునకు కారణమైన వానికి నమస్కారము.  


సమస్తమనగా సృష్టియందలి మరియు దానికి అతీతముగా ఉన్న మొత్తము పరమాత్మ యొక్క ప్రజ్ఞయే.  

శర్వః అనగా హింసించువాడు లేక నశింపచేయువాడు.  ఈ సృష్టినంతటినీ నశింపచేయుట అనగా సమస్తము దేనినుండి పుట్టినదో దానియందు లయమగుట.

శివుడనగా శుభము లేక మంగళము కలిగించువాడు; జీవులకు తాత్కాలిక శుభములను సుఖములను కల్గించుటతో ప్రారంభించి శాశ్వత సుఖమును,  ఆనందమును కల్షించువాడు.  అందుచేతనే నాస్తికుడు అయినవాడు మొట్ట మొదటగా భగవంతునికి తన కష్టములు తొలగింపుమని మ్రొక్కినచో వెంటనే జరుగును.  వానికి ఆ కష్టము తొలగిపోయి సుఖము కలుగును.  

స్థాణుః : రాయివలె స్థిరమయినవాడు. పరమాత్మ సృష్టికి వెలుపల, లోపల కూడా స్థిరమయి యుండును. 

భూతది:  అన్ని భూతములకు, ప్రాణులకు, జీవులకు తను పుట్టుక అయి వున్నాడు. 

నిధిః : దాచబడిన సంపద అయినవాడు  

అవ్యయః : వ్యయమగుట లేనివాడు, లేక నశించుట లేనివాడు.

సంభవః : పుట్టుక లేక కలిగించుట అనుదానికి అధిపతి అయినవాడు.

భావనః : భావమును నడిపించువాడు.

భర్తా : పోషించువాడు. 

ప్రభవః : మేల్కొల్పుటకు లేక వ్యక్త మగుటము అధిపతి అయినవాడు.

ప్రభుః : సమర్ధుడు లేక అధిపతి.

ఈశ్వరః : సృష్టి వైభవమునకు అధిపతి అయినవాడు.    




సాయితో మధుర క్షణాలకు ఒక్క క్షణం విశ్రాంతినిచ్చి ..... 


ఈ రోజునుండి సాయి.బా.ని.స. చెప్పబోయే జనన మరణ చక్రాలపై సాయి ఆలోచనలు అందిస్తున్నాను.  మధ్య మధ్యలో వీరి ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుంది.  

ఈ రోజు మొదటి భాగం వినండి...







జన్మ మరియు పునర్జన్మలపై సాయి ఆలోచనలు  - 1

ఓం శ్రీ గణేషాయనమః, ఓం శ్రీ సరస్వ్వత్యైనమః, ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధాయనమః. 

శ్రీ సాయి సత్ చరిత్ర 10 మరియు 15వ. అధ్యాయాలలో తాను తన భక్తులకు బానిసనని, తాను అందరి హృదయాలలో నివసిస్తున్నానని చెప్పారు.  అసలు విషయానికి వచ్చేముందు, సాయి బా ని స గా మీకందరకూ నా ప్రణామములు. 

ఈ రోజు నేను ఎంచుకొన్న విషయం శ్రీమద్భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్ములవారు, శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీ సాయినాధులవారు చెప్పినటువంటి  ఆత్మ, పరమాత్మ, జననం, మరణం వీటి గురించి ప్రస్తావిస్తాను. నేను సాయినాధుని స్మరిస్తూ  ధ్యానంలో ఉండగా నాకు కలిగిన కొన్ని అనుభూతులను కూడా మీకు వివరిస్తాను. జీవిత చక్రానికి సంబంధించిన నిజాలను, పునర్జన్మ కు కారణభూతమయే సంఘటనలను మీకు అర్ధమయే రీతిలో మీకు చెప్పగలిగితే నా జన్మ ధన్యమయినట్లుగా భావిస్తాను. 

శ్రీ సాయి తన భక్తులకు జ్ఞానేశ్వరిని చదవమని చెపుతూ ఉండేవారు. 41 వ. అధ్యాయములో బాబా తన అంకిత భక్తుడయిన శ్రీ బీ.వీ.దేవ్ గారిని జ్ఞానేశ్వరిని చదవమని సలహా ఇచ్చినారు. మరాఠీ భాష మాట్లాడేవారందరూ భగవద్గీతను జ్ఞానేశ్వరి అని పిలుస్తారు. మొదట్లో దేవ్ భగవద్గీతను అర్ధం చేసుకోలేకపోయేవారు. 1914వ. సంవత్సరం , ఏప్రిల్, 2వ.తారీకున బాబా శ్రీ బీ.వీ.దేవ్ గారికి స్వప్నంలో కనపడి సులభంగా భగవద్గీతను చదివే పధ్ధతిని విశదీకరించారు. ఆవిధంగా బాబా దేవ్ గారి ఆధ్యాత్మికోన్నతికి సహాయం చేశారు.

అందుచేత నేను, భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం లో చెప్పబడినటువంటి జన్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ లతో ప్రారంభిస్తాను. ఇదే విషయం శ్రీ సాయిసత్ చరిత్రలో చెప్పినదానిని కూడా మీకు వివరిస్తాను. 


శ్రీమద్భగవద్గీత : రెండవ అధ్యాయం సాంఖ్యయోగం 12, 13, శ్లోకములు:

శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పెను : ఓ! అర్జునా ! నీవుగాని, నేనుగాని లేని క్షణమే లేదు. ఇకముందుకూడా మనమిద్దరమూ జీవించే ఉంటాము. ఆత్మ స్థిరమైనది, శాశ్వతమైనది. శరీరానికే మరణం. శరీరంలో ఉండే జీవాత్మ జీవితకాలంలో బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యము అనే వివిధ దశలనన్నిటినీ అనుభవిస్తుంది. 

శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయములోని 18, 19 శ్లోకములు:

మన కంటికి  కనపడేవన్నీ  అంతమయిపోవలసినవే. కాని జీవాత్మకు మాత్రము అంతము, అనగా నాశనము లేదు. ఈ చిన్న సత్యాన్ని తెలుసుకొని యుధ్ధానికి సంసిధ్ధుడవు కమ్ము. ఎవడయితే చావుకు ఆత్మే కారణభూతమనియు,ఆత్మే యితరులచేత చంపబడునని అనుకొందురో వారిద్దరూ కూడా అజ్ఞానులే అగుచున్నారు. నిజానికి ఈ ఆత్మ ఎవరినీ చంపదు, చంపబడదు కూడా.


శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము 20, 21 శ్లోకములు: 

ఆత్మకు ఎప్పుడూ కూడా జననము లేదు. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆత్మకు ఆద్యంతములు లేవు. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది పురాతనమైనది. శరీరములో ఉన్నటువంటి ఆత్మకు మరణము లేదు. ఓ! పార్ధా! ఈ నిజాన్ని పూర్తిగా మానవుడు ఎట్లు తెలుకోగలడు. తిరుగుతున్న కాలచక్రములో ఆత్మ  ఒక శరీరమునించి విడిపోయినపుడు దానిని మరణమని భావించుకొనుచున్నాడు.అదే ఆత్మ తిరిగి  నూతన శరీరములోనికి  ప్రవేశించినపుడు దానిని జననమని భావించుకొనుచున్నాడు. అందుచేత ఆత్మ నాశనములేనిది, శాశ్వతమైనది. దానికి జనన మరణాలు లేవు.  


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

శ్రీసాయితో మధురక్షణాలు - 5

$
0
0






23.11.2012 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరలా సాయితో మధురక్షణాలు --  చదివి క్షణ క్షణం స్మరించుకుంటూ ఉండండి.  ఆకాలంలో మీరు ద్వారకామాయిలో ఉన్నట్లుగా ఊహించుకొని ఇప్పుడు చెప్పబోయే దృశ్యాన్ని కూడా కనులారా తిలకించండి. మనమంతా బాబాకు చెందినవారమని భావించుకోండి. 

