Quantcast
Channel: Telugu Blog of Shirdi Sai Baba,read sai leels,devotees experiences in telugu
Viewing all 726 articles
Browse latest View live

శ్రీసాయితో మధుర క్షణాలు - 10

$
0
0



                                                 
04.12.2012 మంగళవారము 

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 


శ్రీ సాయితో మధుర క్షణాలు తరువాయి భాగం 
                             



ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 13వ. శ్లోకం, తాత్పర్యము

శ్లోకం:  రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశవాః   

         అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః  ||

పరమాత్మను చందస్సుల కధిదేవతగా, అనేక శిరములు కలిగినవానిగా, సృష్టియందలి వర్ణములన్నియు తన రూపమైనవానిగా, విశ్వమునకు పుట్టుకయైనవానిగా మరియు విశ్వమునందు పుట్టుచున్నవానిగ, మృత్యువు లేనివానిగ, శాశ్వతునిగ, చైతన్యము లేనివానిగ, ఉత్తమమైన పుట్టుక కలవానిగ, గొప్ప తపస్సు చేయువానిగ మరియు తపస్సే తానైనవానిగ ధ్యానము చేయుము. 


                                               

శ్రీసాయితో మధుర క్షణాలు - 10

పేరు చెప్పడానికిష్టపడని ఒక బాబా భక్తుడు చెప్పిన అనుభవాలలో 5 వ. లీల. 



బాబాకు, అక్బర్ కు  సంబంధించి, మహదీ బువా వివరించిన మరొక చిన్న కధ.

ఒకరోజు కొంతమంది బాలురు, మహదీ బువా, బాబాతో ఉన్నప్పుడు,  బాలురు అక్బర్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటున్నారు. 
                                             

బాబా "మీరు అక్బర్ గురించి మాట్లాడుకుంటున్నారా,  అతను నా పాదాలవద్ద ఉన్నాడు" అన్నారు. మీరప్పుడు ఏమి చేస్తున్నారు బాబా" అన్నారు ఆబాలురు. నేనప్పుడు అమర్ కోట వద్ద ఫకీరును" అన్నారు బాబా.  అప్పుడది షేర్షా  ఢిల్లీకి చక్రవర్తిగా ఉన్న కాలం.  హుమయూన్ రాజ్య భ్రష్టుడై సిం హాసనాన్ని కోల్పోయి దేశ బహిష్కృతుడై ఒక ప్రదేశాన్నించి నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతూ ఉన్నారు.  

                                           
ఆ చక్రవర్తి  నావద్దకు వచ్చినపుడు కూడా అతని భార్య ఉన్నది.  ఆమె నాపాదాల వద్ద పడి నా ఆశీర్వాదములు కోరింది.  ఆమె అప్పుడు గర్భిణీ.  నేనామెతో "ప్రక్కనున్న అమర్ కోట గ్రామంలో నీకు మగపిల్లవాడు జన్మిస్తాడు.  నేనా బాలునికి నామకరణం చేస్తాను" అని చెప్పాను.   కొంతకాలం తరువాత ఆమె ఒక మగ పిల్లవానికి జన్మనిచ్చింది. 

నామకరణ సమయానికి నేనక్కడకు వెళ్ళాను.  నేనా బాలునికి అక్బర్ అని నామకరణం చేశాను.  ఆబాలుడు నాపాదాల వద్ద ఆడుకొన్నాడు. 
                                 
బొంబాయిలో నేను మహదీబువాను కలుసుకొని ఆయనవద్ద నుంచి చాలా సమాచారాన్ని సేకరించాను. ఆయన బొంబాయిలో చివర ఎక్కడో , గౌరవనీయుడైన ఒక మహమ్మదీయుని యింటిలో ఉంటున్నారు.  హిందువులు, ముసల్మానులు, పార్శీలు మొదలైన వారంతా ఆయనంటే ఎంతో గౌరవంగా ఉండేవారు. యింటి యజమాని కూడా అద్దె గురించి  ఎప్పుడు రొక్కించి అడగలేదు. పుట్టుకతో ఆయన హిందువు.  కాని, ఆయన కుల మత భేదాలకు అతీతంగా అందరూ సమానమే అనే విధంగా అందరితోను కలిసి జీవించారు.  బాబా మహాసమాధికి ముందు తాను బాబాతో కొన్ని సంవత్సరాలు గడిపినట్లు చెప్పారు.    

శ్రీ బీ.వీ.నరసిం హస్వామీజీ  గారి వివరణ:

బొంబాయిలో నివసిస్తున్న ఈ నిజమైన భక్తుడిని నేను చూశాను.  ఆయన చెప్పినది విన్నాను. ఆయన చెప్పినదంతా నిజమని నమ్ముతున్నాను.

సాయిసుధ
మార్చ్, 1950

సాయిసుధ
ఏప్రిల్, 1950


(ఇంకా ఉన్నాయి మధురక్షణాలు)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 



శ్రీసాయితో మధుర క్షణాలు - 11

$
0
0


                              
                                               
05.12.2012 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయితో మధుర క్షణాలు - 11

పేరు చెప్పడానికిష్టపడని భక్తుడు చెప్పిన లీల - 6
                         
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 14వ.శ్లోకం, తాత్పర్యము 

                              

శ్లోకం:     సర్వగస్సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్ధనః  

              వేదో వేదవిద్వ్యంగో వేదాంగో  వేదవిత్కవిః     ||

తాత్పర్యము:  పరమాత్మను అంతట వ్యాంపించియుండు వానిగా, సమస్తమును తెలిసినవానిగా కిరణములను వెలుగు తానేయైన వానిగా, విశ్వమందలి సేనలకు నాయకునిగా, జీవులను కాలముగా తనలోనికి స్వీకరించువానిగా, జ్ఞానము తెలియు వాడుగను,  వేదాంగములు తానే యగుటచే అంగలోపము లేనివానిగ పురాణములను కల్పించు కవిగ, మరియు అందలి పరమార్ధము తెలియబడువానిగను ధ్యానము చేయుము.     



శ్రీసాయితో మధుర క్షణాలు - 11

ఒకసారి ఒకానొక సందర్భంలో షిరిడీలో నివసిస్తున్న నానావలి అనే సన్యాసి, బాబాగారు ఉన్న కాలంలో రోడ్డుమీద నిలబడి బాబాని చాలా అగౌరవంగా నిందించసాగాడు.  బాబా అప్పుడు ఒక కార్యం మీద ద్వారకామాయినించి బయటకు వెళ్ళి అప్పుడే  తిరిగి వస్తున్నారు.  ఆయన భక్తులు బాబా గురించి చాలా చెడుగా, అవమానకరంగా నిందిస్తున్న నానావలిని దుడ్డుకఱ్ఱతో విచక్షణా రహితంగా బాదుతూ ఉండటం, అప్పుడే అక్కడకు చేరుకున్న బాబా చూడటం జరిగింది.  బాబా కొద్ది దూరంలో నిలబడి తనకు చాలా బాధగా ఉన్నదని చెప్పారు.  కొంత మంది భక్తులు ఏమిటి మీబాధ అని అడిగారు.  బాబా నానావలి వైపు చూపిస్తూ పాపం, ఆ అమాయక సాధువుని మీరెందుకని కొడుతున్నారని అడిగారు.  మీరతనిని కొడుతూండటం వల్ల నావీపు మీద నొప్పి కలుగుతున్నది అన్నారు బాబా.  
                               

అప్పుడు వారు నానావలిపై తాము చేసిన పనికి సిగ్గుపడి అతనిని బాధించడం మానుకొన్నారు. నానావలి తనను చెడుగా మాట్లాడినా బాధపడకుండా, నానావలి ఆ శిక్షకు అర్హుడయినప్పటికీ అతనిని తాను కాపాడవలసినదేనన్న బాబా నిర్ణయం, బాబాయొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే సంఘటనలలో ఇది ఒకటి. 

ఇక ముగించేముందుగా పేరు చెప్పని ఆ భక్తుడు ఈ అనుభవాలను చెప్పడానికి గల ఒకే ఒక అంశం ఏమిటంటే, ఎవరికయితే నిరాశా నిస్పృహలు ఉంటాయో, వారికి బుధ్ధి చెప్పటానికి, షిరిడీ బాబా మీద పరిపూర్ణమయిన విశ్వాసం కలిగి ఉండమని, వారికి తప్పకుండ ఉపశమనం కలుగుతుందని ఇస్తున్న హామీ అని చెప్పటానికే ఈ అంశం. 

నేను భగవంతుని ప్రార్ధించేదేమిటంటే మహదీ బువా , నరసిం హస్వామీజీ, కమరుద్దీన్ బాబా లేక అబ్దుల్ బాబా గాని, మరెవరయినా గాని, ఆయన భక్తుడు ఎవరయినా గాని, నాస్నేహితులకు, నాకు , సహాయం చేసినట్లుగానే వారికి కూడా ఇదే విధమయిన సహాయాన్నందించమన్నదే నా ఒకే ఒక ప్రార్ధన.  

మరికొన్ని మధుర క్షణాలు.....

(సర్వం  శ్రీసాయినాధార్పణమస్తు)

జన్మ పునర్జనంలపై సాయి ఆలోచనలు - 5

$
0
0



                                                                         

08.12.2012 శనివారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు  

గత రెండురోజులుగా అనువాద ప్రక్రియ సాగుటు ఉండటంవల్ల, ఆఫీసు పనుల వల్ల ప్రచురించడానికి వీలు చిక్కలేదు. సాయితో మధుర క్షణాలు కూడా తయారు చేస్తూ ఉన్నాను.  ఎదురు చూస్తూ ఉండండి.

ఈరోజు తిరిగి సాయి.బా.ని.స. చెప్పే జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు 5వ. భాగం వినండి.

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామ  స్తోత్రం 15వ. శ్లోకం, తాత్పర్యము 

                                                  


శ్లోకం: లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః 

        చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దం ష్ట్రః చతుర్భుజః  ||

పరమాత్మను లోకములకు అధ్యక్షునిగను, దేవతలకు అధిపతిగను, ధర్మమునకు నిర్వాహకునిగను, సాధింపబడినది మరియు సాధింపబడవలసినదిగాను, నాలుగు స్థితులుగా వ్యక్తమగువానిగను, నాలుగు వ్యూహములుగా తెలియబడువానిగను, నాలుగు కోరలు గలవానిగను, నాలుగు భుజములు గలవానిగను ధ్యానము చేయుము.  




జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 5 



బాబా అంకిత భక్తులయిన శ్రీ జీ.జీ. నార్కేగారు పూనాలోని దక్కన్ యింజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్.  బాబా ఆయనకు కలలో దర్శనమిచ్చి చెట్లు కొట్టేవానిని చూపించారు.   "నార్కే! యితడు క్రిందటి జన్మలో నీ స్నేహితుడు.  క్రిందటి జన్మలో నువ్వు మంచి పనులు చేశావు.  దాని ఫలితంగా ఈ జన్మలో బాగా విద్యావంతుడవై యింజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉన్నావు.  కాని, యితను తను  చేసిన చెడు పనుల వల్ల  క్రిందటి జన్మలోని పాప కర్మ ఫలాన్ని ఈ జన్మలోకి తెచ్చుకొని తన జీవనోపాధికి కట్టెలు కొట్టుకొని జీవిస్తున్నాడు" అన్నారు బాబా. నార్కే దీనిని సామాన్యంగానే ఒక కలగా భావించారు. కొద్దిరోజుల తరువాత ఆయన బాబా దర్శననికై ద్వారకామాయికి వెళ్ళారు. ఆశ్చర్యకరంగా ద్వారకామాయిలోని, ధునిలోకి కట్టెలను తీసుకొని వచ్చే కట్టెలుకొట్టేవాడు రావడం తటస్థించింది. బాబా నార్కేని పిలిచి, "ఇతడు క్రిందటి జన్మలో నీ స్నేహితుడు.  నువ్వు అతనివద్దనించి 2/-రూపాయలకు కట్టెలను కొను" అన్నారు.  బాబా మాటలకు నార్కేకి నోట మాట రాలేదు. 

ఇప్పుడు నేను మీకు ఆర్థర్ ఓస్ బోర్న్ వ్రాసిన "ద ఇంక్రెడిబుల్ సాయి" అనే పుస్తకములోని ఒక సంఘటన మీకు వివరిస్తాను. ఒకసారి షిరిడీలో ఒక పిల్లవాడు పాముకాటుతో చనిపోయాడు.  పిల్లవాని తల్లి బాలుడిని తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టి రక్షించమని ప్రార్ధించింది. బాబా ఆమె కోరికకు అంగీకరించలేదు.  అక్కడే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ ఆతల్లి పడే వేదన చూడలేక, ఆ పిల్లవానిని కాపాడమని బాబాని వేడుకొన్నాడు. కాని ఏమీ ఫలితం లేకపోయింది.  "నేను ఆబాలుడిని కాపాడగలను, కాని ఆపిల్లవాడు మరణించడమే మేలు.  వాడు ఇప్పటికే మరొక స్త్రీ గర్భములోనికి ప్రవేశించాడు.  జన్మించిన తరువాత వాడు ఈ జన్మలో చేయలేని ఎన్నోమంచి పనులు చేస్తాడు" అన్నారు బాబా.

మరొక స్త్రీ గర్భంలో ఇప్పటికే జీవం పోసుకున్నప్రాణాన్ని తీసుకొనివచ్చి ఈ బాలుడిని బ్రతికించగలను.   కోసం నేనాపని చేయగలను, కాని దాని తరువాత జరిగే పరిణామాలకి ఎవరయినా బాధ్యత వహించగలరా? అన్నారు బాబా.

అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయి, ఆఖరికి తల్లిని ఒప్పించి చనిపోయిన పిల్లవానికి అంత్య క్రియలు జరిపించారు. 

మీకు ఇంకా వివరంగా విశదీకరించడానికి కొన్ని సంఘటనలను చెపుతాను.  బాబా శ్యామాను పాము కాటునుంచి రక్షించారు.  దానికి కారణం శ్యామ ఈ జన్మలో షిరిడీలొ మిగిలిపోయిన కొన్ని మంచి పనులను చేయవలసి ఉన్నది. ఇక్కడ ఈ పిల్లవాడి విషయంలో బాబా ఒప్పుకోకపోవడానికి కారణం, ఆబాలుడు వచ్చే జన్మలో ఎన్నో మంచి పనులను చేయవలసి ఉంది.

1886 వ. సంవత్సరంలో బాబా పౌర్ణమినాడు, తన భౌతిక శరీరాన్ని విడిచి 72 గంటలపాటు యోగ క్రియ సమాధి పొందిన తరువాత మరలా తన శరీరంలోకి ప్రవేశించారు.  దీనిని బట్టి ఆత్మకు మరణం లేదని మనం నిర్ధారించుకోవచ్చు.  

శ్రీ సాయి సత్చరిత్ర 32 వ.అధ్యాయములో బాబా అన్నమాటలు, "ఈ శరీరం మట్టిలో కలసిపోతుంది.  శ్వాస గాలిలో కలసిపోతుంది. మరలా అటువంటి అవకాశం రాదు. నేను ఎక్కడికయినా వెళ్ళవచ్చు, ఎక్కడయినా కూర్చోగలను.  అనగా ఒకరోజు కాకపోతే తరువాత , ఎవరైనా సరే పునర్జన్మ పొందాలంటే శరీరాన్ని విడవవలసినదే.  అందుచేత లక్షల సంవత్సరాలనుంచి బాబాగారి ఆత్మ ఎన్నో జన్మలను పొందుతూ ఉంది ఇకముందు కూడా పొందుతూ .  ఆయన ఇంకా జన్మలను పొందుతారు. 

మానవుడు మరణిస్తున్నాడంటే తిరిగి వేరొక రూపంలో జన్మ ఎత్తడానికే. ఆత్మకు సంబంధించినంత వరకు ఈ మార్పు అలా జరుగుతూనే ఉంటుంది.  


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు  

బాబాయే నా ఆత్మబలం

$
0
0

                             
 

09.12.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు యూ.ఎస్.యే.లో నివసిస్తున్న సాయి బంధువు సన్యోగిత గారి బాబా అనుభూతిని తెలుసుకుందాము.  ఎన్ని కష్టాలెదురయినా బాబా నే నమ్ముకున్నవాళ్ళకు కష్టాలనేవి ఒక్కొక్కటిగా తొలగిపోతాయని అర్ధమవుతుంది.  కావలసినదల్లా శ్రధ్ధ , సహనం.  ఆయనకు సర్వశ్య శరణాగతి చేయడం.
                                   

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 16వ. శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః 

         అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః  || 

భగవంతుని దీప్తివంతునిగను, జీవుల ఆహారము తానేయైనవానిగను, జీవుల ద్వారా అహారము స్వీకరించువానిగను, సహనమే తన రూపమైనవానిగను, ప్రపంచమునకు మొట్టమొదట పుట్టినవానిగను, జయించిన వానిగను, విశ్వమునకు పుట్టుక  తానేయైనవానిగను, ధ్యానము చేయుము.     


   

సాయిబాబా నా జీవితపు తోడు నీడ-సాయి భక్తురాలు సన్యోగిత:

   ఈ రోజు మనము సాయి వ్రతం చేయడం వల్ల ఒక సాయి భక్తురాలి జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలుసుకుందాము.

అమెరికా నుండి సాయి భక్తురాలు  సన్యోగిత బాబా తో  తన అనుభవాలు చెప్తున్నది.  ఒక్కొక్కరి అనుభవాలు చదువుతుంటే ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం,నమ్మకం, దైర్యం కలుగుతుంది. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక మార్గము నుండి తప్పుదోవ పట్టుతున్నామనిపిస్తుందో ఈ భక్తుల అనుభవాలు మళ్ళీ మనల్ని సరియైన మర్గంలోకి నడిపించేలా చేస్తాయి. సాయిబాబా అందరికి శాంతి,ఆరోగ్యం ,ఆనందం ప్రసాదించు గాక.

    బాబా ఈ బ్లాగ్ లో నీ మీద నా ప్రేమ గురించి చెప్పే శక్తి నివ్వు. నేను ఒక సాంప్రదాయక కుటుంబం నుండి వచ్చినప్పటికి , కొన్ని నెలల క్రితం వరకు నాకు బాబా గురించి అంతగా తెలియదు. గుడికి వెళ్ళినపుడు ఒక గౌరవ భావంతో సాయికి మ్రొక్కేదాన్ని తప్ప ఆయన మహిమల గురించి తెలుసుకోలేకపోయాను.

  నా స్వంత మనుషులే నన్నెంతో బాధలు పెట్టారు. నా స్వంతం అనుకునేవాళ్ళు ఎవరో కాదు నా తల్లి తండ్రులు , నా భర్త, నా అత్తమామలు . మీరు ఎవరైన అడగవచ్చు,  కన్న తల్లితండ్రులు నీకేమి హాని తలపెడతారు అని. వాళ్ళు కావాలని నాకు హాని తలపెట్టలేదు. ప్రతి విషయంలో జోక్యం చెసుకొనేది , స్వతంత్రం లేకుండా చేసి నా జీవితాన్ని కట్టుదిట్టం చేసి బ్రతుకంటే దుర్బరం చేసారు. ఇలాంటివి  ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే.  ఉదాహరణకు మా అమ్మనాన్న ఏదైన విషయంలో ఎవరైన    క్రొత్త వ్యక్తి ఉంటే వాళ్ళకి సపోర్ట్ గా వెళ్తారు. నన్ను అస్సలు పట్టించుకోరు. ఎప్పుడు తప్పు నాదే అన్నట్లు నీతులు చెప్తూ ఉంటారు.
       
 వాళ్ళు ఎప్పుడు నన్ను చిన్నపిల్ల గా అనుకుని, నాకు మాట్లాడడం రాదని, నిర్ణయాలు తీసుకోవడం రాదని ఎప్పుడు తక్కువ అంచనా వేసేవారు. ఇలా చెప్పాలంటే పేజీ సరిపోదు. ఇక్కడ నా తల్లితండ్రుల గురించి చెప్పడం నా ఉద్దెశ్యం కాదు. నా జీవితంలోకి బాబా ఎలా వచ్చారో, నన్ను ఎలా కాపాడాడో చెప్పాలని అనుకుంటున్నాను.