ఓం సాయిరాం
                 
     

          
మొదటగా శ్రీవిష్ణుసహస్ర నామం 5వ. శ్లోకం మరియు తాత్పర్యము. 

శ్లోకం :    స్వయంభూః  శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః
     
              అనాది నిధనో ధాతా విధాతా ధాతురుత్తమః   || 

పరమాత్మ తనంతట తానే పుట్టుచున్నాడు. శాంతియే తానై వ్యక్తమచుచున్నాడు. అదితి కుమారుడు, కలువ పువ్వులవంటి కన్నులు కలవాడు, శబ్ద స్వరూపమైనవాడు, మొదలు, తుది లేనివాడు. సృష్టి క్రమము ఏర్పరచువాడు లేక కల్పించువాడు, తానే సృష్టి కర్తయు అట్టి సృష్టి కర్తకు పాలకుడు అయి ఉన్నాడు.    

                                                   @@@


          
                                                  
శ్రీసాయితో మధురక్షణాలు - 5

శ్యామకర్ణ - అశ్వము

ఈ సాయినాధుని లీల (అంతుపట్టని  లీల) అప్పుడు జరిగినదానిని మనమొక్కసారి మనోనేత్రంతో దర్శించుకోగలిగి అందులో కనక లీనమయిపోతే అది యదార్ధమేనని స్పష్టమవుతుంది. 
 
మనము ద్వారకామాయిలోనికి ప్రవేశించగానే, బాబా పటానికి ప్రక్కనే కుడివైపున బాబావారి గుఱ్ఱం శ్యామ కర్ణ విగ్రహం కనపడుతుంది.  నేను ద్వారకామాయిలోనికి వెళ్ళినపుడెల్లా, గుఱ్ఱం విగ్రహం వున్న బోను మీద చేయివేసి, బాబాచే అనుగ్రహింపబడిన శ్యామకర్ణను తాకుతున్న అనుభూతిని పొందుతూ వుంటాను.బాబా మనవ రూపంలో ఉన్నపుడు అప్పట్లోఉన్న ప్రతీభక్తుడు, ఇప్పటి ప్రతీ భక్తుడు, తాను బాబా కు చెందినవాడిగా ఉండాలని కోరుకుంటాడు. శ్యామ కర్ణ ఉందంతాన్ని తెలుసుకొన్న తరువాత ఎంతో అత్యున్నతమైనదిగా భావింపబడే  మానవ జన్మ అమూల్యమైనదిగా అనిపిస్తుంది.  బాబావారి అనుగ్రహం పొందిన ఈ గుఱ్ఱం బాబావారికి ప్రీతిపాత్రమైనది.  దానికి బాబా అంటే ఎంతోయిష్టం.  అలాగే బాబా కూడా దానిని ఎంతో ప్రేమతో చూసుకొనేవారు.   

1912 వ. సంవత్సరంలో కాసం అనే గుఱ్ఱాల వ్యాపారి షిరిడీ దర్శించాడు. అతను తనతో కూడా ఒక ఆడ గుఱ్ఱాన్ని తీసుకొని వచ్చాడు. దానికి యింకా సంతానం కలుగలేదు.  అతను తన గుఱ్ఱానికి సంతానం కలిగేలా అనుగ్రహించమని వేడుకొని, దానికి పుట్టిన మొదటి పిల్లని బాబావారికి బహుమతిగా సమర్పించుకుంటానని విన్నవించుకున్నాడు. శ్రీసాయి మహరాజ్ దాని నుదిటిపై ఊదీని రాసి, దీవించి, తరువాత దానికి నీటిలో ఊదీ కలిపి త్రాగించారు.  బాబా అనుగ్రహంతో ఆగుఱ్ఱానికి వరుసగా పిల్లలు కలిగాయి. కాసం తను బాబాకి చేసిన వాగ్దానం ప్రకారం దానికి పుట్టిన మొదటి పిల్లను బాబా వద్దకు తీసుకొని వచ్చి సమర్పించుకొన్నాడు. బాబా దానికి శ్యామకర్ణ అని నామకరణం చేశారు.  దాని శరీరం గోధుమ రంగులో ఉండి, చెవులు నల్లగా ఉండేవి. 

ఈ గుఱ్ఱం యొక్క బాగోగులన్నీ చూడటానికి షిరిడీవాసియైన నానా సాహెబ్ ఖగ్ జీవాలే కి బాధ్యత అప్పగించబడింది. అతను ఆగుఱ్ఱానికి, బాబాకు నమస్కారం ఎలా చేయాలో నేర్పించాడు. ఆరతి సమయంలో శ్యామకర్ణ ఆరతి ప్రారంభమవడానికి ముందే ద్వారకామాయి సభామండపంలోకి వచ్చి నుంచునేది.  ఆరతి ప్రారంభమయాక అది తన కాళ్ళకు కట్టిన గజ్జెలతో శబ్దం చేస్తూ వేడుకగా నాట్యం చేస్తూ ఉండేది.  ఆరతి పూర్తికాగానే అది ద్వారకామాయి మెట్లు ఎక్కి బాబాకి నమస్కారం చేసేది. బాబా దానినుదుటిమీద ఊదీ వ్రాసి ఆశీర్వదించేవారు.  తరువాత మిగిలిన భక్తులందరూ కూడా ఊదీ ప్రసాదం తీసుకొని వెళ్ళేవారు. 
 

చావడి ఉత్సవాలు జరిగేటప్పుడు శ్యామకర్ణని పూసల దండతోను, కాళ్ళకు గజ్జెలతో,తోకకి అందమయిన గుడ్డ కట్టి సుందరంగా పూర్తిగా అలంకరించేవారు.  ఆదృశ్యం నిజంగా ఎంతో చూడదగిన దృశ్యం.  ఊరేగింపులో చావడి వరకు అది నాట్యం చేస్తూ వెడుతూ ఉండేది.  బాబా ఒకసారి చావడిలోకి ప్రవేశించగానే అది బయట బాబా వైపుకు తిరిగి నిలబడి ఉండేది.

బాబా మహా సమాధి అయిన తరువాత శ్యామకర్ణ ప్రతిరోజు సమాధిమందిరానికి వెడుతూ ఉండేది.  అక్కడ అది కనుల వెంట కన్నిరు కార్చుతూ మవునంగా కొంతసేపు నిలబడేది.  అయినప్పటికీ అది ప్రతిరోజూ ఆరతికి వస్తూ చావడి ఉత్సవాలలో కూడా పాల్గొంటూ ఉండేది.  

శ్రీ ఎం.ఎస్.ఘోలప్ అనే ఆయన సాయిలీల పత్రికకు, బాబా భక్తుడయిన శ్రీవిఠ్ఠల్ యశ్వంత్ దేశ్ పాడే (దాదర్, ముంబాయి) గారిని యింటర్వ్యూ చేశారు.  శ్యామకర్ణ గురించిన సమాచారం సాయిలీల మాసపత్రిక 1982, ఫిబ్రవరి సంచికలో ఇవ్వడం జరిగింది.  

"షిరిడీలో నేను చూసిన ఒక దృశ్యాన్ని జీవితంలో మరచిపోలేను.  బాబావద్ద శ్యామకర్ణ అనే గుఱ్ఱం వుంది.  అందమైన చక్కని దుస్తులతో  అలంకరింపబడ్డ శ్యామకర్ణ ఆరతిసమయం లో ద్వారకామాయి బయట నిలబడుతూ ఉండేది.  విచిత్రాలలో కెల్లా విచిత్రమేమంటే ఆరతి పూర్తి అయేవరకూ అది కదలకుండా మవునంగా శబ్దం చేయకుండా నిలబడి వుండేది. ఆరతి సమయంలో మౌనంగా దేనినో ఉచ్చరిస్తున్నట్లుగా విచిత్రంగా దాని పెదవులు కదులుతూ ఉండేవని. చాలా అరుదుగా ఆదృశ్యాన్ని చూసే అవకాశం కలిగేదని కొంతమంది భక్తులు చెప్పారు.  ఆరతి పూర్తయిన తరువాత చోప్ దార్ (యితను ప్రత్యేకమయిన దుస్తులతో మిగతా చాచ్ మెన్ లకన్నా భిన్నంగా ఉండి, పూజా సమయంలో ప్రత్యేకమయిన విధులు నిర్వహిస్తూ ఉంటాడు) రాగ యుక్తంగా  ముగింపు మాటలను చెప్పడం ముగియగానే, శ్యామకర్ణ ముందరి రెండు కాళ్ళను మడిచి తన నుదిటితో ద్వారకామాయి నేలను తాకేది. 

1945 లో ఈ ప్రియమైన అశ్వం మరణించింది.  లెండీబాగ్ లో దానికి సమాధి నిర్మించారు. ద్వారకామాయిలో ఉన్న ఈ విగ్రహాన్ని  షిరిడీవాసి శ్రీబాలా సాహెబ్ షుల్ ల్తే  సమర్పించారు.

  శ్రీ కె.ఎం. అనబడే అప్పసాహెబ్ వార్తక్ అనే ఆయన బొంబాయి మరియు యితర ప్రాతాలలోని పెద్ద పెద్ద కంపెనీలకు ఆడిటర్.  ఆయన శ్రీసాయిబాబా గారికి ప్రీతి పాత్రమయిన శ్యామ కర్ణ యిత్తడి విగ్రహాన్ని సాయి సంస్థాన్ వారికి బహూకరించారు.  దానిని లెండీ బాగ్ లో బావి ప్రక్కన అందమైన తిన్నెమీద ప్రతిష్టించారు.  ఆసుందరమైన విగ్రహాన్ని బొంబాయికి చెందిన ప్రఖ్యాత శిల్పి శ్రీకామత్ గారి కళాసృష్టి.  గుఱ్ఱం విగ్రహం, దానికి నిర్మించిన దిన్నె కలిపి అయిన ఖర్చు రూ.2,000/-.  ఈ ఖర్చునంతా శ్రీవార్తక్ గారు భరించారు. 

సేకరణ

సంధ్యా ఉడ్ తా -  హైదరాబాద్  

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 2 వ.భాగము

$
0
0

                         
                                       

24.11.2012  శనివారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీ విష్ణుసహస్రనామం 6వ. శ్లోకం మరియు తాత్పర్యము:

శ్లోకం:  అప్రమేయో హృషికేశః పద్మనాభో మర ప్రభుః 

         విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధృవః ||


భగవంతుడు కొలతల కతీతమైన హృదయమున కధిపతిగా పద్మమే తన నాభిగా తెలియబడువాడు.  ఆయన దేవతలకు ప్రభువు. విశ్వమును నిర్మాణము చేసినవాడు, మానవ జాతికి అధిపతియైనవాడు, సకల రూపములను చెక్కువాడు.  అందరికన్నా ఎక్కువ వయస్సు కలవాడు.  తానే ధృవమై స్థిరముగానున్నవాడు.     




                                                
జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 2 వ.భాగము



సాయి బా ని స గారు చేప్పే వివరణను ఆలకించండి. 



శ్రీమద్భగవద్గీత 2వ.అధ్యాయము 22, 23 శ్లోకములు:

                             

ఏ విధముగా మానవుడు పాత వస్త్రములను వదలిపెట్టి, క్రొత్త వస్త్రములను ధరించునో, అట్లే ఈ జీవాత్మ కూడా పాత శరీరములను విడిచి క్రొత్త శరీరములను పొందును.  

ఆత్మ ఆయుధముల చేత గాని, అగ్నిచేత గాని, నీటిచేత గాని ఆఖరికి వాయువు చేత గాని నాశనము కాబడదు. 

           
24, 25 శ్లోకములు:

ఆత్మ చేదింపబడనిది, దహింపబడనిది.  ఆత్మ అన్నిచోట్ల వ్యాపించి యుండునది స్థిరమైనది.  ఓ! అర్జునా! అందుచేత ఆత్మను గురించి సంపూర్ణముగా తెలిసికొన్న తరువాత శోకింపతగదు.

26, 27 శ్లోకములు:  

ఓ! అర్జునా ఒకవేళ ఈ ఆత్మ కు కూడా చావుపుట్టుకలున్నవని నీవు భావిస్తూ ఉన్నచో దానిని గురించి నీవు శోకించుట తగదు. పుట్టినవానికి మరణము తప్పదు, మరణించినవానికి జన్మము తప్పదు. అనవసర విషయములపై శోకింపతగదు.

శ్రీమద్భగవద్గీత: 4 వ.అధ్యాయము (జ్ఞాన, కర్మ, సన్యాసయోగ) 5, 6 శ్లోకములు: 

ఓ! అర్జునా! నీకు, నాకు ఎన్నో జన్మలు, ఎన్నో సంవత్సరాలు గడచిపోయినవి.  వాటినన్నిటినీ నీవెరుగవు. మన గత జన్మలగురించినవన్ని నాకు తెలుసును. ఈ జరిగినవాటికన్నిటికీ కూడా నేను అతీతుడను. ఆత్మ వలె నాకు ఆది అంతములు లేవు.  నాయోగ శక్తిచే నేను వివిధ రూపాలలో అన్నిటినీ నాస్వాధీనములో ఉంచుకొందును. 

శ్రీసాయి సత్ చరిత్ర 36వ. అధ్యాయములో బాబా ఇదే విషయాన్ని శ్యామాకు ఇలా తెలియచేశారు "శ్యామా 72 జన్మలనుంచీ మనమిద్దరమూ ఒకరికొకరము  తెలుసుకొని ఉన్నాము. నేను నిన్నెపుడైనా బాధించిన విషయము  ఒక్కటైనా  నువ్వు గుర్తుకు తెచ్చుకొనగలవా?  

మరలా శ్రీ సాయి సత్చరిత్ర 3వ అధ్యాయములో బాబా తన భక్తులకు ఇట్లు చెప్పిరి.  

జనులందరి యొక్క ఇంద్రియములను, మనసును, శరీరాన్ని నా అధీనములో నుంచుకొని పాలించువాడను నేనే.  సమస్త జీవరాసులన్నిటియందు నేను వ్యాప్తి చెంది యున్నాను. ఈ విశ్వములోని ప్రతీదీ కూడా నా ఆజ్ఞచేతనే చలించును. జరిగేవాటినన్నిటికి కారణభూతుడను నేనే. నేనే జగన్మాతను.  త్రిగుణాత్మకుడను నేనే. సృష్టి, స్థితి లయ కారకుడను నేనే. 

శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములవారు అర్జునునకు ఉపదేశించిన ఇదే విషయాన్ని ఈ కలియుగంలో బాబా మనకందించారు.   

ఇంతవరకు నేను భగవద్గీతలో చెప్పినట్లుగా ఆత్మకు ఆది అంతము లేదనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు నేను ఇదే విషయాన్ని గురించి నాకు అర్ధమైనది మీకు వివరిస్తాను. 


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


కార్తిక పౌర్ణమి - సాయి నామ సాధన

$
0
0


                                                                
                                    




26.11.2012  సోమవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ విష్ణుసహస్రనామం 8 వ.శ్లోకం, తాత్పర్యము:

శ్లోకం:      ఈ శానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః  శ్రేష్ఠః ప్రజాపతిః 

          హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనః  ||  


తాత్పర్యము:  పరమాత్మను, మిక్కిలి గొప్పవానిగను, ప్రాణము నిచ్చువానిగను, మరియు ప్రాణముగను, అందరికన్న్నా పెద్దవానిగను, ఉత్తమమైన వానిగను, పుట్టుకకు కారణమైన వాడుగను, బంగారపు గ్రుడ్డ్జుగను భూమికి కేంద్రము మరియు గర్భము అయిన వానిగను, లక్ష్మీదేవికి భర్తగను, మధువు అను రాక్షసుని సం హరించిన వానిగను, ధ్యానము చేయవలయును.   