 నా జీవితం చాల గందరగోళంగా ఉండేది.నా జీవితంలో ఏ ఒక్కటీ కూడా మంచిగా జరగలేదు. నేను ఎప్పుడు నా భర్తతో, మా అమ్మనాన్నతో పోట్లాడేదాన్ని. నా మాస్టర్ డిగ్రీ పూర్తి చెయ్యడానికి ఎన్నో పాట్లు పడ్డాను.నాకు ఉద్యోగం లేకపోవడం వల్ల నావద్ద డబ్బుకూడా ఉండేది కాదు. దీని ప్రభావం నా ఆరోగ్యం మీద పడింది. నేను చాలా లావు అయ్యాను. నా ఆరోగ్యం చెడిపోయింది. నేను ఒంటరిదానినయిపోయాను. ఎవ్వరితోనూ నా బాధలు చెప్పుకునేదాన్ని కాదు. ఎప్పుడైన మా అమ్మకు నా సమస్య  గురించి చెప్పుకున్నా, నా అనుకున్న నావాళ్ళే ఎంతో పెద్ద ఉపన్యాసం మొదలుపెట్టేవారు,దానినితో నేను ఇతరులనుండి దూరంగా ఉండేలాగా మౌనగా ఉండేలాగ తయారయేది నాపరిస్థితి. ఎవరికైనా సమస్యలొస్తే తల్లితో చెప్పుకుంటారు. నాకు ఆ అదృష్టం కూడా లేదు. రోజు బాగా ఏడ్చేదాన్ని. నా సమస్యలను ఎక్కడినుండి సరిచేసుకోవాలో అర్థమయ్యేది కాదు.
       
 అప్పుడు బాబా నా జీవితంలోకి ప్రవేశించారు. మా ప్రక్కింటి ఆవిడ ఒక రోజు తాను నవగురువార వ్రతం చేశానని, తన ఉద్యాపన రోజున నాకు ఒక పుస్తకం ఇచ్చింది. నేను వ్రతం చేయడం మొదలు పెట్టాను. నేను ప్రత్యేకంగా ఒక కోరిక అంటూ కోరలేదు. ఎందుకంటే నా కోరికలు చాలా ఉన్నాయి చెప్పాలంటే . అందులో ఏమని కోరేది. అందుకే బాబా ని ఒక్కటి మాత్రం అడిగాను. ప్రస్తుతం దుర్భరంగా  ఉండే జీవితాన్ని చక్కబెట్టి నాకు మన మనఃశ్శాంతి నివ్వు అని. ఈ జీవితం ను భరించడం నా వల్ల కాదు అని.

  అప్పుడు నా జీవితంలో బాబా మహిమలు ప్రారంభమయాయి.  ఎన్నో ఇబ్బందులు, చిక్కు ముడులతో కూడుకున్న నా జీవితాన్ని ఒక   దాని తర్వాత ఒకటి మెల్లగ విడదీయడం మొదలు పెట్టారు. నేను రెండు సార్లు నవగురువార వ్రతం చేసాక నా జీవితంలోచెప్పుకోదగ్గ మార్పులు రావడం గమనించాను.

  ఆశ్చర్యకరంగా నేను చాలా బరువు తగ్గాను. నా ఆరోగ్య సమస్యలన్నీ అంతరించాయి. నాలుగు యేండ్లుగా బరువు తగ్గాలని , ఎంతో కష్టపడి విఫలమయ్యాను. కాని అనుకోకుండ బాబా దయ వల్ల చాల మార్పులు జరిగాయి.

   నా గురించి ఎప్పుడు ఏవో ఫిర్యాదులు చేసే మా అత్త మామలని కూడా బాబా మార్చారు. వాళ్ళు ఇప్పుడు ఏ ఫిర్యాదులు చేయట్లేదు. వాళ్ళను ఇంతకు ముందు సంతోషపెట్టాలని ఏమి చేసిన వాళ్ళకు సంతృప్తి ఉండేది కాదు. చివరకు వాళ్ళు శాంతంగా ఉన్నారు. వారానికొకసారి వాళ్ళ అబ్బాయి  ఫోన్ చేస్తారు . నేను ఫోన్ చేసిన, చేయక పోయిన ఇప్పుడు నా మీద కోపం కాని, ఎటువంటి ఫిర్యాదు కాని వాళ్ళకు ఇప్పుడు లేదు. బాబా మా అమ్మనాన్నలను కూడా మార్చారు. వాళ్ళు తమ తప్పును తెలుసుకున్నారు. నాకు అవసరమైనప్పుడు వాళ్ళ ఓదార్పు , సహాయం నాకు అందలేదని తెలుసుకున్నారు. బాబా నా భర్త కి ఎంతో ఓర్పు నిచ్చారు ఇప్పుడు. తన తప్పులను తెలుసోకగలిగారు. నాకు చాల మర్యాద ఇస్తున్నారు. బాగ చూసుకుంటున్నారు. నా మీద అస్సలు చేయి చేసుకోవడంలేదు.

   బాబా మాకు క్రొత్త యిల్లు వెదకడంలో సహాయం చేశారు. మంచి ప్రదేశంలో మాకొక ఇల్లు దొరికింది. నేను బాబాని ఇల్లు కావాలని ఎప్పుడు అడగలేదు. నేను చాలా కష్టాలు పడుతున్నప్పుడు  నా స్నేహితులు అపార్ట్ మెంట్  కొనుక్కోవడం చూసి మేమెప్పుడయినా ఇల్లు కొనుక్కుటామా అనుకునేదాన్ని. నాజీవితమంతా ఈ చిన్న అపార్ట్ మెంట్ లోనే గడచిపోవాలా?. నా భర్తను ఇంటి గురించి అడిగే ధైర్యం కూడా లేకపోయింది. తను కూడ ఇంటి గురించి ఎప్పుడూ అలోచించలేదు.
 
నేను నా మాష్టర్  డిగ్రీ ఎంతో కష్టంతో పూర్తి చేయగలిగాను. నేను ఎంతో కష్టపడి పనిచేసిన నా ప్రొఫెసర్ కి నచ్చేదికాదు. కాని బాబా దయ వలన ఎలాగో డిగ్రీ  పూర్తి చేయగలిగాను.నేను కష్టాలలో ఉన్నపుడు నన్నెవరూ ఆదుకోలేదు, బాబా యే నెనున్నానటు నాకు రక్షణగా వచ్చారు.
         
 నేను బాబాకు సర్వస్యశరణాగతి చేశాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ జీవితం బాబానే ప్రసాదించారు. దానికి బాబాకి ఎంతో ఋపడ్డాను. ఇప్పుడు ప్రతి రోజు చాలా సంతోషంగా ఉన్నాను. బాబాకి మాత్రమే తెలుసు నాకేది మంచిదో. నాకేది మంచిదో అది బాబా చేస్తారు. ఇప్పుడు పరిస్థితులన్ని  నేను ఎదురు చూడని రీతిలో చక్కబడ్డాయి. మీరు కూడ బాబాకు ఎప్పుడైతే దగ్గర అవుతారో బాబా దగ్గరుండి అంతా చక్కబెడుతూ, మన కోరికలను తీరుస్తారు. కావాలిసినదల్లా  అంతులేని నమ్మకం. అలా అయితే నీవు ఊహించని రీతిలో ఎన్నో అద్బుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు చిన్నవి కావచ్చు లేదా పెద్దవి కావచ్చు ఏదైన మనము బాబాను పూర్తిగా నమ్మి ఆయనకు దగ్గర అయిన క్షణంలో అన్నీ వాటంతకు అవే జరుగుతాయి. బాబా తన బిడ్డలందరిని ప్రేమిస్తాడు. మన ప్రతి ఆలోచన బాబాకి ఎరుకే. మనకు ఏది మంచిదో ,ఎప్పుడు ఎలా చెయ్యాలో అది చేస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని తెలుసుకున్న క్షణాన ఆయన లీలలును వర్ణించడానికి మనకు నోట మాట రాదు.
  సాయి ఆశీస్సులు అందరికి ఉండుగాక .ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 6

$
0
0


                                                  
                                                       
         (పరమశివుడు శ్రీమహావిష్ణువుకు సుదర్శన చక్రమును ఇచ్చుట)


10.12.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ముందుగా శ్రీ విష్ణుసహస్రనామం 17వ. శ్లోకం, తాత్పర్యము

శ్లోకం: ఉపేంద్రో వావామనహః   ప్రాంశు రమోఘశ్శుచి రూర్జితః

        అతీంద్ర స్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః  || 

పరమాత్మను ఇంద్రుని సోదరునిగను, పొట్టివానిగను, ఉన్నతునిగను, ఇంద్రుని అతిక్రమించినవానిగను, చక్కని గ్రహణము గలవానిగను, సృష్టియందలి జీవుని ధరించినవానిగను, నియమము మరియు యమము అనునవి తానేయైన వానిగను, ధ్యానము చేయవలయును.   


ఇక ఈ రోజు సాయి బా ని స చెపుతున్న జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు వినండి. 





                                                 

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 6 


1989 వ.సంవత్సరంలో నేను సాయిమార్గంలోకి ప్రవేశించాను.  అప్పటినుండి క్రమం తప్పకుండా శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేయసాగాను.  ఒక రోజు రాత్రి నా తరువాత జన్మ ఎట్లా సంభవిస్తుందో ఒక సూచన చేయమని బాబాని ప్రార్ధించాను.  

నాకు స్వప్నంలో కనిపించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని నేను మీకు వివరిస్తాను. ఆత్మ శరీరాన్ని వదలి వెళ్ళిన రోజు భౌతిక శరీరానికి మరణం. ఆత్మ మరొక శరీరంలోనికి ప్రవేశించడమంటే తిరిగి పుట్టుట, అదే పునర్జన్మ. 

కలలో నాకు దృశ్యరూపంలో ఈ విధంగా కనిపించింది.  నాయొక్క ఆత్మ  సద్గురుని చేయి పట్టుకొని అరణ్యాన్ని దాటి, ఒక నదిని, తరువాత ఒక పర్వత శిఖరం మీదకు చేరుకోంది. పర్వత శిఖరాగ్రం మీద ఒక కోట దాని మీద నాలుగు బురుజులు వున్నాయి.  


మన సాంప్రదాయ ప్రకారం, మరణించిన పదవ రోజున గోదానం చేస్తాము.  దాని వల్ల ఆత్మ వైతరిణి నదిని ఎటువంటి కష్టములు లేకుండా దాటుతుంది. గోవుయొక్క తోకను పట్టుకొని ఆత్మ వైతరిణీ నదిని ఈదుతుందని ఒక నమ్మకం. 

నదిని దాటిన తరువాత, ఆత్మ నాలుగు బురుజులతో  ఉన్న కోటను చేరుకుంది. కోట మానవ జీవితానికి ప్రతీక. నాలుగు బురుజులు ధర్మ, అర్ధ, కామ, మోక్షాలకు గుర్తులు. మానవుడు తన ప్రయత్నంతో మొదటి మూడింటిని సాధించగలడు. కాని నాలుగవదియైన మోక్షం సద్గురువుయొక్క అనుగ్రహంతోనే లభిస్తుంది. ఆత్మ సద్గురువు యొక్క చేయి పట్టుకొని నాలుగవది అత్యంత ఉన్నతమైన బురుజుకు  చేరుకుంది. సద్గురువు అక్కడ ఆగి, నా ఆత్మతో  ఇలా అన్నారు 

"ఈ ప్రదేశాన్ని దాటి నేను నీతోముందుకు రాలేను. నా నామాన్ని స్మరిస్తూ భగవంతుని యొక్క చరణ కమలాల వద్దకు చేరుకో. 


కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ఆ సమయంలో  క్రిందకు మాత్రం చూడవద్దు."  ఇక్కడ నేను మీకు మన పురాణాలలో ఏమని చెప్పబడిందో గుర్తు చేస్తాను. "భగవంతుని నామాన్ని గాని, భగవత్ స్వరూపుడయిన సద్గురువు యొక్క నామాన్ని గాని స్మరిస్తున్నట్లయితే ఈ కష్టాల కడలిని దాటగలము."

నా ఆత్మ గురువు చెప్పిన సలహాననుసరించి ఆకాశంలో ముందుకు ప్రయాణం కొనసాగించింది. కాని భూమి వైపు చూడాలనే ఉత్సుకత గురువు చెప్పిన సలహాను పెడచెవిని  పెట్టి క్రిందకు చూడగానే ఆత్మ ఆకాశం నుండి చాలా వేగంగా భూమి మీదకు పడి 


మరొక స్త్రీ గర్భంలోకి తిరిగి ప్రవేశించింది. ఆత్మ సద్గురువు చెప్పిన మాటలను అమలుచేయడంలో విఫలమయి మరొక కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆత్మకు సంబంధించి అది పునర్జన్మ.  

ఇంతవరకు మనము భగవద్గీత లోను, హేమాడ్ పంత్ వ్రాసిన శ్రీ సాయి సత్చరిత్రలోను, ఇంకా ఆర్ధర్ ఓస్బోర్న్ వ్రాసిన 'ద ఇంక్రిడిబుల్ సాయి'  అనే పుస్తకాలలోను జన్మ పునర్జన్మ లపై అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలను అర్ధం చేసుకొన్నాము.   


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 5వ. అధ్యాయము

$
0
0


                        
                                        
                                     
                                     
26.02.2013  మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                                            
                            

                                   

శ్రీవిష్ణుసహస్రనామం 42వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  వ్యవసాయో వ్యవవస్థానః సంస్థానః స్థానదో ధృవః  |   

             పరర్ధిః పరమ స్పష్టః స్తుష్టః పుష్టశ్శుభేక్షణః  || 

తాత్పర్యము:  భగవంతుని నిరంతరము యత్నించువానిగా, యితరులను తరగతులుగా విభజించి స్థాపన చేసి స్థలము ఏర్పరచు శక్తిగా, నిన్ను తన చుట్టు త్రిప్పుకొను కేంద్రముగా ధ్యానము చేయుము.  అతడు యితరులకు అభివృధ్ధి కలిగించి శ్రేష్టము, ఉత్తమములైన వ్యక్తము అవ్యక్తము అను శక్తులుగా యున్నాడు.  యింకనూ తృప్తిగా, పోషణగా, శుభ దృష్టిగా తెలియబడుచున్నాడు. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన  రత్నమణి సాయి - 5వ. అధ్యాయము 


(Listen Discourses of Saibanisa Ravada(English &Telugu) and devotional songs( Telugu) on Lord Sainath of Shirdi  


ప్రియమైన చక్రపాణి,

ఈరోజు శ్రీసాయి సత్ చరిత్ర 5వ. అధ్యాయము గురించి వివరించుతాను.  ఈ అధ్యాయములో జరిగిన సంఘటన నా నిజ జీవితములో శ్రీసాయి ప్రవేశించిన తీరులలో పోలికలు ఉండటము చేత ఈ అధ్యాయముపై నాకు భక్తి, విశ్వాసములు ఎక్కువ. 



ముందుగా ఈ అధ్యాయములో చాంద్ పాటిల్ తన తప్పిపోయిన గుఱ్ఱమును వెతకటము ఆ విషయములో శ్రీసాయి, చాంద్ పాటిల్ కు సహాయము చేయటము హేమాద్రిపంతు వర్ణించుతారు.  
                           
                                                              
యిక్కడ ఒక్క విషయము ఆలోచించాలి.  శ్రీచాంద్ పాటిల్ ధనికుడు.  అతను తన గుఱ్ఱమును పోగొట్టుకొన్న మాట వాస్తవమే.  అతను తలచుకొన్న తన తప్పిపోయిన గుఱ్ఱములాంటి గుఱ్ఱములను ఒక పది గుఱ్ఱములను కొనగలడు.  అయినా అతను తన తప్పిపోయిన గుఱ్ఱాన్నే ఎందుకు వెతుకుతున్నాడు?  అనేది ఆలోచించాలి.  బహుశ శ్రీసాయి దృష్టిలో చాంద్ పాటిల్ అన్ని ప్రాపంచిక సుఖాలు అనుభవించిన వ్యక్తి.  అతనిలో ఆధ్యాత్మిక చింతన కలుగ చేయటానికి ప్రాపంచిక సుఖాలపై వైరాగ్యము కలుగ చేయటానికి చాంద్ పాటిల్ లో ఉన్న అరిషడ్ వర్గాలను పూర్తిగా తొలగించటానికి శ్రీసాయి, చాంద్ పాటిల్ ను దగ్గరకు చేరదీస్తారు.  ఈసాయి సత్ చరిత్రలో 21వ. అధ్యాయములో దాదా కేల్కర్ గుఱ్ఱము గురించి ప్రస్తావించుతు, "ఆడ గుఱ్ఱము, అనగా యిచట భగవంతుని అనుగ్రహము  అని అంటారు.  శ్రీసాయి దృష్టిలో చాంద్ పాటిల్ పోగొట్టుకొన్నది భగవంతుని అనుగ్రహము.  అందుచేత ఆభగవంతుని అనుగ్రహాన్ని చాంద్ పాటిల్   కు యివ్వటానికి శ్రీసాయి, చాంద్ పాటిల్ ను దగ్గరకు చేరదీశారు అనేది మనము గ్రహించాలి.

శ్రీచాంద్ పాటిల్ పెండ్లివారితోను ఫకీర్ (శ్రీసాయి) తోను కలసి శిరిడీలోని ఖండోబా మందిరమునకు చేరగానే భక్త మహల్సాపతి ఆఫకీర్ ను చూసి "దయచేయుము సాయి" అని స్వాగతించెను అని హేమాద్రిపంతు  వ్రాస్తారు.

                        
                           
  ఆనాటి నుండి ఆఫకీర్ ను సాయిబాబా అని శిరిడి ప్రజలు పిలవనారంభించినారు.  ఈనాడు "సాయీ" అనే పిలుపు కొన్ని కోట్లమంది భక్తుల హృదయాలలో శాశ్వతముగా నిలిచిపోయినది.  యిక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నీకు వ్రాస్తాను.  శ్రీఆర్ధర్ ఆస్ బోర్న్ యిండియాకు వచ్చి 1957 సంవత్సరములో శిరిడీలో చాలా కాలము యుండి శ్రీ శిరిడీ సాయిపై అనేక విషయాలు సేకరించి యింగ్లీషు భాషలో " ది యిన్ క్రిడిబుల్ సాయిబాబా" అనే పుస్తకము వ్రాసినారు.  
                          
                                                   
ఆపుస్తకములో ఒకటవ పేజీలో ఆయన వివరించిన విషయము నన్ను చాలా కలత పరిచినది.  అది ఆ యువ ఫకీరు శిరిడీలో స్థిర నివాసము ఏర్పరుచుకోవటానికి నిశ్చయించుకొని దగ్గరలో ఉన్న ఓ హిందూ దేవాలయమునకు వెళ్ళి ఆశ్రయము కోరినాడు.  కాని, అక్కడి పూజారి ఆయువకుడిని ముసల్ మాన్ గా గుర్తించి ఆగుడిలోనికి రానీయక ఆ ఊరిలోని  మశీదుకు వెళ్ళమని కసరి కొట్టినాడు.  ఆశ్చర్యము ఆపూజారి ఎవరో కాదు, కాల క్రమేణ ఆఫకీర్ కు ప్రియ భక్తుడు అయిన మహల్సాపతి.  ఆయువకుడు ఆఖరికి ఆపాడుబడిన మట్టితో కట్టబడిన మశీదునే తన నివాసముగా చేసుకొన్నాడు."  ఆరోజులలో శ్రీసాయి హిందూ యోగులతోను, ముస్లిం ఫకీర్లుతోను కలసి మెలసి యుండెడివారు.  శ్రీసాయి నిత్య కృత్యాలు వివరించుతు హేమాద్రిపంతు యిలాగ వ్రాశారు  "శిరిడీకి మూడు మైళ్ళ దూరములో ఉన్న రహతాకు పోయినపుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి, నేలను చదును చేసి, వాటిని నాటి, నీళ్ళు పోయుచుండెను.  సాయిబాబా కృషి వలన అచట ఒక పూలతోట లేచెను.  ఆస్థలములోనే యిప్పుడు బాబా సమాధి యున్నది.  దీనివలన శ్రీసాయి తన భక్తులకు యిచ్చిన సందేశము ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించాలి.  మానవజీవితము పూలమొక్కలు లాంటివి.  వాటికి చక్కగ రక్షణ యిచ్చి పెంచి పెద్ద చేయాలి.  స్వార్ధము అనేది ఏమీ తెలియని ఆపూలులాగ వికసించి భగవంతుని పాదాలపై చేరిపోవాలి.  శ్రీసాయి జీవితము ఒక చక్కటి పూలమొక్కగా పెరిగి స్వార్ధము లేకుండ తన భక్తులకు సేవ చేసుకొని ప్రకృతి ఒడిలోనికి (భూమిలోనికి) ఒరిగిపోయినది (మహాసమాధి  చెందినారు).
                                 