                            
                           
                            
           
కార్తిక పౌర్ణమి - సాయి నామ సాధన

ఈ నెల 28వ.తారీకు బుధవారము కార్తిక పౌర్ణమి.  ఈ రోజున మీరు చేసే ధ్యానం విశిష్టమైన ఫలితాలనిస్తుంది.ఆరోగ్యం , సంతానం , ఉద్యోగం, వివాహం కోసం బాబావారిని ప్రార్ధించుకొని ధ్యానం చేయండి. సత్ఫలితాలను, ఆయన అనుగ్రహాన్ని పొందండి. 


బాబా పటం, విఘ్నేశ్వరుని పటం ఎదురుగా పెట్టుకోండి. దీపం వెలిగించి అగరువత్తులు కూడా వెలిగించండి. ఆసనం మీద పద్మాసనంలో అలా కూర్చోలేనివారు సుఖాసనంలో కాని కూర్చొని, జప సాధనలో విఘ్నములు కలగకుండా ముందుగా  విఘ్నేశ్వరునికి ఈవిధంగా జపం చేయండి.

మీరు: హిందువులయితే:          ఓం పతి, శ్రీపతి, జయ జయ గణపతి

       మహమ్మదీయులైతే:      అల్లాహూ అక్బర్  లా యిహా ఇల్లాల్లా

       మీరు క్రైస్తవులయితే:      హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా


తరువాత ప్రార్ధన సంకల్పం ఇట్లు చెప్పుకోండి.  మీకోసం మీరు చేసుకొంటే కనక మీ పేరు చెప్పుకొనండి. యితరుల కోసం చేస్తూ ఉంటే కనక వారి పేరు చెప్పి వారి సమస్య ఏమిటో చెప్పి బాబాని ప్రార్ధన చేయండి.

ప్రార్ధన సంకల్పం:

ఓ భగవంతుడా ! పరమాత్మ! సద్గురు సాయిబాబా ఈ జన్మలో నీవే తల్ల్లి, తండ్రి.  నేను తెలిసో, తెలియకో తప్పులు, పొరపాట్లు మరియు ఇతరులకు హాని కలిగించినాను.  ఈ హాని కలిగించడానికి నేను/వారు మాయ చూపించిన మార్గములో యిప్పటివరకు నడచి మాయ వలన శిక్షింపబడినాను.  (ఇలా సంకల్పం చెప్పి)


ఆరోగ్యం కోసం ఇలా చేయండి.

ఆ శిక్షయే మాకు ఈ జన్మలో .........(ఇక్కడ పేరు .........గలవారికి వ్యాధితో బాధపడుచున్నారు. నేను/వారు గత జన్మలో ఈ జన్మలో చేసిన పాపకార్యములకు ఈ జన్మలో ...........వ్యాధి అనే శిక్ష రూపములో కష్టాలు అనుభవిస్తున్నాము.  వీటినుండి విముక్తి పొందడానికి మీ నామ సాధన యధా శక్తి చేసి శరణు వేడుచున్నాము.  గత జన్మలో చేసిన పాప కార్యములన్నింటినీ క్షయము చేసి నాకు/వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి.  సర్వ దోష నివారణ చేయండి.  ఇదే నాప్రార్ధన బాబా అని చెప్పి శ్రీసాయి పాదములను తాకండి.  ఇక నీవే దిక్కు. నీదే భారం.

ఓం సాయిబాబా - జై గురుదత్త      హరిఓం బాబా - జై గురుదత్తా  షిర్డి బాబా - జై గురుదత్తా

శ్రీసాయిబాబా - జై గురుదత్తా    శ్రీ ఓం బాబా - జై గురుదత్తా రక్ష రక్ష సాయిబాబా

                    జై సాయిబాబా జై జై సాయిబాబా

              (కుడి అరచేతిలో యంత్రం ధరించి 11 సార్లు జపించండి)

మరలా ప్రార్ధన మొదలు పెట్టి షిర్డీ ధుని ఊదీని నీటిలో సేవించి ప్రార్ధన నామం ఇలా 11 సార్లు సాధన చేయాలి.  కార్తిక పౌర్ణమి రోజున ఇలా సాధన చేస్తే శ్రీ సాయి అనుగ్రహం కృపాకటాక్షములు మీపై ప్రసరిస్తే ఎలాంటి వ్యాధి అయినా నయం అవుతుంది.   

వివాహం నిమిత్తం:

బాబా నాకు - నా కుటుంబ సభ్యులైన చి. ..........వారికి సర్వ గ్రహ, నాగ దోష నివారణ చేసి తక్షణం మంచి సంబంధం ఏర్పరచి వివాహం కుదర్చండి అని చెప్పి శ్రీసాయి షిర్డీ ధుని ఊదీని సేవించాలి.

ఓం సాయిబాబా - జై గురుదత్తా

శ్రీ సాయిబాబా - జై గురుదత్తా

సంతానం కోసం:

నా కుటుంబ సభ్యులైన శ్రీ/శ్రీమతి ............వారికి సంతానం నిమిత్తం యధా శక్తి మీ నామ జపము చేయుచున్నాను.  సర్వ దోష నివారణ చేసి సంతానం ప్రసాదించండి. అని చెప్పి ఎవరికైతే సంతానం కావలెనో వారు ప్రతీరోజు 4 పూటలా షిర్డీ ఊదీని సేవించాలి.  ఈ కార్తిక పౌర్ణమి రోజున ఊదీ సేవించాలి. 

ఓం సాయిబాబా - జై గురుదత్తా

శ్రీ సాయి బాబా - జై గురుదత్తా

కుడి అరచేతిలో యంత్రం ధరించి సాధన చేయాలి.

ఉద్యోగం/వ్యాపారం/విదేశాలకు వెళ్ళడం/ప్రమోషన్/

బాబా నాకు/నా కుటుంబ సభ్యులైన శ్రీ/శ్రీమతి..........వారికి తక్షణం ఉద్యోగం.......లో ఇవ్వండి.   వారికి సర్వ గ్రహ దోష నివారణ చేసి ఉద్యోగంలో స్థిరత్వం ఇవ్వండి.  మీదే భారం.  షిర్దీ ఊదీని తిలకంగా ధరించి ఆనీటిని సేవించాలి.

ఓం సాయి పరమాత్మనే నమః 

షిర్డీ బాబా - సాయిబాబా  (11 సార్లు)

పైన చెప్పబడిన వాటిని 11 సార్లు సాధన చేసి శ్రీసాయి బాబా వారికి పటిక బెల్లం, లేక, పాలు పంచదార, నివేదించి, టెంకాయను కూడా నివేదించండి.  కర్పూర హారతి ఇవ్వండి.  

చివరిగా ఇలా మనస్సులో స్మరించండి.  2/- లేక 11/- దక్షిణ షిరిడీకి పంపించండి.  ఇప్పటి వరకూ చేసిన సాధన మీకు సమర్పించినాను.  మమ్మల్ని నడిపే భారం మీదే. అని చెప్పి ఒక 10 నిమిషములు కళ్ళు మూసుకొని మౌనముగా బాబావారి ఫొటొవద్ద సాధన చేసి విరమించండి. 


                                  --------

మరొక సాధన: 

ఉదయం ధ్యానం చేయవలసిన పధ్ధతి:

సాయి ఫొటో (ఇందులో ఇస్తున్నాను) బాబా వారి ఫొటో కుడి ఎడమల వైపున నాలుగేసి అగరువత్తులు వెలిగించి ఉంచండి. బాబా ఫొటొ వద్ద ఉన్న యంత్రాన్ని (యంత్రం ఫొటో కూడా ఇస్తున్నాను) మీ గుప్పెటలో ధరించండి.






                                     

శ్రీ సాయికి కర్ఫుర హారతి ఇవ్వాలి. 

కళ్ళు మూసుకొని శ్రీ సాయి కుడి పాదాన్ని ( వీ. ఆకారం పాదముపై) మనస్సులో స్మరిస్తూ రెండు కను బొమ్మల మధ్యన సాయి రాం లేదా ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి లేదా సాయిబాబా బాబా అని మనస్సులో స్మరిస్తూ దృష్టినంతా రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి పది నిమిషములు సాధన చేయండి. 

రెండు అరచేతులు బంధన వేసుకొని 20 నిమిషములు మౌనంగా ఉండి వెన్నెముకను నిటారుగా ఉంచి ధ్యానం చేయాలి.  ఇలా ప్రతీరోజు ధ్యానం చేయండి.  మీకు వీలయితే క్రమేపీ ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ ఉండండి.

మౌనమునిండి నెమ్మదిగా బయటకు వస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి.

శ్రీసాయిని సర్వస్య శరణాగతి అని అంటూ పాదాలను తాకుతూ వేడుకోండి.

శ్రీ సాయి  నామ జపం స్నానంతరం సాయంకాలం కూడా చేయండి.

జపానికి ముందు సంకల్పం చెప్పుకోండి. 

ఉదయం:  3.00 గంటలనుండి 6.00 గంటల మధ్యలో మొదలుపెట్టాలి నిద్ర లేచిన వెంటనే.

సాయంకాలం: భోజనానికి ముందు లేదా భోజనం తరువాత 3 గంటల వ్యవధిలో సాధన చేయవలెను)

సాయిబాబా నామం లేదా యితర మీ ఇష్ట దైవ నామం 5 నిమిషాలు చేయండి. 


బాబా వారికి పుష్పములు సమర్పించి కర్పూర హారతినివ్వాలి.

ప్రసాదంగా పంచదార, లేదా బెల్లం, పటిక బెల్లం లేక అటుకులు ఏదయినా సరే నివేదించి హారతినివ్వాలి.

నిరంతరం మనసులో సాయి సాయి లేక సాయిరాం సాయిరాం అని సాయి నామ జపం చేసుకుంటూనే ఉండండి.


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు 3వ. భాగము

$
0
0



                                                    
                                               
28.11.2012 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


రెండు రోజులుగా  బ్లాగులో ఏమీ ప్రచురించకపోవడానికి కారణం కార్తీక పౌర్ణమి గురించి అందరూ చదివి  సత్ఫలితాలను పొందాలనె ఉద్దేశ్యంతో ప్రచురించలేదు.  మరొక కారణం నేత్రవైద్యుడి వద్ద కళ్ళు పరీక్ష చెయించుకున్న కారణంగా , కళ్ళకు శ్రమ ఇవ్వకూడదనే మరొక కారణం.  ఈ రోజు జన్మ, పునర్జ్మల గురించి చదవండి. సాయితో మధురక్షణాలు కూడా ఉంటాయి.  

                                      

మొదటగా ........

శ్రీ విష్ణుసహస్రనామం 9 వ.శ్లోకం, తాత్పర్యము:

శ్లోకం:  ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విద్మః క్రమః  

         అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ || 


తాత్పర్యము: పరమాత్మను జీవునియందు గల పరమాత్మగను, పరాక్రమము కలవానిగను, ధనుస్సు ధరించిన వానిగను, ప్రజ్ఞావంతునిగను, విశేషమైన క్రమము కల్గినవానిగను, విషయముల కతీతమైన వాడుగను, భయపెట్టుటకు వీలుకానివాడుగను,  విశ్వాసముగలవానిగను, పనులు నెరవేర్చువానిగను, ఆత్మవంతునిగను ధ్యానము చేయుము.  




ఈ రోజు సాయి బా ని స చెప్పినజన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు 3వ. భాగము.


మొట్టమొదటగా సృష్టి ప్రారంభమయినపుడు ఆత్మ లన్నీ కుడా ఒక్క పరమాత్మనుంచే ఉద్భవించాయి.  భగవంతుడు ఖచ్చితమైన సంఖ్యలో నే ఆత్మలను సృష్టించాడు.  దానికి ఉదాహరణ చెపుతున్నాను వినండి. 

1946 వ. సంవత్సరంలో మనదేశ జనాభా 40 కోట్లు. దానర్ధం మానవ రూపంలో ఉన్న ఆత్మల సంఖ్య 40 కోట్లు.

ఇతర జీవాలలో ఉన్న ఆత్మల సంఖ్య "ఎక్స్" సంఖ్య లో ఉన్నాయనుకొందాము.  అనగా మొత్తం ఆత్మల సంఖ్య (40 + ఎక్స్.) కోట్లు.  2006 వ. సంవత్సరంలో భారత దేశపు జనాభా 100 కోట్లు. అందుచేత 2006 వ. సంవత్సరంలో మానవులు, యితర జీవులు కలిపి చూడగా మారిన సంఖ్య 100 + ఎక్స్ కోట్లు. తేడా ఉన్నది ఒక్క ఎక్స్ లోనే. వీటిలోనే తరగడం గాని, పెరగడంగాని మొదలైన మార్పులు ఉంటాయి.(అదేవిధంగా మానవుల ఆత్మలో కూడా ఉంటాయి) సృష్టి ప్రారంభమయినపుడు ఉన్న ఆత్మల సంఖ్యకు సమతుల్యంగా ఉంటుంది. కోటాను కోట్ల ఆత్మలలో ఒకే ఒక ఆత్మ భగవంతునిలో ఐక్యమవుతున్నది.(ఇదే విషయాన్ని శ్రికృష్ణ పరమాత్ములవారు భగవద్గీతలో అన్నమాటలు "నూటికి కోటికి ఒక్కడు మాత్రమే నన్ను చేరగలుగుతున్నడు")  అలా సృష్టించబడిన ఆత్మల సమతుల్యంలో చాలా కొద్ది మాత్రమే ఉండేలాగ ప్రకృతి తానంత తానే  స్వయంగా చూసుకొంటుంది.

నేను పైన చెప్పిన ఆలోచనలకు నిరూపించడానికి కొన్ని ఉదాహరణలిస్తాను. 

రామాయణంలో కైకేయి మహరాజు ఆడలేడి కి సంబంధించిన లేడిని చంపినందుకు, ఆ ఆడలేడి మంధరగా జన్మించింది. 

శ్రీ సాయి సత్ చరిత్ర 27వ. అధ్యాయములో గోవు లక్ష్మీఖపర్దే గా జన్మించిన విషయాన్ని గుర్తు చేసుకుందాము. లక్ష్మీ ఖాపరదే గోవు జన్మ తరువాత వరుసగా పొందిన జన్మలన్ని మనకు తెలుసు.  

మరొక ఉదాహరణ చెపుతాను. మహాభారతంలో అంబ అనే యువరాణి భీష్ముడిపై పగ తీర్చుకోవడానికి శిఖండిగా జన్మించి అతని మరణానికి కారణమయింది. 
                                  
శ్రీ సాయి సత్ చరిత్ర 47 వ. అధ్యాయములో దుబాకీ అనే స్త్రీ వీరభద్రప్ప మీద పగ తీర్చుకోవడానికి చెన్నబసప్పగా జన్మించింది. 

జడభరతుడనే మునికి తన ఆశ్రమంలో తిరిగే లేడి పిల్లపై ప్రత్యేకమైన మమకారం ఉండేది. ఆయన మరణించిన తరువాత ఆ లేడిపిల్లపై ఉన్న మమకారంతో తిరిగి లేడిగా జన్మించాడు.

శ్రీ సాయి సత్చరిత్రలో చెన్న బసప్ప, వీర భద్రప్పలు మరుసటి జన్మలో పాము, కప్పలుగా  జన్మించి తమ శతృత్వాన్ని కొనసాగించారు.