                              
 శ్రీసాయి సత్ చరిత్ర 46 వ.పేజీలో వేప చెట్టు క్రింద ఉన్న పాదుకల వృత్తాంతము హేమాద్రి పంతు వివరించినారు.  "బాబా ప్రప్రధమమున శిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసినదాని జ్ఞాపకార్ధము బాబాయొక్క పాదుకలను వేప చెట్టు క్రింద ప్రతిష్టించవలెనని నిశ్చయించుకొనిరి.  పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి."  నాజీవితములో నేను మొదటిసారిగా శిరిడీకి వెళుతున్నరోజు ( అది 1989 సంవత్సరము జూలై నెల శనివారము).  ఉదయము యధావిధిగా శ్రీఆంజనేయ స్వామి గుడికి, మైసమ్మ తల్లి గుడికి పూజ చేయటానికి చేతిలో నాలుగు రూపాయలు తీసుకొని బయలుదేరినాను (ప్రతి శనివారము శ్రీఆంజనేయస్వామి గుడిలో పూజారికి రెండు రూపాయలు యిచ్చి అర్చన చేయించుకోవటము,  ఆగుడికి దగ్గరలో ఉన్న మైసమ్మ తల్లి గుడిలో దీపారాధనకు ఒక రూపాయ యివ్వటము, మిగిలిన ఒక రూపాయి ఎప్పుడూ  భిక్ష కోరే ఒక ముసలమ్మకు యివ్వటము నాకు అలవాటుగా మారిపోయినది.)

యధావిధిగా శ్రీఆఅంజనేయ స్వామి గుడికి ముందుగా వెళ్ళినాను.  గుడిలోనికి వెళుతూ ఉంటే వేపచెట్టు క్రింద ఎప్పుడు యుండే ముసలమ్మ నన్ను యధావిధిగా పలకరించినది.  నేను గుడిలో అర్చన చేయించుకొని రెండు రూపాయలు పూజారి గారికి యిచ్చి మిగిలిన రెండురూపాయలతో బయట వేప చెట్టు క్రింద ఉన్న ముసలమ్మకు ఒక రూపాయ బిళ్ళ ఇవ్వడానికి వచ్చినాను.  నేను ఆముసలి స్త్రీకి ఒక రూపాయ దానము చేస్తూ ఉంటే ఆమె ప్రక్కనే ఒక ముసలివాడు, ఖాకీ నిక్కరు, ఖాకీ చొక్క ధరించి యున్నాడు.  తెల్లని గెడ్డము, నెత్తికి బట్ట చుట్టుకొని, భుజానికి ఒకజోలె, నేలపై ఒక రేకు డబ్బా చేతిలో ఒక పొట్టి కఱ్ఱతో నాముందు చేయి చాచి భిక్ష కోరినాడు.  నాలో ధర్మ సందేహము కలిగినది.  చేతిలో యున్నది రెండు ఒక రూపాయ బిళ్ళలు. ఒక రూపాయి ఆముసలమ్మకు యిస్తే మరి యింకొక రూపాయి బిళ్ళ ఆముసలివానికి యిస్తే మరి మైసమ్మ తల్లి గుడిలో దీపారాధనకు ఏమి యివ్వాలి? ఒక్క క్షణము ఆలోచించి చేతిలో ఉన్న రెండు రూపాయి బిళ్ళలను ఆముసలమ్మకు, ఆముసలివానికి యిచ్చినాను.  అక్కడనుండి బయటకు వస్తూ ఉంటే నాలో అనేక ఆలోచనలు రేకెత్తసాగినాయి.  గుడిలోనికి వెళ్ళేముందు లేని ఈముసలివాడు ఎవరు, నేను ఎన్నడు ఆవ్యక్తిని చూడలేదు అనే ఆలోచనలతో వెనక్కి చూసినాను.  అవ్యక్తి నాకేసి చూస్తూ చిరునవ్వు నవ్వసాగించినారు. ఆవ్యక్తి ముఖములో ఏదో తెలియని శక్తి నన్ను పరవశము చేసుకోసాగినది.  అనేక ఆలోచనలతో యింటికి చేరుకొన్నాను.  బహుశ ఆయన శ్రీసాయిబాబా అయి ఉంటారు అనే ఆలోచన నామనసులో కలగగానే తిరిగి ఆగుడికి వెళ్ళినాను.  అప్పటికే ఆముసలి వ్యక్తి వెళ్ళిపోయినారు అని ఆముసలమ్మ చెప్పినది.  నాకంటికి ఖాకీనిక్కరు, ఖాకీ చొక్కా వేసుకొన్న ఆముసలి వ్యక్తి గురించి ఆముసలి స్త్రీని అడిగితే ఆమె పలికిన పలుకులు నన్ను యింకా ఆశ్చర్యపరచినాయి.  ఆమె ఆముసలివాని గురించి యిచ్చిన వర్ణన యిది - "ఆ ముసలి ఆయన తెల్ల అంగీ, తెల్ల ధోతి, నెత్తికి చిన్న బట్ట, భుజానికి జోలె ఒక చెతిలో డబ్బా, యికొక చేతిలో పొట్టి కఱ్ఱతో వచ్చి ఆమె ప్రక్కన కూర్చుని యిక్కడ గుడికి వచ్చే భక్తులు దాన ధర్మాలు చేస్తారా! అని అడిగినారట.   ఆస్త్రీ నాపై నమ్మకముతో యిపుడు ఓదొర గుడిలోనికి వెళ్ళినాడు. రాగానే నాకు ఒక రూపాయి ఇస్తాడు.  నీవు అడుగు నీకు ఒక రూపాయి ఇస్తాడు అని చెప్పినదట.  ఆస్త్రీ ఎంత అదృష్ఠవంతురాలు,  సాక్షాత్తు శ్రీసాయిబాబా ఆమె ప్రక్కనే కూర్చున్నారు.  నాకు తెలియకుండా నానుండి ఒక్కరూపాయి దక్షిణ స్వీకరించినారు.  నేను అనేక శనివారాలు ఆముసలి వ్యక్తి గురించి గాలించినాను.  యింతవరకు ఆవ్యక్తి తిరిగి కనిపించలేదు.  నానుండి ఒక రూపాయి దక్షిణ స్వీకరించి చిరునవ్వుతో నన్ను ఆశీర్వదించినది శ్రీసాయిబాబా అనే నమ్మకము చెరగని ముద్ర వేసినది.

మొదటి సారిగా శిరిడీకి వెళ్ళిన రోజున హైదరాబాద్ లోని డీ.ఏ.ఈ. కాలనీలోని వేపచెట్టు క్రింద శ్రీసాయి ఆశీర్వచనాలు పొందినాను అనే తృప్తితో ఆవేప చెట్టు క్రింద శ్రీసాయి పాదుకలు ప్రతిష్టించాలి అని నిశ్చయించుకొన్నాను.  కాని, శ్రీసాయి నాకోరికను నెరవేర్చిన విధానము చాలా వింతగా యున్నది.  నేను శ్రీసాయి పాదుకలు ఆవేప చెట్టు క్రింద ప్రతిష్టించాలి అనే ఉద్దేశముతో స్నేహితుల సహాయము కోరినాను.  నాకు సాయము దొరకలేదు సరికదా,  పైగా అన్నీ అడ్డంకులే.  ఏమి చేయాలి తోచక ఒక శనివారము రోజున ఆవేప చెట్టు క్రింద నిలబడి ఆలోచించసాగాను.  శ్రీసాయి ఆ ఆంజనేయస్వామి గుడిలోని పూజారి మనసులో ప్రవేశించి నాసమస్యకు ఆయనే పరిష్కారము సూచించినారు.  ఆపూజారి గుడిలోనుండి బయట ఉన్న వేపచెట్టు  క్రిందకు వచ్చి నన్ను ఒక రెండు కోరికలు కోరినారు.  అవి (1) తను ఎండలో నడుస్తూ ఉంటే కాళ్ళు కాలుతున్నాయి, కొత్త చెప్పులు కొని పెట్టమన్నారు.  (2) తను యింటిలో వంట చేసుకొనేందుకు చాలా యిబ్బంది పడుతున్నాను, తనకి ఒక కిరసనాయలు స్టౌ కొని పెట్టమని కోరినారు.  ఈ రెండు కోరికలు వినగానే నాలో సంతోషము కలిగినది.  శ్రీసాయి నానుండి కొత్తగా గుడికి కావలసిన పాదుకలు మరియు పవిత్రమైన ధుని ఏర్పాటు చేయమని ఆదేశించినారు అని భావించి, మరుసటి గురువారము నాడు ఆపూజారి కాళ్ళకు కొత్త చెప్పులు తొడుగుతూ ఉంటే నేను కోరుకొన్న సాయి పాదుకలు ప్రతిష్టించిన అనుభూతిని పొందినాను.  ఆపూజారికి  కిరసనాయలు స్టౌ దానము యిస్తూ ఉంటే కొత్తగా నిర్మించిన సాయి మందిరములో ధునిని ఏర్పాటు చేసిన అనుభూతిని పొందినాను.

శ్రీసాయి నీళ్ళతో దీపాలు వెలిగించెను అనేదానికి అర్ధము ఏమిటి ఆలోచించు.  భగవత్ కార్యానికి నీవు నీతోటివాడి సహాయ సహకారాలు కోరడములో తప్పు లేదు.  ఆసహాయము అందలేదు కనుక భగవంతుని కార్యమును ఆపివేయకూడదు.  నీదగ్గర ఉన్నదానితో ఆపని పూర్తి చేయాలి. అంతే గాని అది లేదు, యిది లేదు అంటు భగవంతుని పూజ ఆపకూడదు.  శ్రీసాయి భగవంతుని పూజలో మశీదులో దీపాలు వెలిగించాలి అనే ఉద్దేశముతో కోమట్లనుండి నూనె కోరినారు.  కాని, ఆయనకు సహాయము అందలేదు.  అయినా ఆయన భగవంతునిపై అచంచలమైన విశ్వాసము, భక్తితో నీళ్ళతోనే దీపాలు వెలిగించినారు.  దీపారాధనకు నూనె యివ్వలేదని ఆ కోమట్లను ఏనాడు తూలనాడలేదు.

తనకంటే తక్కువ జ్ఞానము కలిగియున్నా జవహర్ ఆలీ అనే ఫకీరు తన్ను అవమానించినా ఏమీ బాధపడకుండ మానావమానాలకు అతీతుడు సాయి అని నిరూపించినారు.

తన భక్తుల సేవకే తన జీవితము అంకితము చేసుకొన్న శ్రీసాయిబాబా పాదాలను నమ్ముకోవటము అంటే మానవత్వాన్ని నమ్ముకోవటం అని అర్ధము చేసుకో.

శ్రీసాయి సేవలో

నీతండ్రి.
 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 6వ.అధ్యయము

$
0
0
                              
                                      
                                                       
27.02.2013 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
                                         

                                      
శ్రీవిష్ణుసహస్రనామం 43వ.శ్లోకం, తాత్పర్యము

శ్లోకం: రామో విరామో విరజో మార్గోనేయో నయోనయః  |

            వీరశ్శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః  ||

తాత్పర్యం:  భగవంతుని శ్రీరామునిగా, సృష్టిని లయము చేయువానిగా, రజస్సునకతీతునిగా, మార్గముగా మరియు నీతి పధముగా, మరియు నీతి కతీతునిగా ధ్యానము చేయుము.  ఆయన శక్తిగల వారందరికన్నా శ్రేష్టుడైన వీరునిగా, ధర్మరూపునిగా, ధర్మము తెలిసినవానిగా, యితరులు అందరికన్నా గొప్పవానిగా ధ్యానము చేయుము.


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 6వ.అధ్యయము

ప్రియమైన చక్రపాణీ ,                                                                              హైదరాబాదు
                                                                                                          11.01.1992

నిన్నటి నా ఉత్తరములో శ్రీసాయితో నా అనుభవాలు ఎక్కువగా వ్రాసినాను అని తలుస్తాను.  నా అనుభవాలు నీకు వ్రాయడములోని ఉద్దేశము చెప్పమంటావా -  శ్రీసాయి 1918 వ.సంవత్సరము ముందు శరీరముతో ఉండగా అనేక లీలలు చూపించినారు.  



ఈనాడు వారు మన మధ్యలేరు.  ఆయన మన మధ్య లేరు అనే భావము సాయి బంధువులకు కలగరాదు.  ఆయన మన మధ్య ఉన్నారు అనే భావన కలిగేలాగ చేసుకొనేందుకు ప్రతి సాయి బంధు తన అనుభవాలను తోటి సాయి బంధువుతో పాలు పంచుకోవాలి.  అదే ఉద్దేశముతో ఈ ఉత్తరాలలో నా అనుభవాలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి.  ఈ అధ్యాయములో 54 వ.పేజీలో హేమాద్రిపంతు అంటారు "ఎవరితోనైన సంభాషించునపుడు సాయిబాబా కధలే ఉదాహరణగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును.  నేను ఏదైన వ్రాయతలపెట్టినచో వారి అనుగ్రహము లేనిదే యొక మాట గాని వాక్యముగాని వ్రాయలేను". యిది అక్షరాల నా జీవితములో నిజము అని గ్రహించినాను.  నేను నీకు ఈ ఉత్తరాలు వ్రాయగలుగుతున్నాను అంటే అది సాయిబాబా అనుగ్రహము అని భావించుతాను.  55వ. పేజీలో శ్రీసాయి పలికిన పలుకులు "నా భక్తుని యింటిలో అన్న వస్త్రములకు ఎప్పుడు లోటుండదు".  యిది అక్షరాల నిజము.  1989 ముందు నాయింటి పరిస్థితి ఈనాటి నాయింటి పరిస్థితిని చూస్తే శ్రీసాయి పలికిన పలుకులు నిత్య సత్యము అని భావించుతాను.  హేమాద్రిపంతు  శిరిడీలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు గురించి గొప్పగా వర్ణించినారు.

శ్రీరామనవమి అంటే జ్ఞాపకము వచ్చినది. 1991 సంవత్సరములో మన యింట శ్రీసాయి శ్రీరామనవమి జరిపించినారు.  ఆనాడు శ్రీసాయి చేసిన ఒక చిన్న చమత్కారాన్ని నీకు చెబుతాను విను.  ముందు రోజు రాత్రి కలలో శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అంటారు నీ యింటికి రామలక్ష్మణులు వచ్చి ప్రసాదము తీసుకొంటారు అనే దృశ్యము ప్రసాదించినారు.  శ్రీరామ నవమి రోజు ఉదయము నేను మీ అమ్మతో అన్నమాటలు నీకు వ్రాస్తున్నాను గుర్తు పెట్టుకో.  "ఈరోజు ప్రసాదము తినడానికి  శ్రీ సాయి రామలక్ష్మణులు లాగ అన్నదమ్ముల రూపంలో వస్తారు చూడు" అని మీఅమ్మతో అన్నాను.  

                                        
                               
ఈమాట అన్న తర్వాత ఆవిషయము పూర్తిగా మరచిపోయినాము.  రాత్రి ఆరతి పూర్తయిన తర్వాత నేను మీ అమ్మ ఆనాటి పూజ కార్యక్రమము గురించి మాట్లాడుకొంటు మరి ఈరోజున శ్రీసాయి మన యింటికి వచ్చి ప్రసాదము తిన్నారా లేదా అని నన్ను అడిగినది.  నాకు అంతవరకు ఆవిషయము జ్ఞాపకము రాలేదు.  వెంటనే ఉదయమునుండి రాత్రి వరకు మన యింటికి వచ్చిన అతిధులను గుర్తు చేసుకోసాగాను.  నా ఆశ్చర్యానికి అంతులేదు.  నామిత్రుడు శ్రీరఘురామన్ తన యిద్దరు కుమార్తెలతో సాయంత్రము మన యింటికి వచ్చి ప్రసాదము తీసుకొని వెళ్ళినారు.  ఆయన యిద్దరు కుమార్తెలు కవల పిల్లలు అనే విషయము గుర్తుకు రాగానె నామనసు ఆనందముతో నిండిపోయినది.  నాశిరస్సు సాయినాధుని పాదాలపై ఉంచి కృతజ్ఞతలు తెలుపుకొన్నాను.                         
 ఆరోజులలో శ్రీగోపాలరావు గుండు శ్రీసాయి సేవ  చేసుకొని ధన్యుడు అయినాడు. మరి నీతండ్రి సాయి సేవలో ధన్యుడు అగుతాడు లేనిది శ్రీసాయి ఆశీర్వచనాల మీద ఆధారపడి యుంది.

శ్రీ సాయి సేవలో

నీ తండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 7వ.అధ్యాయము

$
0
0
                                                                                                            
01.03.2013 శుక్రవారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

                    
                 
శ్రీవిష్ణుసహస్ర నామం 44వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:     వైకుంఠః పురుషఃప్రాణః ప్రాణదః ప్రణవః పృధుః  |

             హిరణ్య గర్భశ్శత్రుఘ్నో వ్యాప్తోవాయురధోక్షజః  ||

తాత్పర్యం:  భగవంతుని అన్నిటికన్నా పైనున్న లోకము నందుండువానిగా, జీవియందునూ, విష్ణువునందునూ గల ప్రజ్ఞగా, జీవితముగా, శ్వాసగా, జీవితమునిచ్చువానిగా, ఓంకారముగా, పృధు చద్రవర్తిగా, హిరణ్యగర్భునిగా, శత్రువులను సం హరించువానిగా, శత్రువులందు వ్యాపించువానిగా, వాయువుగా, సృష్టిలోనికి దిగివచ్చు లేక జన్మించు శక్తిగా ధ్యానము చేయుము.
     

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి  - 7వ.అధ్యాయము

క్రిందటి ఉత్తరములో ఎక్కువ విషయాలు వ్రాయలేదు.  కాని సాయి ఆనాడు, ఈనాడు పలికిన పలుకులు నిత్యసత్యాలు అని నీవు ఈపాటికి గ్రహించి యుంటావు.  



మరి ఈ ఉత్తరములో శ్రీసాయి అవతారములోని ముఖ్య విషయాలు వ్రాయాలంటే చాలా పేజీలు రాయాలి, అందుచేత అవి అన్ని యిపుడు వ్రాయలేను.  కాని నేను నాజీవితములో శ్రీసాయినాధుని అవతారముపై స్వయముగా అనుభవించిన అనుభవాలను వ్రాస్తాను.  హేమాద్రిపంతు ఏడవ అధ్యాయములో వ్రాస్తారు "బాబా హిందువు అన్నచో మహమ్మదీయ దుస్తులలో ఉండెడివారు.  మహమ్మదీయుడు అన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించేవారు.  1987 లో శ్రీసాయి గురించి నాకు తెలియని రోజులలో సికంద్రాబాద్ స్టేషన్ దగ్గరలో ఉన్న పాండురంగని గుడిదగ్గర నిలబడి యుండగా ఒక ముస్లిం స్నేహితుడు నాకు ధనసహాయము చేసి నాకు ఉన్న డబ్బు యిబ్బందులనుండి కాపాడినాడు.  దానికి కృతజ్ఞతా సూచకముగా నేను శ్రీపాండురంగని గుడికి మొదటిసారిగా వెళ్ళి అర్చన చేయించినాను.  అర్చన అనంతరము గుడి ఆవరణలో ఉన్న టీ హోటల్ లో ఉన్న శ్రీసాయి యొక్క చాయా చిత్రము చూసినాను. (శ్రీసాయి తన భక్తులు బూటీ, నిమోంకర్, భాగోజీ షిండేలతో తీయించుకున్న ఫొటో.  ఆ ఫొటొలో హిందూ ముస్లిం ల కలయిక అనేభావము కలిగినది.  ఈరోజున ఆసంఘటన ఆలోచిస్తూ ఉంటే శ్రీసాయి నాకు తెలియకుండానె నాలో, హిందువు అయిన ముస్లిం అయిన అందరికి భగవంతుడు ఒక్కడే అనే సందేశము యిస్తున్నారు అని అనిపించుతున్నది.

హేమాద్రిపంతు శ్రీసాయి విషయములో వ్రాసిన విషయాలు చాలా ఆశ్చర్యము కలిగించుతాయి.  ఆయన మహమ్మదీయుడు అంటే వీలులేదు.  కారణము ఆయన చెవులకు హిందువులవలె కుట్లు యుండెను.  మశీదులో ధునియు అగ్నిహోత్రమును వెలిగించెను,  మశీదులో తిరగలిలో గోధుమలు విసిరేవారు,  శంఖము ఊదువారు, మశీదులో గంటవాయించేవారు, హోమము చేయించేవారు, భజనలు చేయించేవారు.  మరి హిందువా అని అంటే వీలు లేదు.  కారణము ఆయన మశీదులో ఈదుల్ ఫితర్ నాడు తన మహమ్మదీయ భక్తుల చేత నమాజు చేయించేవారు.  మొహర్రం నాడు మశీదులో తీజియా నెలకొల్పి నాలుగు దినముల తర్వాత తానే స్వయముగా తీసివేసేవారు.  భగవంతునికి మతముఏమిటి, కులము ఏమిటి, ఈకులము, మతము భగవంతుని తెలుసుకోవటానికి మానవుడు ఏర్పరుచుకొన్న రోడ్లువంటివి.  భగవంతుడు కులమతాలకు అతీతుడు.  శ్రీసాయి భగవంతుని అవరారము. ఆయన కులమతాలకు అతీతుడు.  శ్రీసాయి భగవంతుని అవతారము.  ఆయన కులమతాలకు అతీతుడు అనేది గ్రహించు.  ఆయన సాక్షాత్తు భగవంతుని అవతారమైనా ఏనాడు తాను భగవంతుడిని అని చెప్పలేదు.  తాను భగవంతుని విధేయ సేవకుడిని అని మాత్రము చెప్పినారు.  అల్లా మాలిక్ అని యెల్లపుడు పలుకుతూ ఉండేవారు.  శ్రీసాయి తొలి దినములలో గ్రామములోని రోగులను పరీక్షించి వారికి ఔషధములు యిచ్చేవారు.  వారు ఆవిధముగా మానవ సేవను మాధవసేవగా చూడమని తన భక్తులకు సూచించినారు.   తన భక్తులు అనారోగ్యముతో బాధ పడుతు ఉంటే చూడలేక తాను ఆవ్యాధులను అనుభవించి కర్మఫలము పరిపక్వత చెందిన తర్వాత తన శరీరాన్ని ధౌతి మరియు ఖండయోగము ద్వారా శుభ్రపరచుకొనేవారు. 1910 లో దీపావళి పండుగనాడు తన చేతిని ధునిలో పెట్టి దూరదేశములో కమ్మరి కొలిమిలో పడిపోయిన పసిబిడ్డను రక్షించిన వైనము, ఖాపద్రే కుమారుని ప్లేగు వ్యాధిని తన శరీరముమీదకు తెచ్చుకొని రక్షించిన వైనము, బాబు కిర్వెండికర్ మూడు. సంవత్సరాల కుమార్తె నూతిలో పడిపోతే ఆపాపను సాయి రక్షించిన వైనము ఆలోచించు.  ఆయనకు పసిపిల్లలపై ఎంత ప్రేమ యున్నది తెలుస్తుంది.  శ్రీసాయి శిరిడీలోని చిన్న పిల్లలతో ఆటలు ఆడుతు వారిలోని స్వచ్చమైన ప్రేమను చూసి ఆనందించేవారు.  యిక్కడ ఒక విషయము వ్రాస్తాను. యిది చాలా మందికి తెలియదు.  1908 సంవత్సరమునకు ముందు శ్రీసాయిబాబా ఎవరిని తనను పూజిం చటానికి అనుమతి యివ్వలేదు.  1908 సంవత్సరములో బాపురావు అనే నాలుగు సంవత్సరాల బాలుడు శ్రీసాయిబాబాను భగవంతునిగా గుర్తించి రోజూ  ఒక పుష్పమును తెచ్చి శ్రీసాయి శిరస్సుపై ఉంచి నమస్కరించేవాడు.  ఆనాటి చిన్న బాలుడు బాపురావు శ్రీసాయికి చేసిన పూజ ఈనాడు కోటానుకోట్ల సాయిభక్తులకు మార్గ దర్శకము అయినది.

శ్రీసాయి సేవలో 

నీతండ్రి.  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 8వ.అధ్యాయము

$
0
0
                         
                                   
                                             
 03.03.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు హైదరాబాదు వచ్చిన కారణంగా శ్రీవిష్ణుసహస్రనామం శ్లోకం, తాత్పర్యం ఇవ్వలేకపోతున్నాను. పుణ్యభూమిలో దొరికిన రత్నమణి సాయి ని అందిస్తున్నాను.  చదవండి.
 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 8వ.అధ్యాయము

ప్రియమైన చక్రపాణి,
ఈ ఉత్తరములో నా అనుభవాలు వ్రాయలేను.  కారణము హేమాద్రిపంతు ఎనిమిదవ అధ్యాయములో ముఖ్యముగా శ్రీసాయి జీవన విధానము గురించి ఆయనకు ఆరోజులలో ఉన్న ముఖ్య భక్తులతో పరిచయము గురించి వర్ణించినారు. శ్రీసాయితో కలసిమెలసి యున్న హేమాద్రిపంతు మానవ శరీరము గురించి ఏమంటారు చూడు. "శరీరమును అశ్రధ్ధ చేయకూడదు .   దానిని ప్రేమించకూడదు.  కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను.  గుఱ్ఱము రౌతు తన గమ్యస్థానము చేరువరకు గుఱ్ఱమును ఎంత జాగ్రత్తగా చూచుకొనునో యంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను".  యిక్కడ నీకు నీ చిన్ననాటి సంగతులు జ్ఞాపకము చేస్తాను.  నీకు సైకిలు త్రొక్కడము వచ్చిన తర్వాత రోజూ సైకిలు షాపుకు వెళ్ళి సైకిలు అద్దెకు తెచ్చుకొని జాగ్రత్తగా వాడుకొని తిరిగి సైకిలు షాపువాడికి సైకిలును, ఎన్ని గంటలు త్రొక్కినది దానికి అద్దె యిస్తు ఉండేవాడివి.  అలాగే ఈ జీవిత ప్రయాణము సాగించటానికి శరీరము అనే సైకిలుని 100 గంటలు (నూరు సంవత్సరాలు) కు భగవంతుని దగ్గరనుండి అద్దెకు తీసుకొని వచ్చినాము.  దురదృష్ఠవశాత్తు మనము ఆసైకిలును (శరీరమును)గతుకులు రోడ్డుమీద నడిపి దానిని పాడు చేసుకొని 100 గంటలు పూర్తి కాకుండ షాపువాడికి (భగవంతునికి) తిరిగి యిచ్చి వేస్తున్నాము.  శ్రీసాయి అనే గురువుని నమ్ముకొని సైకిలు త్రొక్కితే జీవించినంత కాలము గతుకులు (కష్ఠాలు) లేని రోడ్డు మీద ప్రయాణము సాగించవచ్చును.  శ్రీసాయికి బధ్ధకము అంటే చాలా కోపము.  భగవంతుడు మనకు చక్కటి మేధస్సు దానిని సరిగా వినియోగించుకోవటానికి కాలము యిచ్చినాడు.  బధ్ధకము అనే జాడ్యమును దగ్గరకు రానిస్తే దాని పరిణామము ఎలాగ యుంటుంది ఒక్కసారి ఆలోచించు.  బధ్ధకముతో మనము చేయవలసిన పనులు సరిగా చేయము.  దానితో బ్రతుకు తెరువుకు అబధ్ధాలు చెప్పవలసియుంటుంది.  ఒక్కసారి జీవితములో బధ్ధకము, అబధ్ధము ప్రవేశించితే దాని పరిణామము దొంగతనము చేయటమునకు దారి తీస్తుంది.  ఒకమనిషి జీవితములో బధ్ధకము, అబధ్ధము, దొంగతనము అనె లక్షణాలు చోటు చేసుకొంటే ఆమనిషి జీవితము పతనము చెందుతుంది.  అందుచేత జీవితములో బధ్ధకాన్ని దగ్గరకు రానీయకు.  శ్రీసాయి మధ్యాహ్ న్నము వేళలో తన దగ్గరకు భక్తులు రాని సమయములో ఏకాంతముగా ఏమి చేస్తు ఉండేవారు అనేది తెలుసుకోవటానికి ప్రయత్నించు.  వారు ఆసమయములో తన చినిగిపోయిన కఫ్నీ (చొక్కా) ని సూది, దారము తీసుకొని కుట్టుకొంటూ యుండేవారు.  ఆయన భక్తులు ఆయన దగ్గరకు వచ్చి తాము కుట్టి పెడతాము అంటే అంగీకరించేవారు  కాదు.  కారణము బధ్ధకము అనే పిశాచమును దగ్గరకు రానీయకూడదు అని చెప్పేవారు.  యిక బాబా భిక్షాటన గురించి హేమాద్రిపంతు వివరముగా చెప్పేవారు.  

                        
శ్రీసాయి తాను తెచ్చిన భిక్షను అంతా ద్వారకామాయి లో ఉంచిన మట్టిపాత్రలో వేసేవారు.  ముందుగా మశీదు శుభ్రము చేసే స్త్రీ కొంత ఆహారము, మశీదులోని కుక్కలు, పిల్లులు కొంత ఆహారము తిన్న తర్వాత మిగిలిన ఆహారము అంతా కలిపివేసి కొన్ని ముద్దలు తినేవారు.  వారు ఏనాడు రుచిని కోరలేదు.  వారు తమ భోజనములో రుచి గురించి ఆలోచించలేదు.  అటువంటిది శ్రీసాయి భోజన పధ్ధతి.  యిక్కడ నా చిన్ననాటి సంఘటన ఒకటి చెబుతాను.  నేను 7వ.తరగతి చదువుతున్నరోజులలో సైన్సు మాష్టారు మిశ్రమ ఆహారము గురించి పాఠము చెబుతున్నారు.  ఆరోజు నేను క్లాసులో చాలా పరధ్యానముగా యున్నాను.  పాఠము సరిగా వినలేదు.  క్లాసు ఆఖరులో సైన్సు మాస్టారు నేను పరధ్యానముగా ఉన్నది లేనిది చూడటానికి "మిశ్రమ ఆహారము అంటే ఏమిటి?" అని ప్రశ్న వేసినారు.  నేను పాఠము సరిగా వినలేదు.  ఏదో సమాధానము చెప్పాలి లేకపోతే పరధ్యానముగా ఉన్నందులకు బెంచి ఎక్కవలసియుంటుంది. అందు చేత నేను ఒక క్షణము ఆలోచించి "మిశ్రమ ఆహారము అనగా మనము తినదలచుకొన్న వండిన పదార్ధములు అన్నింటిని ముందుగా ఒక గిన్నెలో మిశ్రమము చేసి (కలిపివేసి) తర్వాత తినే ఆహారమును మిశ్రమ ఆహారము" అందురు అని సమాధానము చెప్పినాను.  క్లాసు విద్యార్ధులు అందరు గొల్లుమని నవ్వినారు.  మరి ఈరోజున ఆనాటి క్లాసు విద్యార్ధులలో ఎవరైన శ్రీసాయి భక్తులు ఉంటే వారు ఆనాటి క్లాసులోని సంఘటన గురించి ఏమంటారు అనేది ఊహించలేని విషయముగా ఉన్నది.  ద్వారకామాయిలో రోజూ రాత్రి శ్రీసాయితోపాటుగా, తాత్యా కోతేపాటిలు, మహల్సాపతి నిద్రపోయేవారు.  వారు ముగ్గురు ద్వారకామాయిలో నేలపై తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరము వైపు మాత్రమే ఉంచి నిద్రపోయేవారు.  దానికి కారణము ఏమి అయి ఉంటుంది అని ఆలోచిస్తే నాకు తోచిన సమాధానము, ఈ భూగోళములో తూర్పు,పడమర, ఉత్తరము వైపులలో జన జీవనము ఉన్నది.  దక్షిణ ద్వారములో జన జీవనము లేదు.  మనకు తెలియని రహస్యము శ్రీసాయికి తెలిసి యుంటుంది.  అందుచేత వారు దక్షిణము వైపు తలపెట్టి నిద్ర్రించేవారు కాదు.

శ్రీసాయి సేవలో

నీతండ్రి.  

 (సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


పుణ్యభూమిశిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 9వ.అధ్యాయం

$
0
0
                          


                                          
                                              
 

09.03.2013  శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత వారం రోజులుగా స్వస్థలంలో లేకపోవడం వల్ల ప్రచురణకు అంతరాయం కలిగింది.  ఈ రోజు పుణ్యభూమిశిరిడీ లో దొరికిన రత్నమణి సాయి 9 వ.అధ్యాయం చదవండి.
శ్రీవిష్ణుసహస్ర నామం శ్లోకం మరునాడు యధావిధిగా అందిస్తాను.

సాయి బంధువులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు

ముందుగా శివోహం వినండి.  


http://www.raaga.com/play/?id=37205

(ఇపుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన శివోహం వింటు అర్ధాన్ని కూడా తెలుసుకోండి)

 http://www.youtube.com/watch?v=br29S_GBBjQ

పుణ్యభూమిశిరిడీలో   దొరికిన రత్నమణి సాయి - 9వ.అధ్యాయం 


9వ.అధ్యాయము

                                                                                                                                  14.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో హేమాద్రిపంతు ఆ రోజులలో శ్రీసాయి భక్తులకు జరిగిన అనుభవాలు వివరించినారు  నాకు ప్రత్యేకమైన అనుభవాలు జరగలేదు. 



కాని భిక్ష యొక్క ఆవస్యకత చదివిన తరువాత ఒక విషయము నీకు వ్రాయాలి అని అనిపించుతున్నది.  05.10.91 నాడు రాత్రి కలలో శ్రీసాయి నాకు జన్మ ఇచ్చిన తల్లి రూపములో ఒక మశీదు ప్రక్కన నిలబడి నాకేసి చూస్తున్నారు.  ఆ మశీదు ప్రక్కన ఒక కాళ్ళు లేని ముష్ఠివాడు దీనంగా సాయిబాబా పేరిట దానం చేయమని అడుగుతున్నాడు.  నేను నాతల్లిని చూస్తున్నాను.  నాతల్లి (నీ మామ్మ) నాకేసి చూసి ఏమిటి అలాగ నిలబడ్డావు.  ఈరోజు శనివారము.  ఆబీదవాడికి కొంచము బియ్యము దానం చేయకూడదా అని నన్ను ఆదేశించినది. నాకు నిద్రనుండి తెలివి వచ్చినది.  ఆరోజునుండి శ్రీసాయి సత్ చరిత్ర నిత్యపారాయణ చేసిన తర్వాత ఒక పిడికెడు బియ్యము శ్రీసాయి పేరిట యింటిలో ఉన్న జోలెలో వేస్తు బీదలకు అన్నదానానికి, శ్రీరామనవమి నాడు సాయి భక్తులకు ప్రసాదానికి, విజయదశమినాడు సాయి భక్తులకు ప్రసాదానికి ఆ బియ్యము వాడుతున్నాను.  శ్రీసాయి ఈవిధముగా నన్ను అన్నదానము చేయమని ఆదేశించినారు అని నానమ్మకము.  ఈనమ్మకాన్ని నాజీవితము అంతము వరకు నిలబెట్టుకోవటానికి శ్రీసాయి నాకు శక్తిని ప్రసాదించగలరని నమ్ముతున్నాను.  ఈ తొమ్మిదవ అధ్యాయము ఆఖరిలో శ్రీహేమాద్రిపంతు నీతిని వ్రాసినారు.  "భగవంతుని జీవులన్నిటియందు గనుము"

ఈ విషయములో నేను పొందిన అనుభవాలు వ్రాస్తాను.  ఈ అనుభవాలు నాకు 1991 సంవత్సరములో జరిగినవి.  అది వేసవికాలము మధ్యాహ్న్నము ఎండ విపరీతముగా యున్నది.  నేను యింటినుండి బయటకు వెళ్ళుతున్నాను.  గుమ్మములో మురికి కాలవ యున్నది.  ఒక తెల్లని ఎద్దు దాహానికి ఆమురికి కాలవలోని నీరు త్రాగుతున్నది.  మనసులో బాధ అనిపించినది.  శ్రీసాయి ఆరూపములో యింటి ముందు వచ్చి యుంటారు అనే ఆలోచన కలిగినా నేను ఏమీ పట్టించుకోకుండ (కనీసము బకెట్టు మంచినీరు కూడా యివ్వలేదు) నేను నాపని మీద వెళ్ళిపోయినాను.  మరుసటి రోజున నేను భోపాల్ పనిమీద వెళ్ళి వస్తూ దారిలో విపరీతమైన దాహము బాధతో ఒక స్టేషన్ లో మజ్జిగ కొని త్రాగినాను.  ఆ దుకాణమువాడు ఒక బకెట్టులోని మురికి నీరుతో త్రాగిన గ్లాసులు కడుగుతూ వాటిలో తిరిగి మజ్జిగ పోసి రైలు ప్రయాణీకులకు అమ్ముతున్నాడు.  ఆమజ్జిగ త్రాగిన తర్వాత నాలో పశ్చాత్తాపము కలిగినది.  నాయింటిముందు సాయినాధుడు విపరీతమైన దాహముతో మురికి నీరు త్రాగుతున్నపుడు నేను కనీసము ఒక బకెట్టు మంచినీరు కూడా యివ్వలేక పోయినాను అని బాధపడినాను.  అబాధ నాలో పరివర్తనకు దారి చూపినది.  ఆసంఘటన *మన యింటిముందు పశువులు నీళ్ళు త్రాగటానికి ఒక నీళ్ళ తొట్టి ఏర్పాటు చేయడానికి కారణమైనది.  యిక 1991 సంవత్సరము దీపావళినాడు జరిగిన సంఘటన వ్రాస్తాను.

ఆరోజు దీపావళి.  రాత్రి 8 గంటల ప్రాంతములో మన మేడమీద గదిలో నేను, మీ అమ్మ లక్ష్మి పూజ చేస్తున్నాము. పూజారి మంత్రాలు చదువుతున్నారు.  నామనసు గోడమీద ఉన్న సాయిబాబా ఫొటో పై లగ్నము అయ్హినది.  లక్ష్మి పూజ చేస్తున్నా శ్రీసాయి ఆశీర్వచనాలు కావాలని నామనసు కోరుతున్నది.  శ్రీసాయి తన భక్తుల కోరికను ఎప్పుడు కాదనలేదు అని నిరూపించడానికి అయి ఉంటుంది.  శ్రీసాయినాధుడు ఒక చక్కటి ఊదారంగులో ఉన్న కప్ప రూపములో నాపాదాల దగ్గరలో గెంతుతున్నారు.  ఒక్కసారి మనసు సంతోషముతో ఉక్కిరిబిక్కిరి అయినది.  శ్రీసాయి స్వయముగా అన్నమాటలు "నీ భోజనమునకు పూర్వము ఏ కుక్కను చూచి రొట్టై పెట్టితివో అదియు నేను ఒక్కటియే, అటులనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియూ నాంశములే.  నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ఎవరయితే జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు.  కాబట్టి నేనొకటి, తక్కిన జీవరాశి యింకోటియను ద్వంద్వ భావమును, భేదమును విడిచి నన్ను సేవింపుము"".  నిజము అని గ్రహించగలిగినాను.  ఒకవేళ అది వర్షాకాలము అందుచేత కప్ప గదిలోనికి వచ్చియుండ వచ్చును అని ఎవరైన అంటే ఒక ముఖ్య విషయము చెప్పాలి. ఆనాడు దీపావళి.  ఆరోజు వాన కురియలేదు.  అంతకుముందు పదిరోజులులోను వాన కురియలేదు.  మరి పూజ జరుగుతున్నది మేడమీద గదిలో.  మరి ఆకప్ప ఎక్కడనుండి రాగలదు.  శ్రీసాయినాధుడు మాత్రమే ఆకప్ప రూపములో నాకోరిక తీర్చటానికి దర్శనము యిచ్చినారు అని నా నమ్మకము.

ఇపుడు 22.11.1991 నాడు జరిగిన యింకొక సంఘటన వ్రాస్తాను.  ఆరోజు నిత్యపారాయణ లోని శ్రీసాయి సందేశము ప్రకారము సికింద్రాబాద్ లోని శ్రీపాండురంగ విఠల్ గుడికి వెళ్ళినాను.  నేను గుడి దగ్గరకు వెళ్ళుతుంటే ఒక కుక్క కుంటుకుంటు నావెనకాల గుడివరకు వచ్చి గుడి బయట నిలబడిపోయినది.  నేను దానివైపు జాలిగా చూసి గుడి లోపలికి వచ్చినాను.  పూజారి గుడిలో లేరు.  అక్కడ యున్న పనివాడితో పూజారి గురించి కబురు చేసినాను.   ప్రతిసారి యుండే పూజారి బదులు ఆరోజున పూజారి కుమారుడు కుంటు కుంటు (పోలియో వ్యాధిగ్రస్తుడు) గుడిలోనికి వచ్చి అర్చన చేసినారు.  ఆసమయములో నాకంటికి శ్రీసాయినాధుడు శ్రీపాండురంగ విఠల్ లోను, అర్చన చేస్తున్న కుంటి పూజారిలోను, గుడి బయట కుంటి కాలుతో నిలబడియున్న కుక్కలోను కనిపించినారు.  ఈ సంఘటనతో శ్రీసాయి అన్నమాటలు "నేనొకటి, తక్కిన జీవరాశి యుంకోటి యను ద్వంద్వ భావమును భేదమును విడిచి నన్ను సేవింపుము" యివి అక్షర సత్యాలు.