కాని ఒక విషయం మాత్రం స్పష్టం అదేమిటంటే మానవుడు మరణించిన తరువాత తిరిగి మానవుడిగానే జన్మిస్తాడనే ఖచ్చితమైన ప్రామాణికం లేదు. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితం. వారి వారి కర్మానుసారం మానవులు తిరిగి జంతువులుగా గాని, జంతువులు తిరిగి మానవులుగా గాని జన్మించవచ్చు. అందుచేత సృష్టిక్రమ ప్రారంభ సమయంలో ఎన్నయితే ఆత్మలు ఉన్నవో అదే సంఖ్యలో ఆత్మలు ఈన్నటికీ ఉన్నవి.  

శ్రీ సాయి సత్ చరిత్ర 42 వ. అధ్యాయములో బాబావారు మానవులలోనూ, జంతువులలోను అందరిలోనూ ఒకే విధమయిన ఆత్మ ఉన్నదని చెప్పారు.ఆత్మలయొక్క లక్షణాలలో మార్పులు లేవు. బాబా లక్ష్మితో ఏమని చెప్పారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొందాము. బాబా లక్ష్మితో "లక్ష్మీ, ఎందుకని అనవసరంగా కలవర పడతావు? కుక్క ఆకలి తీర్చినట్లయితే నా ఆకలి తీర్చినట్లే. కుక్కలో కూడా ఆత్మ ఉన్నది.  జీవియొక్క రూపం వేరు.  కాని అందరి ఆకలి ఒక్కటే. ఆవిధంగా మానవులలోను, జంతువులలోనూ ఉన్నది ఒకేవిధమయిన ఆత్మ అని నిర్ధారించారు.


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 



       

శ్రీసాయితో మధుర క్షణాలు - 7

$
0
0



                                                 
29.11.2012 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 10 వ. శ్లోకం, ప్రతిపదార్ధం 

                                 
                                     
శ్లోకం: సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 

        అహః సంవత్సరో వ్యాళః  ప్రత్యయః సర్వదర్శనః ||


పరమాత్మ దేవతలకు అధిపతిగను, శరణ్యముగను, సహనముగను, అయిఉన్నాడు. విశ్వమునకు బీజమువంటివాడు. జీవుల పుట్టుకకు కారణమైనవాడు. అట్లే దినము, సంవత్సరము మరియు నర్వమువంటి కాలము తానేయున్నాడు.  విశ్వాసమునకు మూలము మరియు సమస్తమును దర్శింపచేయువాడు.   
   
ఇప్పుడు మరలా శ్రీసాయితో మధురక్షణాలను మధురంగా అనుభవిద్దాము. మరలా మరలా అనుక్షణం గుర్తు చేసుకొందాము. 

శ్రీసాయితో మధుర క్షణాలు - 7

పేరు చెప్పడానికిష్టపడని భక్తుల  అనుభవాలు - 2 


1946 వ. సంవత్సరంలో నేను,  బొంబాయిలోని మద్రాసీ హిందూ హొటల్ లో మరొక ప్రముఖజ్యోతిష్కుడు హస్తసాముద్రికునితో ఒకే గదిలొ కలసి ఉన్నాను.    ఆగదిలోకి ఆయన కోసం ఎంతో మంది సందర్శకులు వస్తూ ఉండేవారు.  మొదట్లో ఆయనకు సాయిబాబా అంటే నమ్మకం లేదు.  ఎప్పుడో సమాధి పొందిన గురువు గురించి, శక్తిని వృధాగా ఖర్చు చేస్తూ, కాలాన్ని వెచ్చిస్తున్నావని నాతో తరచూ అంటూ ఉండేవాడు. సాయి, నేడు జీవించి ఉన్న ఏ గురువుకన్నాకూడా ఇప్పటికీ చాలా శక్తిమంతుడని నేను చెప్పినపుడు, అంతకన్నా ఎక్కువ శక్తిమంతుడు కాకాపోతే నేను చెప్పినదానిని నమ్మనని చెప్పాడు. ఒకరోజున ఆయన వద్దకు జ్యోతిష్య సంబంధమయిన విషయాలు అడగటానికి వచ్చిన సందర్శకులు ఉన్నప్పటికీ, ఆయనకు బాబా తన శక్తివంతమైన కళ్ళతో తనవైపు చూస్తూ  నిలుచుని ఉండటం కనిపించింది. ఆయన ఆశ్చర్యంతో బాబాను చూడటానికి బయటకు వెళ్ళారు.  బాబా నన్ను ఉద్దేశ్యించి, గదిలో గోడకు నేను తగిలించిన బాబా పటం గురించి (నా ముఖానికి ఎదురుగా నా పాదాలకు ఎత్తులో  ఉంది బాబా పటం) ఇలా  చెప్పారు. 

                                       

"చూడు ఈ మనిషి. వాడు నాభక్తుడినని చెప్పుకొంటాడు.  వాడి పాదాలు నాపటానికి ఎదురుగా కనిపించేలా పెట్టుకుని పడుకుంటున్నాడు. నాపటానికి ఎదురుగా కాళ్ళు పెట్టుకొని పడుకోవద్దని వాడికి చెప్పు. ఇలా చెప్పి బాబా అదృశ్యమయారు.

బాబా అక్కడ ప్రత్యక్షమయి తనతో మనోహరంగా మనసుకు నాటేటట్లు మాట్లాడటం ఆయనను చాలా ఆశ్చర్యచకితుడిని చేసింది.  బాబా జీవించి లేరు అనే అర్ధరహితమైన భావన ఆయన మదిలోనించి తొలగించుకొన్నారు.  తాను ప్రత్యక్షంగా బాబాను చూశారు.  నన్ను తన భక్తునిగా నామీద ఎంతో మక్కువ కనపరచారు. 

ఆ జ్యోతిష్కుడు తనకోసం వచ్చినవారినందరినీ పంపి వేశారు.  నేను గదిలోకి రాగానె ఆయన చాలా ఉద్విగ్నతతో జరిగిన   యదార్ధాలన్నిటినీ వివరంగా చెప్పారు.  గోడమీద బాబా పటం ఎక్కడ ఉన్నదో అక్కడనె ఉంచి, నా పాదాలు ఆయనవైపు ఉండకుండా వుండేటట్లుగా మంచం దిశను మార్చేయమని ఆయన నన్ను పట్టుబట్టారు.  వెంటనె మేము మంచం దిశను మార్చి పెట్టాము.   ఈ సంఘటనతో ఆయనకూడా బాబాకు అంకిత భక్తుడయారు. 

శ్రీ బీ.వీ.నరసిం హ స్వామీజీగారి వివరణ. 
 
తన పేరు చెప్పడానికిష్టపడని, బొంబాయిలో నివసిస్తున్న సాయిభక్తుడు చెప్పినదంతా యదార్ధమని నేను  నమ్ముతున్నాను..

సాయిసుధ.
మార్చ్, 1950, ఏప్రిల్, 1950   
సౌజన్యంతో.  

మరికొన్ని మధురక్షణాలకై ఎదురు చూడండి.......

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

సాయితో మధురక్షణాలు - 8

$
0
0

                                                  
                                                   
30.11.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయితో మధురక్షణాలు - 8
                                                         
                             

ముందుగా శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రం 11వ. శ్లోకం, తాత్పర్యము. 

శ్లోకం:      అజః సర్వేశ్వరః సిధ్ధః సిధ్ధిః సర్వాదిరచ్యుతః  

             వృషా కపి రమే యాత్మా సర్వయోగ వినిస్సృతః   ||

తాత్పర్యము: పరమాత్మను పుట్టనివానిగనూ, అన్నిటికినీ అధిపతిగనూ, సాధింపబడిన మరియూ సాధించుటయను రెండునూ తానే  యైనవాడుగ, అన్నిటికన్నా మొదటగా నున్నవాడుగ, జారిపోవుట లేనివానిగా, వర్షములు కలిగించి మరల నీటిని స్వీకరించువానిగ, కొలత కందని ఆత్మ తత్త్వము కలవానిగ, అన్ని లోకములయందలి సామ్యముగా, సృష్టిని పుట్టించువానిగా, ధ్యానము చేయవలయును.   
  