శ్రీసాయి సేవలో

 నీతండ్రి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

(*సాయి.బా.ని.స. మంచి మనసుతో పశువులు నీరు త్రాగడానికి తొట్టెను బయట కట్టించి అందులో నీరు పోసేవారు.  కాని చుట్టుపక్కలవారు ఆతొట్టెలోనికి చెత్తను  పాత చీపురు కట్టలు, పాత చెప్పులు, కోడిగ్రుడ్డు డొల్లలు వేయడం ప్రారంభించారనీ,తరువాత మునిసిపాలిటీవారు తూము కట్టడానికి అడ్డముగా ఉన్నదని కూలదోసారని వారు నాకు మాటల సందర్భంలో చెప్పడం జరిగింది. వారు నాకు చెప్పడం జరిగింది.  దీనిని బట్టి మనకు ఏమని అర్ధమవుతున్నదో మీరే ఊహించుకోండి.  --  త్యాగరాజు 

(09.03.2013)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 10వ. అధ్యాయము

$
0
0
                                   
                                               
                          
                                
                                                 
12.03.2013  సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్స్లులు







                                        
                            
శ్రీ విష్ణుసహస్రనామం 45వ.శ్లోక, తాత్పర్యము

శ్లోకం:      ఋతుఃస్సుదర్శనః కాలః పరిమేష్టీ పరిగ్రహః  |

             ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః       ||

తాత్పర్యము:  పరమాత్మను ఋతువుల కధిపతిగా, శత్రువులను సం హరించు చక్రముగా, సంవత్సరము అందరి భాగములుగ వ్యక్తమగుచున్న కాలముగా, సృష్టి అను మహాయజ్ఞముగా, కర్మఫలములు మనచే గ్రహింపబడువానిగా, రాక్షసులను సం హరించువారిలో తీవ్రమైనవానిగా, సమర్ధుడైన దక్షుడను ప్రజాపతిగా, జీవుల మనస్సునందుగల విశ్రాంతిగా, ఈ విశ్వమే దక్షిణయైనవానిగా ధ్యానము చేయుము.    


12.03.2013 సోమవారము

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 10వ. అధ్యాయము

ఈ ఉత్తరములో శ్రీసాయి గురించిన వివరాలు వ్రాయాలి.  నేను వ్రాసే విషయాలకంటే శ్రీహేమాద్రిపంతు వ్రాసిన విషయాలు ఘనమైనవి.  



అందుచేత శ్రీసాయి సత్ చరిత్రలో పదియవ అధ్యాయము విపులముగా చదువు.  శ్రీసాయి పై నమ్మకము ఉంచి జీవిత ప్రయాణము సాగించిన మన గమ్యముసు లువుగా చేరగలము అంటారు శ్రీహేమాద్రిపంతు.  ఈవిషయము నీకు బాగా అర్ధము కావాలి. అందుకు ఒక చక్కని ఉదాహరణ నీకు చెబుతాను.  మనము రైలులో సుఖముగా ప్రయాణము చేయటానికి రాత్రి పూట ప్రశాంతముగా నిద్రపోవటానికి స్లీపర్ కోచ్ లో బెర్తుకు ఛార్జీలు కట్టి ప్రయాణము సాగించుతాము.  బెర్తుకు ఛార్జీలు కట్టకపోతే అందరితోను కలసి జనరల్ కంపార్ట్ మెంట్  లో ప్రయాణము సాగించవలసియుంటుంది.  యిక్కడ జీవిత ప్రయాణములో శ్రీసాయికి శ్రధ్ధ మరియు సహనము అనే  చార్జీలు కట్టి సుఖప్రయాణము చేసుకొనే ప్రయాణీకులు అందరు మన సాయి బందువులు అనే విషయము గుర్తు చేసుకోవాలి.  బాబాయొక్క జన్మ తేదీ మరియు బాబాయొక్క తల్లిదండ్రుల వివరాలు ఆరోజులలో ఎవరికి తెలియవు.  అందుచేత హేమాద్రిపంతు ఆవివరాలు ఏమీ వ్రాయలేదు.  ఈనాడు శ్రీసత్యసాయిబాబా తెలియపర్చిన విషయాలు చాలా ఆసక్తిని రేకెత్తించినాయి .  వారు శ్రీశిరిడీ సాయి తల్లిదండ్రుల పేర్లు దేవగిరి అమ్మ, గంగా భవాడ్యుడు అని తెలియపర్చినారు.  శ్రీసాయిబాబా పుట్టిన రోజు 28.09.1835 అని తెలియపర్చినారు.  భగవంతుడు మానవ అవతారము ఎత్తినపుడు మానవుల మధ్య తల్లిదండ్రులకు జన్మించవలసినదే అని కొందరు అంటారు.  కొందరు దీనికి అంగీకరించరు.

ఈ విషయములో నేను ఏది సరి అయినది ఏది సరి అయినది కాదు అని చర్చించలేను కాని రెండిటికీ ఉదాహరణకు యివ్వగలను.  ఈవిషయాలు నాస్వంత విషయాలు కావు.  పురాణాలునుండి, మరియు చరిత్ర ఆధారముగా తెలుసుకొన్న విషయాలు మాత్రమే.  శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మొదటి కోవకు చెందినవారు.  మరి ఈకాలములో చరిత్ర ఆధారముగా సేకరించిన విషయాలు చూస్తే నామదేవు, కబీరు, సామాన్య మానవులుగా జన్మించి  యుండలేదు.  నామదేవు భీమారధి  నదిలో, కబీరు భాగీరధి నదిలోను చిన్న పాపలుగా వారి పెంపుడు తల్లిదండ్రులకు చిక్కిరి.  యిటువంటి పరిస్థితిలో శ్రీశిరిడీసాయి ఏకోవకు చెందియుంటారు అనేది ముఖ్యము కాదు.  వారు భగవంతుని అవతారము అని మాత్రము మనము నమ్మగలిగితే చాలు.  పదియవ అధ్యాయములో హేమాద్రిపంతు బాబా లక్ష్యము, వారి బోధలు విషయములో శ్రీసాయి అన్న మాటలు వ్రాసినారు.  అవి "హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయుల దైవమగు రహీము ఒక్కరే" అందుచేత హిందూ, మహమ్మదీయులు చేతులు కలిపి స్నేహముతో జీవించమన్నారు.  నేను శిరిడీలోని ద్వారకామాయి హిందూ మహమ్మదీయుల మైత్రికి చిహ్నము అని నమ్ముతాను.  నాచిన్ననాటి స్నేహితులు హుస్సేని బేగ్, మరియు ఖలీల్ లను తలచుకొన్నపుడు స్నేహానికి మతాలు అడ్డు రావు అని భావించుతాను.  ఈకలి యుగములో యోగాభ్యాసాలు, యాగాలు, మంత్రోపదేశాలు సరిగా జరపలేము.  అందుచేత శ్రీసాయి నామ స్మ్రరణ చేస్తూ భగవంతుని చేరటము ఉత్తమమైన మార్గము అని నమ్మేవాళ్ళలో నేను ఒకడిని.

శ్రీసాయి సేవలో

నీతండ్రి. 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 11 వ. అధ్యాయము

$
0
0
                         
                                             
                                               
                                           
12.03.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                                                   
                                         
శ్రీ విష్ణు సహస్రనామం 46వ.శ్లోకం, తాత్పర్యం.

శ్లోకం:     విస్తారః స్ఠావరస్స్ఠాణుః ప్రమాణం బీజమవ్యయం  | 

             అర్ధో నర్ధో మహాకోశో మహాభోగో మహాధనః    ||

తాత్పర్యం :  పరమత్మను సృష్టిగా వికసించువానిగా, మరియు సృష్టియందు స్థిరముగా నున్నవానిగా, మార్పులేని వానిగా, మొట్టమొదటగా కొలతగా ఏర్పడినవానిగా సృష్టికి మొదటి విత్తనముగా, వ్యయము లేనివానిగా, సృష్టికి  భావము మరియు ప్రయోజనము తానేయైనవానిగా, మరియు ఆ రెండింటికి అతీతమైనవానిగా, గొప్ప నిధిగా, సంపదగా, మరియు సుఖముగా, ధ్యానము చేయుము. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 11 వ. అధ్యాయము                                                             
                                                                           16.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో ముందుగా శ్రీసాయికి రూపము ఉందా లేదా అనే విషయముపై ఒక రెండు మాటలు నీకు చెప్పదలచుకున్నాను. 



 శ్రీసాయి శిరిడీకి వచ్చినపుడు తన పేరు సాయి అని ఎవరికీ చెప్పలేదు.  ఆయనను ఒక జడ్జిగారు మీపేరు ఏమిటి అని ప్రశ్నించినపుడు నన్ను సాయిబాబా  అని పిలుస్తారు అన్నారు.  ఆయనకు ఆ పేరు యిచ్చినది మన సాయి బంధు మహల్సాపతి.  శ్రీసాయి తనకు రూపము లేదు అని తన భక్తులకు చెప్పియున్నారు.  దానిని మన పెద్దలు నిర్గుణ స్వరూపము అని పిలుస్తారు.  ఈ స్వరూపములో సాయిని పూజించటము అంటే నిర్గుణ స్వరూప బ్రహ్మను పూజించటము అగుతుంది.  ఇది అందరికీ వీలుపడదు.  అందుచేత మనము మానవ రూపములో ఉన్న భగవంతుని పూజించుతాము.  ఆకోవకు చెందిన పూజా విధానమె శ్రీరాముని పూజ.  శ్రీకృష్ణుని పూజ, మరియు శిరిడీసాయినాధుని పూజ.  
                                    
                                       
ఈపూజా విధానము సగుణ స్వరూప పూజా విధానము అంటారు.  యిది మన అందరికీ సులభమైన పధ్ధతి.  శ్రీసాయి సర్వాంతర్యామి.  ఎక్కడ జూచిన వారే యుండువారు.  అని శ్రీహేమాద్రిపంతు అంటారు. ఈవిషయములో నేను హేమాద్రిపంతుతో ఏకీభవించుతాను.  శ్రీసాయి సర్వాంతర్యామి అనే 
                                   
                                             
విషయము నా జీవితములో అనేక సార్లు అనుభవ పూర్వకముగా తెలుసుకొన్నాను.  యిపుడు అవి అన్నీ ఒక్కచోట ఒకే ఉత్తరములో వ్రాయటముకన్నా, సందర్భోచితముగా వ్రాయటము మంచిది అని తలుస్తాను.
శ్రీసాయి నుదుటిపై డాక్టర్ పండిట్ చందనము పూసెను అనే విషయము మనకు తెలుసు.  కాని దాని వెనుక ఉన్న సాయి తత్వము ఏమిటి? అనేది మనము ఆలోచించాలి.  శ్రీసాయి డాక్టర్ పండిట్ యొక్క గురువు రూపములో దర్శనము యిచ్చి భగవంతుడు భక్తుని వెనుక పరిగెడుతాడు అనేది సాయి నిరూపించినారు.  డాక్క్టర్ ఫండిట్ అనుభవానికి వ్యతిరేకమైనది హాజీ సిద్దీఖ్ ఫాల్కేయొక్క అనుభవము.  తొమ్మిది నెలలు వరకూ శ్రీసాయి హాజీ సిద్దీఖ్ ఫాల్కేను మశీదులోనికి రానీయలేదు.  కారణము హాజీలోని అహంకారము పూర్తిగా తొలగిపోవక పోవటమే.  శ్రీసాయిని  నేను నిత్యము పూజించుతాను.  మరియు ప్రతి శనివారము దేవతల గుళ్ళకు తప్పనిసరిగా వెళ్ళి పూజించుతాను అనే అహంకారము నాలో విపరీతముగా పెరిగిపోయినది.  1991 దత్త జయంతి రోజు (శనివారము) న నేను వెళ్ళిన ప్రతి గుడిలోను అక్కడి పూజార్లు చేత నాలోని అహంకారము తొలగించబడిన వైనము  ఆలోచించుతూ ఉంటే, శ్రీసాయి  అహంకారము అనేది తన భక్తులలో లేకుండ చేసి కనువిప్పు కలిగిస్తారు అనేది చెప్పక తప్పదు.  ఆనాటి నుండి నేను అహంకారము వదలి భగవంతుడు సర్వాంతర్యామి ఆయన గుడిలోను, నీయింటిలోను, నీమనసులోను ఉన్నాడు అని నమ్ముతు యింటి దగ్గరనే భగవంతుని పూజ చేస్తున్నాను.  ఈ పదకొండవ అధ్యాయములో హేమాద్రిపంతు బాబా స్వాధినములో పంచ భూతములు ఉండేవి అని వ్రాసినారు.  వారు ఈవిషయములో రెండు ఉదాహరణలు యిచ్చినారు.  నేను స్వయముగా చూసిన ఒక ఉదాహరణ నీకు చెబుతాను విను.

1989 జూలై నెలలో ఒక శనివారమునాడు మొదటిసారిగా శిరిడీ యాత్రకు బయలుదేరినాను.  మధ్యాహ్న్నము బస్సుకు యింటినుండి ఆటోలో  బయలుదేరినాము.  ఆసమయములో కుంభవృష్టి  వాన.  ఏమి చేయాలో తెలియని పరిస్థితి.  శ్రీసాయి నామము జపించుతూ ఆటో లో వానకు తడుస్తూ బయలుదేరినాము.  ఆటో ఉస్మానియా యూనివర్శిటీ మశీదు దగ్గరకుచేరేసరికి ఒక్క చుక్క వాన లేదు.  బహుశ శ్రీసాయి అలనాడు శిరిడీలోని వానను ఆపటానికి ద్వారకామాయి (మశీదు) బయటకు వచ్చి, ఆగు, యాగు, నీకోపము తగ్గించు, నెమ్మదించు" అన్న మాటలు తిరిగి ఈనాడు తన భక్తులు శిరిడీకి వస్తూ ఉంటే వారికి యిబ్బంది కలగకుండ యుండటానికి అదే మాటలు ఉచ్చరించి ఉంటారని నానమ్మకము.  ఒక్కసారి శ్రీసాయిపై నమ్మకము కుదిరిన తర్వాత ఆనమ్మకము శిరిడీ యాత్రవరకు కాకుండ మన జీవిత యాత్రలో కూడా ఉంచుకొని మనము భగవత్ సాక్షాత్కారమును పొందవలెను.

శ్రీసాయి సేవలో

నీతండ్రి 


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 12వ.అధ్యాయం

$
0
0


                                                                          
                                          


14.03.2013  గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
 సాయిబంధువులకు ఒక గమనిక:  ద్వారకామాయి గీత్ మాలా లింక్ ఇస్తున్నాను.  దానిలో మరపురాని మధురమైన పాటలను తనివితీరా విని ఆనందించండి.

http://www.facebook.com/dwarakamai?ref=hl


                               
                                     
శ్రీవిష్ణుసహస్రనామం 47వ. శ్లోకం,  తాత్పర్యం

శ్లోకం:   అనిర్విణ్ణస్స్ఠావిష్టో  భూర్ధర్మయూపో మహామఖః  |

              నక్షత్రనేమి ర్నక్షత్రీక్షమః క్షామస్నమీహనః || 

తాత్పర్యం:  భగవంతుని విస్మయము చెందని వానిగను, స్థిరమైనవారిలో శ్రేష్టునిగను, మొక్కలు మున్నగునవి మొలిపించువానిగను, జీవులను పుట్తించువానిగను, ఈ సృష్టియను యజ్ఞమునకు ఆధారమగు ధర్మమను స్థంభమునకు జీవులను కట్టి యుంచువానిగను, సృష్టియందలి అన్ని యజ్ఞములకు ఆధారమైన మహా యజ్ఞముగను,  రాశిచక్రము, నక్షత్ర విభజన మున్నగు వానికి అధిపతిగను, సహనము, సామర్ధ్యము మున్నగు అంశములు తానే అయిన వానిగను, కరువు, ఆకలి, అనువాని రూపమున జీవులకు క్రమశిక్షణనిచ్చువానిగను, జీవుల కోరికలయొక్క వరుస తానే అయిన వానిగను ధ్యానము చేయుము.    


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
12వ.అధ్యాయం

                              
                              
                                                             17.01.1992

ప్రియమైన చక్రపాణి,

పండ్రెండవ అధ్యాయములో హేమాద్రిపంతు శ్రీసాయి భక్తుల అనుభవాలను వివరముగా వ్రాసినారు.  నాకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నీకు వ్రాసేముందుగా,  శ్రీ సాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు  శ్రీసాయి భక్తులు గురించి వివరించుతూ యిలాగ అన్నారు. 



 "వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు" ఇది అక్షర సత్యము.  నావిషయము ఆలోచించు.  బహుశ నీకు వెనకటి ఉత్తరములో వ్రాసి యుంటాను. అదే 1964 లో ఒకనాటి రాత్రి శ్రీసత్యసాయి నాకలలో దర్శనము ఇచ్చి ఇచ్చిన సందేశము.  ఆసందేశము ప్రకారము శ్రీశిరిడీసాయిని తలచే భాగ్యము 1989 సంవత్సరములో వచ్చినది.  ఈఅధ్యాయములో శ్రీహేమాద్రిపంతు మూలే శాస్త్గ్రి అను భక్తుని వివరాలు చక్కగా వివరించినారు. .  శ్రీసాయి ములేశాస్త్రికి నాలుగు అరటిపళ్ళు ఇచ్చి ఆశీర్వదించినారు.  1991 సంవత్సరము లో శ్రీసాయి ములేశాస్త్రిని నాయింటికి పంపి నన్ను ఆశీర్వదించినారు.  యిది కొంచము ఆశ్చర్యముగా యుంది కదూ.  1991 సంవత్సరములో (తేదీ, నెల గుర్తు లేదు) ఒకరోజున ఆఫీసులో నాస్నేహితుడు శ్రీములేతో మాట్లాడినాను.  అతను మరాఠీ బ్రాహ్మణుడు.  నాకు మంచి స్నేహితుడు.  ఆరోజు ఆఫీసునుండి యింటికి వచ్చి విశ్ర్రాంతి తీసుకొంటు యుంటే పోస్టుమాన్ వచ్చి శ్రీసాయిబాబా పక్ష పత్రిక అందచేసినాడు.  ఆపత్రిక వెనుక అట్టపై శ్రీములేశాస్త్రికి శ్రీసాయి నాలుగు అరటిపళ్ళు యిచ్చి ఆశీర్వదించిన ఘట్టము ఉంది.  నేను చాలా ఆసక్తిగా చదువుతున్నాను.  నేను యింకా ఆపుస్తకము చదువుతు ఉండగా, ఉదయము నాతో మాట్లాడిన నాస్నేహితుడు శ్రీములే నాయింటికి వచ్చి నాతో టీ త్రాగినాడు.
ఈసంఘటన ద్వారా శ్రీసాయి తెలియ చేసినది ఏమిటి అనేది ఆలోచించు.  ఆరోజులలో ములేశాస్త్రి  అహంకారముతో శ్రీసాయిని గుర్తించలేదు.  కాని శ్రీసాయి అటువంటి అహంకారిని కూడా ఆశీర్వదించి ప్రేమతో నాలుగు అరటి పళ్ళు యిచ్చినారు.  నేను ములేశాస్త్రి గురించిన వివరాలు సాయిబాబా పక్షపత్రికలో చదువుతు ఉండగా, మా ఆఫీసులో పని చేస్తున్న శ్రీములేను సాయి మన యింటికి పంపి ఆశ్చర్యపరచటములో అర్ధము, అహంకారము ఉంటే దానిని తొలగించుకోవలసినది అని హెచ్చరించటము అని గుర్తు పెట్ట్లుకోవాలి.

శ్రీములేశాస్త్రి మరియు ఒక డాక్టర్ యొక్క చరిత్ర చదివిన తర్వాత మనము తెలుసుకోవలసిన విషయము ఏమిటి?  అనే  దానికి నాకు తోచిన సమాధానము నీకు వ్రాస్తాను.  నీవు నీగురువునందు, నీయిష్ఠ దైవమునందు స్థిరమైన నమ్మకము ఉంచవలెను.  ఒకసారి మనము మన గురువుపై నమ్మకము పెంచుకొంటే అది ఏనాటికి తరగిపోదు.  ఆయనే నీయిష్ఠ దైవము రూపములో నీకు దర్శనము యిస్తు నిన్ను ఆధ్యాత్మిక రంగములో ముందుకు నడిపించుతు నీ అభివృధ్ధికి పాటుపడతారు.

శ్రీసాయి సేవలో

నీతండ్రి. 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 13వ.అధ్యాయం

$
0
0

                                                         
                                               
                                                       

17.03.2013 ఆదివారము
 

 ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

                                        
                                                

శ్రీవిష్ణు సహస్రనామం 48అ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  యజ్ఞ ఇజ్యో మహేజ్య శ్చక్రతున్నత్రం సతాంగతిః  |

             సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం  ||

 తాత్పర్యం: యజ్ఞమనగా అందరికీ ఉపయోగించు మంచిపనిని ఔదార్యముతో ఫలాపేక్ష లేక ఇతరుల యందలి అంతర్యామిని చూచి, చేయుట.  ఇట్లు యజ్ఞార్ధము ప్రపంచమునందు జీవించు సజ్జనుల, మహర్షుల రూపమున వారియందలి యజ్ఞస్వరూపముగా నారాయణుడే యున్నాడు.   


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
13వ.అధ్యాయం

                                                                                                18.01.1992          
ప్రియమైన చక్రపాణి,

హేమాద్రిపంతు ఈ అధ్యాయములో ఎక్కువగా బాబా దయ వలన అనారోగ్యమునుండి విముక్తి పొంది పూర్ణ ఆరోగ్యము పొందిన భక్తుల అనుభవాలను వివరించినారు.  



శ్రీసాయి స్వయముగా తన భక్తులతో అన్న కొన్ని మాటలను హేమాద్రిపంతు ఈ విధముగా శ్రీసాయి సత్  చరిత్రలో వివరించారు. "పూజా  తంతుతో నాకు పని లేదు.  షోడశోపచారములుగాని, అష్టాంగ యోగములు గాని నాకు అవసరము లేదు.  భక్తి యున్న చోటనే నా నివాసము".  బాబాకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు ఏమి చేసినది హేమాద్రి పంతు వివరముగా శ్రీసాయి సత్ చరిత్రలో వ్రాసినారు.  నేను అన్ని వివరాలు వ్రా యకపోయినా కొన్ని విషయాలు మాత్రము నీకు తెలియపరచాలి.  భీమాజీ పాటిలు విషయములో శ్రీసాయి ముందు ఏమి శ్రధ్ధ చూపించరు.  కారణము అతను గత జన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము అనుభవించి తీరాలి అంటారు.  అటువంటి సమయములో భీమాజీ పాటిలు తనకు వేరే దిక్కు లేదు.  దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. తన పాలిట దేవుడు శ్రీసాయి అని నమ్మి శిరిడీకి వచ్చినాను అని బాబాతో మొర పెట్టుకొంటే బాబా మనసు మార్చుకొని భీమాజీ పాటిలు ఆరోగ్యము కొరకు తన తపశ్శక్తి ధారపోసి అతనికి ఆరోగ్యము ప్రసాదించుతారు.  బాల గణపతి షింపి  యొక్క మలేరియా జ్వరమును నల్ల కుక్కకు పెరుగు అన్నము తినిపించి జ్వరమును తగ్గించెను.  యిది విచిత్రముగా లేదా!   యిక్కడ అర్ధము చేసుకోవలసినది బాబా ఎవరి దగ్గర ఏమి ఊరికే తీసుకోరు.  
                                      

బాలగణపతి చేతితో పెరుగు అన్నము తిని విశ్వాసమునకు మారుపేరు "సాయి" అని నిరూపించినారు. ఇక బాపూ సాహెబు బుట్టె విషయము ఆలోచించెదము.  అతడు ఆ రోజులలో కోటీశ్వరుడు.  అతనికి డబ్బుకు కొదవ లేదు.  అతని చుట్టు డాక్టర్ లకు లోటు లేదు.  అతను వాంతులు, విరోచనాలు, కలరాతో బాధపడుతూ ఉంటే ఏమందులు యివ్వకుండ అతనిలోని అహంకారమును తన చూపుడు వ్రేలితో అతనికి చూపించి, దానిని తొలగించి అతని అనారోగ్యము  తొలగించటానికి బలమైన ఆహారమును స్వీకరించిచమని ఆదేశించి, అతనికి పూర్ణ ఆరోగ్యమును ప్రసాదించెను.  యిక అళందిస్వామి చెవిపోటు నోటి మాటతోను, కాకా మహాజని వంటి బీద భక్తుని విరో చనాల బాధను బీదవాటి పాలిట బాదాము పప్పు అయిన వేరుశనగ  గింజలను తినిపించి ఆవ్యాదులను నిర్మూలించెను.  యింక దత్తోపంతు కడుపు నొప్పి, శ్యామా మూలశంఖ వ్యాధి, నానా సాహెబు చందోర్కరు మరియు గంగాధర పంతుల కడుపు నొప్పిలను మందులతో కాకుండ తన ఆశీర్వాదము వలనే బాగు చేసెను.  యిన్ని విషయాలు తెలుసుకొన్న తర్వాత మనకు శ్రీసాయిపై నమ్మకము కుదరకపోతే అది శ్రీసాయి తప్పుకాదు.  అది మనలోని మూర్ఖత్వము.  1990 లో నీవు ఎం. సెట్.  పరీక్షకు చదువుతున్నపుడు మలేరియా జ్వరముతో బాధపడ్డావు.  శ్రీసాయి నీపై దయ చూపించి పరీక్షలముందు ఆవ్యాధిని నిరోధించి, నీవు పరీక్ష వ్రాయటానికి వీలు కలిగించినారు.  యిది నీవు నమ్మినా నమ్మకపోయిన నేను మాత్రము నమ్ముతాను.
శ్రీసాయి పై తిరుగు లేని నమ్మకముతో

నీతండ్రి



(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 14వ. అధ్యాయము

$
0
0
                                       
                                            
                               
18.03.2013 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                                   

               
శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం 49వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  సుప్రతస్సుముఖ స్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్  |

             మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః            || 

తాత్పర్యము:  పరమాత్మను సత్కర్మకు అంకితమైనవానిగా, మంచి ముఖము కలవానిగా, తన వాక్కుచే ఆనందము కలిగించు మంచి మిత్రునివలె హృదయమును తాకువానిగా, తన వాక్కు వలన మనస్సును తనలోనికి హరించువానిగా, తనవాక్కు వలన మనస్సును తనలోనికి హరించువానిగా, ఆయన క్రోధము నశింప చేసిననూ బాహువులయందు శౌర్యము కలిగి శతృవులను చీల్చివేయు వానిగా ధ్యానము చేయుము. 
 

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

14వ. అధ్యాయము
                          
                              
                                                                                                                                                               19.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో హేమాద్రిపంతు యోగీశ్వరుని లక్షణాలు వర్ణించుతు ఒక చోట అంటారు.  మోక్షము సంపాదించాలి అంటే మనమెప్పుడును బధ్ధకించరాదు.  యిది అక్షరాల నిజము.  శ్రీసాయి ఎన్నడు బధ్ధకించి యుండలేదు.  



మధ్యాహ్న్న  సమయములో భక్తులు ఎవరు లేనప్పుడు ఏకాంతముగా కూర్చుని తన చినిగిపోయిన కఫనీ (చొక్కా) ని సూది దారముతో కుట్టుకుంటూ యుండేవారు.  ఆపనిని తన భక్తులు ప్రేమతో చే యటానికి సిధ్ధపడినా  ఆయన దానికి అంగీకరించేవారు కాదు.  మనము బధ్ధకమును దగ్గరకు రానిస్తే ఆబధ్ధకము, అబధ్ధము (అసత్యము) ను తోడుగా పిలుచుకొని వస్తుంది.  ఒకసారి బధ్ధకము, అబధ్ధము మనలో ప్రవేశించితే మనకు తెలియకుండానే దొంగతనము అనే బుధ్ధి మనలో చోటు చేసుకొంటుంది.  యింక ఈ మూడు మనిషి జీవిత ములో ప్రవేసించితే ఆమనిషికి మోక్షము మాట భగవంతునికి తెలుసు.  పతనము మాత్రము అందరికి తెలుస్తుంది.  హేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో వ్రాస్తారు "ప్రతి నిత్యము సాయి లీలలు వినినచో, నీవు శ్రీసాయిని చూడగలవు.  నీవు యితరుల జీవితములో జరిగిన సాయి లీలలు వినకపోయినా  ఫరవాలేదు.  కాని, నీ జీవితములో జరిగిన సాయి లీలలను నీవు మరచిపోకుండ యుంటే చాలు.  నీకు జ్ఞాపకము చేయటానికి నీజీవితములో జరిగిన కొన్ని లీలలు యిక్కడ వ్రాస్తాను.  నీవు అంగీకరించుతావు అని నమ్ముతాను.
1990 లో నీకు ఒమేగా లో చదవటానికి సీటు రాలేదు అని తెలిసినపుడు నీవు పడ్డ బాధ, వెయిటింగ్ లిస్టులో నీపేరు చూసుకొని నీవు పడిన ఆనందము, అదే రోజు సాయంత్రము పోస్టుమాన్ సాయిబాబా పక్ష పత్రిక తెచ్చి యి చ్చినపుడు అందులోని సాయి సందేశము "నీకు కాలేజీలో సీటు మాత్రమే వచ్చినది.  కష్ఠపడి చదవాలి".  యిది నీజీవితములో శ్రీసాయి చూపించిన లీల కాదా! 24.07.1991 నాడు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణలో శ్రీసాయి సందేశము "అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును" గుర్తు  ఉండి యుంటుంది .  ఆ మరుసటిరోజు 25.07.1991 నాడు పరీక్షా ఫలితాలులో నీ రాంక్ 1331 అని తెలుపబడలేదా,  ఆలోచించు.  శ్రీసాయి నీకు ప్రతిసారి సందేశము యిచ్చిన పుస్తకము నెంబరు 1916.  నీ ఎంసెట్ హాల్ టికెట్టు నెంబరు 59318.  నీకు వచ్చిన రాంక్ 1331.  ఈ నెంబర్లు అన్నిటిని కూడు, ఆవచ్చే సంఖ్య 8.  శ్రీ సాయి నీకు ప్రసాదించిన అదృష్ఠ సంఖ్య 8 అని తలచడములో తప్పులేదు. 

శ్రీసాయికి హిందూ, ముస్లిం భక్తులే కాకుండ యితర మతాలు భక్తులు కూడా యుండేవారు. వారిలో పార్సీ మతస్థుడు రతంజీ షాపుర్జీ వాడియా ముఖ్యుడు.  ఈ రతంజీ జీవిత చరిత్ర నీవు తెలుసుకోవాలి.  జీవితములో ధనము ఒక్కటే ముఖ్యము అని నీవు అనేక సార్లు అన్నావు.  అది తప్పు అని గ్రహించు.  రతనజీ  కి ఆరోజులలో పెద్ద వ్యాపారి కోటీశ్వరుడు.  అందరికి అతను దాన ధర్మాలు చేస్తు ఉండేవాడు.  నాందేడులోని ప్రజలకు అతను దాన కర్ణుడు.  మరి అటువంటి వ్యక్తికి తీరని లోటు ఒకటి యండేది.  ఆలోటు ధనముతో పూడ్చలేనటువంటిది.  అదే పుత్ర సంతానము లేకపోవటము.  అతను ఎన్ని దాన ధర్మాలు చేసినా మరియు ధనముతో కొనలేనిది, పుత్ర సంతానము కలిగి యుండాలనే కోరిక.  ఈ కోరిక తీర్చగలిగేది  ఒక్క సాయి బాబా మాత్రమే అని తెలుసుకొని శిరిడీ వెళ్ళి శ్రీసాయి పాదాలను కన్నిళ్ళతో కడిగినాడు.  శ్రీసాయి ఆశీర్వచనాలతో పుత్ర సంతానాన్ని పొందినాడు.  అతనిని సంతోషపరిచినది అతని దగ్గర ఉన్న ధనమా లేక శ్రీసాయి ఆశీర్వచనాలా ఒక్కసారి అలోచించు.  నీకే తెలుస్తుంది.  యింక శ్రీసాయి ధనాన్ని దక్షిణ రూపములో స్వీకరించేవారు. అంతే గాని భిక్ష రూపములో ఏనాడు తను ధనాన్ని స్వీకరించలేదు.  తన భక్తులను స్వీకరించనీయలేదు.  శ్రీసాయి దక్షిణ కూడ ఉదయము నుండి సాయంత్రము వరకు స్వీకరించి, సాయంత్రము తిరిగి బీదలకు దానము చేసేవారు.  మరల మరుసటి రోజు ఉదయము చేతిలో చిల్లిగవ్వలేని ఫకీరుగా తన రోజు ప్రారంభించేవారు.
                    
 
శ్రీ సాయి తన భక్తులకు ఎప్పుడు ఒక మాట చెబుతు ఉండేవారు.  "మన పారమార్ధికమునకు ఆటంకములు రెండు గలవు.  మొదటిది స్త్రీ.  రెండవది ధనము.  తన భక్తుడు ధనము మీద ఎంత వ్యామోహముకలిగి యున్నది లేనిది అనే విషయము తెలుసుకోవడానికి దక్షిణ రూపంలో ఆభక్తుని నుండి ధనాన్ని తీసుకొనేవారు.  ఈపరీక్ష లో ఆభక్తుడు ఉత్తీర్ణుడు కాగానే పరస్త్రీ వ్యామోహము ఉన్నది లేనిది తెలుసుకోవటానికి ఆభక్తుని శిరిడీలో నివసించుచున్న రాధాకృష్ణమాయి అనే భక్తురాలి యింటికి పంపేవారు.  ఈరెండు పరీక్షలయందు ఆభక్తుడు తట్టుకొని నిలబడిననాడు శ్రీసాయి అతనికి పారమార్ధిక ప్రగతిలో సహాయము చేసేవారు.  ఈనాడు శ్రీసాయి మనమధ్య శరీరముతో లేరు.  ప్రతిసాయి భక్తుడు శ్రీసాయిని తన మనసులో నిలుపుకొని ఈరెండు పరీక్షలను తామే స్వయముగా జరుపుకొని ఉత్తీర్ణులు కావాలి.  శ్రీసాయి ఆశీర్వచనాలు పొందాలి. 
శ్రీసాయి  సేవలో
నీతండ్రి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 15వ.అధ్యాయము

$
0
0

                                                                                                        

                                 
                             
                                    
19.03.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                  

           

శ్రీవిష్ణు సహస్రనామం 50వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  స్వాపన స్స్వవశో వ్యాపీ నైకాత్మానైకకర్మకృత్   |

             వత్సరో వత్సలోవత్సీ రత్నగర్భో ధనేశ్వరః  ||

తాత్పర్యం:  నారాయణుడు స్వప్నములు కల్పించును.  ఆయన అస్తిత్వము జీవులకు తమతమ అస్తిత్వములుగా భ్రాంతిని కల్పించి ఆయన అస్తిత్వము తమ ప్రపంచముగా స్వప్నము కల్పించును.  సంవత్సర చక్రమునకు ఆయన అధిపతియై జీవులందరిలోకి వారి వారి మంచి గుణములుగా విస్తరించును.  ఆయన వశము కావలెనన్నచో తనకు తానే వశము కావలెను.  జీవులయందలి వాత్సల్యమే ఆయన రూపము.  కనుక జీవులందరూ ఆయనకు దూడలై సం రక్షింపబడుచున్నారు.  అన్ని సద్గుణములకు ఆయన నిలయము.  యింకనూ ఆయన సంపదలకధిపతి.  


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
15వ.అధ్యాయము

                              
                               20.01.1992

ప్రియమైన చక్రపాణి,

శ్రీసాయి సత్ చరిత్ర మొదటి సారిగ నిత్యపారాయణ మొదలు పెట్టినపుడు ఈ పదునైదవ అధ్యాయములో శ్రీసాయి తన భక్తులపై కురిపించిన ప్రేమ ఆదరణలకు నా కళ్ళు ఆనంద భాష్పాలుతో నిండిపోయినాయి.  అటువంటి ప్రేమ ఆదరణ  పొందిన చోల్కరు ధన్య జీవి. 



 ప్రతి సాయి భక్తుడు చోల్కరులాగ సాయి మార్గములో ప్రయాణము సాగించి మేఘశ్యాముడులాగ సాయి మార్గములో రాలి పోయి సాయిలో ఐక్యమైపోవాలి.  అందుచేత సాయి బంధువులలో చోల్కరు అన్నా మేఘశ్యాముడు అన్నా నాకు చాలా యిష్ఠులు.  నాజీవితము వాళ్ళు నడచిన మార్గములో నడచిపోయిన ధన్యము.  మన జీవితాలలో తృప్తితో జీవించాలి అంటే చోల్కరు కధ రోజూ మనము గుర్తు చేసుకోవాలి.  అందు చేతనే కాబోలు హేమాద్రిపంతు ఈ అధ్యాయము ఉత్తర లేఖనములో అంటారు "ఎవరియితే ఈ అధ్యాయమును భక్తి శ్రధ్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్ఠాలు అన్ని శ్రీసాయినాధుని కృపచే తొలగును".  యిక ఈ అధ్యాయములోని యితర విషయాలు ముచ్చటించేముందు ఒక విషయము చెబుతాను.  నేను చోల్కరులాగ ఒక మొక్కు మ్రొక్కుకున్నాను.  నాజీవితములో నాబరువు బాధ్యతలు పూర్తి అయిన తర్వాత శిరిడీ వెళ్ళ్లి ద్వారకామాయిలో శ్రీసాయి కి 15 కిలోల పటిక బెల్లము నైవేద్యముగా సమర్పించి అక్కడి భక్తులకు మరియు మనకు తెలిసిన సాయి బంధువులకు పంచి పెట్టాలి.  ఈ కోరికను తీర్చవలసినది శ్రీసాయినాధుడే.

శ్రీ సాయి సత్చరిత్రలో శ్రీసాయి అంటారు "ప్రపంచమున మీకు యిచ్చ వచ్చిన (ఇష్ఠమైన) చోటుకు పోవుడు.  నేను మీచెంతనే యుండెదను.  యిది అక్షరాల నిజము.  నావిదేశీ యాత్రలో శ్రీసాయి నా చెంతనే యుండేవారు అనేది సంతోషముగా చెప్పగలను.  సందర్భోచితముగా ఆవివరాలు మిగతా ఉత్తరాలలో వ్రాస్థాను.  రెండు బల్లులు కధ ద్వారా శ్రీసాయి మనబోటివాళ్ళకు యిచ్చిన సందేశము ఏమిటి అనేది ఆలోచించు.  నోరు లేని జీవులు సైతము తమ తోటి ప్రాణులను ప్రేమించుతున్నాయి.  మరి ఒకే గర్భమున జన్మించిన అన్నదమ్ములు ఎందుకు కీచులాడుకొంటారు అని ప్రశ్నించుతారు శ్రీసాయి.  05.05.91 నాడు నేను విదేశాలకు (కొరియా) వెళ్ళవలసిన రోజు 04.05.91 (శనివారము) నాడు శ్రీఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఆగుడిలో ఉన్న శ్రీసాయి బాబా పటము దగ్గర నిలబడి నావిదేశ యాత్రను విజయవంతము చేయమని మనసారా ప్రార్ధించినపుడు ఒక చిన్న అనుభవము కలిగినది.  నేను శ్రీసాయి పటము ముందు కళ్ళు మూసుకొని నావిదేశ యాత్ర గురించి ప్రార్ధించుతున్నాను. ఆపటము వెనుక ఒక పెద్ద బల్లి టిక్కు, టిక్కు, అని పదే పదే పలకటము నాకు శుభసూచకముగా అనిపించినది.  శ్రీసాయి ఆశీర్వచనములతో 05.05.1991 నాడు ప్రారంభమైన నా విదేశీయాత్ర విజయవంతముగా 21.05.91 నాడు ముగిసినది.  శ్రీసాయి బల్లి రూపములో ఆశీర్వదించినారు అనే భావన ఈనాటికి నామనసులో మిగిలినది.