శ్రీసాయితో మధుర క్షణాలు 8వ.భాగములో పేరు చెప్పడానికిష్టపడని బాబా భక్తులు చెప్పిన లీలలలో 3వ. లీల.

బాబావారి అనుగ్రహపు జల్లు నామీద నిరంతరం ఎంతగా కురుస్తోందంటే, ఆయనతో నాకు కలిగిన అనుభూతిని, వాటిలో నుండి  ఏది నిర్ణయించుకొని చెప్పాలో కష్టం. 

ఇటీవలి సంవత్సరాలలో సాయిబాబా నాకు దర్శనమిచ్చినవాటిలో  మహదీ బువాగారికి కి కూడా సంబంధించినది ఒకటి ఉంది.  నేను మహదీ బువాగారి వద్దకు వెళ్ళి కొంత సమయం ఆయనతో గడిపి వస్తూ ఉండేవాడిని.  1943 ప్రాంతంలో ఒకరోజు నేను మహదీ బువాగారిని  కలుసుకున్న తరువాత, అక్కడినుంచి నేనొక్కడినే హోటల్ లో భోజనం చేయడానికి బయలుదేరాను. బ్రహ్మచారిని అయినందువల్ల, హోటల్లో భోజనం చేయవలసిన పరిస్థితి వచ్చి, నేను స్వయంగా వండి బాబాకు నైవేద్యం పెట్టే అవకాశం లేకుండా పోయిందే అని ఒక్కక్షణం అకస్మాత్తుగ నామనసుకు అనిపించింది.  

ఇలా ఈ పరిస్థితి  వచ్చినందుకు చాలా ఖిన్నుడినయి, వంటరిగా నేనొక్కడినే భోజనం చేస్తున్నందుకు  క్షమించమని బాబాను ప్రార్థించాను.

 అకస్మాత్తుగా, నా ఆశ్చర్యానికనుగుణంగా, నా బల్లకెదురుగా మహదీబువ గారు, బాబా, ఇద్దరూ భోజనం చేస్తూ ఉండటం చూశాను. మొట్టమొదటగా నాకెంతో సంతోషం కలిగింది. తరువాత నన్ను నేనే నిందించుకొన్నాను.  అఱచేతులతో కణతలు నొక్కుకొని, కన్నీళ్ళతో "బాబా నేను పాపిని" అన్నాను బాబాతో. ఇక్కడ మీరు  భోజనం చేస్తున్నట్లుగా నాకు దర్శనమిచ్చి ,  నాకు మీరు ప్రసాదించిన ఇంతటి గొప్ప గౌరవానికి నేను తగను. కొద్ది సమయంలోనే బాబా, మహదీబువా ఇద్దరూ అదృశ్యమయారు. ఆరోజున బాబా, మహదీబువా వాస్తవంగా హోటల్ కి వచ్చారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకొని హోటల్ నుండి బయటకు వచ్చాను.  అలా నిశ్చయించుకొని నేను మహదీ బువా గారి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్నంతా వివరంగా చెప్పి, "ఆ దృశ్యం నిజమేనా"" అని ఆయనను అడిగాను. బాబా మీద నాకున్నటువంటి అత్యంత భక్తి, బాబాతో నాకున్నటువంటి తీవ్రమయిన, నిరంతరమయిన ఏకాగ్రత వల్లనే ఆయన దర్శనం కలిగిందని, అది నిజమేనని చెప్పారు.  అయినప్పటికీ నేనాయనను ఒక ప్రశ్న అడిగాను  "మీరు కూడా కనిపించారు కదా? మీరెందుకు వచ్చారు?"  తాను ఆరోజు భౌతిక శరీరంతో హోటల్ కు రాలేదని ఒప్పుకున్నారు. ఇంకా ఆయన, బాబా తన అద్భుతమయిన శక్తితో ఒకే సమయంలో రెండు శరీరాలను ధరించగలరని చెప్పారు.     

     క్రింద శ్రీ బీ.వీ.నరసిం హ స్వామీజీ గారి వివరణ.

బొంబాయిలో నివసిస్తున్న, పేరు చెప్పడానికిష్టపడని ఈ నిజమైన భక్తుడిని నేను చూశాను. ఆయన చెప్పినదంతా నిజమని నేను నమ్ముతున్నాను. 

సాయిసుధ 
మార్చ్, 1950 

సాయిసుధ
ఏప్రిల్, 1950 


(ఇంకా క్షణ క్షణం మధుర క్షణాలకు ఎదురు చూడండి)

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



శ్రీసాయితో మధురక్షణాలు - 9 వ.భాగము

$
0
0

                                                   
                                                 

01.12.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయితో మధురక్షణాలు - 9 వ.భాగము
                               

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం 12వ. శ్లోకం, తాత్పర్యం 

శ్లోకం: వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః 

        అమోఘః  పుండరీకాక్షో వృష కర్మా వృషా కృతిః  ||

సృష్టియందలి సంపదగానూ, ఆసంపదను గోరు మనస్సుగనూ, సత్యముగను, ధర్మముగానూ, సామ్యము గలవానిగను, చక్కగా కొలువబడువానిగనూ, సముడుగనూ, వ్యర్ధముకానివానిగను, పద్మము వంటి కన్నులు కలవానిగనూ, వర్షము కలిగించువానిగనూ, వర్షమే తానైనవానిగనూ ధ్యానము చేయవలయును.      

శ్రీసాయితో మధుర క్షణాలు 8వ.భాగములో పేరు చెప్పడానికిష్టపడని బాబా భక్తులు చెప్పిన లీలలలో 4 వ. లీల.

బాబాగారు జీవించి ఉన్న రోజులలో జరిగిన సంఘటనలలో ఒక సంఘటనను మహదీ బువా గారు ఈ క్రింది విధంగా వివరించారు. 

చైనా బజార్ లో గొప్ప సంపన్నుడు ఉండేవాడు.  అతనికి ఒక కుమారుడు ఉన్నాడు.  అతనికి  వ్యసనాలు బాగా ఎక్కువ. ఆ యువకుడు బాగా అత్యాస గల వడ్డీ వ్యాపారులవద్ద అప్పులు చేశాడు. ఆ వడ్డీ వ్యాపారులు ఇతని వద్ద ఉన్నదంతా లాగేసుకొని, వారు తాము ఇచ్చిన  అప్పుకంటే  అత్యంత అధిక మొత్తాలకి బాగా ఎక్కువ వడ్డీకి ప్రామిసరీ నోట్లు వ్రాయించుకొన్నారు. ఆ యువకుడు హీన స్థితికి దిగజారాడు. ఆ దౌర్భాగ్య స్థితి మరియు దివాల పరిస్థితినుండి బయటపడటానికి షిరిడీ వెళ్ళి సాయిబాబా ఆశీర్వాదములు తీసుకొమ్మని సలహా ఇచ్చారు. అతను షిరిడీ  మసీదుకు వెళ్ళినప్పుడు, బాబాఆగ్రహంతో , డబ్బు ఇవ్వడానికి బదులు, కఱ్ఱ తీసుకొని అతని వెనకాల పరుగెత్తి అతనిని కొట్టి ఇలా అన్నారు " సగ్లా పైసా పనిన్ తక్లా పూడె జా మీ ఎతో"   (నీ డబ్బునంతా నీటిలోకి విసిరి వేశావు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను, నీకంటే ముందు నేనక్కడ ఉంటాను).  ఆయువకుడు నిరుత్సాహంతో అణగారిపోయి బొంబాయికి తిరిగి వచ్చాడు. కాని అతను తన ఇంటిని సమీపించగానే  తన ఇంటిలో జరుగుతున్నదానిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తనకు అప్పు ఇచ్చిన ఒక వడ్డీవ్యాపారి అక్కడ ఉన్నాడు. బాబా ఆ వడ్డీవ్యాపారితో "నువ్వు మళ్ళి ఈ అప్పుతీసుకున్నవాడి దగ్గరకు వచ్చావంటే నీ మెడ విరిచేస్తాను" అంటూ ఆవడ్డీ వ్యాపారిని బెదిరిస్తూ కనిపించారు. అతని వద్ద తాకట్టుపెట్టిన నగలు, పత్రాలన్నిటినీ వ్యసనపరుడైన ఋణగ్రస్తునికి తిరిగి ఇచ్చివేయమని ఆజ్ఞాపించారు. తీసుకున్న అప్పుమొత్తం ముట్టినట్లుగా కూడా పత్రం రాసి యిమ్మని వత్తిడి చేశారు. వ్యసనపరుడయిన యువకుడు బాబాని చూడగలిగాడు, కాని ఆ వడ్డివ్యాపారి ఒక దెయ్యాన్ని చూశాడు. ఏమయినప్పటికీ ఆ వడ్డివ్యాపారి భయంకరమైన దెయ్యాన్ని చూసి, తనను బలవంతపెట్టడంతో భయంతో  అతను చెప్పినట్లే  చేశాడు. అతను తన వద్ద తాకట్టు పెట్టిన నగలన్నిటినీ , పత్రాలనూ, తిరిగి ఇచ్చివేసి, అప్పుమొత్తం తీరిపోయినట్లుగా దస్తావేజు కూడా రాసి ఇచ్చాడు. బాబా వ్స్యనపరుడయిన యువకుడి వైపు తిరిగి "నేను నిన్ను విడిచిపెట్టేశాననుకున్నావు. కాని ఎవరయితే నన్ను శరణు వేడుతారో వారిని నేనెప్పుడు విడిచిపెట్టను (మాలా కోనీ శరణ్ ఘెయున్ ఆలె, త్యానా మీ కెవ్హం సొడ్నర్ నహీ)
                                   
                                               
శ్రీ బీ.వీ.నరసిం హస్వామీజీ గారి వివరణ

బొంబాయిలో నివసిస్తున్న ఈ నిజమైన భక్తుని నేను చూశాను. అతను చెప్పినదంతా నిజమని నేను నమ్ముతున్నాను.  

సౌజన్యం:

సాఇ సుధ
మార్చ్ 1950

సాయిసుధ
ఏప్రిల్, 1950 

(యింకా మరికొన్ని మధురక్షణాలు .....)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు 

జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు 4వ.భాగము

$
0
0




                                                    
02.12.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. చెప్పుతున్న జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు 4వ.భాగము విందాము. 


జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు 4వ.భాగము 



ఈ విషయం మీద శాస్త్రవేత్తలు ఏమని చెప్పారో ఒక్కసారి దాని మీద దృష్టి పెడదాము. కొన్ని రకాలయిన జీవులు క్రమంగా అంతరించి పోవడం మనకు తెలుసు.  మరొక మాటలో చెప్పాలంటే బహుశా వాటి ఆత్మలు మానవ రూపాలను ధరిస్తూ ఉండటం, ఆ విధంగా మానవ జాతి అభివృధ్ధి చెందడం జరుగుతోంది.  జంతువులయొక్క మంచి లక్షణాలు, ప్రవర్తన వల్ల వాటిలోని ఆత్మలు మానవులుగా పునర్జన్మ ఎత్తుతున్నాయి. 



ఆత్మకు రూపం,రంగు, రుచి లేదు కనక దానిని చూడలేము. ఆత్మ శరీరములోనికి ప్రవేశించిన తరువాత చేసుకొన్న కర్మను బట్టి మంచి పనులుగాని, చెడు పనులు గాని చేస్తుంది. సాంకేతికంగా అభివృధ్ధి సాధించిన ఈ రోజుల్లో మనము గృహావసరాలకు, పరిశ్రమలకు ఎల్.పీ.జీ. వాడుతున్నాము. దానికి రంగు,రుచి,వాసన ఇటువంటివేమీ లేవు.  సులభంగా గుర్తించడానికి వీలుగా శాస్త్రవేత్తలు,  దానికి ఒక విధమైన వాసన కలిగిన గాస్ మెర్కప్టైన్ అనే  వాయువును కలిపారు.

అందుచేత భగవంతుడు ఆత్మ యొక్క శక్తిని మనం గ్రహించుకొనేందుకు వీలుగా వివిధ రకాలయిన జీవులలో ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని చేపట్టాడు. మానవుల శరీరం గాని, జంతువుల శరీరం గాని మరణించిన తరువాత శిధిలమవుతాయి, ఇక ఆత్మలు క్రొత్త శరీరాలలోనికి అనగా మానవ శరీరంలోనికి గాని, జంతువులు లేక కీటకాల లోనికి ప్రవేశిస్తాయి. పురాణాల ప్రకారం ఈ విశ్వంలో  కోట్ల జీవరాసులు వున్నాయి.  మరొక విధంగా చెప్పాలంటే అవి ఒకదాని తరువాత మరొకటిగా తిరిగి జన్మలెత్తుతూ ఉంటాయి. 

మానవ రూపాలలో ఉన్నటువంటి ఆత్మ  నిరంతరం తమ జీవిత కాలమంతా అత్యుత్తమమైన లక్షణాలను ప్రదర్శించినట్లయితే ఆత్మ పరమాత్మలో లీనమయిపోతుంది. ఉదాహరణకి భారతంలోని ధృవుని చరిత్రను తీసుకొందాము. ఆయన తన రాజ్యాన్ని చక్కగా 26 వేల సంవత్సరాలు పరిపాలించాడు.  శ్రీ మహా విష్ణువుయొక్క అనుగ్రహంతో ధృవుడు ధృవతారగా ఆకాశంలో వెలుగొందుతున్నాడు. 
                                    


శ్రీ సాయి సత్ చరిత్రలోని 31వ. అధ్యాయములో మనకి ఇటువంటి పాత్ర కనపడుతుంది.  తాత్యా సాహెబ్ నూల్కర్ చనిపోయినప్పుడు, బాబా విచారంతో "తాత్యా మనని విడిచి వెళ్ళిపోయాడు.  అతనికి పునర్జన్మ లేదు" అన్నారు. ఈ విధంగా బాబా తన భక్తులు కొంతమందికి సద్గతిని కలిగించారు. 
                                        

శ్రీమద్భగవద్గీతలో 7 వ.అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగములోని 3, 30 శ్లోకాలలో ఏమి చెప్పబడిందో చూద్దాము.   

శ్రీకృష్ణ పరమాత్ములవారు ఇట్లా చెప్పారు: వేలల్లో ఒకరిద్దరు మాత్రమే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా అరుదుగా వారిలో ఒక్కడు మాత్రమే నా యదార్ధ రూపమును తెలుసుకొనుచున్నాడు. వారే తాము చేసే ప్రయత్నాల వల్ల  నన్ను, నా నిజ స్వరూపాన్ని తెలుసుకొని అంతులేని జనన మరణ చక్రాలనుంచి శాశ్వతంగా విముక్తులవుతున్నారు. 

శ్రీ సాయి సత్ చరిత్ర 31వ. అధ్యాయములో బాబా పునర్జన్మ గురించి ఏమని చెప్పారో తెలుసుకొందాము. బాబా దర్బారుకు జబ్బు పడిన పులిని తీసుకొనివచ్చారు.  బాబా "ఈ పులి కిందటి జన్మలో మానవునిగా మీకు ఋణపడి ఉంది.  పులిగా జన్మించి కిందటి జన్మలోని ఋణాన్ని తీర్చుకొని ఈ ద్వారకామాయిలో సద్గతి పొందింది" అన్నారు.


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


  

Viewing all 726 articles
Browse latest View live