యిక్కడ సరదాగా నామనసులో వచ్చిన ఒక ఆలోచన వ్రాస్తాను.  ఆనాడు ద్వారకామాయిలోని బల్లి టిక్కు టిక్కుమని ఔరంగాబాదునుండి తన చెల్లెలు తనను చూడటానికి వస్తున్నది అని శ్రీసాయికి తెలియచేసినది.  ఈనాడు. అంటే 04.05.91 (శనివారము) నాడు శ్రీసాయి పటము వెనుక యున్న బల్లి టిక్కు టిక్కు అని "నీవిదేశ యాత్రకు ఔరంగాబాదు మీదుగా వెళుతు మాచెల్లును గుర్తు చేసుకో" అన్నట్టుగా భావించవచ్చును.  కారణము బొంబాయినుండి బయలుదేరిన విమానము విదేశాలకు అంటే కొరియా దేశానికి ఔరంగాబాదు విమానాశ్రయము మీదుగా ప్రయాణము చేస్తున్నాము అని విమానము నడుపుతున్న పైలట్ మైక్ లో చెబుతున్నపుడు బల్లి టిక్కు టిక్కు అని పలకడమునకు నామన్సులో అర్ధము తెలిసినది.  ఆవిమానములో శ్రీసాయి నాప్రక్కన కూర్చొని నాతో ప్రయాణము చేసినారు.  ఆవివరాలు ముందు ముందు ఉత్తరాలలో వ్రాయడానికి ప్రయత్నము చేస్తాను.  అంతవరకు ఉత్సాహముతో వేచియుండు.

శ్రీసాయి సేవలో

నీతండ్రి 


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 16,17 అధ్యాయములు

$
0
0
        
                
        
20.03.2013  బుదవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
       

        
శ్రీ విష్ణుసహస్ర నామం 51వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం :  ధర్మగుప్ ధర్మకృధ్ధర్మీ సదసక్షర మక్షరం    |

              అవిజ్ఞాతా సహస్రాంశు ర్విధాతా కృతలక్షణః       ||

తాత్పర్యం:  నారాయణుడు ధర్మమును నిర్మించువాడు.  మరియు అదిపతి, మరియు తనయందు గుప్తముగా నుంచుకొనువాడు.  ఆయన ఉండుట, లేకుండుట అను రెండూ తానేయైనవాడు మరియు నశించువాడు, నశింపనివాడు కూడా.  ఆయన తన వేయి కిరణములతో ఎవరి స్థానమున వారిని నియమించువాడు.  ఆయన జ్ఞానమే ఆయనకు తెలియలేదు.  అనేక లక్షణములు, సిధ్ధాంతములు ఆయనను గూర్చి కల్పింపబడినను ఆయనను తెలియుటలేదు.   

  పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి  - 

  16,17 అధ్యాయములు

                              
                              
                                                        21.01.1992

ప్రియమైన చక్రపాణి,

శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు 16,17 అధ్యాయములు ఒకేచోట వ్రాసినారు.  అందుచేత నేను ఈ రెండు అధ్యయములుపైన ఒకటే ఉత్తరము వ్రాస్తున్నాను.  



బ్రహ్మజ్ఞానము విషయములో శ్రీసాయి యొక్క ఆలోచనలనుశ్రీహేమాద్రిపంతు చక్కగా వివరించినారు.  ఈ బ్రహ్మజ్ఞానము అందరికి అంత సులువుగా అబ్బదు.  బ్రహ్మ జ్ఞానమును   సంపాదించవలెనని తపన మానవుని జీవితములో తృప్తిని మిగుల్చుతుంది.  తృప్తితో గడిపిన జీవితము ధన్యము.  అందుచేత ప్రతి ఒక్కరు బ్రహ్మ జ్ఞానము సంపాదించాలి అనే తపనతో జీవితము గడపాలి.  1991 ఏప్రియల్ నెలలో ఒకనాటి   రాత్రి భయంకరమైన కల వచ్చినది.  నేను ఒక సరస్సులో పెద్ద పెద్ద మొసళ్ళు మధ్య జీవితము గడుపుతున్నాను.  
         
ఆజీవితము చాలా బాధాకరముగా యున్నది.  అనుక్షణము భయంతో వణికిపోసాగాను.  ఉదయము లేచి సాయి సత్ చరిత్రలో ఈకలకు అర్ధము వెతికినాను.  16,17 అధ్యాయములో 147 పేజీలో నాకు అర్ధము దొరికినది.  ఆనాటినుండి జీవితమునుండి అసూయ, అహంభావములను పారద్రోలడానికి ప్రయత్నించుచున్నాను.  ఈ నాప్రయత్నములో శ్రీసాయి నాతోడు ఉంటే అదేనాకు గొప్ప అదృష్ఠము.  బ్రహ్మజ్ఞానము సంపాదించుటకు శ్రీసాయి చూపిన యోగ్యత విషయములో ప్రయత్నము చేయుము.  ఈచిన్న వయసులో ప్రయత్నము మొదలిడిన నీ సంసార బాధ్యతలు తీరునాటికి బ్రహ్మజ్ఞాన సంపాదనపై ఆసక్తి కలుగుతుంది.
          
ఆరోజులలో 01.01.1991 ఉదయము 6 గంటలకు శ్రీసాయి సత్ చరిత్ర 16,17 అధ్యాయములు పారాయణ చేయు చున్నాను. 147 వ. పేజీలో శ్రీసాయి పలికిన మాటలు నన్ను చాలా ఆకర్షించినవి.  అవి "నాఖజానా నిండుగానున్నది.  ఎవరికేది కావలసిన, దానిని వారికివ్వగలను.  కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను.  నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు.  ఈమశీదులో కూర్చుని నేనెప్పుడు అసత్యములు పలుకను".  నామనస్సు లో సంతోషము కలిగినది.  ఉ. 8.30 నిమిషాలకు ఆఫీసుకు బయలుదేరుతున్న సమయములో శ్రీసాయి భక్తురాలు శ్రీమతి రాజ్ మన యింటికి వచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగు కార్డు యిచ్చినారు.  ఆకార్డుపై చిరునవ్వుతో శ్రీసాయిబాబా ఫొటో.  ఆఫొటో క్రింద శ్రీసాయి సందేశము -  ఆసందేశము నేను ఆనాడు నిత్యపారాయణలో పొందిన "నాఖజానా నిండుగా నున్నది........నీవు తప్పక మేలు పొందెదవు".   సందేశము ఒకటి కావడము నేను దానిని శ్రీసాయి లీలగా భావించి శ్రీసాయికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. 
శ్రీసాయి సేవలో


నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 18,19 అధ్యాయములు

$
0
0
                         
                                        
                              
                                       
24.03.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
 

గత మూడు రోజులుగా మన బ్లాగులో రత్నమణి సాయి అందించలేకపోయాను.. మన్నించాలి... ఈ రోజు 16,17 అధ్యాయాలు చదవండి...
                           

శ్రీవిష్ణు సహస్రనామం 52వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:     గభస్తినేమిస్సత్తత్వస్థస్సిం హో భూత మహేశ్వరః   |  

             ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురుః   ||

తాత్పర్యం:  నారయణుని మార్గము సూర్యగోళము యొక్క వెలుగుచే నిర్ణయింపబడుచున్నది.  ఆయన మనయందు, సామ్యముగను, సిం హముగను, అన్ని భూతములయందలి ఈశ్వరునిగా, మొట్టమొదటి దేవునిగా, మహాదేవునిగా, దేవతలకధిపతిగా, మరియు దేవతలను సం రక్షించువానిగా, ఉపదేశకునిగా ధ్యానము చేయవలెను.   


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
18,19 అధ్యాయములు
                                                                                                22.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో 18-19 అధ్యాయములలోని విషయాలపై నాకు తోచిన అభిప్రాయాలు నీకు తెలియ చేస్తాను.  ఈ నా అభిప్రాయాలను నీవు అర్ధము చేసుకొనిన తర్వాత నీ స్నేహితులకు కూడా పనికివస్తుంది అని తలచిననాడు ఈ ఉత్తరాలు నీ స్నేహితుల చేత కూడా చదివించు. 



 ఈ విషయములో శ్రీ హేమాద్రిపంతు తెలియచేసిన సంగతి నీవు గుర్తు చేసుకో.  అదే సద్గురువు వర్షాకాలము మేఘము వంటివారు.  వారు తమ అమృత తుల్యములైన భోదలు పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిసెదరు.  వానిని మనముభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా యితరుల మేలుకొరకు వెల్లడి చేయవలెను. యింకొక విషయము నిన్న రాత్రి షిరిడీ డైరీ ఆఫ్ ది హానరబుల్ మిస్టర్ జీ.ఎస్.ఖపర్డే పూర్తిగా చదివినాను.  ఈ రోజు ఉదయము శ్రీ ఖాపర్దే డైరీ తిరిగి అలమారులో పెడుతుంటే ఎందుకో బాబానుండి సందేశము పొందాలని మనసులో కోరిక పుట్టి కళ్ళు మూసుకొని ఒక పేజీ తెరచినాను. (పేజీ 69).  శ్రీ ఖాపర్దే  మరియు శ్రీసాయి మీద 30.01.1912 నాడు జరిగిన సంభాషణ.  "నేను ఉత్తరాలు వ్రాసానని చెపితే, ఆయన నవ్వి సోమరిగా  కంటే ఏదో పనిలో చేతులు కదలటమె మంచిది "   అనే సందేశము వచ్చినది.  నీకు జ్ఞాపకము ఉండే యుంటుంది.  నారెండవ ఉత్తరములో శ్రీసాయి గురించిన ఉత్తరాలు వ్రాయడానికి ప్రోత్సాహము 06.01.1992 నాడు మీఅమ్మనుండి లభించినది.  ఈ ఉత్తరాలు ఈ విధముగా నీకు వ్రాయడానికి శ్రీసాయినుండి అనుమతి ఈ రోజునే లభించినది.  శ్రీసాయి ఆశీర్వచనాలతో శ్రీ సాయి జీవిత చరిత్రపై నీకు 48 ఉత్తరాలు వ్రాయగలను అనే ధైర్యము ఈక్షణములో కలిగినది.  శ్రీసాయి ఈ ధైర్యమును నామనసులో సదా కలిగించుతు ఉంటారని నా నమ్మకము.  శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో ఈ విధముగా అంటారు.  "వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింప చేయును.  వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును జూచెదరు".  యిది అక్షరాల నిజము.  నేను చేసిన పాపాల కర్మలు ముగిసిన నాకు మంచిరోజులు (1989)  వచ్చే  సమయలో భగవంతుడు శ్రీసాయి అనే యోగీశ్వరుని పాదాలు నాకు చూపించినారు.  ఈరోజున నేను శ్రీసాయి పాదాలపై నా శిరస్సు ఉంచి ఆయన శరణు కోరుతున్నాను.  శ్రీసాయి హరివినాయ సాఠే చేత ఏడు రోజులలో గురుచరిత్ర పారాయణ చేయించినారు అనే విషయము వ్రాయబడియుంది. శ్రీసాయి నాచేత 1991లో గురుచరిత్ర ఏడురోజులలో పారాయణ చేయించినారు.  మీ అమ్మచేత రోజుకు ఒక అధ్యాయము పారాయణ చేయించినారు.  అది మా అదృష్టముగా భావించుతాము.  శ్రీసాయి సత్ చరిత్రలో భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో, బాబా అంత త్వరగా సహాయపడును అని చెప్పబడింది. ఒక్కొక్కపుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును అని వ్రా యబడినది.  నేను పట్టుదలతో 07.06.1990 నుండి శ్రీసాయిబాబా జీవిత చరిత్రను నిత్యపారాయణ చేస్తున్నాను.  
ఈ నిత్యపారాయణ ఫలితమును నేను చూడలేను.  కారణము నేను కోరుకొన్న కోరిక అటువంటిది.  ఆకోరిక చెప్పమంటావ - బాధపడవద్దు - నేను నిత్య పారాయణ చేస్తున్న సమయములో ప్రశాంతముగా కన్నుమూయాలి అనే కోరిక.  ఈ కోరిక తీర్చవలసినది శ్రీసాయి.  ఈకోరిక తీరినది లేనిని అనేదానికి సాక్షిగా నిలబడవలసినది నీవు.

గురువుకు మనము యివ్వగలిగినది రెండు కాసులు. ఒకటి ఢృఢమైన విశ్వాసము (శ్రధ్ధ) రెండవది ఓపిక (సహనము) అని శ్రీసాయి సత్ చరిత్రలో చెప్పబడింది.  నీవు శ్రీసాయిని నీగురువుగా భావించితే నీవు కూడ శ్రధ్ధ, సహనములతో ఆయనను పూజించు.  శ్రీసాయి అనుగ్రహము పొందటానికి ప్రయత్నించు.  నేను నీకు యిచ్చిన ఈసలహానునీవు నీపిల్లలకు యిచ్చిన నాకు సంతోషము. నీవు శ్రీసాయిని నమ్మితే ఒక విషయము జ్ఞాపకము ఉంచుకో.  మంత్రమునకు గాని, యుపదేశమునకు గాని ఎవ్వరి వద్దకు పోవద్దు. ఈవిషయములో శ్రీహేమాద్రిపంతు తన ఆలోచనలను వివరముగా శ్రీసాయి సత్ చరిత్రలో వ్రాసినారు.  ఒకసారి బాగా చదివి అర్ధము చేసుకో.  నేను 1989 నుండి 1991 వరకు శ్రీసాయి గురించి తెలుసుకోవాలని తపనతో ఎంతో మంది దగ్గరకు వెళ్ళినాను.  నాకు తృప్తి కలగలేదు.  శ్రీసాయి తన భక్తుడు శ్రీ బీ.వి.దేవుతో ఏవిషయమైన తెలుసుకోదలచిన తననే స్వయముగా అడిగి తెలుసుకోమన్న విషయము నేను గుర్తు చేసుకొంటు సరాసరి శ్రీసాయిని అడిగి తెలుసుకోవటము ప్రారంభించినాను.

ఇక్కడ నీకు ఒక సలహా యిస్తాను పాటించు.  నీవు హేమాద్రిపంతు వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్రకు యింగ్లీషు తెలుగు అనువాదాలు చదువు.  శ్రీసాయి తత్వాన్ని గ్రహించు.  శ్రీసాయి తత్వము అనే బాటలో ముందుకు సాగిపోతు కొంత జీవితాన్ని అనుభవించు.

ఇదే విషయము హేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో ఈ విధముగా అన్నారు.  "అవును బాబా! నా మనస్చాం చల్యము నిష్క్రమించినది.  నాకు నిజమైన శాంతి , విశ్రాంతి కలిగినది.  సత్యమార్గమును కనుగొనగలిగితిని".  ఈ మాటలలో ని అర్దాన్ని నీవు తెలుసుకొంటావు.  గురు శిష్యుల సంబంధముపై శ్రీసాయి చక్కటి ఉదాహరణ యిచ్చినారు.  అది తల్లి తబేలు పిల్ల తాబేలు జీవన విధానము.  యిటువంటి ఉదాహరణ యింకొకటి నేను చెబుతాను.  మన హిందూ సాంస్కృతిలో పిల్లల భవిష్యత్ కోసము, వారి ఆరోగ్యము కోసము తల్లి ఉపవాసములు, పూజలు, నోము, వ్రతాలు ఆచరించుతుంది.  దీని అర్ధము ఏమిటి ఒక్కసారి ఆలోచించు.  తల్లినుండి పిల్లలు శారీరకముగా ఎంత దూరములో ఉన్న ఆపిల్లలు తల్లి మనసులో అంత దగ్గరగా యుండటము చేతనే ఆతల్లి తన పిల్లల యోగక్షేమము కోసము నోములు వ్రతాలు చేస్తుంది.   అదే విధముగా శ్రీసాయి యొక్క భక్తులు శ్రీసాయి మనసులో చోటు చేసుకొని శ్రీసాయి యొక్క ప్రేమ అనురాగాలను ఆనాడు, ఈనాడు పొందగలగుతున్నారు.

శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి చెప్పిన ఈమాటలు గుర్తు చేసుకో - "ఏదైన సంబంధముండనిదే ఒకరు యింకొకరి వద్దకు పోరు.  ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీవద్దకు వచ్చినచో నిర్ధాక్షిణ్యముగా వానిని తరిమి వేయకు.  ఈ విషయము నీకు ఎక్కువ వ్రాయనక్కరలేదు.  కారణము మన యింటిలోనికి నెల రోజుల క్రితము ఉదయము 5 గం టలకు పాలవాడి  వెనకాలనే వచ్చిన చిల్లి (పిల్లి) మన యింట పెంపుడు పిల్లిగా మారిపోయిన సంగతి నీకు బాగా గుర్తు యుండి యుంటుంది  కనుక.  శ్రీసాయి యింకొక విషయము చెప్పినారు. "నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము.  అప్పుడు మనమిద్దరము కలియు మార్గము ఏర్పడును.  నాకునీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగానుంచుచున్నది .  దానిని నశింపజేయనిదే మన ఐక్యత కలుగదు.  అందుచేత ఈవిషయము గుర్తించి నీవు ప్రత్యక్షముగా శ్రీసాయితో సంబంధము పెట్టుకో.  మధ్య వర్తులకు దూరంగా యుండు.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయికి త్రాగుబోతులు అంటే అసహ్యము అని హేమాద్రిపంతు తెలియచేసినారు.  బహుశ ఇదే కారణము అయి ఉండవచ్చును.  నేను 1991 నుండి త్రాగుడు మానివేసినాను.  ఈరోజున నేను సారాయికి బానిసను గాను, సాయికి మాత్రమే బా.ని.స. ను.  యిది నా అదృష్టము.  శ్రీసాయి సత్ చరిత్రలో  కష్టమునకు కూలి అనే విషయములో శ్రీసాయి అంటారు.  "ఒకరి కష్టమును యింకొకరు ఉంచుకొనరాదు".  దాని వలన ఎదుటివానికి సుఖము, నీకు తృప్తి మిగులుతుంది.

శ్రీసాయి సేవలో
నీతండ్రి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 20వ.అధ్యాయము

$
0
0
                                   
                  
               
               
25.03.2013 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి  బంధువులకు బాబావారి శుభాశీస్సులు

        
శ్రీవిష్ణుసహస్రనామం 53వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞాన గమ్యః పురాతనః    |

             శరీర భూత భృత్ భోక్త కపీంద్రో భూరిదక్షిణః ||

తాత్పర్యం:  పరమాత్మను రోజురోజుకూ ఉత్తముడైనవానిగా, ఉచ్చస్థితిలో నున్నవానిగా ధ్యానము చేయుము.  ఆయన మహా వృషభము, మరియు గుప్తముగానుండి రక్షించువాడు.  మిక్కిలి పురాతనమై జీవించి యున్నవాడు.  జ్ఞానము ద్వారా మాత్రమే గ్రహింపదగినవాడు.  శరీరమునందలి పంచభూతములను నిర్వహించుచు మరల శరీరమునందే యుండి భుజించి తృప్తి పడువాడు.  హనుమంతునిగా అవరరించినవాడు, యజ్ఞమును నిర్వహించునప్పుడు విశేషముగా సంపదలను పంచిపెట్టువాడు. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
20వ.అధ్యాయము

                              
                              
                                                    23.01.1992

ప్ర్లియమైన చక్రపాణి,

ఈ రోజు తెల్లవారుఝామున వచ్చిన కలను నీకు ముందుగా తెలియచేసి ఆ తర్వాత శ్రీసాయి సత్ చరిత్రలోని 20వ. అధ్యాయము గురించి  వివరించుతాను.  ఈరోజు తెల్లవారుఝామున (23.01.1994 - ఉ.4) వచ్చిన కలలోని వివరాలు "నేను మరియు మరికొంతమంది నదిలో నావలో ప్రయాణము చేస్తున్నాము. 



 నది మధ్యలో యింకొక పడవలో శ్రీసత్యసాయి మరియు  యిద్దరు భక్తులు యున్నారు.  శ్రీసత్యసాయి  నదీమతల్లిని ఆశీర్వదించుతున్నారు.  నాకుశ్ రీసత్యసాయి ఉన్న పడవ దగ్గరకు వెళ్ళవలెనని అనిపించినది .  నేను ఉన్న పడవవానికి రెండురూపాయలు యిచ్చినాను.  నన్ను సత్యసాయి పడవదగ్గరకు తీసుకొని వెళ్ళమని కోరినాను.
నేనున్న పడవను నడిపేవాడు నేను కోరినట్లుగా చేసినాడు.  శ్రీసత్యసాయి నాభుజముపై చేయి వేసి శ్రీసాయిని ధ్యానించమన్నారు.  నేను కొంచముసేపు ధ్యానము చేసినాను.  వినూత్నమైన భావన, ఆనందము కలిగినది.  కళ్ళు తెరచి చూసినాను.  శ్రీసత్యసాయి నేను ఉన్న పడవలోని యితర భక్తుల భుజముపై చేయి వేయగానే వారు చాలా బాధతో గిలగిల్లాడిపోయినారు.  (1964 సంవత్సరములో నేను అటువంటి బాధ పడినాను) యింతలో నాకు తెలివి వచ్చినది.  యిది అంతా కల కదా అనిపించినది.  ఈకలకు అర్ధము ఏమిటి అని ఆలోచించినాను.  నేను ప్రయాణము చేస్తున్న నావను నడుపుతున్నది శ్రీశిరిడీసాయి.  నానుండి రెండురూపాయలు దక్షిణ తీసుకొని నామన్సులోని కోరికను తీర్చగలిగింది శ్రీ  శిరిడీసాయి కాక యింక ఎవరు?  శ్రీశిరిడీ సాయి 1964 సంవత్సరములో శ్రీసత్యసాయి రూపములో నాభుజముపై చేయి వేసినపుడు నేను గిలగిలలాడిపోయినాను. నా గతాన్ని నామనసులోని కోరికను గ్రహించి శ్రీశిరిడీసాయి, సత్యసాయి రూపములో నేను ప్రయాణము చేస్తున్న నదిలో యింకొక పడవలో నిలబడి నాకు దర్శనము యిచ్చి నాకోరిక తీర్చినారు.

            
ఈ విధముగా శిరిడీసాయి, తాను సత్యసాయిలోను ఉన్నాను అని తెలియచేస్తున్నారు.  శ్రీశిరిడీసాయి మనము ఏరూపములో కోరితే ఆరూపములో దర్శనము యిచ్చి మన ఆధ్యాత్మిక ప్రగతికి సహాయము పడే సమర్ధ సద్గురువు.  అటువంటి సద్గురువు పాదాలను నమ్ముకోవటము మన పూర్వ జన్మ పుణ్యఫలము.  యింక 20వ. అధ్యాములో శ్రీసాయి తన భక్తులు భోజనము విషయములో ఎంతో శ్రధ్ధ కనపరచి పేరుపేరున పిలచి "అన్నా మధ్యాహ్న భోజనమునకు పొమ్ము, బాబా నీబసకు పో, బాపూ, భోజనము చేయుము" అని పలకరించేవారు.   
         

యిది యదార్ధము అనే  భావన నాలో కలిగినది.  నాజీవితములో జరిగిన ఒక సంఘటన నీకు తెలుపుతాను.  అది చదివిన తర్వాత నీకు కూడా నాభావముతో ఏకీభవించుతావు.  అది విజయదశమి రోజు (29.09.1990).  ఆనాడు నాయింటికి మన యిల్లు కట్టిన తాపీ పనివాళ్ళను, కూలీలను భోజనమునకు పిలిచినాను. శ్రీసాయికి మధ్యాహ్న్న హారతి యిచ్చి అందరికి వడ్డనలు ప్రారంభించినాను.  వచ్చినవాళ్ళలో నాయింట పని చేయని ఒక పది సంవత్సరాల బాలుడు యున్నాడు.  బహుశ నాయింట పనిచేసిన తాపీ మేస్త్రీ బంధువు అయి ఉండవచ్చును అని తలచినాను.  అందరికి మిఠాయి వడ్డించుతున్నాను.  ఆకుర్రవాని విస్తరి దగ్గరకు వచ్చి మిఠాయి వడ్డించుతుంటే ఆవిస్తరి గాలికి ఎగిరిపోయినది.  లడ్డు నేలమీద వడ్డించవలసి వచ్చినది.  ఆకును సరిచేసి తిరిగి ఆలడ్డుని విస్తరాకులో పెట్టినాను.  ఆకుర్రవానికి ఏమి పట్టనట్లుగా లేదు.  తన ప్రక్కవారి కేసి చూస్తున్నాడు.  తిరిగి బిరియాని వడ్డించుతు ఆకుర్రవాని విస్తరి దగ్గరకు వచ్చినాను.  బిరియాని వడ్డించుతుంటే విస్తరాకు గాలికి ఎగిరిపొయినది.  బిరియాని నేలపై వడ్డించినాను.
శ్రీసాయి తన భక్తుడు దాసుగణుకు ఈశావాస్యోపనిషత్తును ఆచరణలో చూపించిన విధానము నీవు బాగా చదువు.  కష్ఠసుఖాలు అనేవి మన భావనలు.  అవి మనోవైఖరిపై ఆధారపడి యుండునని గ్రహించు.   భగవంతుడు మనకు యిచ్చినదానితో సంతోషము పడవలెను.  యితరుల సొమ్మును మనము ఆశించరాదు.  మనకు ఉన్నదానితో సంతుష్టి చెందవలెను.. యివి అన్నీ మనము ఆచరణలో పేట్టగలిగిన రోజున జీవితములో అశాంతి అనేది చోటు చేసుకోదు.  తృప్తిగా సుఖప్రదమైన జీవితాన్ని గడపవచ్చు.   

అటువంటి జీవితాన్ని నీకు సాయి ప్రసాదించాలని ఆసాయినాధుని వేడుకొంటున్నాను.

శ్రీసాయి సేవలో
నీతండ్రి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 21వ. అధ్యాయము

$
0
0
          
    
  
  

29.03.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

     

శ్రీవిష్ణుసహస్రనామం  54వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:       సొమపో మృతస్సోమః పురుజిత్ పురుసత్తమః 

               వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్త్వతాంపతిః 

తాత్పర్యం ::  పరమాత్మను యజ్ఞము చేసి సోమరసమును, అమృతమును స్వీకరించువానిగా, తిరిగితిరిగి విజయములను సాధించువానిగా మానవునియందలి ఉత్తమోత్తమ మానవునిగా, వినయవంతునిగా, జయము కలిగించువానిగా, సత్యమున కంకితమయిన వానిగా, దాశ కులమునందు పుట్టినవానిగా, సాత్వతులవంశము వానిగా ధ్యానము చేయుము. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 21వ. అధ్యాయము

ఈ ఉత్తరములో నేను వ్రాసే విషయాలు చదివితే శ్రీసాయి ఒక్క శిరిడీలోనే లేరు, ఆయనను ఈప్రపంచములో ఏమూలన మనము నిలబడి పిలిచిన అక్కడ దర్శనము యిస్తారు అనేది నేను అనుభవ పూర్వకముగా వ్రాస్తున్నాను.  



నీలో ఈ విషయాలు చాలా ఉత్సాహాన్ని కలుగ చేస్తాయి.  జాగ్రత్తగా చదువు.  శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు ఈవిధముగా వ్రాస్తారు "అత్యంత ప్రాచీన కాలమునుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ యున్నది.  అనేకమంది యోగులనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు.  వారనేక చోట్ల పని చేసినను ఆందరు ఆ భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చెదరు.  కాన ఒకరు చేయునది యింకొకరికి తెలియును.  ఒకరు చేసినదానిని యింకొకరు పూర్తి చేసెదరు" ఈమాటలు గుర్తు పెట్టుకొని నాజీవితములో జరిగిన అనుభవానికి జోడించి చూడు అపుడు హేమాద్రిపంతు వ్రాసినది అక్షరాల నిజము అని నీవు అంటావు.  ఆరోజు 11.01.1991 శ్రీసాయి సత్ చరిత్రలో 21వ. అధ్యాయము నిత్యపారాయణ చేస్తున్నాను.  ఆ అధ్యాయములోని సందేశము నన్ను చాలా ఆకట్టుకొన్నది.  అది అప్ప అనే కన్నడ యోగి శ్రీ వీ.హెచ్.ఠాకూర్, బీ.ఏ.గారికి యిచ్చిన సందేశము.  ఆసందేశము నాకు వర్తించుతుంది అని నమ్ముతాను.  కారణము శ్రీ వీ.హెచ్.ఠాకూర్ గార్కి, నాకు జరిగిన సంఘటనలో పోలికలు ఉన్నాయి.  ముందుగా ఆసందేశము "ఈ పుస్తకము నీవు చదవవలెను.  నీవట్లు చేసినచో నీకోరికలు నెరవేరును.  ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తరదిక్కునకు పోయినపుడు నీవొక గొప్ప యోగిని నీ అదృష్టము చేత కలిసికొనెదవు.  వారు నీభవిష్యత్తు మార్గమును చూపెదరు.  నీమనసుకు శాంతి కలుగ చేసెదరు.  నీకు అనందము కలుగచేసెదరు".  ఈ అధ్యాయము పారాయణ చేసిన రెండు రోజుల తర్వాత మా ఆఫీసులో నలుగురు ఆఫీసర్లను ఆఫీసు పనిమీద కొరియా దేశానికి పంపవలెనని నిర్ణయించబడినది.  మొత్తము ఎనిమిది మంది పేర్లు వినబడసాగినాయి.  నాపేరు కూడా యుంది.  ఆఎనిమిది మంది పేర్లలో -  కాని, నలుగురి నే విదేశాలకు పంపుతారు.  మరి అదృష్టము ఎవరిని వరించబోతున్నది ఎవరికి తెలియదు.  11.01.1991 నాడు నిత్యపారాయణలోని శ్రీసాయి సందేశము నిజము కావాలి అంటే నాపేరు మొదటి నలుగురి పేర్లలో యుండాలి.  అంతా శ్రీసాయి దయ అని తలచి భారము శ్రీసాయి మీద వేసినాను.  అదేరోజు ఆఫీసులో నన్ను పై అధికార్లు పిలిచి పాస్ పోర్టు కాగితాలపై నాచేత సంతకాలు పెట్టించినారు.  నాసంతోషానికి హద్దులు లేవు.  శ్రీసాయి దయ వలన నాపేరు మొదటిసారిగా వెళ్ళే యింజనీర్సులో రెండవ పేరుగా ఉన్నది.  మొదటి పేరు నామిత్రుడు శ్రీనివాస్ రావుది.  విధిగా నాపేరుతో ఉన్న పాస్ పోర్టు వచ్చినది.  01.05.1991 నాడు కొరియా దేశము సందర్శించవచ్చునని డిల్లీ నుండి విసా వచ్చినది.  05.05.1991 నాడు హైదరాబాద్ నుండి విమానములో బొంబాయి చేరుకొన్నాము.  అక్కడనుండి కొరియా దేశానికి విమానములో వెళ్ళవలెను.  కొరియా దేశము భారతదేశము నకు తూర్పు ఉత్తరము దిశలలో అంటే ఈశాన్యములో యున్నది.

05.05.1991 నాడు రాత్రి అంటే 06.05.1991 నాటి తెల్లవారు జామున బొంబాయి విమానాశ్రయమునుండి విమానములో కొరియా దేశానికి బయలుదేరి 06.05.1991 సాయంత్రము 6.30 నిమిషాలకు కొరియా దేశము చేరుకొన్నాము. నా విదేశీ ప్రయాణ వివరాలు అన్నీ సందర్భానుసారముగా ముందుముందు ఉత్తరాలలో నీకు వ్రాస్తాను  అంత వరకు ఓపికతో యుండు.  శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీఠాకూర్ "శ్రీసాయి పాదాలపై శిరస్సు పెట్టి నమస్కరించి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్ధించెను". యిది ఆనాడు శ్రీ వీ.హెచ్.ఠాకూర్ గార్కి లభించిన అదృష్టము.  శ్రీసాయి నాకు అటువంటి అదృష్టాన్ని ప్రసాదించినారు.  నేను కొరియా దేశములో 10.05.91 నాడు శ్రీసాయి సత్ చరిత్ర 51వ. అధ్యాయము పారాయణ పూర్తిచేసినాను.  ఆరోజు శ్రీసాయి ఏవిదమైన అనుభూతిని కలుగచేయలేదని బాధపడుతు రోజు అంత ఆఫీసు పనిమీద గడిపినాను.  రాత్రివేళ 8 గంటలకు నాకొరియా మిత్రుడు మిస్టర్ లీ నన్ను, నామిత్రుడు శ్రీనివాసరావును బయట హోటల్ కు భోజనమునకు తన కారులో తీసుకొని వెళ్ళినాడు.  9.30 నిమిషాలకు భోజనము పూర్తి అయినది.  మేము ముగ్గురము చాంగ్ వాన్ పట్టణములో రాత్రి దీపాల కాంతిలో కారులో తిరుగుతున్నాము.  నామనసులో శ్రీసాయి 51వ. అధ్యాయము పూర్తి చేసిన సందర్భములో కొత్త అనుభూతిని ఇవ్వలేదు అనే బాధ నిండియున్నది.  బహుశ  శ్రీసాయి దానిని గ్రహించి రాత్రి 9.45 నిమిషాలకు నామిత్రుడు శ్రీ లీ చేత పలికించిన మాటలు విను, "గోపాల ఈ ఊరు బయట కొండలు చూడు.  ఆకొండ మీద బుధ్ధుని గుడి యుంది.  ఆగుడిలో దీపాలు యింకా వెలుగుతున్నాయి.  నీకు చూడాలని కోరిక యుంటే మనము ఆగుడికి వెళ్ళుదామా!" అనగానే శ్రీసాయి సాక్షాత్తు నాతో మాట్లాడినట్లు భావించి సంతోషముతో అంగీకరించినాను.  శ్రీ లీ తన కారును గంటకు 90 కిలోమీటర్ల వేగముతో నడుపుతు ఆకొండ దగ్గరకు తీసుకొని వచ్చినాడు.  అప్పటికి రాత్రి 10.15 నిమిషాలు అయినది.  రోజు రాత్రి పది గంటలకు గుడిని మూసివేస్త్గారు.  మన అదృష్టమును పరీక్షించుకొందాము అని శ్రీ లీ చెప్పగానే పరుగులు పెడుతు మేము 10.30 నిమిషాలకు కొండ మీద యున్న బుధ్ధుని గుడికి చేరుకొన్నాము.  మాగురించే గుడి తలుపులు తెరచియున్నాయి అనే భావన కలిగినది.  ఆగుడిలోని బౌధ్ధలామ ఆరు అడుగుల మనిషి.  తెల్లని వస్త్రాలు ధరించి యున్నారు.  ఆయన తలపై కేశాలు పూర్తిగా తొలగించి యున్నాయి.  గుండ్రటి  ముఖము, తెల్లని వర్చస్సు, చిరునవ్వుతో మాకు స్వాగతము పలికినారు.  ఈవిధమైన ఆహ్వానానికి నామిత్రుడు శ్రీలీ చాలా ఆశ్చర్యపడినాడు.

మేము భారత దేశమునుండి వచ్చినాము అని నాకొరియా మిత్రుడు శ్రీలీ ఆబౌధ్ధ లామాకు మమ్ములను పరిచయము చేసినారు.  ఆ లామా తను భారతదేశములోని బుధ్ధ గయ దర్శించినాను అని చెప్పినారు.  యిక్కడ ఒక చిన్న విషయము గుర్తు పెట్టుకో ముందు ముందు 46వ. అధ్యాయములో శ్రీసాయి అన్నమాటలు "కాశి ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామా కంటే ముందుగనే గయలో కలిసికొనెద". బహుశ ఆనాడు శ్యామా కోర్కె తీర్చటానికి శ్రీసాయి పటము రూపములో గయలో శ్యామాకు దర్శనము ఇచ్చినారు.  మరి 10.05.91 నాడు శ్రీసాయి నాకు చాంగ్ వాన్ పట్టణములోని కొండమీద బౌధ్ధ దేవాలయములో పూజారిగా నాకు దర్శనము యిచ్చినారు.  ఆబౌధ్ధ లామా ఆరాత్రివేళ తన చెల్లెలును లేపి కొరియా దేశపు ఆచారము ప్రకారము ఆకుపచ్చ రంగు టీ తయారు చేయించి మాకు యిచ్చినారు.  శ్రీసాయి స్వయముగా మాచేత టీ త్రాగించుచున్న అనుభూతిని పొందినాము.  యిక్కడ యికొక విషయము ప్రస్తావించుతాను. 30వ. అధ్యాయము లో హేమద్రిపంతు కాకాజీ విషయములో అంటారు, "యోగి సంకల్పించనిదే వారిని జూడగలుగు వారు ఎవరు?  అతని ఆజ్ఞ లేనిదే చెట్టు ఆకు కూడా కదలదు.  యోగి దర్శనముకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో, అంత త్వరగాను, బలముగాను, అతని కోరిక నెరవేరును.  దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములొనర్చును.  ఆనాడు కాకాజి విషయములో అట్లే జరిగెను.  నావిషయములో మొదటిసారి శిరిడీకి 1989 వెళ్ళినపుడు, మరియు 10.05.91 నాడు కొరియాలోని చాగ్ వాన్ పట్టణము బౌధ్ధ దేవాలయమునకు వెళ్ళినపుడు అట్లే జరిగెను.  యిది అంత శ్రీసాయి నాచేత 51వ. అధ్యాయము నిత్య పారాయణ చేయించి చేతికి ఫలము యిచ్చినట్లుగా భావించినాను.  ఆగుడిలో జరిగిన ఒక సంఘటన వ్రాస్తాను.  నేను భారతదేశమునుండి బయలుదేరేముందుగా రెండు డాలర్లను విడిగా పర్సులో పెట్టుకొన్నాను.  ఆరెండు డాలర్లు కొరియా దేశములో ఎవరైన యోగీశ్వరులు దర్శనము యిస్తే వారికి దక్షిణగా యివ్వదలచుకొన్నాను.  యిది నేను మ్రొక్కు కొన్న మొక్కు.  శ్రీసాయి నాకు ఆబుధ్ధుని దేవాలయములోని లామా రూపములో దర్శనము యిచ్చినారు.  మనసు ఆనందముతో నిండిపోయినది.  రెండు చేతులు జోడించి ఆలామా (శ్రీసాయి) పాదాలపై శిరస్సు పెట్టి, నన్ను స్వీకరించి ఆశీర్వదించమని ప్రార్ధించినాను.  ఆరెండు డాలర్లు దక్షిణగా స్వీకరించమన్నాను.  ఆయన నన్ను ఆశీర్వదించి ఆరెండు డాలర్లు బుధ్ధుని పాదాల దగ్గర పెట్టమని చెప్పినారు. శ్రీసాయి రాత్రివేళలలో ఏభక్తుని దగ్గరనుండి దక్షిణ స్వీకరించలేదు.  ఈవిషయము శ్రీ ఎం.వీ.కామత్ గారు వ్రాసిన పుస్తకము సాయిబాబా ఆఫ్ షిరిడీ, ఏ యూనిక్ సైంట్ 246వ.పేజీలో వ్రాయబడినది. ఆ బౌధ్ధ లామా మా ముగ్గిరికి మూడు వెండి లాకెట్లు ఆశీర్వచనాలతో యిచ్చినారు.  ఆవెండి లాకెట్టు మీద స్వస్తిక్ ముద్ర యున్నది.  యిదే ముద్రను నీవు    శిరిడీసాయినాధుని సమాధి మందిరము గోడపై చూడగలవు.  ఆబౌధ్ధ లామ (శ్రీసాయి) నాకు ఆవెండి లాకెట్టు యిస్తున్నపుడు సాక్షాత్తు శ్రీసాయినాధుడు నాకు వరము యిస్తున్న భావన పొందినాను.  ఆ లాకెట్టు ఈనాడు నామెడలో యున్నది.  ఆఖరి శ్వాస వరకు ఆ లాకెట్టు నామెడలో యుండాలని కోరుకొంటున్నాను.  అంతా శ్రీసాయి దయ.  యింక శ్రీహేమాద్రి పంతు నవవిధ భక్తి మార్గమును గురించి చెబుతారు.  నేను ఆమార్గములో "శ్రీసాయి స్మరణ" మార్గాన్ని ఎన్నుకొన్నాను.  అనుక్షణము శ్రీసాయి నామ స్మరణ చేస్తే శ్రీసాయి మనలకు ఎల్లపుడు కాపాడుతారు.  మనకు ముక్తిని ప్రసాదించుతారు.  శ్రీసాయి సత్ చరిత్రలో బాబా యిచ్చిన సందేశము. ఒకరి గూర్చి చెడ్డ చెప్పరాదు.  అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు.  యిది పాటించగలిగితే అందరు మన మిత్రులే అందరు సాయి స్వరూపులే.

శ్రీసాయి సేవలో
నీ తండ్రి 


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Viewing all 726 articles
Browse latest View live